
పిట్‌బుల్ జాతికి చెందిన కుక్కలను ప్రమాదకరమైనవి పేర్కొంటారు. అనేకసార్లు మానవులపై ఇవి దాడికి పాల్పడటమే ఇందుకు కారణం. పెంచుతున్న యజమానులతో పాటు ఇతరులపై సైతం ఉన్నట్టుండి దాడి చేసి గాయపర్చుతుండటంతో వీటిని పెంచుకోవడంపై భారత్‌లో నిషేధం కూడా విధించారు. అయితే తాజాగా ఓ పిట్ బుల్ కుక్క.. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా దాడి నుంచి చిన్నారుల ప్రాణాలను కాపాడింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాన్సీలో జరిగింది. శివగణేష్ కాలనీలో ఇంటి ముందు తోటలో పనిమనిషి పిల్లలు ఆడుకుంటుండా ఒక్కసారిగా పాము ప్రవేశించింది. కోబ్రాను గుర్తించిన పిల్లలు సాయం కోసం కేకలు వేయడం ప్రారంభించారు. చిన్నారుల అరుపులు విన్న పిట్ బుల్ జెన్నీ.. వెంటనే దాన్ని కట్టేసిన తాడును తెంచుకొని వారిని రక్షించేందుకు వచ్చింది.
కుక్క దాని దవడల మధ్య కింగ్ కోబ్రాను బంధించి ముప్పుతిప్పలు పెట్టింది. తలతో వేగంగా తప్పుతూ దాన్ని చంపేందుకు ప్రయత్నించింది. దాదాపు అయిదు నిమిషాలపాటు పాముతో పోరాడింది. చివరికి పామును వేగంగా కొట్టడం ద్వారా అది చనిపోయింది.
पिटबुल ने बचाई बच्चों की जान: झाँसी के एक घर के गार्डन में बच्चे खेल रहे थे, तभी एक साँप आ गया और देखते ही देखते पिटबुल डॉग साँप से भिड़ गया। पिटबुल ने साँप को पटक पटक कर मार डाला।#Pitbull #Jhansi pic.twitter.com/fqB77XW3Q6
— Aviral Singh (@aviralsingh15) September 25, 2024
ఇక ఈ ఘటనపై జెన్నీ యజమాని పంజాబ్ సింగ్ మాట్లాడుతూ.. తమ పిట్ బుల్ పామును చంపి ప్రాణాలను రక్షించడం ఇది మొదటిసారి కాదని తెలిపారు. తమ ఇల్లు పొలాల మధ్య ఉండటం వల్ల తరచుగా పాములు వస్తుంటాయిని, అయితే జెన్నీ ఇప్పటివరకు ఎనిమిది నుంచి, పది పాములను చంపినట్లు ఆయన తెలిపారు.