రాకాసి కుక్కలు చంపేశాయి | A 65-year-old man was killed and a woman seriously hurt by two pit bulls | Sakshi
Sakshi News home page

రాకాసి కుక్కలు చంపేశాయి

Published Thu, Sep 10 2015 9:20 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

రాకాసి కుక్కలు చంపేశాయి

రాకాసి కుక్కలు చంపేశాయి

లాస్ ఎంజెల్స్: మార్నింగ్ వాక్కు వెళ్లిన 65 ఏళ్ల పెద్దాయనపై రెండు కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశాయి. ఆయన భార్యను కూడా తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనకు సంబంధించి కుక్కల యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన ఎమిలియో రియోస్(65) అనే వ్యక్తి ప్రతి రోజు మాదిరిగానే ఉదయం లేచి తన ఇంటి ఎదురుగా ఉన్న పచ్చిక బయల్లో కాస్త నడిచి వ్యాయామం చేసేందుకు బయటకు వెళ్లాడు.

అతడు అలా వెళ్లాడో లేదో వెంటనే రెండు పిట్ బుల్స్ (అమెరికా సంతతికి చెందిన కుక్కలు) ఒక్కసారిగా ఆయనపై విరుచుకు పడ్డాయి. విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశాయి. అంతటితో ఆగకుండా అతడి భార్యపై కూడా దాడికి పాల్పడ్డాయి. దాంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు రాగా అవి పరారయ్యాయి. అనంతరం వచ్చిన పోలీసులు ఆ రాకాసి కుక్కలను మత్తుమందిచ్చిపట్టుకున్నారు. అందులో ఓ పిట్ బుల్ మాత్రం మత్తుమందు ఇచ్చినా పోలీసులపై దాడి చేసే ప్రయత్నం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement