Husband Behaviour
-
అతనికి ఆ హాబీ ఉందని... ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన భార్య!!
wife bid for her husband to sell him online: ఆలు మగలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. ఇటీవల కాలంలో చాలా సిల్లీ విషయాలకే విడిపోవడం కూడా చూశాం. మరికొంతమంది అయితే చాలా తీవ్రంగా కొట్టుకుని ఒకరినోకరు గాయపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మహిళ కేవలం వాకింగ్‌కి వెళ్తున్నాడన్న కోపంతో భర్తని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే..న్యూజిలాండ్‌కి చెందిన ఒక మహిళ తన భర్తను ఆన్లైన్లో విక్రయానికి పెట్టింది. తన భర్తకి వాకింగ్‌కి వెళ్లే హాబీ ఉందని, అందుకోసం తనని, పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతాడని చెబుతోంది. పైగా అతను పిల్లలను చూసుకోవలసినప్పుడల్లా వాకింగ్‌కి వెళ్లిపోతుంటాడని తెలిపింది. అయితే ఆమెకు తన భర్తతో గడపటం చాలా ఇష్టం అని, కానీ అతనెమో తనకు చెప్పకుండా వెళ్లిపోతాడని వాపోయింది. అందుకే ఆమె విసిగిపోయి ఈ పని చేసానని చెబుతోంది. ఈ మేరకు ఆమె తన భర్త అమ్మకానికి సంబంధించిన ప్రోఫైల్‌ని క్రియేట్ చేసి ఆన్లైన్ ట్రేడింగ్ సైట్లో ఉంచింది. పైగా యూజ్డ్ కండిషన్ అనే ట్యాగ్‌ని ఒకటి పెట్టి ప్రకటనలో..పొడవు 6 అడుగుల 1 అంగుళం...వయసు 37 ఏళ్లు. వృత్తి రీత్యా రైతు. బాగా చూసుకోడమే కాక నిజాయితీ పరుడు అని పేర్కొంది. అంతేకాదు అతన్ని ఎవరైన కొనుగోలు చేస్తే షిప్పింగ్ ఉచితం అని ఆఫర్ కూడా ఇచ్చేసింది. (చదవండి: ఆ వ్యక్తి 67 ఏళ్లుగా స్నానమే చేయలేదట!. అతని ఆహారం ఏమిటో తెలుసా?) -
‘భార్యలను మార్చుకునే’ రాకెట్ గుట్టురట్టు!
తిరువనంతపురం(కేరళ): మన సమాజంలో వివాహానికి ఎంతో ఉన్నత స్థానం ఉంది. అయితే, ఈ మధ్య చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉంటున్నాయి. కొన్నిచోట్ల భార్య, భర్తలు వేరే వాళ్లతో వివాహేతర సంబంధాలు పెట్టుకుట్టుంటే.. మరి కొన్నిచోట్ల కొందరు బరితెగించి తమ కన్నవారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొన్నిచోట్ల స్నేహం ముసుగులో యువతి, యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఇటువంటి ఘటనే కేరళలో వెలుగుచూసింది. వివరాలు.. కేరళలోని కరుచాకల్కు చెందిన ఒక వ్యక్తి తన భార్యను లైంగికంగా వేధించేవాడు. ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతం చేసేవాడు. ఈ రీతిలో ప్రతిరోజు భార్య ఇష్టానికి వ్యతిరేకంగా అతను వ్యవహరించేవాడు. కొంత కాలానికి ఆ వ్యక్తి ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో అతను మరికొందరు కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. ఈ గ్యాంగ్‌లో ఏడుగురు సభ్యులున్నారు. ఈ ఏడుగురితో కూడా సంబంధం పెట్టుకోవాలని తన భార్యను ఆ వ్యక్తి బలవంతం చేశాడు. ఆ గ్యాంగ్‌లోని అందరూ తమ భార్యలపట్ల ఇలాంటి అభ్యంతరకర పద్ధతినే కొనిసాగించేవారు. ఈ క్రమంలో సదరు మహిళ.. భర్త చేష్టలతో విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు.. పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విచారణ చేపట్టారు. వీరి విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా టెలిగ్రామ్, మెసెంజర్లతో సంప్రదించుకునేవారని పోలీసులు గుర్తించారు. వీరికి సంబంధించిన చాటింగ్ గ్రూపులో వేలాది మంది యువతి,యువకులున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో బృందాలుగా విడిపోయిన పోలీసులు గత ఆదివారం నిందితులను కొట్టాయం, అలప్పుజ, ఎర్నాకులం జిల్లాల నుంచి అరెస్టు చేశారు. -
మరో మహిళతో భర్త ఫోటోలు: ఐదుగురు పిల్లలను బాత్‌టబ్‌లో ముంచి
బెర్లిన్: పిల్లలు పుట్టాలని తల్లిదండ్రులు ఎంతో పరితపిస్తుంటారు. ఒకవేళ ఏదైన సమస్యలుంటే.. వారు ఆసుపత్రుల చుట్టు.. ఆలయాల చుట్టు తిరుగుతుంటారు. మనుషులే కాదు.. నోరులేని మూగజీవాలు కూడా తమ పిల్లల పట్ల ఎనలేని ప్రేమను కనబరుస్తాయి. ఒకవేళ పిల్లలకు ఏదైన ఆపద సంభవిస్తే.. తమ ప్రాణాలను కూడా లెక్కచేయవు. ప్రస్తుతం క్షణికావేశంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిన్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. జర్మనీలో కూడా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. జర్మనీలోని సోలెంగెన్ పట్టణానికి చెందిన ఒక మహిళ, తన భర్తతోపాటు కలిసి జీవిస్తుంది. వీరికి ఆరుగురు పిల్లలున్నారు. ఈ క్రమంలో.. ఒక రోజు తన భర్త.. మరో మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. దీంతో.. విచక్షణను కోల్పోయి తన ఇంట్లో ఉన్న బాత్‌టబ్‌లో ఐదుగురు పిల్లలను ముంచి ఊపిరాడకుండాచేసి అతి క్రూరంగా హత్యచేసింది. చనిపోయిన పిల్లలంతా.. 18 నెలల నుంచి 8 ఏళ్ల వయసులోపు వారున్నారు. సంఘటన జరిగినప్పుడు.. తన భర్త, పెద్దకొడుకు లేకపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గతేడాది సెప్టెంబరులో జరిగింది. ఆ తర్వాత సదరు మహిళ.. ట్రైన్‌ఎదుట వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తర్వాత స్థానికులు ఆమెను కాపాడారు. పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో విచారించిన ఆమెను జీవితఖైదు విధిస్తు జడ్జి తీర్పునిచ్చారు. తాజాగా, ఆమె తరపు న్యాయవాది.. నిందితురాలి మానసిక స్థితి సరిగ్గాలేదని ఆమెకు బెయిల్ ఇవ్వాలని, శిక్షాకాలాన్ని 8 సంవత్సరాలకు తగ్గించాలని కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై జడ్జి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా అమానుషమని, అరుదైన ఘటన అని విచారం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన తర్వాత.. నిందితురాలు భర్తకు.. ఇకమీదట నీవు నా పిల్లలను చూడలేవని మెసెజ్ చేసింది. దీని అర్థం ఏంటని ప్రశ్నించారు?.. అదే విధంగా నిందితురాలి మానసిక పరిస్థితిని అధ్యయనం చేయడానికి ప్రత్యేక వైద్యుడిని నియమించారు. అతను.. ఆమెను విచారించారు. ఆమె ఆరోగ్యంగా ఉందని , ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావడంలేదని కోర్టు వారికి తెలిపారు. దీంతో ఆమెకు బెయిల్ మంజూరును న్యాయమూర్తి నిరాకరించారు. కాగా, ఈ ఘటనలో మృతి చెందిన పిల్లల ఆత్మకు శాంతి కలగాలని స్థానికులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. -
ప్రియురాలితో దిగిన ఫొటోలను భార్యకు వాట్సప్‌లో
సాక్షి, ఓర్వకల్లు: ఇష్టంలేని పెళ్లి చేసుకొన్న భర్త వేధింపులకు తట్టుకోలేక భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రమైన ఓర్వకల్లులో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బండారి సోమన్న కూతురు బండారి సుజితను కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన కిశోర్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. కిశోర్ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. పెళ్లయిన ఏడాదికే భార్యను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. దీంతో రెండు సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి తల్లితండ్రులు తమ కూతురు కాపురాన్ని చక్కపెట్టాలని భావించారు. అయితే కిశోర్‌కు పెళ్లికి ముందుగానే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు భార్యకు తెలియడంతో వేధింపులు మరింత అధికమయ్యాయి. ఇటీవల సుజితకు గ్రామ సచివాలయంలో మహిళా పోలీసు ఉద్యోగం లభించింది. ప్రస్తుతం కోడుమూరు మండలం, పి.కోటకొండ గ్రామంలో విధుల్లో చేరింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కిశోర్ తన ప్రియురాలితో దిగిన అసభ్యకరమైన ఫొటోలను భార్య వాట్సప్‌కు పంపాడు. కలత చెందిన సుజిత మూడు రోజుల క్రితం పుట్టింటికి రావడంతో ఆదివారం రాత్రి భర్త కిశోర్ నన్నూరు వద్దకు పిలిపించుకొని తనకు ఇష్టంలేదని, విడాకులు ఇవ్వాలని కోరాడు. మనోవేదనతో ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో సుజిత పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఏడడుగులు వేసి ఏలుకోనంటున్నాడు
ప్రేమిస్తున్నా అన్నాడు. జీవితాంతం తోడుంటా అని నమ్మించాడు. అతడే సర్వస్వం అనుకున్న యువతి అయినవారందరినీ విడిచి ఏడడుగులు నడిచింది. ఏడాదిలోగా పరిస్థితి తారుమారైంది. జీవితాంతం తోడుంటానని చెప్పిన భర్త.. గర్భిణి అన్న కనికరం లేకుండా ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు. అండగా నిలవాల్సిన అత్తమామలు వేధింపులకు గురిచేస్తూ పట్టెడన్నం పెట్టేందుకు కూడా నిరాకరిస్తున్నారు. ఆమెకు ఆశ్రయం కల్పించి సాయం చేస్తున్న వారిని కూడా దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని విర్రవీగిపోతున్న వీరి ఆగడాలను ఇన్నాళ్లూ మౌనంగా భరిస్తూ వస్తున్న ఆమె.. న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టింది. వేడుకుంటోంది. అండగా నిలిచిన మహిళల సాయంతో కార్యాలయాలను ముట్టడించింది. బూర్జ : తనకు న్యాయం చేయాలని మండలంలోని అల్లెన గ్రామానికి చెందిన గంటా ధనలక్ష్మి బూర్జ జంక్షన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని బూర్జ వరకు బుధవారం ర్యాలీ నిర్వహించింది. పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన తెలిపింది. వెలుగు కార్యాలయం వద్ద విప్ కూన రవికుమార్ పింఛన్లు పంపిణీ చేస్తున్నారని తెలిసి.. అక్కడకు వెళ్లి ఆయన వాహనాన్ని అడ్డుకుంది. మహిళలు, ప్రజా సంఘాలు కూడా ఆమెకు మద్దతుగా నిలవడంతో వివాదం చోటుచేసుకుంది. అక్కడి నుంచి నేరుగా వెలుగు కార్యాలయంలోకి విప్ వెళ్లిపోయారు. విప్ బయటకు రావాలని అంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన బయటకు రాకపోవడంతో.. భర్త ఆగడాలను వివరించింది. ‘మీ మద్దతే ఉందని నా భర్త హెచ్చరిస్తున్నాడు’ అంటూ నిలదీసింది. తనకేమీ సంబంధం లేదని, భర్త ఇంట్లో ఉండేలా చేస్తానని విప్ హామీ ఇచ్చారు. తర్వాత సమస్య సీఎం ఆదాంకు తెలపాలని సూచించారు. గతంలో పోలీసులను ఆశ్రయించినా.. ఫలితం లేకపోయిందని విలపించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. వివక్ష.. వేధింపులు గంటా ధనలక్ష్మిది బూర్జ మండలంలోని జీబీపురం. తండ్రి చిన్నారావు రోజువారీ కూలీ. అమ్మ లీలావతితో కలసి ఆమె పలు ఇళ్లలో పనిచేస్తుండేది. జీబీపురం పక్కనే ఉన్న అల్లెన గ్రామానికి చెందిన బొత్స రాంబాబుతో ఆమెకు 2015లో పరిచయమైంది. రాంబాబు తండ్రి సింహాద్రి గ్రామంలో వీఆర్ఏగా ఉండేవారు, తల్లి చిన్నమ్మడు టీడీపీ మాజీ ఎంపీటీసీ. పరిచయం స్నేహంగా మారి ప్రేమ చిగురించింది. 2017 ఏప్రిల్ 21న ధనలక్ష్మికి నిశ్చితార్థం చేసేందుకు నిర్ణయించగా.. 20వ తేదీ రాంబాబుతో కలసి ఇంటినుంచి వెళ్లిపోయింది. ఏప్రిల్ 22న ఆమదాలవలస వెంకటేశ్వర ఆలయంలో కొంతమంది పెద్దల సాయంతో వీరు పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించి రసీదును పెద్దలకు అందజేశారు. అనంతరం భర్తతో కలసి గుంటూరు వెళ్లిపోయింది. తర్వాత సంతకవిటి మండలం ఎస్.రంగారాయపురంలోని అక్క ఇంటికి ధనలక్ష్మి, అల్లెనలోని ఇంటికి రాంబాబు వెళ్లిపోయారు. కొద్ది కాలం తర్వాత ఆమెను కూడా అల్లెనకు తీసుకెళ్లాడు. ఇప్పుడు నాలుగు నెలల నుంచి తనను ఇంట్లోకి రానివ్వకుండా బయట శాలలో పెట్టి, వేరే పళ్లెంలో భోజనం పెడుతూ.. వివక్ష చూపుతున్నారని ధనలక్ష్మి వాపోయింది. ఈ నెల 4వ తేదీన ఆమదాలవలస సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో సీఐ ఆదాం రాంబాబుపై కేసు నమోదుచేశారని వివరించింది. అప్పటికీ న్యాయం జరగలేదని, కేసు పెట్టిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయని కన్నీరుమున్నీరయింది. అత్తమామలతో పాటు వారి బంధువులు వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొంది. ఇరుగు పొరుగువారు భోజనాలు పెడుతుంటే వారిని దుర్భాషలాడుతున్నారని, చివరికి రామమందిరం వద్ద తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విలపించింది. తనకు విప్ కూన రవికుమార్ మద్దతు ఉందని రాంబాబు బెదిరిస్తున్నాడని వాపోయింది. దీంతో న్యాయం పోరాటం చేస్తున్నానని తెలిపింది ఆరు నెలల గర్భిణి అయిన ధనలక్ష్మి న్యాయం కోసం పోరాడుతున్న విషయం తెలుసుకున్న అల్లెన, గంగా భగీరథపురం, ఇతర గ్రామాల మహిళలు అధిక సంఖ్యలో బూర్జ చేరుకుని మద్దతుగా నిలిచారు. ధనలక్ష్మికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇందులో సిటు మహిళా నాయకులు ఈశ్వరమ్మతోపాటు ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. దీంతో రాంబాబుపై గతంలో నమోదైన కేసులో రాంబాబును బుధవారం అరెస్టు చేస్తున్నట్లు ఎస్సై జనార్దనరావు తెలిపారు. -
వ్యక్తిగత కారణాలతో మహిళ ఆత్మహత్య
సాక్షి, విజయనగరం : జిల్లాలోని కురుపాం గ్రామానికి చెందిన పత్తిక మణిమాల(30) పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందింది. ఈమె భర్త శంకర్ రావు వృత్తి రీత్యా టీచర్. ఇతను గుమ్మలక్ష్మీపురం మండలం అచ్చబా గ్రామంలో మండలపరిషత్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్య, భర్తల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. శంకర్ రావే తన భార్యను చంపి, దాన్ని ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
భర్త వేధింపులతో గర్భిణి మృతి
మంచిర్యాలక్రైం: భర్త వేధింపులతో అనారోగ్యానికి గురై గర్భిణి మృతి చెందింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన నిమ్మకంటి శ్రీలత (22) బెల్లంపల్లికి చెందిన ఎండీ అజ్గర్‌తో ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో శ్రీలత కుటుంబ సభ్యులు కొంత కాలంగా ఇంటికి రానియ్యలేదు. తరుచూ వేధింపులకు గురి చేస్తూ రోజు చిత్రహింసలకు గురి చేస్తున్న క్రమంలో వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అప్పటికే శ్రీలత నాలుగు నెలల గర్భిణి. దీంతో అనారోగ్యానికి గురై సరైన వైద్యం అందక మృతి చెందింది. ఆమె మృతికి భర్త అజ్గర్ కారణమని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు. -
చనిపోయిన భార్య పుర్రెను తీసుకొచ్చి..