రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో బర్డ్ ఫ్లూ మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం 11 వేల కోడిపిల్లలను, 4,356 కోళ్లను చంపి, పాతిపెట్టింది. ప్రభుత్వ కోళ్ల ఫారంలో చనిపోయిన కోళ్ల నమూనా పరీక్షల్లో వైరస్ హెచ్5 ఎన్1 నిర్ధారించిన తర్వాత అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ కోళ్ల ఫారంలో కోళ్లు చనిపోతున్న దరిమిలా అధికారులకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందనే అనుమానం వచ్చింది. దీంతో వెంటనే కోళ్ల నమూనాను పరీక్షల కోసం భోపాల్‌లోని నేషనల్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపారు. అక్కడ ఆ నమూనాలలో హెచ్5 ఎన్1 నిర్ధారణ అయ్యింది.
దీనిపై రాయ్‌గఢ్ కలెక్టర్ కార్తికేయ గోయల్ మీడియాతో మాట్లాడుతూ భోపాల్‌లోని నేషనల్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల రాయ్‌గఢ్‌లోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్ నుండి పంపిన కోళ్ల నమూనాలలో బర్డ్ ఫ్లూ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిదన్నారు. అందుకే కోళ్ల ఫారమ్‌లోని మిగిలిన కోళ్లను, కోడిపిల్లలను చంపి పాతిపెట్టారన్నారు. రాయ్‌గఢ్ కలెక్టర్ మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, ప్రభుత్వ కోళ్ల ఫారం ఆవరణలో పూర్తి భద్రతా చర్యల నడుమ జేసీబీసహాయంతో ఒక గొయ్యి తవ్వి, చనిపోయిన కోళ్లు , కోడిపిల్లలను పూడ్చిపెట్టామని తెలిపారు. అలాగే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కోడి గుడ్లను కూడా నాశనం చేశారు.
ఇది కూడా చదవండి: రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment