అతనికి ఆ హాబీ ఉందని... ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన భార్య!! | Woman Bid Online To Sell Her Husband Due To His Habitual Walking | Sakshi
Sakshi News home page

Woman Sells Her Husband: హస్బెండ్ ఫర్ సేల్... ఫ్రీ షిప్పింగ్‌

Published Fri, Jan 21 2022 7:20 PM | Last Updated on Sat, Jan 22 2022 9:25 AM

Woman Bid Online To Sell Her Husband Due To His Habitual Walking - Sakshi

wife bid for her husband to sell him online: ఆలు మగలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. ఇటీవల కాలంలో చాలా సిల్లీ విషయాలకే విడిపోవడం కూడా చూశాం. మరికొంతమంది అయితే చాలా తీవ్రంగా కొట్టుకుని ఒకరినోకరు గాయపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మహిళ కేవలం వాకింగ్‌కి వెళ్తున్నాడన్న కోపంతో భర్తని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది.

అసలు విషయంలోకెళ్తే..న్యూజిలాండ్‌కి చెందిన ఒక మహిళ తన భర్తను ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టింది. తన భర్తకి వాకింగ్‌కి వెళ్లే హాబీ ఉందని, అందుకోసం తనని, పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతాడని చెబుతోంది. పైగా అతను పిల్లలను చూసుకోవలసినప్పుడల్లా వాకింగ్‌కి వెళ్లిపోతుంటాడని తెలిపింది. అయితే ఆమెకు తన భర్తతో గడపటం  చాలా ఇష్టం అని,  కానీ అతనెమో తనకు చెప్పకుండా వెళ్లిపోతాడని వాపోయింది. అందుకే ఆమె విసిగిపోయి ఈ పని చేసానని చెబుతోంది.

ఈ మేరకు ఆమె తన భర్త అమ్మకానికి సంబంధించిన ప్రోఫైల్‌ని క్రియేట్‌ చేసి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ సైట్లో ఉంచింది. పైగా యూజ్డ్‌ కండిషన్‌ అనే ట్యాగ్‌ని ఒకటి పెట్టి ప్రకటనలో..పొడవు 6 అడుగుల 1 అంగుళం...వయసు 37 ఏళ్లు. వృత్తి రీత్యా రైతు. బాగా చూసుకోడమే కాక నిజాయితీ పరుడు అని పేర్కొంది. అంతేకాదు అతన్ని ఎవరైన కొనుగోలు చేస్తే షిప్పింగ్‌ ఉచితం అని ఆఫర్‌ కూడా ఇచ్చేసింది.

(చదవండి: ఆ వ్యక్తి 67 ఏళ్లుగా స్నానమే చేయలేదట!. అతని ఆహారం ఏమిటో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement