చైబాసా: జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింహ్‌భూమ్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. గువా పోలీస్‌స్టేషన్ పరిధిలోని లిపుంగా ప్రాంతంలో సోమవారం ఉదయం 5 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు ఐజీ అమోల్ వి హోంకార్ చెప్పారు.
మావోయిస్టు పార్టీ ఏరియా కమాండర్ టైగర్ అలియాస్ పాండు హన్స్‌దా, బట్రి దేవ్‌గమ్‌లను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, మూడు రైఫిళ్లు, ఒక పిస్టల్‌ను స్వాదీనం చేసుకున్నామన్నారు. మృతులను జోనల్ కమాండర్ కండె హొన్హాగా, సబ్ జోనల్ కమాండర్ సింగ్‌రాయ్ అలియాస్ మనోజ్, ఏరియా కమాండర్ సూర్య అలియాస్ ముండా దేవ్‌గమ్, మహిళా నక్సల్ జుంగా పుర్టి అలియాస్ మర్లా, సప్ని హన్స్‌డాగా గుర్తించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment