pit bulls
-
Video: కింగ్ కోబ్రాను చంపి పిల్లలను రక్షించిన పిట్ బుల్
పిట్‌బుల్ జాతికి చెందిన కుక్కలను ప్రమాదకరమైనవి పేర్కొంటారు. అనేకసార్లు మానవులపై ఇవి దాడికి పాల్పడటమే ఇందుకు కారణం. పెంచుతున్న యజమానులతో పాటు ఇతరులపై సైతం ఉన్నట్టుండి దాడి చేసి గాయపర్చుతుండటంతో వీటిని పెంచుకోవడంపై భారత్‌లో నిషేధం కూడా విధించారు. అయితే తాజాగా ఓ పిట్ బుల్ కుక్క.. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా దాడి నుంచి చిన్నారుల ప్రాణాలను కాపాడింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాన్సీలో జరిగింది. శివగణేష్ కాలనీలో ఇంటి ముందు తోటలో పనిమనిషి పిల్లలు ఆడుకుంటుండా ఒక్కసారిగా పాము ప్రవేశించింది. కోబ్రాను గుర్తించిన పిల్లలు సాయం కోసం కేకలు వేయడం ప్రారంభించారు. చిన్నారుల అరుపులు విన్న పిట్ బుల్ జెన్నీ.. వెంటనే దాన్ని కట్టేసిన తాడును తెంచుకొని వారిని రక్షించేందుకు వచ్చింది.కుక్క దాని దవడల మధ్య కింగ్ కోబ్రాను బంధించి ముప్పుతిప్పలు పెట్టింది. తలతో వేగంగా తప్పుతూ దాన్ని చంపేందుకు ప్రయత్నించింది. దాదాపు అయిదు నిమిషాలపాటు పాముతో పోరాడింది. చివరికి పామును వేగంగా కొట్టడం ద్వారా అది చనిపోయింది. पिटबुल ने बचाई बच्चों की जान: झाँसी के एक घर के गार्डन में बच्चे खेल रहे थे, तभी एक साँप आ गया और देखते ही देखते पिटबुल डॉग साँप से भिड़ गया। पिटबुल ने साँप को पटक पटक कर मार डाला।#Pitbull #Jhansi pic.twitter.com/fqB77XW3Q6— Aviral Singh (@aviralsingh15) September 25, 2024ఇక ఈ ఘటనపై జెన్నీ యజమాని పంజాబ్ సింగ్ మాట్లాడుతూ.. తమ పిట్ బుల్ పామును చంపి ప్రాణాలను రక్షించడం ఇది మొదటిసారి కాదని తెలిపారు. తమ ఇల్లు పొలాల మధ్య ఉండటం వల్ల తరచుగా పాములు వస్తుంటాయిని, అయితే జెన్నీ ఇప్పటివరకు ఎనిమిది నుంచి, పది పాములను చంపినట్లు ఆయన తెలిపారు. -
పిట్‌బుల్ బీభత్సం.. పరారీలో కుక్క యజమాని
సాక్షి, బెంగళూరు: మనదేశంలో నిషేధించిన పిట్‌బుల్ జాతి కుక్క బాలునిపై పడి కరిచింది. టూషన్‌కు వెళుతున్న విద్యార్థిని కరవడంతో కిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. హుబ్లీ బంకాపుర చౌక్ వద్ద పాటిల్ గల్లీలో జరిగిన ఘటనలో పవన్ అనిల్ దొడ్డమని (12) అనే బాలునికి తీవ్రగాయాలు అయ్యాయి. గురుసిద్దప్ప చెన్నోజీ అనే వ్యక్తికి చెందిన కుక్క కాంపౌండ్ నుంచి ఎగిరి వచ్చి బాలుని మీద దాడి చేసిందని బెణ్ణిగేరి పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనతో సదరు కుక్క యజమాని కుక్కను తీసుకుని కుటుంబంతో సహా ఇళ్లు విడిచి పరారయ్యాడు. ఇతడు మాజీ కార్పొరేటర్ బంధువు అని చెబుతున్నారు. పిట్‌బుల్ జాతి కుక్కలు ఉద్రేకమైనవని, ఉట్టి పుణ్యానికే జనం మీద పడి కరుస్తాయని పేరుంది. దీంతో భారత ప్రభుత్వం వీటి పెంపకాన్ని నిషేధించింది. అయినప్పటికీ కొందరు దొంగచాటుగా వీటిని పెంచుకోవడం జరుగుతోంది. అమెరికా వంటి విదేశాల నుంచి ఈ కుక్కలను గతంలో దిగుమతి చేసుకున్నారు. జంట నగరాల్లో కుక్కల గోల కాగా హుబ్లీ–ధార్వాడ జంట నగరాలలో కుక్కల బెడద ఎక్కువైంది. కిమ్స్ ఆస్పత్రిలో నమోదవుతున్న కేసులే దీనికి రుజువు. ఈ మధ్యకాలంలో కుక్కలు కొరికి వ్యాక్సిన్ వేసుకున్న వారు 750 మంది వరకూ ఉన్నారు. ఈ కేసులన్నీ హుబ్లీ నగరానికే చెందినవి. నిత్యం ఐదారు మందికి పైగా కుక్కల బారినపడి కిమ్స్‌కు వస్తున్నారు. ముఖ్యంగా హుబ్లీలోని బంకాపుర చౌక్ సెటిల్మెంట్ ప్రదేశం, పాతహుబ్లీ, గణేష్ పేట, ఆనంద్నగర, తదితర చోట్ల వీధి శునకాల బెడద అధికంగా ఉంది. కొప్పికర్ రోడ్డు ఇటీవల యువకులపై కుక్క దాడి చేసింది. ఆ వెనువెంటనే బంకాపుర్ చౌక్ పాటిల్ గల్లీలో మరో ఘటన జరిగింది. చదవండి: (అందరి చూపు సుప్రీం వైపు.. సరిహద్దుల్లో భారీగా బలగాలు) త్వరలో నియంత్రణ చర్యలు కార్పొరేషన్ ప్రధాన వైద్యాధికారి డాక్టర్.శ్రీధర్ దండెప్పనవర మాట్లాడుతూ కుక్కల నియంత్రణకు కృషి చేస్తున్నాము. ఆ మేరకు టెండర్లును పిలిచాము. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కుక్కలను పట్టుకొని సంతాన రహిత ఆపరేషన్లను చేస్తామని చెప్పారు. -
ఇదేం విడ్డూరం...పెంపుడు కుక్కే యజమానులపై ఘోరంగా దాడి...
హర్యానా: పెంపుడు కుక్కే యజమాని భార్య, పిల్లలపై ఘోరంగా దాడి చేసింది. ఈ ఘటన హర్యానాలోని రేవారిలో బలియార్ ఖుర్దే గ్రామంలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఆ గ్రామ మాజీ సర్పంచ్ సూరజ్ తాను తన భార్య, పిల్లలు ఇంటి తిరిగివచ్చినప్పుడు తమ పెంపుడు కుక్క పిట్‌బుల్ ఘోరంగా దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో తన భార్య, పిల్లలు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. తాను తనవారిని కాపాడుకోవటం కోసం ఆ కుక్కను ఆపేందుకు ఎంతగా కర్రలతో కొట్టినా...దాడి చేయడం మాత్రం ఆపలేదని చెప్పారు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడిందని, ఆమె తల, కాళ్లు, చేతులకు దాదాపు 50 కుట్లుదాక పడ్డాయని ఆమె కుటుంట సభ్యులు తెలిపారు. (చదవండి: అరుదైన సంగీత శస్త్ర చికిత్స: బ్యాండు మేళం వాయిస్తుంటే.. సర్జరీ చేసేశారు) -
హడలెత్తించిన కుక్క.. ఆవుపై దాడి.. అమాంతం నోటితో కరిచి పట్టుకొని..
లక్నో: కుక్కలు విశ్వాసానికి మారు పేరుగా వర్ణిస్తుంటారు. కానీ కొన్ని రకాల కుక్కలు మాత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా మనుషులపై దాడి చేస్తుంటాయి. ఎక్కడి పడితే అక్కడ కొరికి కరిచేస్తుంటాయి. ఇటీవల కాలంలో పెంపుడు జంతువులు దాడి చేస్తున్న ఘటన ఎక్కువ అవుతున్నాయి. అంతేగాక కుక్కల బారిన పడి అనేక చోట్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలను చాలానే చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ కుక్క దాడిలో ఆవు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో చోటుచేసుకుంది. పిట్ బుల్ జాతికి చెందిన పెంపుడు కుక్క ఆవుపై విచక్షణారహింతంగా దాడికి తెగబడింది. క్రూరమైన కుక్క ఆవు దవడను తన నోటితో బలంగా కరిచి పట్టుకుంది. దీంతో ఆవు నొప్పితో మెలికలు తిరుగుతూ కనిపించింది. ఆవును రక్షించడానికి కుక్క యాజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. చేతులు, కర్రతో కొట్టినప్పటికీ కుక్కు ఆవును ఎంతకూ వదిలి పెట్టలేదు. మరో ఇద్దరు, ముగ్గురు వచ్చి సాయం చేయగా చివరికి విడిచిపెట్టింది. అయితే అప్పటికే ఆవు నోటిపై లోతైన గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కుక్క లైసెన్స్ చూపించాల్సిందిగా యాజమానిని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. కుక్కను కూడా స్వాధీనం చేసుకొని బోనులో ఉంచారు. ఆవును పశువైద్యశాలకు పంపించారు. అలాగే దానికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్కే నిరంజన్ తెలిపారు. కాగా పిట్‌బుల్ జాతికి చెందిన కుక్కలు మనుషులపై దాడి చేసే ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. గత రెండు నెలల్లో వేర్వేరు సంఘటనల్లో దాదాపు అర డజను మంది పిట్‌బుల్ దాడిలో గాయపడ్డారు. कानपुर के सरसैया घाट पर ‘पिटबुल कुत्ते’ ने कर दिया गाय पर हमला। - ग्रामीणों की काफी देर की मशक्कत के बाद गाय को पिटबुल की कैद से छुड़ाया जा सका। - इस बीच पिटबुल डॉग ने गाय का जबड़ा चबा लिया। - इस घटना के बाद घाट पर जाने से कतरा रहे हैं सैलानी। pic.twitter.com/yvbBN5EgSS — Shubhankar Mishra (@shubhankrmishra) September 22, 2022 -
హ్యాట్సాఫ్!. కుక్కని భలే రక్షించాడు.. వైరల్ వీడియో
ఒక్కోసారి సంభవించే అనుహ్యమైన ప్రమాదాలు లేదా జంతువులు దాడులు చాలా భయానకంగా ఉంటాయి. పైగా ఎలా తప్పించుకోవాలో కూడా తెలియదు. అచ్చం అలాంటి ఘటనే ఒక కస్టమర్ కుమార్తెకి ఎదురైంది. (చదవండి: పారా సెయిలింగ్ మళ్లీ ఫెయిల్ !... ఇద్దరు మహిళలకు చేదు అనుభవం!!) అసలు విషయంలోకెళ్లితే...అమెరికాలోని స్టెఫానీ లాంట్జ్ సబర్బన్ లాస్ వెగాస్‌లో అమెజాన్ డెలివరీ డ్రైవర్ లిడే ప్యాకేజీలను డెలివరీ చేస్తుంటాడు. ఇంతలో ఒక కస్టమర్ కుమార్తె 19 ఏళ్ల లారెన్ రే బయటకు వచ్చింది. అనుకోకుండా అక్కడ ఒక వీధి కుక్క ఆమె వద్దకు వచ్చింది. అయితే ఆమె కూడా ఆ కుక్కని చక్కగా పలకరించింది. అంతా బాగానే ఉంటుంది. ఇంతలో ఆమె పెంపుడు కుక్క బయటకు వచ్చింది. అంతే ఆ వీధి కుక్క ఒక్కసారిగా చాలా క్రూరంగా ఆ కుక్క పై దాడి చేసింది. దీంతో ఆమెకు ఒక్కసారిగా ఏం చేయాలో పాలుపోదు. అయితే ఏదోరకంగా దాన్ని భయపెట్టడానికి ప్రయత్నించినా కూడా అది ఆగదు. పైగా ఆమె పై కూడా దాడి చేసింది. దీంతో అక్కడే ఉన్న అమెజాన్ డ్రైవర్ వెంటనే స్పందించి ఆ కుక్కను నివారించటమే కాకుండ ఆమె పెంపుడు కుక్క వద్దకు రాకుండా అడ్డుగా నిలబడి ఉంటాడు. ఆ తర్వాత ఆమె తన పెంపుడు కుక్కను తీసుకుని లోపలికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ కుక్క కూడా కాసేపటికి నిష్క్రమించింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?) -
దారుణం: కూలీ ప్రాణం తీసిన పెంపుడు కుక్క
సాక్షి, బెంగళూరు: నిర్మాణ స్థలంలో మెట్ల కింద నిద్రిస్తున్న కూలీని యజమాని పెంపుడు కుక్క దాడి చేసింది. ఆ కుక్క చేతిలో తీవ్రంగా గాయపడి అతడు మృతి చెందాడు. ఈ దాడిని ఆపడానికి ప్రయత్నించిన యజమానిని కూడా ఆ కుక్క గాయపరిచింది. దీంతో ఆ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని అత్తూర్ లేఅవుట్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడు నరసింహ (36) పని చేసేందుకు వచ్చాడు. నిర్మాణం జరుగుతున్న స్థలంలో మెట్ల కింద నరసింహ నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో యజమాని తన విదేశీ (పిట్ బుల్) జాతికి చెందిన పెంపుడు కుక్కతో అక్కడకు చేరింది. అకస్మాత్తుగా ఆ కార్మికుడిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అతడి మెడను పట్టుకుని కొరికేసింది. అయితే కుక్క అదుపు చేయడానికి వెళ్లగా యజమానికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. నరసింహ అరుపులు విని తోటి కార్మికులు అక్కడికి చేరుకుని వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నరసింహ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒక వ్యక్తి మరణానికి కారణమైన కుక్క యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అర్ధరాత్రి రౌడీ షీటర్ హల్చల్.. పోలీసుల ఎన్కౌంటర్ చదవండి: దారుణం.. వేశ్యను వాడుకుని డ్రైనేజీలో పారవేత -
డ్రైవింగ్ సీట్లో కుక్క..160 కి.మీ వేగంతో కారు!
వాషింగ్టన్: ప్రపంచంతో పాటు అమెరికాను వణికిస్తున్న కరోనా వైరస్ వార్తల్ని పక్కనబెడితే.. అమెరికా పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి చేసిన పనికి పోలీసులు నిశ్చేష్టులయ్యారు. 51 ఏళ్ల ఆల్బర్ట్ టిట్లో అనే వ్యక్తి కుక్కను డ్రైవింగ్ సీట్లో పెట్టి.. తాను ప్యాసెంజర్ సీట్లో కూర్చుని కారును ఏకంగా గంటకు 160 కి.మీ వేగంతో తోలాడు. దీంతో ఎమర్జెన్సీ కాల్ సెంటర్‌కు కొందరు ఫోన్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఈ ఘటన దక్షిణ సీటెల్‌లో గత ఆదివారం చోటుచేసుకుంది. (చదవండి: కరోనాకు 35,349 మంది బలి) ‘పదేళ్లుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. అధిక వేగంతో బండి నడిపి.. వారు చెప్పే సాకులు తెలుసు. కానీ, ఇతగాడు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాను. ఎందుకంత వేగంగా కారు నడిపావ్ అని ప్రశ్నిస్తే.. కుక్కకు డ్రైవింగ్ నేర్పిస్తున్నా! అని చెప్పడంతో దిమ్మ తిరిగిపోయింది. ఇలాంటి వాళ్లను అస్సలు క్షమించకూడదు. అంత ఎత్తున్న ఆ శునకాన్ని షెల్టర్‌లో పెట్టాం. నిందితుడిపై డ్రగ్స్, మోటార్ వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేశాం’అని పోలీస్ అధికారి హెథర్ ఆక్స్ట్మాన్ చెప్పుకొచ్చారు. కాగా, అమెరికా కరోనా క్రోధానికి బలవుతోంది. న్యూయార్క్, న్యూజెర్సీలతో కలిపి దేశం మొత్తంమ్మీద 1.45 లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా.. 2,606 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,574 మంది కోలుకున్నారు. (చదవండి: కరోనా: గుడ్‌న్యూస్ చెప్పిన జర్నలిస్టు) -
రాకాసి కుక్కలు చంపేశాయి
లాస్ ఎంజెల్స్: మార్నింగ్ వాక్కు వెళ్లిన 65 ఏళ్ల పెద్దాయనపై రెండు కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశాయి. ఆయన భార్యను కూడా తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనకు సంబంధించి కుక్కల యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన ఎమిలియో రియోస్(65) అనే వ్యక్తి ప్రతి రోజు మాదిరిగానే ఉదయం లేచి తన ఇంటి ఎదురుగా ఉన్న పచ్చిక బయల్లో కాస్త నడిచి వ్యాయామం చేసేందుకు బయటకు వెళ్లాడు. అతడు అలా వెళ్లాడో లేదో వెంటనే రెండు పిట్ బుల్స్ (అమెరికా సంతతికి చెందిన కుక్కలు) ఒక్కసారిగా ఆయనపై విరుచుకు పడ్డాయి. విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశాయి. అంతటితో ఆగకుండా అతడి భార్యపై కూడా దాడికి పాల్పడ్డాయి. దాంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు రాగా అవి పరారయ్యాయి. అనంతరం వచ్చిన పోలీసులు ఆ రాకాసి కుక్కలను మత్తుమందిచ్చిపట్టుకున్నారు. అందులో ఓ పిట్ బుల్ మాత్రం మత్తుమందు ఇచ్చినా పోలీసులపై దాడి చేసే ప్రయత్నం చేసింది.