
సునీతా విలియమ్స్ (Sunita Williams).. ఈ పేరు ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం మారోమోగిపోతోంది. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ దాదాపు 9 నెలల పాటు అంతతరిక్షంలోనే గడిపి మంగళవారం(భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 2.41 గంటలకు) స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమి మీదకు వచ్చింది. సునీత క్షేమంగా రావాలంటూ యావత్ ప్రపంచం కోరుకుంది. ఆమె క్షేమంగా భూమి మీదకు చేరుకుందనే వార్త తెలియగానే సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.
(చదవండి: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?)
ఆమె చేసిన సేవలను, సాహసాలను కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సునీతా విలియమ్స్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతుందట. ఆమె చేసిన సాహోసోపేతమైన యాత్రలను వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నయట. ఇప్పటికే బాలీవుడ్‌కి చెందిన పలువురు దర్శక నిర్మాతలు సునీత లైఫ్ జర్నీని కథగా మలిచే పనిలో పడ్డారట.
బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ సునీతా విలియమ్స్ బయోపిక్ గురించి చర్చలు జరుగుతున్నాయట. సునీత విలియమ్స్ జీవితంలోని స్ఫూర్తిదాయక అంశాలు, ఆమె శిక్షణ, నాసాలో చేరడం, అంతరిక్షంలో 322 రోజులు గడపడం, మరియు భూమికి సురక్షితంగా తిరిగి రావడం.. ఈ అంశాలతో భారీ బడ్జెట్‌లో ఓ సినిమా చేసేందుకు బాలీవుడ్‌కి చెందిన బడా డెరెక్టర్ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్‌తో సునీతకు సంబంధం ఉండడంతో ఆమె బయోపిక్‌ని ఇక్కడ కచ్చితంగా ఆదరిస్తారని సదరు దర్శకుడు బలంగా నమ్ముతున్నాడట. మరి సునీతా బయోపిక్ వచ్చేది హాలీవుడ్ లోనా? లేదా బాలీవుడ్‌లోనా? చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment