ఇదేం విడ్డూరం...పెంపుడు కుక్కే యజమానులపై ఘోరంగా దాడి... | Woman And Her Two Children Attacked By Their Pet Pit Bull Dog | Sakshi
Sakshi News home page

ఇదేం విడ్డూరం...పెంపుడు కుక్కే యజమానులపై ఘోరంగా దాడి...

Published Sun, Oct 16 2022 1:03 PM | Last Updated on Sun, Oct 16 2022 1:03 PM

Woman And Her Two Children Attacked By Their Pet Pit Bull Dog  - Sakshi

హర్యానా: పెంపుడు కుక్కే యజమాని భార్య, పిల్లలపై ఘోరంగా దాడి చేసింది. ఈ ఘటన హర్యానాలోని రేవారిలో బలియార్‌ ఖుర్దే గ్రామంలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ సూరజ్‌ తాను తన భార్య, పిల్లలు ఇంటి తిరిగివచ్చినప్పుడు తమ పెంపుడు కుక్క పిట్‌బుల్‌ ఘోరంగా దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో తన భార్య, పిల్లలు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు.

తాను తనవారిని కాపాడుకోవటం కోసం ఆ కుక్కను ఆపేందుకు ఎంతగా కర్రలతో కొట్టినా...దాడి చేయడం మాత్రం ఆపలేదని చెప్పారు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడిందని, ఆమె తల, కాళ్లు, చేతులకు దాదాపు 50 కుట్లుదాక పడ్డాయని ఆమె కుటుంట సభ్యులు తెలిపారు. 

(చదవండి: అరుదైన సంగీత శస్త్ర చికిత్స: బ్యాండు మేళం వాయిస్తుంటే.. సర్జరీ చేసేశారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement