Raigarh
-
‘మహా’వృష్టి
ముంబై: మహారాష్ట్రలోని పలు జిల్లాలపై వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ముంబై మహానగరంసహా థానె, పుణె, పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయందాకా ఎడతెగని వానలతో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భీకరవర్షాలకు ఆయా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణెలోని దక్కన్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ముగ్గురు, తహమినీ ఘాట్‌లో కొండచరియలు పడి ఒకరు చనిపోయారు. జలదిగ్భంధంలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలోనూ వానలు ముంచెత్తాయి. సిటీ లోని శాంటాక్రూజ్ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్‌పోర్టులో విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై 300 మీటర్ల దూరం తర్వాత ఏమీ కనిపించట్లేదు. దీంతో 11 విమానాలను రద్దుచేశారు. కొన్నింటిని వేరే నగరాలకు దారి మళ్లించారు. -
ఛత్తీస్‌గఢ్‌లో పెరుగున్న కరోనా కేసులు
ఛత్తీస్‌గఢ్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 24 మందికి కరోనా సోకింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరోనా బాధితులు రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు చెందిన వారని సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గత 24 గంటల్లో కొత్తగా 11 మందికి కరోనా సోకింది. దీంతో రాజధానిలో కరోనా బాధితుల సంఖ్య 51కి చేరింది. ఇక్కడ ఇప్పటికే 40 మంది కరోనా బాధితులు ఉండగా, ఇప్పుడు ఈ సంఖ్య 51కి పెరగడం ఆందోళనకు దారితీస్తోంది. రాష్ట్రంలోని పారిశ్రామిక నగరం రాయ్‌ఘర్ కరోనా కేసులలో రెండవ స్థానంలో ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా ఐదుగురికి కరోనా సోకింది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 131కి చేరింది. కాగా 31 మంది కరోనా బాధితులు హోమ్ ఐసోలేషన్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4182 శాంపిల్స్‌ను పరీక్షించారు. -
ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..
బరంపురం(భువనేశ్వర్): తమ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ ప్రేమ జంట రాయిఘర్ పోలీసులను బుధవారం ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితి, సోనపూర్(డీఎన్‌కే) గ్రామంలో ఉన్న తన అక్క ఇంటికి ఈ నెల 8వ తేదీన ఛడిబెడ గ్రామానికి చెందిన ఓ యువతి వచ్చింది. కాళీమాత పూజల సందర్భంగా అదేరోజు రాత్రి గ్రామంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు యువతి హాజరైంది. అదే చోటుకి వచ్చిన తన ప్రియుడితో కాసేపు మాట్లాడేందుకు కార్యక్రమం జరుగుతున్న ప్రదేశం నుంచి కొంచెం దూరం వెళ్లారు. అక్కడ ఓ చోట వీరిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటుండగా గ్రామానికి చెందిన కొంతమంది ఆకతాయిలు వీరిని చుట్టుముట్టి, వారి వివరాలపై ఆరాతీశారు. ఆ తర్వాత వారికి ఇష్టమొచ్చినట్లు వారి బంధంపై మాట్లాడి, బలవంతంగా లాక్కెళ్లారు. వారిద్దరినీ ఓ ఇంట్లో బంధించి, వీడియో తీశారు. కాసేపు తర్వాత వారి ఇద్దరిపై పూలు చల్లి, పెళ్లి చేసినట్లుగా మరో వీడియో తీశారు. చదవండి: ('నూటొక్క జిల్లాల అందగాడు': విగ్గుతో అమ్మాయిలకు వలేస్తాడు.. ఆ తర్వాత..) న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు అనంతరం యువతి శరీరంపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి, అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో తనను దయచేసి విడిచిపెట్టాలని ఆ యువతి ఎంత మొరపెట్టుకున్నా వారు వినలేదు. అలాగే బంధించి, ఉంచిన వారిని మరుసటిరోజు ఉదయం విడిచిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి సోనపూర్కి హుటాహుటిన వచ్చి, యువతిని తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన గ్రామ కమిటీ సభ్యులు యువతి తండ్రిపై భౌతికదాడి చేసినట్లు ఫిర్యాదులో యువతి పేర్కొంది. ప్రస్తుతం తమను బంధించి, చిత్రహింసలు చేసిన వీడియోలు వైరల్ కావడంతో తమ పరువు పోయిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రేమికుల జంట పోలీసులను కోరింది. లేకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు. చదవండి: (Mukesh Ambani House: ‘అంటిలియా’ అడ్రస్ అడిగిన ముగ్గురి అరెస్టు!) -
కలహాల కాపురం? విషం సేవించిన భార్యాభర్తలు
జయపురం: నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి కచరాపర-2 గ్రామానికి చెందిన భార్యాభర్తలు కుటుంబంలో తగవుల కారణంగా ఆస్పత్రి పాలైనట్లు అనుమానిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మనోరంజన్‌కు ఉమ్మరకోట్ సమితి గుబురి గ్రామానికి చెందిన జయంతితో 15 యేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. శుక్రవారం జయంతి విషం తాగి వాంతులు చేసుకుంటుండడం చూసిన భర్త, గ్రామస్తులు వెంటనే రాయిఘర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షించి మందులు ఇచ్చారు. కొంతసేపటికి ఆరోగ్యం కుదుటపడుతున్న సమయంలో జయంతి తండ్రి హిరెన్ మండల్, మరి కొంతమంది బంధువులతో హాస్పిటల్‌కు వచ్చి తన కుమార్తె పరిస్థితికి భర్తే కారకుడని ఆరోపించి దాడి చేసి కొట్టారు. ఈ దెబ్బలకు మనోరంజన్ అక్కడే సృహ కోల్పోవడంతో వెంటనే నవరంగపూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కుటుంబకలహాలే ఈ పరిస్థితికి కారణమని పోలీసులు, బంధువులు, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసిన రాయిఘర్ పోలీసు అధికారి ఠంకుగిరి భొయి సిబ్బందితో రాయిఘర్ ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై కేసు నమోదు చేశారు. భార్యాభర్తలు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, వారిని విచారణ చేస్తామని వెల్లడించారు. -
23 ఏళ్లుగా దుర్గామాత సేవలో సలీమ్ నియారియా
రామ్.. రహీమ్ అంతా ఒక్కరే, ఖురాన్.. భగవద్గీత చెప్పేదొక్కటే అనేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది రాయగఢ్ లోని దుర్గానవరాత్రోత్సవం. సర్వమత సమానత్వాన్ని చాటుతూ 23 ఏళ్లుగా నవరాత్రుల్లో దుర్గామాతను నిలబెట్టడంలోనూ, తిరిగి నిమజ్జనం చేయడంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నాడు 50 ఏళ్ల షేక్ సలీమ్ నియారియా. అవును.. ముస్లిం అయి ఉండి కూడా నవరాత్రుల నిర్వహణకు నడుం కడుతున్నాడీయన. హండీచౌక్ దుర్గా కమిటీ పేరున... రాయగఢ్ లోని హండీచౌక్ ప్రాంతంలో నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ గా ఉన్న నియారియా... మొత్తం 25 మంది బృందంలో తనతోపాటు మరో ముగ్గురు ముస్లింల సాయంతో దుర్గా పూజ వేడుకలు నిర్వహిస్తున్నారు. వీరంతా నవరాత్రుల్లో దుర్గాపూజా కార్యక్రమాల్లో ప్రత్యేక పాత్రపోషించి, అంగరంగ వైభవంగా వేడుకలు జరిపిస్తున్నారు. అలాగే మరెందరో ముస్లిం కళాకారులు దుర్గా మండపాన్ని అలంకరించడంలోనూ పాల్గొంటున్నారు. 1992 నుంచి ప్రారంభించిన ఉత్సవాల కార్యక్రమాలకు నియారియా కేవలం యాజమాన్యం వహించడం కాక, స్వయంగా ప్రతి కార్యక్రమంలోనూ పాలుపంచుకుంటున్నారు. అలాగే దుర్గా శరన్నవరాత్రుల అనంతరం తొమ్మిదవరోజు దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఒక్క దుర్గామాత విషయంలోనే కాదు అతడు అన్ని మతాల కార్యక్రమాల్లోనూ అదే రీతిలో పాల్గొంటారు. -
'కీచక' ఐఏఎస్ అరెస్టు!
రాయగఢ్: తన ఇంట్లో పనిచేస్తున్న 16 ఏండ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఐఏఎస్ అధికారి అరెస్టయ్యాడు. ఐఏఎస్ ఏకే ధ్రిత్లారే (56)ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఖర్సియా ప్రాంత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా ఉన్నప్పుడు ధ్రిత్లారే తన అధికారిక నివాసంలో పనిచేస్తున్న బాలికను పలుసార్లు లైంగికంగా వేధించారని, దీంతో బాధిత బాలిక గత జూన్ 15న రాయ్‌గఢ్ కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు నలుగురు అధికారులతో విచారణబృందాన్ని ఏర్పాటుచేశారు. ధ్రిత్లారేను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. విచారణ బృందం దర్యాప్తులో వెలుగుచూసిన వివరాల ఆధారంగా పోలీసులు ధ్రిత్లారేను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రూ. 25 వేల పూచీకత్తుపై ఛత్తీస్‌గఢ్ హైకోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చింది. దీంతో ఆయన బెయిలుపై విడుదలయ్యారు. -
పసిబిడ్డను పొయ్యిలోకి విసిరేసిన తండ్రి
రాయ్‌గఢ్: కన్న బిడ్డను అతి కిరాతకంగా హతమార్చాడో తండ్రి. భార్య భర్తల మధ్య వైరం కాస్తా అభం శుభం తెలియని పసికందు ప్రాణాలు తీసింది. అసియా రామ్ రాథియా(45) అనే వ్యక్తి మద్యం తాగి భార్య రాస్ కున్వార్ తో తరచు ఘర్షణకు దిగేవాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి మద్యం బాగా సేవించి వచ్చిన రాథియా తిరిగి భార్యతో గొడవ పడ్డాడు. మద్యం మత్తుతో విచక్షణ కోల్పోయిన అతను పేగు బంధాన్ని కూడా మరిచిపోయాడు. అక్కడే ఉన్న ఏడు నెలల పసిగుడ్డును పొయ్యిలోకి విసేరేయడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. రాథియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాగా కాలిన గాయాలతో ప్రాణాలు కోల్పోయిన ఆ చిన్నారిని పోస్ట్‌మార్టంకు తరలించామని ఎస్పీ రాహుల్ భాగత్ తెలిపారు. కాగా, గతంలో మాజీ భార్యను హత్య చేసిన ఘటనలో అసియా మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడని ఎస్పీ తెలిపారు.. అనంతరం రెండు సంవత్సరాల క్రితం రాస్ కున్వార్ పెళ్లి చేసుకున్నాడు. -
ఛత్తీస్‌గఢ్‌లో మోడీ రెండవ రోజు ప్రచారం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర శాసనసభకు రెండవ దశ ఎన్నికల్లో జరగనున్న నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ నేడు నాలుగు ర్యాలీలలో పాల్గొనున్నారు. రాయ్‌ఘర్, కిలబ్, బిల్ల, హైస్కూల్ మైదాన్‌లో నిర్వహించే సభల్లో మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. మోడీ మొదటగా రాయ్‌ఘర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం నిర్వహించే ర్యాలీలలో పాల్గొనున్నారు. నిన్న ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నిర్వహించిన ఐదు ర్యాలీలలో మోడీ పాల్గొన్నారు. నవంబర్ 19వ తేదీన జరగనున్న రెండవ దశ ఎన్నికల్లో 72 అసెంబ్లీ స్థానాలలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి సోమవారం మొదటి దశ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 67 శాతం ఓట్లు పోలైన విషయం విదితమే.