రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయాడు. సోధి గజేంద్ర తదితర సుమారు 20 మంది మావోయిస్టులతో కూడిన కుంటా ఏరియా కమిటీ సమావేశమవుతున్నట్లు అందిన సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి.
ఈ సందర్భంగా భేజీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నగరం, పంటాభేజీ గ్రామాల మధ్య ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో ఒక మావోయిస్టు చనిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment