టెక్నాలజీ పరంగా ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలోకి సాగుతుంటే మరోవైపు మనుషులు తమ వికృత ఆలోచనలకు తెరలేపుతున్నారు. ఇది వరకు నేరాలు చేసేవాళ్లంతా కేవలం చదువుకోకపోవడంతో మూర్ఖంగానో లేక క్షణికావేశంలో అజ్ఞానంతో చేసేవారు. కానీ ఇప్పుడూ బాగా చదువుకుని ఏది మంచో, ఏది చెడో కూడా తెలిసి మంచి ఉన్నత స్థితిలో ఉండి కూడా విశృంఖలపు ఆలోచనలతో విచిత్రమైన నేరాలు చేస్తున్నవారే కోకొల్లలు. అయితే ఇక్కడోక వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అత్యంత దారుణమైన నేరానికి ఒడిగట్టాడు.
(చదవండి: చిప్స్ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!)
అసలు విషయంలోకెళ్లితే...జర్మనీ మాజీ ఉపాధ్యాయుడు స్టెఫాన్ ఆర్ స్వలింగ సంపర్కుడు. ఈ మేరకు స్టెఫాన్ ఆర్ నరమాంస భక్షణ నిమిత్తం ఆన్‌లైన్‌లో డేటింగ్ యాప్ ద్వారా ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు కలుద్దామని ఇంటికి పిలిపించి మరీ డ్రగ్స్ ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అతని జననాంగాలను కోసి తినేశాడు. ఈ మేరకు ఆ టీచర్ అతని శవాన్ని ముక్కలుగా కోసి బెర్లిన్‌లో ఈశాన్య పాంకో జిల్లాలో చెల్లా చెదురుగా పడేశాడు. అయితే పోలీసులు బెర్లిన్ పార్కులో మానవ అవశేషాలను గుర్తించడంతో నవంబర్ 2020న ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
ఇంతకి ఆ అవశేషాలను తప్పిపోయిన స్టెఫాన్ టీకి సంబంధించినవిగా పోలీసులో గుర్తించారు. ఆ తర్వాత బాధితుడి ఫోన్‌లోని కాల్‌డేటా ఆధారంగా నిందుతుడు స్టెఫాన్ ఆర్‌గా గుర్తించి అరెస్టు చేశారు. అయితే బెర్లిన్ కోర్టు తాజాగా ఈ కేసు పూర్వాపరాలను విచారిస్తూ ఇది అత్యంత అమానవీయమైన కేసుగా అభివర్ణించింది. ఈ మేరకు ప్రిసైడింగ్ జడ్జీ మాథియాస్ షెర్ట్‌జ్ మాట్లాడుతూ..." 30 ఏళ్లుగా న్యాయమూర్తిగా నా సర్వీస్‌లో ఎన్నో కేసులు చవిచూశాను కానీ ఇంతటి అమానుషమైన కేసు ఇంతవరకు చూడలేదు" అని అన్నారు. అంతేకాదు నరమాంస భక్షణలో భాగంగానే స్టిఫాన్ టీని చంపి శరీరాన్ని కోసి తిన్నట్లు నిర్ధారించారు.
ఈ మేరకు ఇంత భయంకరమైన అమానుష చర్యకు పాల్పడినందుకు గానూ అతనికి జీవిత ఖైదు విధించారు. పైగా నింధితుడి తరుపు న్యాయవాదులు బాధితుడు తన ఇంట్లోనే సహజ కారణాలతో చనిపోయాడని, తమ స్వలింగ సంపర్కం గురించి ప్రజలు తెలుసుకుంటారనే భయంతోనే స్టిఫాన్ ఆర్ అతని మృతదేహాన్ని నరికి పారవేశాడని వాదించారు. కానీ కోర్టు వాటన్నింటిని తిరస్కరించి ఆ నిందితుడి కఠిన శిక్ష విధించింది. అయితే నిధింతుడు శిక్ష విధించే క్రమంలో మౌనంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
(చదవండి: ‘టైం కి డ్రోన్ రాకపోయుంటే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి’)
Comments
Please login to add a commentAdd a comment