బెర్లిన్: పిల్లలు పుట్టాలని తల్లిదండ్రులు ఎంతో పరితపిస్తుంటారు. ఒకవేళ ఏదైన సమస్యలుంటే.. వారు ఆసుపత్రుల చుట్టు.. ఆలయాల చుట్టు తిరుగుతుంటారు. మనుషులే కాదు.. నోరులేని మూగజీవాలు కూడా తమ పిల్లల పట్ల ఎనలేని ప్రేమను కనబరుస్తాయి. ఒకవేళ పిల్లలకు ఏదైన ఆపద సంభవిస్తే.. తమ ప్రాణాలను కూడా లెక్కచేయవు. ప్రస్తుతం క్షణికావేశంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిన్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి.
జర్మనీలో కూడా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. జర్మనీలోని సోలెంగెన్ పట్టణానికి చెందిన ఒక మహిళ, తన భర్తతోపాటు కలిసి జీవిస్తుంది. వీరికి ఆరుగురు పిల్లలున్నారు. ఈ క్రమంలో.. ఒక రోజు తన భర్త.. మరో మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. దీంతో.. విచక్షణను కోల్పోయి తన ఇంట్లో ఉన్న బాత్‌టబ్‌లో ఐదుగురు పిల్లలను ముంచి ఊపిరాడకుండాచేసి అతి క్రూరంగా హత్యచేసింది.
చనిపోయిన పిల్లలంతా.. 18 నెలల నుంచి 8 ఏళ్ల వయసులోపు వారున్నారు. సంఘటన జరిగినప్పుడు.. తన భర్త, పెద్దకొడుకు లేకపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గతేడాది సెప్టెంబరులో జరిగింది. ఆ తర్వాత సదరు మహిళ.. ట్రైన్‌ఎదుట వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తర్వాత స్థానికులు ఆమెను కాపాడారు. పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో విచారించిన ఆమెను జీవితఖైదు విధిస్తు జడ్జి తీర్పునిచ్చారు.
తాజాగా, ఆమె తరపు న్యాయవాది.. నిందితురాలి మానసిక స్థితి సరిగ్గాలేదని ఆమెకు బెయిల్ ఇవ్వాలని, శిక్షాకాలాన్ని 8 సంవత్సరాలకు తగ్గించాలని కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై జడ్జి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా అమానుషమని, అరుదైన ఘటన అని విచారం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన తర్వాత.. నిందితురాలు భర్తకు.. ఇకమీదట నీవు నా పిల్లలను చూడలేవని మెసెజ్ చేసింది. దీని అర్థం ఏంటని ప్రశ్నించారు?.. అదే విధంగా నిందితురాలి మానసిక పరిస్థితిని అధ్యయనం చేయడానికి ప్రత్యేక వైద్యుడిని నియమించారు.
అతను.. ఆమెను విచారించారు. ఆమె ఆరోగ్యంగా ఉందని , ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావడంలేదని కోర్టు వారికి తెలిపారు. దీంతో ఆమెకు బెయిల్ మంజూరును న్యాయమూర్తి నిరాకరించారు. కాగా, ఈ ఘటనలో మృతి చెందిన పిల్లల ఆత్మకు శాంతి కలగాలని స్థానికులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment