hobby
-
పర్వతారోహణ చేద్దామా?
‘పర్వతాలు పిలుస్తాయి... వెళ్లాలి’ అంటారు పర్వతారోహకులు. మనకున్న ఎన్నో హాబీల్లో పర్వతారోహణ ఒకటి. చిన్న గుట్టలతో మొదలయ్యే హాబీ కొండలకు పర్వతాలకు ఎదిగి ఆఖరకు ‘ఎవరెస్ట్’ అధిరోహించడంతో ముగుస్తుంది. పర్వతారోహణ చేసేవారు జీవితంలో ఒక్కసారైనా పర్వతారోహణ చేయాలని కోరుకుంటారు. కొంతమంది ఏడు ఖండాల్లోని ప్రతి ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాలనుకుంటారు. ఇంతకూ పర్వతారోహణ వల్ల ఏమవుతుంది?పర్వతాలు ఎక్కే క్రమంలో ప్రకృతి పెట్టే పరీక్షలను ఓర్చడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శిఖరం వరకూ చేరాక భూమ్మీద ఎదురయ్యే కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా జీవితం ఎంత విలువైనదో తెలుస్తుంది. జీవితం అంటే చిన్న చిన్న విషయాలు కాదు ఉదాత్తమైనవి ఉన్నతమైన విషయాలను సాధించడం అని తెలుస్తుంది. ‘పర్వతం వంటి వ్యక్తి’, ‘శిఖరం వంటి వ్యక్తి’ అని కొందరిని కోలుస్తారు. అంటే ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో ఆ రంగంలో వారు అత్యున్నత విజయాన్ని సాధించినవారన్నమాట. శాస్త్రవేత్తలలో ఐన్‌స్టీన్ శిఖరం వంటి వాడు. సినిమా నటులలో అమితాబ్ బచ్చన్ శిఖరం వంటి వాడు. మనం ఒక చిత్రకారులం కావాలనుకుంటే పికాసో అంతటి వాళ్లం కావాలని లక్ష్యం పెట్టుకోవాలి. అలాంటి స్ఫూర్తి పర్వతారోహణ వల్ల కలుగుతుంది.అబ్బాయిల కంటే మేము ఎందులోనూ తక్కువ కాదు అని ఆత్మవిశ్వాసం తెచ్చుకోవడానికి అమ్మాయిలకు పర్వతారోహణ ఒక మంచి మార్గం.పర్వతారోహణలో వీపు వెనుక బరువు వేసుకుని ఎక్కాలి. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనడం పెద్ద కష్టం కాదని ఈ కష్టం పడినప్పుడు తెలుస్తుంది. పర్వతారోహణలో పోదుపుగా తెలుస్తుంది. తీసుకెళ్లిన ఆహారాన్ని పోదుపుగా వాడుకోవాలి. నీళ్లను ΄÷దుపుగా వాడుకోవాలి. జీవితంలో కూడా ఉన్న నిధులను ఎలా జాగ్రత్త చేసుకోవాలో దీని వల్ల తెలుస్తుంది. అహం (ఇగో) కొన్నిసార్లు మేలు చేస్తుంది. కొన్నిసార్లు హాని చేస్తుంది. అంత ఎత్తయిన పర్వతం మౌనంగా ఉన్నప్పుడు ఆరడుగుల మనిషి ఎందుకు మిడిసి పడాలి. ఎదిగేకొద్దీ వొదగడం పర్వతం నేర్పిస్తుంది. వినయం విజయానికి తొలి మెట్టు.ఉదయాన్నే లేచి స్కూలుకు వెళుతున్నాం, ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్నాం అనుకుంటాంగాని కొండనో పర్వతాన్నో ఎక్కితేనే మనం ఎంత ఫిట్‌గా ఉన్నామో తెలుస్తుంది. మన ఊపిరితిత్తులు, మోకాళ్లు, పిక్కలు ఎంత బలంగా ఉన్నాయో పర్వతారోహణ తెలియచేస్తుంది. ఈ హాబీని ఫాలో అయ్యేవారు ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు. మరిన్ని పర్వతాలు ఎక్కేందుకు మరింత ఫిట్‌గా ఉంటారు. కాబట్టి పర్వతారోహణ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. -
అతనికి ఆ హాబీ ఉందని... ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన భార్య!!
wife bid for her husband to sell him online: ఆలు మగలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. ఇటీవల కాలంలో చాలా సిల్లీ విషయాలకే విడిపోవడం కూడా చూశాం. మరికొంతమంది అయితే చాలా తీవ్రంగా కొట్టుకుని ఒకరినోకరు గాయపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మహిళ కేవలం వాకింగ్‌కి వెళ్తున్నాడన్న కోపంతో భర్తని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే..న్యూజిలాండ్‌కి చెందిన ఒక మహిళ తన భర్తను ఆన్లైన్లో విక్రయానికి పెట్టింది. తన భర్తకి వాకింగ్‌కి వెళ్లే హాబీ ఉందని, అందుకోసం తనని, పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతాడని చెబుతోంది. పైగా అతను పిల్లలను చూసుకోవలసినప్పుడల్లా వాకింగ్‌కి వెళ్లిపోతుంటాడని తెలిపింది. అయితే ఆమెకు తన భర్తతో గడపటం చాలా ఇష్టం అని, కానీ అతనెమో తనకు చెప్పకుండా వెళ్లిపోతాడని వాపోయింది. అందుకే ఆమె విసిగిపోయి ఈ పని చేసానని చెబుతోంది. ఈ మేరకు ఆమె తన భర్త అమ్మకానికి సంబంధించిన ప్రోఫైల్‌ని క్రియేట్ చేసి ఆన్లైన్ ట్రేడింగ్ సైట్లో ఉంచింది. పైగా యూజ్డ్ కండిషన్ అనే ట్యాగ్‌ని ఒకటి పెట్టి ప్రకటనలో..పొడవు 6 అడుగుల 1 అంగుళం...వయసు 37 ఏళ్లు. వృత్తి రీత్యా రైతు. బాగా చూసుకోడమే కాక నిజాయితీ పరుడు అని పేర్కొంది. అంతేకాదు అతన్ని ఎవరైన కొనుగోలు చేస్తే షిప్పింగ్ ఉచితం అని ఆఫర్ కూడా ఇచ్చేసింది. (చదవండి: ఆ వ్యక్తి 67 ఏళ్లుగా స్నానమే చేయలేదట!. అతని ఆహారం ఏమిటో తెలుసా?) -
అగ్గిపెట్టె కళ.. ప్రపంచ చరిత్ర చూపుతూ
చీకటింట వెలుతురుకు జన్మనివ్వడమే కాదు గత వైభవ కాంతినీ కళ్లకు కడుతుంది అగ్గిపెట్టె. నమ్మకం కుదరకపోతే అఖంఢ భారతావనితో పాటు ఖండాంతర ఖ్యాతిని కళ్లకు కట్టే ఈ మ్యాచ్ బాక్స్ లోగోలను ఒకసారి తిలకించండి. అమితాబ్ బచ్చన్ కూలీ సినిమా నుంచి టాటా నానో వరకు ఆసక్తి కథనాలను మ్యాచ్బాక్స్ లోగోలతో పరిచయం చేస్తాను రండి.. అంటూ ఆహ్వానిస్తోంది శ్రేయ కాటూరి. సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన ‘ఆర్ట్ ఆన్ ఎ బాక్స్’ శ్రేయకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. మ్యాచ్ బాక్స్ ద్వారా ప్రపంచ చరిత్రను విశ్లేషణాత్మకంగా చూపుతూ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. అగ్గిపెట్టె కథలు ఢిల్లీలో నివాసం ఉంటున్న 28 ఏళ్ల శ్రేయ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా అనుకోకుండా వివిధ దేశాల ప్రసిద్ధ సంస్కృతులకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా వినూత్నంగా తను అప్పటికే అలవాటుగా అప్పుడప్పుడు సేకరించిన మ్యాచ్బాక్స్లపై ఆమె దృష్టి పడింది. ఆ దృష్టి కోణం ఆమెను వినూత్నంగా ఆలోచింపజేసింది. ఆ ఆసక్తి వివిధ దేశాలకు సంబంధించిన 5,000 మ్యాచ్ బాక్స్ లోగోలను సేకరించి, శోధించి, విశ్లేషించేంతగా మారింది. అగ్గిపెట్టెల లోగో రూపకల్పనలో ఉన్న కథలను తెలుసుకుంటున్నకొద్దీ ఆమెకెన్నో విషయాల మీద అవగాహన పెరిగింది. ఈ విషయాలను పంచుకోవడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ సరైన వేదికగా భావించింది. ఇన్స్టాగ్రామ్ పేజీలో ‘ఆర్ట్ ఆన్ ఎ బాక్స్’ పేరుతో అగ్గిపెట్టెల కథలు మొదలుపెట్టింది. రంగురంగుల లేబుళ్ల సాక్ష్యం.. ప్రిన్స్ చార్లెస్ పెళ్లి వంటి ముఖ్యమైన చారిత్రక సంఘటనను స్మరించుకునే అగ్గిపెట్టె లేబుల్ కూడా శ్రేయ సేకరణలో ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత త్రివర్ణ పతాకం, అశోకచక్రం వంటి జాతీయ చిహాలు, స్వాతంత్య్ర సమరయోధులను కూడా మ్యాచ్బాక్స్లపైన చిత్రీకరించినవి ఉన్నాయి. ఆమె పరిశోధన అక్కడితో ఆగలేదు. అగ్గిపెట్టెల లోగోల కళను అర్థం చేసుకోవడంపై మరింతగా దృష్టి సారించింది. ‘‘సామాజిక దృక్కోణంలో అగ్గిపెట్టెల గురించి అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. మతం, లింగ భేదం, దేశం ఇలా మూడు డొమైన్లను కేంద్రంగా ఉపయోగించి మ్యాచ్బాక్స్ల వెనుక ఉన్న కథలను పునర్నిర్మించాను. అందులో లేబుళ్లదే అసలైన ప్రాధాన్యత’’. అంటుంది. సంస్కృతుల అవగాహన ఈ పరిశోధన పూర్తి చేయడానికి ఏడాదికి పైగానే పట్టింది. చాలా ఆసక్తిగా అనిపించింది. వేల మ్యాచ్బాక్స్లలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలవీ నా దగ్గర ఉన్నాయి. భారతదేశంలో అగ్గిపెట్టెలను అధ్యయనం చేసిన తరువాత, మతపరమైన చిహ్నాలను దైవిక ఐకానోగ్రఫీ రూపంలో ఉపయోగించడంలో నిరంతరం కృషి జరిగిందని తెలుసుకున్నాను. స్వాతంత్య్రోద్యమ సమయంలో వచ్చినవి, జాతీయవాద స్ఫూర్తిని పెంచినవి.. ఒక్కోటి తెలుసుకుంటూ వెళితే ఆ ప్రయాణం అత్యంత అద్భుతంగా అనిపించింది స్త్రీని వస్తువుగా చూపిన కాలం 90 లలో లోగోలు బ్రాండ్ల వంటి వినియోగదారు ఉత్పత్తులను బట్టి మ్యాచ్బాక్స్ లేబుల్స్ మార్చారు. మరొకటి లింగ ప్రాతినిధ్యం పరంగా ఉంది. ఇది పితృస్వామ్య ఆధిపత్య శ్రేణులదని గమనించాను. నేను చూసిన ఒకే ఒక లేబుల్ పి.టి. ఉష మాత్రమే. ఎప్పుడూ పెళ్లికూతురు, బాలీవుడ్ ప్రముఖ తారల బొమ్మలు. మహిళలను ఎలా చిత్రీకరిస్తారనే దానిపైన నిర్వచనం సంవత్సరాలుగా మారనేలేదని స్పష్టమైంది. సాంకేతిక పరంగా చూస్తే మైక్రోసాఫ్ట్, ఆపిల్, కింగ్‌ఫిషర్ వంటి బ్రాండ్లు ఎలా అభివృద్ధి చెందాయో అగ్గిపెట్టెల లోగోలు చూపాయి. సాధారణ ఇతివృత్తాలు జంతువులు, మొక్కలు, పక్షులు, రేడియోలు, కార్లు .. వంటివి మ్యాచ్బాక్స్లలో ఉన్నాయి. నా స్థాయిలో నేను నా ప్రాజెక్ట్ ద్వారా ప్రజలను ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు కొన్ని విషయాలు మరింత స్పష్టంగా అర్థమయ్యాయి. అగ్గిపెట్టె కళ ద్వారా మహిళల చిత్రాల చిత్రణ నిర్వచనాన్ని మార్చలేమా? అన్నదే నా ప్రశ్న. మహిళల చిత్రాలను రైతులు, ఉపాధ్యాయులు లేదా వ్యోమగామిగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ చాలా మంది స్ఫూర్తిదాయకమైన మహిళలు వివిధ రంగాలలో అసాధారణమైన ప్రతిభ కనబరుస్తున్నారు. దేశాల మధ్య వైరుధ్యం వివిధ దేశాల నుండి అగ్గిపెట్టెల నమూనా లో ఖచ్చితంగా పెద్ద తేడా ఉంది. నేను సేకరించిన మ్యాచ్బాక్స్ల గరిష్ట సంఖ్య అమెరికా, భారత్. అమెరికాలోని బార్లు, రెస్టారెంట్ల నుండి కొన్ని సేకరించాను. వాటి డిజైన్ బ్రాండ్ ఆధారితమైనవి. అమెరికా మ్యాచ్‌బాక్స్‌లు అక్కడి చరిత్రలో 60 నుంచి 80 ల మధ్య కాలంలో ప్రత్యేకంగా ప్రింటింగ్ కంపెనీలు, హోటళ్ళు, రెస్టారెంట్ల కోసం ప్రకటనల సాధనంగా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జాతీయవాద భావాలను ప్రేరేపించడానికి బాగా ఉపయోగ పడ్డాయి. ఇతర దేశాల విషయానికొస్తే స్వీడన్ అగ్గిపెట్టెల డిజైన్ భిన్నంగా ఉంటుంది. వీటితో పాటు ఆస్ట్రేలియా, రష్యా, చైనా అగ్గిపెట్టెలు కొన్ని ఉన్నాయి. సమాజాన్ని మార్చేవిధంగా లోగో.. మిగతా కాలాలతో పోల్చితే 90ల కాలంలోనే కొత్త బ్రాండ్లు వచ్చాయి. ఆ వ్యత్యాసాన్ని అధ్యయనం చేయడం నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. సిండ్రెల్లా, చోటా భీమ్ చిత్రాలు కూడా ఆ లోగోల్లో ఉన్నాయి. చూడటానికి అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అగ్గిపెట్టెలు ప్రధానంగా ఎరుపు, పసుపు, నారింజ రంగులను ఒక నమూనాగా ఉపయోగించారు. ఇవి అగ్నిని సూచించడమే కారణం. ఈ కళలో ప్రఖ్యాత మహిళల చిత్రాలను, సమాజం భావనను మార్చేవిధంగా, మహిళల ప్రస్తుత ఆత్మస్థైర్య చిత్రాలను మార్చాలని కోరుకుంటున్నా’’ అని వివరిస్తుంది శ్రేయ. -
అరుదైన హాబీ.. ఇల్లు దాటకుండానే
భువనేశ్వర్: మనలో చాలా మందికి వేర్వేరు హాబీలు ఉంటాయి. కొందరికి వివిధ దేశాల కరెన్సీ, జాతీయ జెండాలు వంటివి కలెక్ట్ చేసే అలవాటు ఉంటే.. మరి కొందరికి అందమైన ఫోటోలు కలెక్ట్ చేయడం హాబీ. ఈ క్రమంలో భువనేశ్వర్‌కు చెందిన మూడవ తరగతి విద్యార్థి దిబ్యాన్షికి అగ్గిపెట్టలు కలెక్ట్ చేయడం సరదా. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాలకు చెందిన 5000 అగ్గిపెట్టలను సేకరించింది. అయితే వీటిని సేకరించడానికి బాలిక ఆయా దేశాలకు వెళ్లలేదు. బంధవులు, స్నేహితులు ఎవరైనా విదేశాలకు వెళ్లినప్పుడు వారిచేత వీటిని తెప్పించేదట. ఈ సందర్భంగా దిబ్యాన్షి మాట్లాడుతూ.. ‘మా నాన్న వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్. దాంతో వేరు వేరు ప్రాంతాలు, దేశాలకు తిరిగే వాడు. అలా వెళ్లిన ప్రతిసారి నా కోసం అగ్గిపెట్టెలు తెచ్చేవాడు. అలానే మా బంధువులు, స్నేహితులు విదేశాలకు వెళ్తే నా కోసం అగ్గిపెట్టెలు తెమ్మని కోరేదాన్ని. ఇలా సేకరించిన వాటిని ఒక థీమ్ ప్రకారం అరెంజ్ చేశాను’ అని దిబ్యాన్షి ఏఎన్ఐకి తెలిపింది. Bhubaneswar: Dibyanshi, a class three student has collected over 5,000 matchboxes from different countries. She says,"My father is wildlife photographer & travels a lot. I also ask my relatives to bring matchboxes for me. I've organized them according to various themes." (18.12) pic.twitter.com/0Pxn0B9UjR — ANI (@ANI) December 18, 2020 ఈ సందర్భంగా దిబ్యాన్షి తల్లి గోపా మొహంతి మాట్లాడుతూ.. ‘నా భర్త వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఓ సారి తన స్నేహితుడి కోసం అగ్గిపెట్టె తీసుకువచ్చాడు. దాని డిజైన్, ప్యాకింగ్ దిబ్యాన్షికి చాలా నచ్చింది. దాన్ని తన దగ్గరే ఉంచుకుంటాను అని కోరింది. ఇలా మూడేళ్ల నుంచి అగ్గిపెట్టెలు సేకరిస్తుంది. వీటిని థీమ్ ప్రకారం ప్లాస్టిక్ పెట్టెల్లే భద్రపరుస్తాము’ అని తెలిపారు. -
వ్యాపకం.. వ్యాపారమైతే..
గడప దాటకుండానే గడించడానికి ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్గాలనేకం ఉన్నాయి. వ్యాపకాన్ని వ్యాపారావకాశంగా మార్చుకోవడం కూడా వాటిల్లో ఒకటి. కమ్మని వంటకాలు చేయడం మీ హాబీనా? ఎంచక్కా క్యాటరింగ్ బిజినెస్ మొదలుపెట్టొచ్చు. మేకప్, ఫ్యాషన్, సౌందర్య సాధనాలపై మంచి అభిరుచి ఉంటే దాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. ఇదంతా జరగాలంటే హాబీని వ్యాపారావకాశంగా మల్చుకునేది ఎలా, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనవి తెలియాలి. అందులో కొన్ని ఇవి.. 1. సరదా కోసమే కాకుండా మనసుకు కాస్త సంతృప్తి కూడా కలిగించే వాటిని హాబీలుగా ఎంచుకుంటూ ఉంటాం. అలాంటి వాటికి వ్యాపారపరమైన రూపునిస్తున్న పక్షంలో ప్రశ్నించుకోవాల్సిన విషయం ఒకటుంది. మనస్సుకు సాంత్వననిచ్చే హాబీ కాస్తా హోమ్ బిజినెస్‌గా మారిన తర్వాత కూడా దానిపై ఆసక్తి కొనసాగించగలమా, ఆస్వాదించగలమా అన్నది ఆలోచించుకోవాలి. వ్యాపకంలో లాభనష్టాలు, ఆర్థిక కోణాల ప్రసక్తి ఉండదు. అదే వ్యాపారం అంటే.. అనేక లెక్కలు ఉంటాయి. అప్పటిదాకా హాబీగా ఉన్నది కాస్తా ప్రధాన ఆదాయ వనరుగా మారితే లాభనష్టాల గురించి ఆలోచించడం ఎక్కువవుతుంది కనుక.. దాన్ని ఆస్వాదించే అవకాశాలు తగ్గొచ్చు. కనుక ఇలాంటివన్నీ బేరీజు వేసుకుని ముందడుగు వేయాలి. 2. హాబీని బిజినెస్‌గా మార్చుకుందామని నిర్ణయించుకుంటే అసలు దానికి మార్కెట్ అనేది ఉందా అన్నది తెలుసుకోవాలి. మీరు చేసే వంటకాలను, తయారుచేసే ఆభరణాలు మొదలైన వాటిని మీ చుట్టుపక్కాలు, స్నేహితులు మెచ్చుకోవచ్చు. కానీ మార్కెట్లో వాటిని అమ్మితే డబ్బులిచ్చి కొనుక్కునేంత నాణ్యత, ప్రత్యేకత ఉందా అన్నది చూసుకోవాలి. మన ఇంటి దగ్గర అద్భుతంగా ఉందనుకున్నా మార్కెట్లోకి వెళ్లినప్పుడు అట్టర్‌ఫ్లాప్ కావొచ్చు. కనుక, ఇందుకోసం మార్కెట్ రీసెర్చ్ చేయాలి. మిగతా వాటికి ఎంత భిన్నంగా, ఎంత నాణ్యంగా మీరు ప్రొడక్టును అందించగలరన్నదానిపై దృష్టి పెట్టాలి. అప్పుడే కస్టమర్లు మీ వైపు వస్తారన్నది గుర్తుపెట్టుకోవాలి. 3. టెస్ట్ చేయండి. యెకాయెకిన వ్యాపారంలోకి దూకేయకుండా ముందుగా ఒకసారి మీ హాబీని వ్యాపారంగా మార్చుకుంటే వర్కవుట్ అవుతుందో లేదో టెస్ట్ చేసి చూడండి. ఒకవైపు జాబ్ మానకుండా కొనసాగిస్తూనే మరోవైపు పార్ట్‌టైమ్ వ్యాపారంగా హాబీని పరీక్షించండి. కొంతైనా సరే ఆదాయం ఎలా వస్తోంది, విస్తరిస్తే ఎలా వచ్చే అవకాశం ఉంది అన్నది పరిశీలిస్తే రంగంలోకి దిగొచ్చా లేదా అన్నదానిపై అవగాహన వస్తుంది. 4. ప్రణాళిక ఉండాలి.. టెస్ట్ డ్రైవ్‌ని బట్టి ముందుకెళ్లవచ్చు అనుకున్న పక్షంలో బిజినెస్ ప్లాన్‌ని ఒకటి తయారు చేసుకోండి. ఏ స్థాయిలో మొదలుపెడుతున్నారు, ఎప్పటికల్లా ఏ స్థాయికి చేర్చాలనుకుంటున్నారు వంటి లక్ష్యాలను నిర్దేశించుకోండి. ఏముందీ, ఇప్పటిదాకా పార్ట్‌టైమ్‌గా ఉన్నది కాస్తా ఫుల్‌టైమ్ అవుతుంది .. దీనికంటూ పెద్దగా ప్రణాళికలు వగైరా అంటూ హడావుడి అనవసరం అని తేలిగ్గా తీసిపారేయకండి. వ్యాపారం వృద్ధి చెందాలంటే ప్లానింగ్ చేసుకోవడం, సమీక్షించుకోవడం, బిజినెస్ వ్యూహంలో మార్పులు, చేర్పులు చేపట్టడం అనివార్యం. అలాగే, చట్టబద్ధంగా అనుమతులు మొదలైనవి తీసుకోవాల్సి ఉందేమో చూసుకోవాలి. 5. మార్కెటింగ్.. మార్కెటింగ్.. మార్కెటింగ్. హోమ్ బిజినెస్ విజయవంతం కావాలంటే కావాల్సినది నాణ్యమైన ఉత్పత్తి లేదా సర్వీసు అందించడమో మాత్రమే సరిపోదు. సాధ్యమైనంత ఎక్కువమందికి వాటి గురించి తెలియాలి. కనుక రోజువారీ వ్యాపార కార్యకలాపాల్లో మార్కెటింగ్ కచ్చితంగా భాగం కావాలి. ప్రస్తుతం ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఇందుకు చాలా ఉపయోగపడుతున్నాయి. కేవ లం మీ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితం కాకుండా ఇలాంటి వాటితో ఎక్కడెక్కడో ఉన్న కస్టమర్లకు కూడా చేరువ కావొచ్చు. వ్యాపారావకాశాలను ఎలా మెరుగుపర్చుకోవచ్చన్న దానిపై ఈ తరహా సైట్స్‌లో ఎక్స్‌పర్ట్‌ల నుంచి సలహాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే, దీని కన్నా ముందుగానే ఎవరు కొనే అవకాశం ఉంది, ఏ విధంగా వారి దృష్టిని ఆకర్షించాలి, ఎలా వారిని చేరాలి మొదలైన వాటి కోసం ఒక ప్రణాళిక అంటూ తయారుచేసుకోవాలి. -
ఎన్నికల్లో పోటీ.... ఆయన హాబీ!
బరంపురం : ఎవరి సరదా వారికానందం-అనే నానుడిని నిజం చేస్తున్నాడు ఒడిశాకు చెందిన 78ఏళ్ల కె.శ్యాంబాబు సుబుధి. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయడమంటే భలే సరదా. అవి అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా సరే! గెలుపు ఓటములతో ఆయనకస్సలు సంబంధమే లేదు. నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి... నామినేషన్ పత్రంతో సిద్ధమైపోతాడు. ఇలా ...1957 నుంచి అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీకి మొత్తం 27 సార్లు ఎన్నికల బరిలో దిగాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ రాజకీయాల్లో తలపండిన వారిపైనే పోటీకి దిగటం శ్యాంబాబు మరో ప్రత్యేకత. అయితే, ఏ ఒక్కసారీ గెలిచింది లేదు. ఏదో ఒకరోజు ప్రజలు తనను గెలిపించకపోతారా అంటూ ఎప్పటికప్పుడు ఎన్నికల క్షేత్రంలో రణానికి సిద్ధం అవుతూనే ఉన్నాడు. తాజాగా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో శ్యాంబాఉ తనదైన పద్దతిలో పోటీకి సిద్ధమైపోయారు. ఈసారి ఆయన బరంపురం, ఆస్కా స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుని, ఇప్పటికే సైకిల్‌పై ప్రచారం మొదలెట్టారు.