ఛీ ఛీ అదేం టైటిల్‌..?: స్టార్‌ హీరో సినిమాపై జయా బచ్చన్‌ విమర్శలు! | Jaya Bachchan Made Controversial Comments On Toilet Ek Prem Katha Movie, Says She Would Never Watch This Film | Sakshi
Sakshi News home page

రూ.300 కోట్ల కలెక్షన్స్‌.. అదీ ఒక పేరేనా..?: స్టార్‌ హీరో సినిమాపై ఎంపీ విమర్శలు!

Published Wed, Mar 19 2025 11:39 AM | Last Updated on Wed, Mar 19 2025 12:06 PM

Jaya Bachchan says she would never watch Toilet Ek Prem Katha Movie

అదో బ్లాక్‌ బస్టర్‌ మూవీ. బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్లు రాబట్టి రికార్టు సృష్టించిన చిత్రం. కానీ ఆ చిత్రం అంటే తనకు నచ్చదని, అసలు ఆ సినిమానే చూడలేదని చెబుతోంది బాలీవుడ్‌ నటి, ఎంపీ జయా బచ్చన్‌(Jaya Bachchan). ఆ సినిమాకి పెట్టిన పేరు నచ్చకపోవడంతోనే తాను ఇప్పటివరకు ఆ మూవీ చూడలేదని, తన దృష్టిలో అదొక ఫ్లాప్‌ చిత్రమని చెబుతోంది. 

జయ బచ్చన్‌కి నచ్చని ఆ చిత్రం పేరే ‘టాయిటెట్‌: ఎక్‌ ప్రేమ్‌ కథ’ ( Toilet Ek Prem Katha Movie). అక్షయ్‌ కుమార్‌ నటించిన ఈ చిత్రం 2017లో రిలీజై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. శ్రీ నారాయణ్‌ సింగ్‌ దీనికి దర్శకత్వం వహించారు. 

తాజాగా ఈ చిత్రంపై జయా బచ్చన్‌ తీవ్ర విమర్శలు చేసింది. ఓ జాతియ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో జయాబచ్చన్‌ మాట్లాడుతూ.. ‘సినిమాలు చూసే విషయంలోనూ నేను కొన్ని కండీషన్స్‌ పెట్టుకున్నా. టైటిల్‌ నచ్చకపోతే సినిమా చూడను. ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ’ పేరు నాకు ఏమాత్రం నచ్చలేదు. 

ఒక్కసారి ఆ టైటిల్‌ చూడండి. అలాంటి పేరు ఉన్న సినిమాలు చూడాలని నేను ఎప్పుడూ అనుకోను. ఛీ ఛీ అసలు అదేం పేరు? నిజంగా అది కూడా ఒక పేరేనా?. అది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయినా.. నా దృష్టిలో మాత్రం ఫ్లాప్‌ చిత్రమే’ అని జయా బచ్చన్‌ అన్నారు.

‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ’ సినిమా కథ విషయానికొస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న టాయిలెట్ల కొరతను ఎత్తి చూపుతూ శ్రీ నారాయణ్‌ సింగ్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. అక్షయ్‌కి జోడీగా భూమి ఫడ్నేకర్‌ నటించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోరిక మేరకు గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించడానికి ఓ భర్త  ఏం చేశాడనేది ఆ సినిమా కథాంశం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement