
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో కాంకేర్ జిల్లా కోయిల్‌బెడా అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ముగ్గురు మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా విభాగాల ప్రత్యేక పోలీసులు తారçసపడిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ జరుగుతోందని ఎస్పీ చెప్పారు.
మందుపాతర పేలి జవాను దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం మందుపాతర పేలి హెడ్ కానిస్టేబుల్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కూంబింగ్ జరుపుతుండగా ఆయన పొరపాటున మందుపాతరపై కాలు వేశారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment