ఛత్తీస్గఢ్లో మోడీ రెండవ రోజు ప్రచారం | Narendra Modi to address 4 election rallies in Chhattisgarh today | Sakshi
Sakshi News home page

ఛత్తీస్గఢ్లో మోడీ రెండవ రోజు ప్రచారం

Published Fri, Nov 15 2013 11:46 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

Narendra Modi to address 4 election rallies in Chhattisgarh today

ఛత్తీస్గఢ్ రాష్ట్ర శాసనసభకు రెండవ దశ ఎన్నికల్లో జరగనున్న నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ నేడు నాలుగు ర్యాలీలలో పాల్గొనున్నారు. రాయ్ఘర్, కిలబ్, బిల్ల, హైస్కూల్ మైదాన్లో నిర్వహించే సభల్లో మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. మోడీ మొదటగా రాయ్ఘర్లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం నిర్వహించే ర్యాలీలలో పాల్గొనున్నారు.



నిన్న ఛత్తీస్గఢ్లో బీజేపీ నిర్వహించిన ఐదు ర్యాలీలలో మోడీ పాల్గొన్నారు. నవంబర్ 19వ తేదీన జరగనున్న రెండవ దశ ఎన్నికల్లో 72 అసెంబ్లీ స్థానాలలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి సోమవారం మొదటి దశ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 67 శాతం ఓట్లు పోలైన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement