three maoists
-
ముగ్గురు మావోయిస్టులు మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో కాంకేర్ జిల్లా కోయిల్‌బెడా అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ముగ్గురు మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా విభాగాల ప్రత్యేక పోలీసులు తారçసపడిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ జరుగుతోందని ఎస్పీ చెప్పారు. మందుపాతర పేలి జవాను దుర్మరణం ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం మందుపాతర పేలి హెడ్ కానిస్టేబుల్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కూంబింగ్ జరుపుతుండగా ఆయన పొరపాటున మందుపాతరపై కాలు వేశారని పోలీసులు తెలిపారు. -
ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్
పశ్చిమ గోదావరి: ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో మంగళవారం జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. బుట్టాయగూడెం మండలం ఉప్పరెల్లలో కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో ముగ్గురు న్యూడెమోక్రసీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ఆ ముగ్గురిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
వరంగల్: సంచలనం రేపిన మావోయిస్టు పార్టీ సభ్యులు శ్రుతి, సాగర్ ల ఎన్ కౌంటర్ అనంతరం వరంగల్ జిల్లాలో పట్టుబడ్డ ముగ్గురు మావోయిస్టులను పోలీసులు శనివారం కోర్టులో హాజరుపర్చారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ (కెకెడబ్ల్యు) దళానికి చెందిన అసిస్టెంట్ డిప్యూటీ కమాండర్ కోవాసి గంగా అలియాస్ మంగ్యా, విట్టి భీములు, దీము కిష్టయ్యతో పాటు మావోయిస్టు సానుభూతి పరుడు శేఖర్‌ను కూడా అరెస్టు చేసినట్లు శుక్రవారం వరంగల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా ప్రకటించడం తెలిసిందే. అరెస్టయిన ముగ్గురూ చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారని, 2010 నుండి మావోయిస్టు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారని ఎస్సీ తెలిపారు.