profile
-
అదానీ చిన్న కొడుకు పెళ్లికి, షాదీ డాట్ కామ్ అనుపమ్ మిట్టల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
బిలియనీర్,అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani) చిన్న కుమారుడు జీత్ అదానీ (Jeet Adani), వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షా (Diva Jaimin Shah) ను ఈ నెల ఏడున పెళ్లాడాడు. అహ్మదాబాద్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా గౌతమ్ అదానీ తన కుమారుడి వివాహ సమయంలో, వివిధ సామాజిక సమస్యలకుపయోగించేలా రూ. 10వేల కోట్లు విరాళంగా ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇందులో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చనున్నారు. అంతకుముందు, జీత్ అదానీ ,దివా షా జంట ప్రతీ ఏడాది 500 మంది వికలాంగుల మహిళల వివాహానికి ఒక్కొక్కరికీ రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. 21 మంది నూతన వధూవరులు (వికలాంగ మహిళలు), వారి భర్తలను కలిశారు.ఈ వివాహంలో మరో విశేషంగా కూడా ఉంది.అదేమిటంటే..!షాదీ.కామ్ వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా ప్యానలిస్ట్ , అనుపమ్ మిట్టల్ (Anupam Mittal) జీత్ అదానీకి ఒక ఆసక్తికరమైన వివాహ బహుమతి (Wedding Gift) ఇచ్చాడు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో చాలా కాలంగా ఉండిపోయిన జీత్ ప్రొఫైల్‌ను తొలగించాడు.ఈ విషయాన్ని స్వయంగా అనుపమ్మిట్టల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన వివాహానికి కొన్ని రోజుల ముందు షార్క్ ట్యాంక్ 'బియాండ్ ది ట్యాంక్' విభాగంలో మిట్టల్‌తో సంభాషించాడు జీత్. ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు జీత్. చిన్న వయసులో తన పాఠశాల స్నేహితులు చిలిపిగా షాదీ డాట్ కామ్‌లో ఒక ఖాతా క్రియేటర్ చేశారనీ, అది ఇప్పటికీ అది అలాగే ఉందని, దయచేసి దాన్ని ఇప్పటికైనా తొలగించాలని అభ్యర్థించాడు. As promised, here’s a small wedding gift from me to you & Diva @jeet_adani1. We have had ur profile deleted from @ShaadiDotCom now that u have confirmed ur participation in @sharktankindia 🤗💜 pic.twitter.com/1rNMtWmAhf— Anupam Mittal (@AnupamMittal) February 8, 2025దీనికి అనుపమ్ సరేనని సమాధాన మిచ్చారు. ఈ సందర్బంగా అదానీ గ్రూపు ఉద్యోగుల్లొ ఐదు శాతం వికలాంగులుగా ఉండాలని ఆదేశించినట్టు కూడా వెల్లడించారు. వాగ్దానం చేసినట్లుగామీ దంపతులకు ఇది ఒక చిన్న వివాహ బహుమతి అంటూ మిస్టర్ మిట్టల్ ఎక్స్‌లో ఒకపోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన జత చేశారు.జీత్ అదానీతో షార్క్ ట్యాంక్ "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్వికలాంగుల కోసం పనిచేసే వ్యవస్థాపకులకు ఏమి చేయవచ్చనే దానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ ఉండాలని జీత్ అదానీ సూచన మేరకు షార్క్ ట్యాంక్ ఇండియా "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్ ప్రకటించింది. ఈ ఎపిసోడ్ కోసం రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 15 వరకు అనుమతి ఉంటుంది. -
డాక్టర్ టు సినీ యాక్టర్
-
మీరేంటో ఇట్టే చెప్పేయొచ్చు.. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా ప్రొఫైల్ బాగుందా!?
ఒకప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే స్నేహితులు, చుట్టాలను, చుట్టు పక్కల వాళ్లను అడిగి తెలుసుకొనేవాళ్లు. స్కూల్, కాలేజీల్లో ఇచ్చే కండక్ట్ సర్టిఫికెట్లను చూసేవాళ్లు. పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల గురించి వాకబు చేసేవారు. కానీ ఇప్పుడు సాంకేతిక యుగంలో నిమిషాల్లోనే మన ప్రవర్తనను అంచనా వేస్తున్నారు. దీన్నే సోషల్ ప్రొఫైలింగ్ అంటారు. ♦ సుదీప్ బీటెక్ పూర్తి చేశాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ సీటు వచ్చింది. వీసా కోసం నిరీక్షిస్తుండగా వీసా రిజెక్ట్ అని మెసేజ్ వచ్చింది..అన్నీ సక్రమంగానే ఉన్నా వీసా ఎందుకు రిజెక్ట్ అయ్యిందో సుదీప్‌కు అర్థంకాలేదు. ♦ ఉన్నత విద్యావంతురాలైన శ్రీవిద్యకు మాట్రిమొనీ వెబ్సైట్లో ఓ ఎన్ఆర్ఐ సంబంధం రావడంతో ఆమె తండ్రి ఉబ్బితబ్బిబయ్యాడు. కానీ అంతలోనే ‘మీ సంబంధం వద్దని మా అబ్బాయి అంటున్నాడు’ అని పెళ్లికొడుకు తండ్రి. కారణం చెప్పకుండానే ఫోన్ కట్ చేశాడు. ♦ ఓ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వినీష్కు మరో కంపెనీలో మంచి పొజిషన్, జీతం పెంపుతో ఆఫర్ వచ్చింది. దేశాల్లోని ఆన్సైట్ ప్రాజెక్టుకు ఎంపికయ్యాడు. కానీ వారం తర్వాత ఆఫర్ లెటర్ రిజెక్ట్ అయినట్లు అతనికి ఈ–మెయిల్ వచ్చింది. ♦ సుదీప్‌కు వీసా రాకపోవడానికి... శ్రీవిద్య పెళ్లి సంబంధం చెడిపోవడానికి... వినీష్ జాబ్ ఆఫర్ రిజెక్ట్ కావడానికి కారణం ఒక్కటే ...వారి సోషల్ ప్రొఫైల్ బాగోలేకపోవడం. ఆకతాయి చేష్టలతో ఆన్లైన్లో వారు పెట్టిన కామెంట్లు, ఫొటోలు, వీడియోలు, ఇతర పోస్ట్‌లు ఇప్పుడు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. సోషల్ ఫ్రొఫైలింగ్‌తో వారంతా చిక్కుల్లో పడ్డారు. సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే స్నేహితులు, చుట్టాలను, చుట్టు పక్కల వాళ్లను అడిగి తెలుసుకొనేవాళ్లు. స్కూల్, కాలేజీల్లో ఇచ్చే కాండక్ట్ సరి్టఫికెట్లను చూసేవాళ్లు. పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల గురించి వాకబు చేసేవారు. కానీ ఇప్పుడు సాంకేతిక యుగంలో నిమిషాల్లోనే మన ప్రవర్తనను అంచనా వేస్తున్నారు. దీన్నే సోషల్ ప్రొఫైలింగ్ అంటారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ ఇలా అనేక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మనం నిత్యం ఏదో ఒక సమాచారం పంచుకుంటూనే ఉంటాం. అందులో ఒక వ్యక్తి పెట్టే కామెంట్లు, చేసే పోస్ట్‌లు, ఫొటోలు పంచుకునే భావాలను అంచనా వేసి ఆ వ్యక్తి గురించి అంచనా వేయడమే సోషల్ ప్రొఫైలింగ్. విద్యార్థులు హద్దు దాటితే కష్టమే.. సోషల్ మీడయా యాప్‌లలో యువత, విద్యార్థులు గంటల తరబడి చాటింగ్‌లు, మీటింగ్‌లలో కొందరు హద్దు దాటుతున్నారు. ఎదుటి వారిని కించపర్చేలా వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నారు. ఇంకొందరు తోటి విద్యార్థులను సైబర్ బుల్లీయింగ్ (తప్పుడు వ్యాఖ్యలతో వేధించడం) చేస్తున్నారు. మరికొందరు రాజకీయపరమైన వ్యాఖ్యలు, మతపరమైన వివాదాస్పద కామెంట్లు పెడుతున్నారు. ఇవే చిక్కులు తెచి్చపెడుతున్నాయి. యూకే, కెనడా, అమెరికా లేదా ఇతర దేశాలకు వెళ్లాలనుకొనే వారి సోషల్ మీడియా ఖాతాలను ఆయా దేశాల ఎంబసీలు పరిశీలించి వీసాల జారీలో వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటాయన్న విషయాన్ని మరుస్తున్నారు. ఉద్యోగులకు జాగ్రత్త తప్పదు.. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం సోషల్ మీడియా వాడకంలో సంయమనం పాటించకపోతే చిక్కులు తప్పవు. మతం, ప్రాంతం, కులాన్ని కించపర్చేలా పోస్టులు పెడితే అవి కెరీర్‌పరంగా ఎదిగేందుకు అడ్డంకిగా మారొచ్చు. ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖలో పనిచేసే ఓ టైపిస్ట్ కొంత బడ్జెట్ సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టాడన్న కారణంతో అతన్ని వెంటనే సస్పెండ్ చేశారు. డిజిటల్ ఫుట్‌ప్రింట్ మనమే ఇస్తున్నాం.. సోషల్ మీడియాలో మన వ్యక్తిగత వివరాలను, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, స్నేహితులు ఎవరు, ఎక్కడికి తరచూ వెళుతుంటాం తదితర అంశాలను నిత్యం షేర్ చేస్తున్నాం. సోషల్ ప్రొఫైలింగ్‌కు కారణమయ్యే ఈ సమాచారాన్నే డిజిటల్ పుట్‌ప్రింట్స్ ఆన్ సోషల్ మీడియా అని అంటారు. హనీట్రాప్‌లలో చిక్కే ప్రమాదం... ఏదైనా కంపెనీ లేదా కీలక ప్రభుత్వరంగ సంస్థల్లోని కొందరు ఉద్యోగులను హనీట్రాప్ (వలపు వల) ద్వారా అ«దీనంలోకి తెచ్చుకొని సమాచారం రాబట్టేందుకు సైతం వారి సోషల్ ప్రొఫైలింగే కీలకం అవుతోంది. సదరు వ్యక్తి బలహీనతలు గుర్తించి ట్రాప్ చేస్తారు. ఉదాహరణకు ఎవరైనా హీరోయిన్ గురించి ఎక్కువ ప్రస్తావన, లైక్, కామెంట్లు ఉన్నట్లయితే ఆ బలహీనతనే ఎరగా వేసి హనీట్రాప్ చేసే ప్రమాదం ఉంటుంది. వివరాలు ఇవ్వకపోవడం ఉత్తమం.. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండటం సాధ్యం కాని పరిస్థితి. సోషల్ మీడియాలో మన సమాచారాన్ని వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలను సాధ్యమైనంత వరకు పెట్టకూడదు. కుల, మత, ప్రాంత, రాజకీయపరమైన పోస్టులేవీ పెట్టకపోవడం ఉత్తమం. యువత ఈ విషయాన్ని గుర్తిస్తేనే వారు భవిష్యత్తులో చిక్కుల్లో పడకుండా ఉంటారు. – ప్రసాద్ పాటిబండ్ల, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, ఢిల్లీ -
ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ యాక్టివిటీ చెక్ చేసుకోవడం ఎలా?
భద్రతాపరమైన కోణంలో ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ యాక్టివిటీ చెక్ చేసుకోవడం అవసరం. దీని కోసం... ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి బాటమ్ రైట్ కార్నర్లో ప్రొఫైల్‌ను ట్యాప్ చేయాలి. టాప్ రైట్ కార్నర్లో 3–హారిజంటల్ లైన్స్ ట్యాప్ చేయాలి సెట్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి లిస్ట్ నుంచి సెక్యూరిటీ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి లాగిన్ యాక్టివిటీ ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి. ఇన్‌స్టాలో లాగిన్ యాక్టివిటీని డిలిట్ చేయడానికి... 1. సెట్టింగ్స్‌లోని ‘లాగిన్ యాక్టివిటీ’ను సెలెక్ట్ చేసుకోవాలి 2. 3–డాట్ బటన్ నొక్కాలి 3. లాగ్ ఔట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి: వాట్సాప్‌లో ఎడిట్ మెసేజ్ ఫీచర్ -
రాజకీయాల్లో ఆవేశం స్టార్.. షెహబాజ్
ప్రతిపక్షాలు ఏకంకాగా.. ఎట్టకేలకు ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించి తాను ప్రధాని పీఠం మీద కూర్చోబోతున్నాడు షెహబాజ్ షరీఫ్ . డెబ్భై ఏళ్ల ఈ ప్రతిపక్ష నేత రాజకీయాలతోనే కాదు.. హత్యారోపణలు, వివాహాలతో, అవినీతి ఆరోపణలతో చాలాసార్లు వార్తల్లోకెక్కాడు కూడా. అంతేకాదు రాజకీయాల్లోనూ ఆవేశపూరితుడనే పేరుంది ఆయనకి. బహిరంగ సభల్లో, ర్యాలీ, చట్టసభ.. వేదిక ఏదైనా సరే ఊగిపోతూ చేసే ప్రసంగాలు.. జనాల్లో జోష్ నింపడమే కాదు.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంటాయి కూడా!. ► తొలుత వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్న షెహబాజ్.. ఆ తర్వాత రాజకీయాల్లోనూ రాణించడం మొదలుపెట్టారు. పాక్‌లో ఏ ముఖ్యమంత్రి సాధించలేని ఫీట్‌ను(మూడుసార్లు సీఎంగా ఎన్నిక కావడం) సాధించాడీయన. ► అయితే మొదటి దఫా సీఎంగా పని చేసిన టైంలో నేరాలకు ఘోరాలకు పాల్పడడన్న ఆరోపణలతో బలవంతగా దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. స్వదేశానికి వచ్చే ప్రయత్నాలన్ని బెడిసి కొట్టాయి ఆయనకి. చివరకు.. పాక్ సుప్రీం కోర్టు జోక్యంతో తిరిగి పాక్‌లో ఎలాగోలా అడుగుపెట్టాడు. ► అనేక మలుపుల తర్వాత హత్యలకు సంబంధించిన ఆరోపణల్లో షెహబాజ్‌కు విముక్తి లభించింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో.. పంజాబ్‌కు మళ్లీ రెండు, మూడో దఫా సీఎంగా ఎంపికయ్యాడు. ► సోదరుడు నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు తర్వాత షెహబాజ్ షరీఫ్ ‘పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్(పీఎంఎల్-ఎన్) చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2018 నుంచి నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గళం వినిపించడం మొదలుపెట్టాడు. ► మనీలాండరింగ్ కేసులో 2019 డిసెంబర్లో ఆయన, ఆయన కొడుక్కి సంబంధించిన ఆస్తులను కొన్నింటినిపై నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో చర్యలు తీసుకుంది. ఆపై లాహోర్ హైకోర్టు ఆదేశాలతో ఆయన్ని అరెస్ట్ చేయగా.. కిందటి ఏడాది ఏప్రిల్‌లో బెయిల్ మీద బయటకు వచ్చారు. Entertainment will continue in Pakistan. Meet Shahbaz Sharif Next PM of Pakistan & his Highly Entertaining Hand Movements 😂😂 #ShahbazSharif #ImranKhan #NoConfidenceMotion pic.twitter.com/FdtVtkgt2v — Farhad Khan (@Farhadkhan998) April 9, 2022 ► చివరకు.. ఇమ్రాన్ ఖాన్ మీది వ్యతిరేకతను వాడుకుని ప్రధాని పీఠంగా కూర్చున్నారు. షెహబాజ్ షరీఫ్ పాక్ 23వ ప్రధాని. ► 1951, సెప్టెంబర్ 23న జన్మించిన మియాన్ ముహ్మద్ షెహబాజ్ షరీఫ్.. వ్యాపార-రాజకీయాలతో ఎదిగి సోదరుడు నవాజ్ షరీఫ్ కంటే ధనికుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ► షెహబాజ్.. నుస్రత్‌ను మొదటి వివాహం చేసుకున్నాడు. నలుగురు పిల్లలు, 2003లో తెహమినా దుర్రనితో రెండో వివాహం జరిగింది. ► అయితే ఆయన వైవాహిక జీవితంపైనా విమర్శలు వినిపిస్తుంటాయి. రహస్యంగా ఎంతో మందిని ఆయన వివాహం చేసుకున్నాడంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తుంటారు. ► వంశపారంపర్యంగా వస్తున్న లాహోర్‌లోని రాయివిండ్ ప్యాలెస్‌లోనే షెహబాజ్ కుటుంబం జీవిస్తోంది. ► అభ్యుదయ కవిగా పేరున్న షెహబాజ్.. కవితా పంక్తులను విసురుతూ చేతులను ఆవేశంగా కదిలిస్తూ ప్రసంగాల్ని రక్తికట్టిస్తుంటారు. ► చట్ట సభల్లో, పొలిటికల్ ర్యాలీల్లో ప్రత్యర్థుల మీద విమర్శలు సంధించేప్పుడు చేతులు ఆడిస్తూ.. భయంకరంగా ఊగిపోతూ స్పీచ్‌లు దంచుతుంటాడు. ► అందుకే ప్రధాని అయిన ఈ టైంలో ఆయన ఆవేశపూరితమైన ప్రసంగాలు, చేతుల కదిలికలకు సంబంధించిన జిఫ్ ఫైల్స్, యానిమేషన్ బొమ్మలు వైరల్ అవుతున్నాయి. ► పాక్‌లోనే కాదు.. ఇప్పుడు ఇండియాలోనూ అందుకు సంబంధించిన మీమ్ ట్రెండ్ కొనసాగుతుండడం విశేషం. -
Jogi Ramesh: ముక్కు సూటితత్వం.. నిలదీసే లక్షణం..
ఎన్టీఆర్ జిల్లా: ముక్కు సూటితత్వం, ప్రశ్నించే గళం, నిలదీసే లక్షణం.. ఇవీ నాయకుడిగా జోగి రమేష్‌ను నిలబెట్టాయి. గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ బీసీల అభివృద్ధి కోసం జరిగిన ఉద్యమాల్లో ముందు నిలిచారు. కృష్ణా జిల్లా ( ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా) ఇబ్రహీంపట్నంలో 1970లో జోగి మోహనరావు, పుష్పవతి దంపతులకు పుట్టిన జోగి రమేష్ బీఎస్సీ చదువుకున్నారు. జోగి రమేష్‌కు భార్య - శకుంతల దేవి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు జోగి రమేష్. కృష్ణాజిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రైల్వే బోర్డు సభ్యుడిగా, ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా వివిధ పదవుల్లో పని చేశాడు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కాగిత వెంకట్రావు పై 1192 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జోగి రమేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశారు. 2019లో పెడన నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. టీడీపీ అభ్యర్ధి కాగిత కృష్ణప్రసాద్ పై 7839 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో జోగి రమేష్‌ను పలు మార్లు లక్ష్యంగా చేసుకుంది తెలుగుదేశం. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలపడానికి వెళ్లినప్పుడు జోగి రమేష్‌పై భౌతిక దాడికి ప్రయత్నించింది. ఆ ఘటనలో ఆయన కారును ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. -
RK Roja: రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. ఆమెకు సరిలేరు
నిజ జీవిత కథలు సినిమాలు అవుతాయి. కానీ సినిమా కథలు జీవితంగా మారుతాయన్న దానికి నిదర్శనం. ఒకే వ్యక్తి వేర్వేరు రంగాల్లో రాణించడం కూడా రోజాకే చెల్లుబాటయింది. సినీ నటిగా ఎంత పేరు తెచ్చుకుందో, బుల్లి తెర వ్యాఖ్యాతగా అంతే స్థాయిలో రాణించిన రోజా… రాజకీయాల్లో తనదైన శైలిలో ముద్ర వేశారు. కుటుంబ నేపథ్యం రోజా అసలు పేరు శ్రీలత. 17/ 11 /1972న జన్మించారు. తండ్రి కుమారస్వామి రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి హైదరాబాద్‌కి వలస వెళ్లారు. రోజా నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ నుంచి డిగ్రీ అందుకున్నారు. కొన్ని సంవత్సరాలు కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నారు. బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ప్రేమ తపస్సు చిత్రం ద్వారా సినిమాలకు పరిచయమయ్యారు రోజా. దానికంటే ముందు తమిళచిత్రం చంబరతి చిత్రంలో నటించారు. ఆ సినిమా తమిళంలో మ్యుజికల్ హిట్. తెలుగులో చేమంతి కింద డబ్ చేశారు. ఆ సినిమాను ప్రముఖ ఛాయా గ్రహకుడు, దర్శకుడు అయిన ఆర్కే సెల్వమణి రూపొందించాడు. ఆయనతోనే ప్రేమలో పడిపోయిన రోజా పెద్దల అంగీకారంతో దంపతులయ్యారు. వీరికి కుమార్తె అన్షు మాలిక, కొడుకు కృష్ణ కౌశిక్ ఉన్నారు. రాజకీయ ప్రస్థానం 2004లో రాజకీయాల్లోకి వచ్చిన రోజా నగరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి వారి చెంగారెడ్డి పై పోటీ చేశారు. 2009లో చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోటీ చేశారు కానీ ఫలితం దక్కలేదు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో చేరిన రోజా.. ఆ తర్వాతి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు నగరి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత నేత గాలి ముద్దుకృష్ణనాయుడు పై విజయం సాధించిన రోజా.. 2019 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ పై గెలిచి సత్తా చాటారు. వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా,ఫైర్ బ్రాండ్‌గా పేరున్న ఆర్కే రోజా.. ఏ మాత్రం తేడా వచ్చినా విపక్షాలను తూర్పూరపట్టగలరు. తనదైన శైలిలో రాజకీయ విమర్శలు చేయడంలో ఆమెకు సరిలేరు. 2020 నుంచి రెండేళ్ల పాటు ఏపిఐఐసి చైర్ పర్సన్ గా పనిచేశారు. -
Vidadala Rajini: ఆమె ఒక సంచలనం... ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ..
జీవితంలో ఊహించనన్ని మలుపులు సినిమాలో కనిపిస్తాయి కానీ.. అందుకు సాక్షాత్తు నిదర్శనం విడదల రజని. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కాదు.. అందుకు తగ్గట్టుగా రాణించడం, తనకు తానుగా నాయకురాలిగా ఎదగడం, ప్రతీ సవాలును ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లో నాయకురాలిగా నిలబడడం లాంటి ఎన్నో ఘటనలు విడదల రజనీ జీవితంలో కనిపిస్తాయి. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలవడమే ఒక సంచలనం అయితే... 32 ఏళ్లకే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం విడదల రజనీ జీవితంలో మరో విశేషం. అతి తక్కువ కాలంలో ప్రజల్లో మంచి అభిమానం సంపాదించుకున్న విడదల రజనీకి సోషల్ మీడియాలో లక్షలాది అభిమానులున్నారు. నేపథ్యం హైదరాబాద్‌లో 24-06-1990న పుట్టిన విడదల రజనీ.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాదు మల్కాజ్గిరి లోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో రజనీ 2011లో బి.ఎస్.సి. పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్లు పనిచేసిన రజనీ... విడదల కుమారస్వామితో వివాహం జరిగింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రజనీకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. అమెరికా జీవితం భర్త కుమారస్వామితో కలిసి సాఫ్ట్‌వేర్‌లో పని చేసిన విడదల రజనీ.. మెరుగైన అవకాశాల కోసం భారతీయ యువతలాగే అమెరికా బాట పట్టారు. భర్తతో కలిసి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాఫ్ట్వేర్ మల్టీ నేషనల్ కంపెనీ ప్రాసెస్ వీవర్ కంపెనీ ఏర్పాటు చేశారు. దీనికి కొన్నాళ్ల పాటు డైరెక్టర్, బోర్డు మెంబర్‌గా సేవలు అందించారు. సమాజసేవ కోసం ఏపీకి తిరుగు పయనం కొన్నాళ్లు అమెరికాలో ఉండి ఏపీకి తిరిగి వచ్చిన విడదల రజనీ.. 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. సొంత మనుషులు, సొంత గ్రామానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో భర్త కుమారస్వామి ప్రోత్సాహంతో వీఆర్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. 2018వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి, అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పై 8301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలిచిన తొట్ట తొలి బీసీ మహిళగా చరిత్ర సృష్టించారు. శాసనసభ వేదికగా.. తనదైన శైలిలో వివిధ ప్రజా ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై గళం విప్పారు రజనీ. ఉత్సాహంగా ఉండడం, నిత్యం ప్రజల్లో ఉండడం, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండడం రజనీకి కలిసొచ్చిన అంశాలు. -
తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ప్రారంభం
-
బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.. ప్లస్ అవుతారా?
ఉత్తరాఖండ్‌కు అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. ఆరెస్సెస్‌తో 30 ఏళ్ల అనుబంధం, కరడుగట్టిన హిందుత్వ వాదం, ఇరుగు పొరుగు దేశాలను కూడా కలిపేసుకొని మళ్లీ అఖండ భారత్ ఏర్పాటు కావాలన్న లక్ష్యం, బీజేపీ సీనియర్ నాయకుల అండదండలు అన్నీ కలిపి ధామిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాయి. యువకుడు కావడంతో సీఎం అయ్యాక ఎన్నో సృజనాత్మక ఆలోచనలతో పరిపాలన సాగించారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోయినా, గత సీఎంల వల్ల ఏర్పడిన వివాదాలను పరిష్కరించారు. రేయింబవళ్లు కష్టపడే తత్వం ఉన్న ధామి బీజేపీని వరుసగా రెండోసారి గెలిపించాలన్న సవాల్ స్వీకరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఏకంగా 57 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఏడాదిలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చారన్న అపప్రదను పోగొట్టుకోవాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో పాటు, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి యువ ఆలోచనలు కూడా కలిసొస్తాయన్న విశ్లేషణలున్నాయి. ► ఉత్తరాఖండ్లోనిపితోరగఢ్లో 1975 సంవత్సరం సెప్టెంబర్ 16న జన్మించారు. ► లక్నో యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. ► యువకుడిగా ఉండగానే ఆరెస్సెస్ భావజాలంవైపు ఆకర్షితులయ్యారు. 1989–1999 వరకు పదేళ్ల పాటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యునిగా ఉన్నారు. ఆరెస్సెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ► ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా చీఫ్‌గా 2002 నుంచి 2008 వరకు పని చేశారు. ► పుష్కర్ సింగ్ భార్య గీతా ధామి. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ► ఉధామ్ నగర్‌లోని ఖతిమా నియోజకవర్గం నుంచి 2012లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి తన స్థానాన్ని కాపాడుకున్నారు. ► భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ► ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా 2021 జూలైలో పదవీబాధ్యతలు తీసుకున్నారు. 45 ఏళ్ల వయసులో సీఎం పదవిని చేపట్టి రాష్ట్రానికి అత్యంత పిన్న వయస్కుడైన సీఎంగా రికార్డులకెక్కారు. ► ఉత్తరాఖండ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కుల, ప్రాంతీయ సమతుల్యతల్ని కాపాడే విధంగా ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన ధామిని బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది. (క్లిక్: గజ ఈతగాడు.. ఆయనను కాదని ఒక్క అడుగు ముందుకు వేయలేదు..) ► రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు పుష్కర్ సింగ్ ధామి అత్యంత సన్నిహితులు. రాజ్‌నాథ్ సూచనల మేరకే ఆయనను సీఎంను చేసినట్టుగా ప్రచారంలో ఉంది. ► భగత్ సింగ్ కొషియారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర అధికారిగా ప్రత్యేక బాధ్యతలు నిర్వహించారు. ► సీఎంగా ఎక్కువ కాలం పదవిలో కొనసాగకుండానే ఎన్నికలు రావడంతో ధామి ముందర ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ► కేవలం ఆరు నెలల కాలంలోనే ధామి ప్రభుత్వం 550 నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసింది ► సీఎం పదవి చేపట్టిన నాటికే సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ధామి చాలా ప్రయత్నాలు చేశారు. దేవస్థానంలో బోర్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న పూజార్లను వెనక్కి తీసుకునేలా చేయడంలో కృతకృత్యులయ్యారు. ► అయిదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చిందన్న విమర్శల్ని పోగొట్టేలా చర్యలు తీసుకున్నారు. యువకుడు కావడంతో కొత్త ఆలోచనలతో అందరినీ ఆకర్షించారు. కష్టపడే మనస్తత్వంతో బీజేపీకి ధామి ప్లస్ పాయింట్ అవుతారనే అంచనాలైతే ఉన్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి అఖండ భారతం ధామి ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో 2015లో ఆయన చేసిన పాత ట్వీట్ వివాదాస్పదమై వెలుగులోకి వచ్చింది. ఆ ట్వీట్లో అఖండ భారత్ స్థాపనే తన లక్ష్యమంటూ మన ఇరుగు పొరుగు దేశాలను భారత్‌లో అంతర్భాగంగా చూపిస్తూ కాషాయం రంగు పూసిన మ్యాప్‌ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దేశభక్తి ఉన్న ప్రతీఒక్కరూ అఖండ భారత్ కోరుకుంటారంటూ ఆయన కామెంట్ చేయడంపై కలకలం రేగింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొంతమంది ఆ ట్వీట్‌ని పొగుడుతూ ఆయనని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు, దేశానికి విదేశాంగ మంత్రిని చేయాలంటూ కొందరు బ్రహ్మరథం పడితే, మరికొందరు విమర్శించారు. (చదవండి: నాన్నా..‘ఎస్ వికెన్ డూ ఇట్’!) -
కొందరు కావాలనే అలా చేశారు: గులాం నబీ ఆజాద్
న్యూఢిల్లీ: దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత తన ట్విటర్ ప్రొఫైల్ మార్చినట్టు వచ్చినట్టు వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పందించారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని.. తనపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘గందరగోళం సృష్టించేందుకు కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారు. నా ట్విటర్ ప్రొఫైల్ నుంచి ఎటువంటి సమాచారం తీసివేయలేదు. అలాగే కొత్తగా ఎటువంటివి జోడించలేదు. నా ట్విటర్ ప్రొఫైల్ మునుపటిలానే ఉంద'ని గులాం నబీ ఆజాద్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అసంతృప్త నేతల బృందమైన జీ –23లో కీలక నాయకుడిగా ఉన్న ఆజాద్ అధికార బీజేపీతో సన్నిహితంగా మెలిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంపీగా ఆజాద్ పదవీ విరమణ సమయంలో రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆజాద్ పరస్పరం ప్రశంసించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆజాద్‌కు పద్మభూషణ్ పురస్కారం దక్కడంపై కాంగ్రెస్ నాయకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమమైంది. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు స్పందించకుండా మౌనంగా ఉంది. కపిల్ సిబల్, శశి థరూర్, రాజ్‌బబ్బర్ వంటి నాయకులు ఆజాద్‌కు అభినందనలు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ మాత్రం భిన్నంగా స్పందించారు. పద్మ పురస్కారాన్ని తిరస్కరించాలనే అర్థం వచ్చేట్టుగా వ్యాఖ్యలు చేశారు. (చదవండి: ఆయన గులాంగా ఉండాలనుకోవడం లేదు) -
అతనికి ఆ హాబీ ఉందని... ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన భార్య!!
wife bid for her husband to sell him online: ఆలు మగలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. ఇటీవల కాలంలో చాలా సిల్లీ విషయాలకే విడిపోవడం కూడా చూశాం. మరికొంతమంది అయితే చాలా తీవ్రంగా కొట్టుకుని ఒకరినోకరు గాయపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మహిళ కేవలం వాకింగ్‌కి వెళ్తున్నాడన్న కోపంతో భర్తని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే..న్యూజిలాండ్‌కి చెందిన ఒక మహిళ తన భర్తను ఆన్లైన్లో విక్రయానికి పెట్టింది. తన భర్తకి వాకింగ్‌కి వెళ్లే హాబీ ఉందని, అందుకోసం తనని, పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతాడని చెబుతోంది. పైగా అతను పిల్లలను చూసుకోవలసినప్పుడల్లా వాకింగ్‌కి వెళ్లిపోతుంటాడని తెలిపింది. అయితే ఆమెకు తన భర్తతో గడపటం చాలా ఇష్టం అని, కానీ అతనెమో తనకు చెప్పకుండా వెళ్లిపోతాడని వాపోయింది. అందుకే ఆమె విసిగిపోయి ఈ పని చేసానని చెబుతోంది. ఈ మేరకు ఆమె తన భర్త అమ్మకానికి సంబంధించిన ప్రోఫైల్‌ని క్రియేట్ చేసి ఆన్లైన్ ట్రేడింగ్ సైట్లో ఉంచింది. పైగా యూజ్డ్ కండిషన్ అనే ట్యాగ్‌ని ఒకటి పెట్టి ప్రకటనలో..పొడవు 6 అడుగుల 1 అంగుళం...వయసు 37 ఏళ్లు. వృత్తి రీత్యా రైతు. బాగా చూసుకోడమే కాక నిజాయితీ పరుడు అని పేర్కొంది. అంతేకాదు అతన్ని ఎవరైన కొనుగోలు చేస్తే షిప్పింగ్ ఉచితం అని ఆఫర్ కూడా ఇచ్చేసింది. (చదవండి: ఆ వ్యక్తి 67 ఏళ్లుగా స్నానమే చేయలేదట!. అతని ఆహారం ఏమిటో తెలుసా?) -
డేటింగ్ యాప్‌లో లారా ప్రోఫైల్, స్పందించిన మాజీ మిస్ యూనివర్స్
మాజీ మిస్ యూనివర్స్, నటి.. టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి భార్య లారా దత్తాకు చెందిన ప్రోఫైల్ ఓ డేటింగ్ యాప్‌లో ఉందని ఇటీవల జోరుగా ప్రచారం జరుగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇది కాస్తా లారా దృష్టికి వెళ్లడంతో తాజాగా దీనిపై ఆమె స్పందించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తనపై వస్తున్న వార్తలకు స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు లారా మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ ఏ డేటింగ్ సైట్లో లేను. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నాపై విపరీతమైన ప్రచారం జరిగుతుంది. చదవండి: ప్రభాస్ గురించి ట్వీట్ చేసిన సన్నీ సింగ్, ‘డార్లింగ్’ ఫ్యాన్స్ ఫైర్ అందుకే దీనికి సమాధానం ఇవ్వాలనుకుంటున్నా. డేటింగ్ యాప్‌లో నా ప్రొఫైల్ ఉందని వారంటున్నారు. ఇది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత ఒక్కొక్కరికి క్లారిటీ ఇస్తూ వస్తున్నా. చివరకు ఆన్ లైన్ ద్వారా అందరికీ ఒకే సారి క్లారిటీ ఇస్తున్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అలాగే డేటింగ్ యాప్స్క తాను వ్యతిరేకం కాదని... జనాలు ఒకరినొకరు కలుసుకోవడానికి ఈ యాప్స్ ఎంతో ఉపయోగపడతాయని లారా వ్యాఖ్యానించింది. అయితే, ఇప్పటి వరకు తాను డేటింగ్ యాప్‌లో లేనని చెప్పారు. ఈ వార్తలను నమ్మొద్దని ఆమె ఫ్యాన్స్‌ను కోరారు. View this post on Instagram A post shared by Lara Dutta Bhupathi (@larabhupathi) -
కేబినెట్ విస్తరణ: 35 మంది కొత్త మంత్రుల ప్రొఫైల్..
సాక్షి, న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో ఎన్నికలు, సామాజిక సమీకరణాల ప్రాతిపదికగా 77 మంది మంత్రులతో కొత్త మంత్రి మండలి కొలువుతీరింది. నారాయణ రాణె, శర్బానంద, జ్యోతిరాదిత్య సింథియా, అనుప్రియ పటేల్ తదితరుల కొత్త కేబినెట్లో స్థానం సంపాదించారు. వీరిలో కొందరు గురించి క్లుప్తంగా.. నారాయణ రాణే (69): మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన వారు. శివసేనలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగానూ విధులు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషించారు. 2017లో సొంతంగా మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష పార్టీని స్థాపించారు. 2020లో పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన రాణే రాజ్యసభ సభ్యుడు కావడం తొలిసారి. మహారాష్ట్ర పరిశ్రమలు, రెవెన్యూ, ఓడరేవులు, పశుసంవర్ధక వంటి శాఖలకు మంత్రిగా పనిచేశారు. 35 ఏళ్లుగా ఏదో ఒక పదవిలో ఉన్నారు. రాజకీయాలకు ముందు 1971 నుంచి 1984 వరకూ ఆదాయపన్ను శాఖలో పనిచేశారు. శర్బానంద సోనోవాల్ (58): అస్సాంలోని దిబ్రూగఢ్‌కు చెందినవారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసిన సోనోవాల్ అసోం గణపరిషద్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో బీజేపీలో చేరారు. 2014లో లఖింపూర్ నుంచి ఎంపీగా ఎన్నికై ప్రధాని మోదీ కేబినెట్లో క్రీడల మంత్రిగా పనిచేశారు. 2016లో అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వీరేంద్ర కుమార్ (67): మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జన్మించారు. సీనియర్ పార్లమెంటేరియన్. ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. 17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా పనిచేశారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్ విస్తరణ సమయంలో మైనారిటీ వ్యవహారాలు, మహిళ,శిశు అభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా నియమితులయ్యారు. జ్యోతిరాదిత్య సింథియా (50): మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2020లో బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. జ్యోతిరాదిత్య రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. రామచంద్ర ప్రసాద్ సింగ్ (63): బిహార్‌లోని నలందకు చెందిన రామచంద్ర ప్రసాద్ ఎన్డీయే భాగస్వామ్య పార్టీ జేడీయూ కీలకనేత. యూపీ క్యాడర్ 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సింగ్ 2010 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశారు. అశ్విని వైష్ణవ్ (50): ఒడిశాకు చెందిన అశ్విని వైష్ణవ్ 2019లో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి. పెన్సిల్వేనియా వర్సిటీ నుంచి ఎంబీయే చేశారు. 1994 బ్యాచ్ ఐఏఎస్ (27వ ర్యాంకు) అధికారి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రశంసలు పొందారు. 1999లో ఒడిశాలో సైక్లోన్ సమయంలో యూఎస్ నేవీ వెబ్సైట్ ట్రాక్ చేసి తాజా పరిస్థితులు ఉన్నతాధికారులకు చేరవేసి భారీ నష్టం జరగకుండా చూశారు. వాజపేయి హయాంలో పీఎంవోలో పనిచేశారు. పశుపతి కుమార్ పారస్ (68): బిహార్‌లోని ముంగేర్‌కు చెందిన పశుపతి పారస్ ఎన్డీయే భాగసామ్య లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు. బిహార్లోఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. దేశంలోని సీనియర్ చట్టసభ సభ్యుల్లో ఒకరు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజా జీవితంలోకొనసాగుతున్నారు. భాగల్పూర్ వర్సిటీ నుంచి బీఈడీ చేశారు. భూపేందర్ యాదవ్ (52): బీజేపీలో ట్రబుల్ షూటర్‌గా పేరుపొందిన భూపేందర్ యాదవ్ రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అమిత్‌షా అనుచరుడిగా పేరొందిన భూపేందర్ పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో తన నాయకత్వ లక్షణాల ద్వారా గుర్తిం పు పొందారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల సమ యంలో పార్టీ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. పంకజ్‌చౌధరి (56): ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ లోక్‌సభ సభ్యుడు. ఆరోసారి ఎంపీగా ఉన్నారు. గతంలో గోరఖ్‌పూర్ డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న చౌధరి గోరఖ్‌పూర్ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అనుప్రియ సింగ్ పటేల్ (40): ఎన్డీయే భాగస్వామి అప్నాదళ్(సోనేలాల్) పార్టీ అధ్యక్షురాలు. ఛత్రపతి సాహూజీ మహరాజ్ వర్సిటీ నుంచిఎంబీయే చేసిన అనుప్రియ అమిటీ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. మీర్జాపూర్ నుంచి వరసగా రెండోసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మోదీ తొలి కేబినెట్లో ఆరోగ్య శాఖసహాయమంత్రిగా పనిచేశారు. యూపీ ఎమ్మెల్యేగానూ పనిచేశారు. వెనకబడిన వర్గాల సమస్య పరిష్కారం నిమిత్తం మైనారిటీ వ్యవహారాల స్థానంలో ఓబీసీ మంత్రిత్వశాఖ తీసుకురావాలని ఇటీవలే అనుప్రియ డిమాండు చేశారు. ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ భగేల్ (61): యూపీలోని ఆగ్రాకు చెందిన భగేల్ ఐదోసారి ఎంపీ. యూపీప్రభుత్వంలో పశుసంవర్ధక, మత్స్య, మైనర్ ఇరిగేషన్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. మిలటరీ సైన్స్‌లో పీహెచ్డీ చేసిన భగేల్ ఎల్ఎల్బీ తోపాటు ఎంఏ, ఎమ్మెస్సీ పూర్తి చేశారు. రాజీవ్ చంద్రశేఖర్ (57): బెంగళూరుకు చెందిన రాజీవ్ రాజ్యసభ సభ్యుడు. పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా ఉన్నారు. విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపుపొందారు. హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రొగ్రామ్ చేసిన రాజీవ్ కంప్యూటర్ సైన్స్‌లో ఎంటెక్ చేశారు. శోభ కరాంద్లాజే (54): దక్షిణ కన్నడ ప్రాంతానికి చెంది శోభ ఉడుపి చిక్మగ్లూర్ నియోజకవర్గంనుంచి వరసగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్ణాటకలో ఆహార, ప్రజా పంపిణీ, విద్యుత్తు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. మూడు దశాబ్దాలుగా ప్రజా జీవనంలో ఉన్న శోభ సోషియాలజీలో ఎంఏ చేశారు. భానుప్రతాప్ సింగ్ వర్మ: ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన భానుప్రతాప్ జలాన్ నియోజకవర్గం నుంచి ఐదోసారి ఎంపీగా గెలిచారు. యూపీ ఎమ్మెల్యేగానూ ఎన్నికైన వర్మ మూడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్నారు. బుందేల్‌ఖండ్ వర్సిటీ నుంచి ఎంఏ, ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు. దర్శన విక్రమ్ జర్దోష్ (60): గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన దర్శన మూడోసారి సూరత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుజరాత్ సోషల్ వెల్ఫేర్ బోర్డు సభ్యురాలిగా పనిచేసిన దర్శన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా పనిచేశారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న ఆమె బీకాం చదివారు. సంస్కృతి ఆర్ట్ కల్చర్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు. మీనాక్షి లేఖి (54): న్యూఢిల్లీ నియోజవర్గం నుంచివరసగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన లేఖి ఎన్డీఎంసీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. మీడియాలో బీజేపీ వాయిస్‌గా పేరుపొందిన మీనాక్షి సామాజిక కార్యకర్తగానూ సేవలందించారు. ప్రధాని మోదీని ‘చౌకీదార్ చోర్ హై’అని వ్యాఖ్యానించిన రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం పార్లమెంటులో పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్యానెల్ స్పీకర్ సభ్యురాలు. అన్నపూర్ణదేవి (51): జార్ఖండ్‌లోని నార్త్‌ఛోతంగపూర్‌కు చెందినఅన్నపూర్ణ దేవి కోడర్మ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన ఆమె జార్ఖండ్ సాగునీరు, మహిళ, శిశు అభివృద్ధి, రిజి్రస్టేషన్ శాఖల మంత్రిగా పనిచేశారు. రెండు దశాబ్దాల క్రితం 30 ఏళ్ల వయసులో జార్ఖండ్ మైన్స్,జియాలజీ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాంచీవర్సిటీ నుంచి చరిత్రలో ఎంఏ చేశారు. ఎ.నారాయణ స్వామి (64): కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన నారాయణ స్వామి చిత్రదుర్గ నియోజకవర్గం నుంచితొలిసారి ఎన్నికయ్యారు. కర్ణాటక అసెంబ్లీకి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన కేబినెట్మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. మూడు దశాబ్దాలపాటు ప్రజా జీవితంలో ఉన్న నారాయణస్వామి బీఏ చదివారు. కౌశల్ కిషోర్ (61): ఉత్తరప్రదేశ్‌లోని అవద్‌కు చెందిన కౌశల్ మోహన్‌లాల్‌గంజ్ నియోజకవర్గానికి రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీ ప్రభుత్వంలో సహాయమంత్రిగా పనిచేసిన కౌశల్ మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. బీఎస్సీ చదివారు. అజయ్‌భట్ (60): ఉత్తరాఖండ అల్మోడాకు చెందిన అజయ్ భట్ నైనిటాల్–ఉధమ్‌సింగ్‌నగర్ నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భట్ ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో పలు మంత్రిత్వశాఖలు చేపట్టారు. రెండున్నర దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్న అజయ్‌భట్ న్యాయవాది. బీఎల్ వర్మ (59): ఉత్తరప్రదేశ్‌లోని రోహిలాఖండ్కు చెందిన వర్మ రాజ్యసభ సభ్యుడు మూడున్నర దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్న వర్మ వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత వర్సిటీ నుంచి ఎంఏ పూర్తిచేశారు. అజయ్‌కుమార్ (60): ఉత్తరప్రదేశ్‌లోని అవద్‌కు చెందిన అజయ్‌కుమార్ ఖేరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాపరిషద్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా పదవులు నిర్వహించారు. మూడు దశాబ్దాలపాటు ప్రజాజీవితంలో ఉన్న అజయ్‌కుమార్ బీఎస్సీ ఎల్ఎల్బీ చేశారు. చౌహాన్ దేవుసిన్హ్ (56): గుజరాత్‌లోని ఖేడాకు చెందిన చౌహాన్ వరసగా రెండోసారి ఖేడా నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆల్ఇండియా రేడియోలో ఇంజినీరుగా పనిచేసిన చౌహాన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాచేశారు. భగవంత్ కుభ(54): కర్ణాటకలోని బీదర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. కపిల్ మోరేశ్వర్ పాటిల్ (60): మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన కపిల్ భివండి నియోజకవర్గంనుంచిప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా వివిధ పదవుల్లో ఉన్న కపిల్ సర్పంచి, జిల్లా పరిషద్ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. ముంబయి వర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశారు. ప్రతిమా భౌమిక్ (52): అగర్తలాకు చెందిన ప్రతిమా భౌమిక్ త్రిపుర వెస్ట్ నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. బయోసైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. సుభాష్ సర్కార్ (67): పశ్చిమ బెంగాల్ మేదినిపూర్‌కు చెందినసుభాష్ బంకురా నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎయిమ్స్ కల్యాణి బోర్డు సభ్యుడైన సుభాష్ గైనకాలజిస్ట్. చిన్నతనం నుంచే సామాజిక కార్యక్రమంలో చురుగ్గా ఉండేవారు. ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో ఉన్న సుభాష్ రామకృష్ణ మిషన్తోకలిపి పనిచేసేవారు. కలకత్తా వర్సిటీ నుంచి ఎంబీబీఎస్ చేశారు. భగవత్ కిషన్రావ్ కరాద్ (64): మరాట్వాడా ప్రాంతానికి చెందిన భగవత్ రాజ్యసభ సభ్యుడు. ఔరంగాబాద్ మేయర్‌గా పనిచేసిన ఆయన మరాట్వాడా లీగల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. వృత్తి రీతా వైద్యుడైన భగవత్ ఎంబీబీఎస్, ఎంఎస్(జనరల్ సర్జరీ), ఎంసీహెచ్(పీడియాట్రిక్ సర్జరీ), ఎఫ్‌సీపీఎస్ (జనరల్ సర్జరీ ) చేశారు. రాజ్‌కుమార్ రంజన్ సింగ్ (68): ఇంఫాల్‌కు చెందిన రాజ్‌కుమార్ ఇన్నర్ మణిపూర్ నియోజవర్గంనుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న రాజ్‌కుమార్ జియోగ్రఫీ ప్రొఫెసర్. గువాహటి యూనివర్సిటీ నుంచి జీయోగ్రఫీలో ఎంఏ ,పీహెచ్డీ చేశారు. భారతి ప్రవీణ్ పవార్ (42): మహారాష్ట్రలోని ఖందేశ్‌కు చెందిన భారతి దిండోరి నియోజకవర్గం నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాసిక్‌జిల్లా పరిషద్ సభ్యురాలిగా చేసిన భారతి రక్షిత నీరు అందించడం, పౌష్టికాహారలోపాన్ని రూపుమాపడంలో కృషి చేశారు. నాసిక్‌లోని ఎన్డీఎంవీపీఎస్ వైద్య కళాశాల నుంచి సర్జరీలో ఎంబీబీఎస్ చేశారు. బిషే్వశ్వర్ తుడు(56): ఒడిశాలోని మయూర్‌భంజ్‌కు చెందిన తుడు తొలిసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒడిశాలోని జలవనరుల విభాగంలో సీనియర్ ఇంజినీరుగా పనిచేశారు. రూర్కెలాలోని ఉత్కళమణి గోపబంధు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేశారు. శాంతను ఠాకూర్ (38): ప్రధాని మోదీ కేబినెట్లో రెండో అత్యంత పిన్నవయస్కుడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శాంతను బాంగాన్ నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మతువా వర్గానికి చెందిన శాంతను కర్ణాటక దూరవిద్య వర్సిటీ నుంచి బీఏ ఇంగ్లిష్ చేశారు. ముంజపరా మహేంద్రభాయ్ (52): గుజరాత్‌లోని సురేంద్ర నగర్‌కు చెందిన ముంజపరా వృత్తిరీతా వైద్యుడు. జనరల్ మెడిసిన్‌లో ఎండీ చేసిన ముంజపరా మూడు దశాబ్దాలుగా కార్డియాలజిస్ట్, ప్రొఫెసర్‌గా గుర్తింపుపొందారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ఆయన వైద్య శిబిరాల ద్వారా 8లక్షలకు పైగా రోగులకు సేవలందించడంతోపాటు రూ.2కే మందులు అందించేవారు. ఎల్.మురుగన్ (44): ఉభయసభల్లోనూ సభ్యుడు కాదు. తమిళనాడులోని కొంగునాడుకు చెందిన మురుగన్ 15 ఏళ్లుగా మద్రాస్ హైకోర్టులో న్యాయ వాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మద్రాస్ వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం, లా లో పీహెచ్డీ చేశారు. నిశిత్ ప్రమానిక్ (35): ప్రధాని మోదీ కేబినెట్లో అత్యంత పిన్న వయస్కుడు. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గురికి చెందిన నిశిత్ కూచ్‌బెహార్ నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీఏ చదివిన నిశిత్ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేశారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలు..
రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేసిన ఆరు పేర్లను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. వారి వివరాలను పరిశీలిస్తే.. సి.రామచంద్రయ్య చార్టర్డ్ అకౌంటెంట్‌గా మొదలుపెట్టి.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి అయిన సి.రామచంద్రయ్య 1948, మే 27న కడపలో జన్మించారు. ఆయన కొంతకాలం చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. 1985–89 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 1986–88 మధ్య ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిగా ఉన్నారు. తర్వాత రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. 1999–2004 మధ్యకాలంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్స్ చైర్మన్‌గా పనిచేశారు. 2011లో ఎమ్మెల్సీగా ఉన్నారు. 2012లో దేవదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. చల్లా భగీరథరెడ్డి తండ్రి బాటలో నడుస్తూ.. ఎమ్మెల్సీ అభ్యర్థి చల్లా భగీరథరెడ్డి 1976లో చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీదేవి దంపతులకు జన్మించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన భగీరథరెడ్డి 2003 నుంచి 2009 వరకు కర్నూలు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2007 నుంచి 2008 వరకు జాతీయ స్థాయి యువజన కాంగ్రెస్ సెక్రటరీగా, 2009 నుంచి 2010 వరకు ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. రాజకీయంగా తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇంజనీరింగ్ చదివి.. దివంగత తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కుమారుడైన 36 ఏళ్ల బల్లి కళ్యాణ్‌చక్రవర్తి బీఈ వరకు చదివారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని 16వ వార్డు ఆయన స్వస్థలం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకుడుగా కొనసాగుతున్నారు. గత 12 ఏళ్లుగా తండ్రి బల్లి దుర్గాప్రసాద్‌రావుకు రాజకీయంగా చేదోడుగా ఉంటున్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరఫున క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఖాకీ వృత్తి నుంచి రాజకీయాల్లోకి.. షేక్ మహమ్మద్ ఇక్బాల్ విశ్రాంత ఐజీ. అనంతపురం జిల్లా హిందూపురంలోని ప్రశాంత్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఎంఏ వరకు చదివిన ఆయన 35 ఏళ్లపాటు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2018లో వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలకృష్ణపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో మొదటిసారి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. మార్చి 29తో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కరీమున్నీసా కార్పొరేటర్‌గా మొదలై.. ఎండీ కరీమున్నీసా విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్. భర్త ఎండీ సలీం. ఏడవ తరగతి వరకు ఆమె చదివారు. 2014లో జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున 54వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి కూడా డివిజన్ అభివృద్ధికి కరీమున్నీసా కృషి చేశారు. అలాగే పార్టీ బలోపేతానికీ కృషి చేశారు. ప్రస్తుతం 59వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ ఎంపిక చేసింది. దువ్వాడ శ్రీనివాస్ పోరాటాలతో ప్రస్థానం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన దువ్వాడ శ్రీనివాస్ 1964లో దువ్వాడ కృష్ణమూర్తి, లీలావతి దంపతులకు జన్మించారు. కాకినాడ పీఆర్ కళాశాలలో ఎంఏ లిటరేచర్, బీఎల్ చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా వ్యవహరించారు. 2006లో జిల్లాపరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున టెక్కలి ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు. అలాగే 2014లో టెక్కలి అసెంబ్లీకి, 2019లో శ్రీకాకుళం ఎంపీ పదవికి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేశారు. కానీ ఓటమి చెందారు. రాజకీయ ఆరంభం నుంచి కింజరాపు కుటుంబ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ పోరాటం చేశారు. టెక్కలి నియోజకవర్గంలో అత్యధికంగా 112 సర్పంచ్ స్థానాల గెలుపునకు కృషి చేశారు. చదవండి: (ఎమ్మెల్సీ ఎన్నికలు: మాట నిలబెట్టుకున్న సీఎం జగన్) -
ఇరిగేషన్ నుంచి ఫినాన్స్.. మంత్రుల ఫ్రొఫైల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది నెలల తరువాత తొలిసారి కేబినెట్ విస్తరణ జరిపారు. కొత్తగా ఐదురుగు ఎమ్మెల్యేలకు, ఓ ఎమ్మెల్సీకి మొత్తం ఆరుగురికి మంత్రివర్గంలో చోటుకల్పించారు. వీరిలో ఇద్దరు మహిళలు సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌లు ఉన్నారు. దీంతో తెలంగాణ తొలి మహిళా మంత్రులుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. గత ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ రావుకు.. ఈసారి కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తిరిగి ఐటీ, మున్సిపల్ శాఖలను కేటాయించారు. మంత్రుల వివరాలు... డబుల్ హ్యాట్రిక్.. ఇరిగేషన్ నుంచి ఫినాన్స్ తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన హరీష్‌రావు.. టీఆర్ఎస్లో కీలక నేతగా గుర్తింపు పొందారు. 2004 నుంచి వరుసగా సిద్ధిపేట అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి.. డబుల్ హ్యాట్రిక్ నమోదు చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 95 వేల ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజార్టీ సాధించి సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్లో తనకు తిరుగు లేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో భారీ నీటిపారుదల, శాసన సభ వ్యవహారాల శాఖ శాఖ మంత్రిగా విజయవంతమైన హరీష్.. తాజా మంత్రివర్గ విస్తరణలో కీలకమైన ఆర్థికను దక్కించుకున్నారు. తెలంగాణకు వరప్రదాయినిగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరీష్ పాత్ర వర్ణించలేనిది. 1972, జూన్ 3న జన్మించిన హరీష్.. 32 ఏళ్ల వయసులో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చదవండి: వైభవంగా మంత్రుల ప్రమాణ స్వీకారం సాఫ్ట్వేర్ నుంచి ఐటీ మంత్రిగా... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడిగా కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. 2006లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009 నుంచి సిరిసిల్ల శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ తొలి కేబినెట్ లో ఐటీ, మున్సిపల్, పంచాయతీ రాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 డిసెంబర్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. 1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో జన్మించారు. రెండేళ్లపాటు కరీంనగర్ లో చదువుకున్న రామారావు, హైదరాబాద్‌లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. గుంటూరులోని విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ డిగ్రీలో చేరారు. తరవాత పూణే యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి, అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి మేనేజ్మెంట్ అండ్ ఈ-కామర్స్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని ‘ఇంట్రా’ అనే సంస్థలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి వచ్చి.. కేసీఆర్ వారసుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ బాధ్యతలు నెరవేర్చనున్నారు. దేశంలో తొలి మహిళా హోంమంత్రి రికార్డు.. 2004, 2009లో చేవెళ్ల అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డి.. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు వహించారు. 2009 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి.. దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా విధులు నిర్వర్తించి రికార్డు సృష్టించారు. 2009-14 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం.. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. గులాబీ గూటికి చేరారు. అనంతరం కొద్దికాలంలోనే మంత్రిగా చోటు దక్కించుకున్నారు. అంతేకాకుండా తెలంగాణ తొలి మహిళా మంత్రిగా కూడా సబితా ప్రత్యేక గుర్తింపును పొందారు. 1963 మే 5న జన్మించారు. ఒకే ఒక్కడు.. అజయ్ అనతికాలంలోనే కీలక నేతగా ఎదిగిన పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు ప్రస్తుతం పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ గెలిచిన ఏకైక స్థానం ఖమ్మం (అజయ్ కుమార్) మాత్రమే. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమితో జిల్లాకు తొలిమంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో తాజా మంత్రివర్గ విస్తరణలో.. విజయం సాధించిన అజయ్‌కు అవకాశం దక్కింది. కమ్యూనిస్ట్ కుటుంబ నుంచి వచ్చిన అజయ్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి తొలిసారి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో సీనియరైన తుమ్మల నాగేశ్వరరావును ఓడించడంతో కొద్దికాలంలోనే గుర్తింపు పొందారు. 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి మాజీ ఎంపి నామా నాగేశ్వరరావుపై ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేశారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ఆయనకు రవాణ శాఖ దక్కింది. చదవండి: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు హ్యాట్రిక్ విజయం.. 2009లో కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గంగుల కమలాకర్ తొలిసారి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల సమయంలో గులాబీ తీర్థం పుచ్చుకుని కారేక్కేశారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 1968 మే 8న జన్మించారు. సర్పంచ్ నుంచి మంత్రిగా.. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగుకు చెందిన సత్యవతి రాథోడ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆమె.. 2007లో నర్సింహుల పేట జెడ్పీటీసీగా, 2009లో డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆమె టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలిగా ఉన్న ఆమెను సీఎం కేసీఆర్ తాజా కేబినెట్ విస్తరణలో మంత్రిగా అవకాశం కల్పించారు. తెలంగాణ తొలి మహిళా మంత్రిగా కూడా సత్యవతి ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజా మంత్రివర్గ విస్తరణలో గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా నియమితులయ్యారు. -
పల్లె నుంచి పరీక్షల అధికారి వరకూ..
సాక్షి, కడప ఎడ్యుకేషన్: మనసుండాలే గాని మార్గముంటుందంటారు. చదువుకోవాలనే ధ్యాస ఆ వ్యక్తిని ఉన్నతాధికారి స్థాయికి తీసుకెళ్లంది. మన జిల్లాలోని వల్లూరు మండలం గంగాయపల్లెలో ఓ రైతు ఇంట జన్మించి బడి ముఖమే చూడకుండా 1 నుంచి 5 వరకు ఓ ప్రైవేటు వ్యక్తి వద్ద చదివారు. తరువాత 6 నుంచి ప్రభుత్వ స్కూలులో చదివారు. ఆయనెవరో కాదు. మన రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారెడ్డి. టెట్, సర్వశిక్ష అభియాన్ బోర్డులకు కూడా సేవలందిస్తున్నారు. సుబ్బారెడ్డి గంగాయపల్లె గ్రామంలోని ఓ ప్రైవేటు వ్యక్తి వద్ద ప్రాథమిక విద్య నేర్చుకున్నారు. చదువుపై ఆది నుంచి ఆసక్తి చూపేవరు.6 నుంచి 10వ తరగతి వరకు గంగాయపల్లె జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివారు. కడపలోని రామక్రిష్ణా జూనియర్ కళాశాలో, డిగ్రీని కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో పీజీని శ్రీక్రిష్ణదేవరాయ యూనివర్సీటీ పూర్తి చేశారు. ఈయన 2000లో విద్యను పూర్తి చేసి మొట్టమొదటి సారిగా సెకండ్‌గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తరువాత డీఎస్సీ రాసి 2001లో స్కూల్ అసిస్టెంట్ ఎంపికైయ్యారు. 2007లో జేఎల్ పరీక్షను రాసి జూనియర్ లెక్చరర్‌గా ఎంపికయ్యారు. 2008లో ఏపీపీఎస్సీ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును సాధించారు. డిప్యూటీ డీఈఓగా ఎంపికయ్యారు. సొంత జల్లా అయిన కడపకు వచ్చారు. అనంతరం 2012లో డీఈఓగా పదోన్నతిపై హైదరాబాదకు వెళ్లారు. తరువాత రాçష్ట్రం విడిపోవడంతో కృష్ణా జిల్లా డీఈఓగా బదిలీపై వచ్చారు. తరువాత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది విద్యాశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. దీంతోపాటు 2018 నుంచి ప్రభుత్వ పరీక్షల జాయింట్ డైరెక్టర్‌గా, సర్వశిక్ష అభియాన్ బోర్డు డైరెక్టర్‌గా కూడా సేవలందిస్తున్నారు. సుబ్బారెడ్డి తల్లితండ్రులు బాలిరెడ్డి, సుబ్బమ్మలది వ్యవసాయ కుటుంబం. విద్యాశాఖలో మార్పులు సుబ్బారెడ్డి ప్రభుత్వ పరీక్షల రాష్ట్ర ఇన్చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విద్యాశాఖలో పలు సమూల మార్పులు తెచ్చారు. పదవ తరగతి విద్యార్థులకు మార్కుల జాబితాను ఫలితాలు వెలువడిన వెంటనే ఆన్లైన్ పెట్టించేలా చర్యలు తీసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులను ఎత్తివేయించడంలో కీలక భూమిక పోషించారు. గతంలో విద్యార్థి హాల్‌టికెట్ నెంబరు కొడితే కేవలం వ్యక్తిగత మార్చులు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు స్కూల్ కోడ్ కొట్టగానే విద్యార్థులకు సంబంధించిన అందరి ఫలితాలు ఒకేసారి వస్తాయి. ఇదీ ఆయన కృషేనని చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా 12 రకాల స్కూల్ మేనేజ్మెంట్కు సంబంధించిన 11,890 స్కూల్స్ గుర్తింపుతోపాటు అడిషి నల్ తరగతుల వివరాలను అన్లైన్లో నమోదు చేయించారు. ప్రైవేటు పాఠశాలల గుర్తిం పు వివరాలను కూడా ఆన్లైన్లో పెట్టించారు. పదవ తరగతి విద్యార్థులకు సం బంధించిన నామినల్ రోల్స్‌ను కూడా జూన్‌లోనే ఆన్లైన్ చేస్తున్నారు. గతంలో నవంబర్ నెలలో నామినల్ రోల్స్‌ను అన్లైన్ చేసేవారు. ఆలాంటిది ఇప్పడు జూన్‌లోనే చేయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మహిళలు ఆర్థిక స్వావలంబనకు కుట్లు, అల్లికలు, మ్యూజిక్ వంటి వృత్తి విద్యా కోర్సలను సంబంధించిన శిక్షణా కేంద్రాన్ని కడపలో ఏర్పాటు చేయించారు. -
అభ్యర్థుల ప్రొఫైల్
ఒకరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చి అదే బాటలో రాణిస్తుంటే.. మరికొందరు ఎలాంటి అనుభవం లేకున్నప్పటికీ రాజకీయాల్లోకి వచ్చి తమ చరిష్మా చూపించారు. అతిచిన్న వయస్సులోనే క్యాబినెట్ హోదా పొందినవారూ ఉన్నారు. ఇ లా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు రాష్ట్రరాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా వారి ప్రొఫైల్స్ ఇవే.. పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రొఫైల్ పేరు : పరిగె శ్రీనివాస్‌రెడ్డి తల్లిదండ్రులు : పరిగె రాజారెడ్డి, పాపమ్మ వయస్సు : 10–02–1950 కులం : రెడ్డి (ఓసి) విద్యార్హత : ఇంజనీరింగ్ (బీఈ–డిస్కంటిన్యూ) స్వగ్రామం : పోచారం (బాన్సువాడ మండలం) కుటుంబం : భార్య పుష్ప, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె (రవీందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి) రాజకీయ ప్రస్థానం: 1978లో దేశాయిపేట సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నిక 1989లో నిజామాబాద్ ఎంపీగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి బాలాగౌడ్ చేతిలో ఓడిపోయారు. 1992లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక 1993–1997లో టీడీపీ జిల్లా కన్వీనర్‌గా పదవీ బాధ్యతలు 1994లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నిక 1998లో గహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు 1999లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నిక 1999–2000 భూగర్భ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు 2001–02 గ్రామీణ, పంచాయతిరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు 2004లో కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయారు. 2005 నుంచి 07 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక 2009లో కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌పై గెలుపు 2011లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థిపై 23వేల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నాలుగేళ్ల, 3 నెలలు కొనసాగారు. కాసుల బాల్‌రాజ్ బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసుల బాల్‌రాజ్ ప్రొఫైల్ పేరు : కాసుల బాల్‌రాజ్ తల్లిదండ్రులు : కాసుల బాబురావు వయస్సు : 01–01–1960 కులం : మున్నూరు కాపు విద్యార్హత : ఎస్ఎస్సి స్వగ్రామం : బాన్సువాడ రాజకీయ ప్రస్థానం: 1984– మున్నూరు కాపు సంఘంయువజన అధ్యక్షుడు. 1985 నుంచి 1990–యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు 1990 నుంచి 1998వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు 1992 నుంచి 1995 వరకు మార్కెట్ కమిటి అధ్యక్షులు–బాన్సువాడ 1995 నుంచి 2001 వరకు బాన్సువాడ సర్పంచ్ 22–7–2006 నుంచి 17–8–2008వరకు బాన్సువాడ ఎంపిపి 2009లో ప్రజా రాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బాన్సువాడ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి 6వేల ఓట్లు సాధించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతిలో 23వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి ప్రొఫైల్ పూర్తి పేరు : పొద్దుటూరి వినయ్ కుమార్‌రెడ్డి తండ్రి పేరు : సురేందర్‌రెడ్డి తల్లి పేరు : అరుణ భార్య : అనన్య రెడ్డి స్వగ్రామం : కోమన్‌పల్లి, ఆర్మూర్ మండలం, నిజామాబాద్ జిల్లా ప్రస్తుత నివాసం : విల్లా నెంబర్ : 177, అపమ ఫామ్ మిడోస్ కోంపల్లి, హైదరాబాద్ పిల్లలు : హృదయ్, అన్వి విద్యార్హత : బీటెక్ (ఈఈఈ) వృత్తి : రియల్ ఏస్టేట్ వ్యాపారం, బిల్డర్ నిర్వహించిన పదవులు : టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రత్యేకతలు : టీఆర్ఎస్ పార్టీ 13వ ఆవిర్భావ సభను 2013 ఏప్రిల్‌లో ఆర్మూర్‌లో నిర్వహించిన ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి వ్యాపార భాగస్వామిగా, మిత్రునిగా గుర్తింపు ఉంది. గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న గంపగోవర్ధన్ ప్రొఫైల్ అభ్యర్థి పేరు : గంప గోవర్ధన్ స్వస్థలం : బస్వాపూర్, భిక్కనూరు మండలం రాజకీయ ప్రస్థానం : 1987లో బస్వాపూర్ సింగిల్‌విండో చైర్మన్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. భిక్కనూరు మండల టీడీపీ అధ్యక్షునిగా పనిచేశారు. 1994 లో తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో టిక్కెట్ దక్కలేదు. ఆయన స్థానంలో యూసుఫ్‌అలీకి టీడీపీ టిక్కెట్ రావడంతో స్తబ్ధుగా ఉన్నారు. 1999 నుంచి 2000 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీడీపీ అ«ధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. 2004లో కామారెడ్డి స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. దీంతో టీడీపీ అభ్యర్థిగా ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా కామారెడ్డి నుంచి పోటీ చేసి షబ్బీర్‌అలీపై విజయం సాధించారు. 2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2014 లో మరోసారి టీఆర్ఎస్ నుంచి గెలిచి ప్రభుత్వవిప్‌గా అసెంబ్లీ రద్దు వరకు పనిచేశారు. గడ్డం ఆనంద్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం ఆనంద్‌రెడ్డి ప్రొఫైల్ పేరు : గడ్డం ఆనంద్‌రెడ్డి తండ్రి పేరు : గడ్డం గంగారెడ్డి తల్లి పేరు : గడ్డం లక్ష్మీకాంతమ్మ భార్య పేరు : ఇందిరా రెడ్డి పిల్లలు : శిల్పారెడ్డి, కావ్యరెడ్డి చదువు : డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీర్ రాజకీయ ప్రస్థానం : 2008 లో డిచ్పల్లి నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. 2014లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రొఫైల్ పూర్తి పేరు : ఆశన్నగారి జీవన్‌రెడ్డి తండ్రి పేరు : వెంకట రాజన్న తల్లి పేరు : రాజాబాయి భార్య : రజితరెడ్డి స్వగ్రామం : జాన్కంపేట్, వేల్పూర్ మండలం, బాల్కొండ ప్రస్తుత నివాసం : ఇంటి నెం: 4–70/8/డీ/8, వెంకటేశ్వర కాలనీ, మామిడిపల్లి, ఆర్మూర్ మండలం, నిజామాబాద్ పిల్లలు : అనౌషికారెడ్డి, అనణ్యరెడ్డి విద్యార్హత : ఎంఏ (రాజనీతి శాస్త్రం), ఎల్ఎల్బీ వృత్తి : వ్యవసాయం, వ్యాపారం, న్యాయవాది తమ్ముడు : రాజేశ్వర్‌రెడ్డి చెల్లెలు, బావ : కరుణ, శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన పదవులు : టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ నియోజకవర్గం ఇన్చార్జి. నిర్వహించిన బాధ్యతలు : 2014–2018 వరకు ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రత్యేకతలు : టీఆర్ఎస్ 13వ ఆవిర్భావ సభను 2013 ఏప్రిల్‌లో ఆర్మూర్‌లో నిర్వహించారు. 2014లో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డిపై సుమారు 13 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మహ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న మహ్మద్‌అలీ షబ్బీర్ ప్రొఫైల్ అభ్యర్థి : మహ్మద్‌అలీ షబ్బీర్ స్వస్థలం : మాచారెడ్డి, (కామారెడ్డిలో స్థిరపడ్డారు) పుట్టిన తేది : 15–02–1957 రాజకీయ ప్రస్థానం : షబ్బీర్‌అలీ 1970లో ఎన్ఎస్యూఐ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తక్కువ కాలంలో ఎన్ఎస్యూఐ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. 1987లో మాచారెడ్డి మండలం ఎంపీపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి గడ్డం రాజిరెడ్డి చేతిలో కొద్ది తేడాతో ఓడిపోయారు.1989లో కామారెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో 31 ఏళ్లకే మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ అభ్యర్థి గంపగోవర్ధన్ చేతిలో ఓడిపోయారు. 1999లో టీడీపీ అభ్యర్థి యూసుఫ్‌అలీ చేతిలో ఓటమి చెందారు. 2004లో బీజేపీ అభ్యర్థి మురళీధర్‌గౌడ్ పై భారీ మెజార్టీతో గెలుపొంది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో టీడీపీ అభ్యర్థి గంపగోవర్ధన్ చేతిలో ఓడిపోయారు. 2010లో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి గంపగోవర్ధన్ చేతిలో మరోసారి ఓటమి చెందారు. ప్రస్తుతం కామరెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రేకులపల్లి భూపతి రెడ్డి రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ప్రొఫైల్ ఇది.. పేరు : డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తండ్రి పేరు : ఆర్.రాజారెడ్డి తల్లి పేరు : లక్ష్మీ నర్సమ్మ భార్య పేరు : వినోదిని. పిల్లలు : శ్రీనిత్రెడ్డి (కుమారుడు). పుట్టిన తేదీ : 12/02/1964 చదువు : ఎంఎస్ ఆర్థో స్వగ్రామం : జలాల్పూర్, నిజామాబాద్ రూరల్ మండలం ప్రస్తుత నివాసం : మారుతినగర్, కంఠేశ్వర్, నిజామాబాద్ 1995లో నగరం ఖలీల్వాడీలో తిరుమల ఆర్థోపెడిక్ నర్సింగ్ హోం ప్రారంభించారు. 2001లో ఐఎంఏ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక 2001 టీఆర్ఎస్లో చేరిక 2002లో టీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్‌చార్జీగా నియామకం. 2002లో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం 2015లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవ ఎన్నిక 2018లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రొఫైల్ పేరు : పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తండ్రి : గంగారెడ్డి తల్లి : రుక్మవ్వ నివాసం : నవీపేటలోని సిరన్‌పల్లి, ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పుట్టిన తేది : 02–08–1950 విద్యాభ్యాసం : డిగ్రీ బీఏ భాషలు : తెలుగు సతీమణి పేరు : సుచరిత పిల్లలు : రాధిక, రచన, రజిత్‌రెడ్డి కుటుంబం నేపథ్యం : సాధారణ రైతు కుటుంబం చేపట్టిన పదవులు : 1986–87లో సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ డెలిగెట్గా పని చేశారు. 1989లో బోధన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి కొత్త కొత్త రమాకాంత్ చేతిలో ఓటమి చెందారు. 1994లో ఎమ్మెల్యే టిక్కెట్ రాలేదు. కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి పార్టీ అధిష్టానం సూచన మేరకు పోటీ నుంచి నిష్క్రమించారు. 1999, 2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2006 నుంచి 2009 వరకు రెండు పర్యాయాలు టీటీడీ బోర్డు సభ్యుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్ర వైద్య విద్యాశాఖ, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీఆర్ఎస్ టీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ఆమేర్ చేతిలో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉంటున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి బయోడేటా.. పేరు : బాజిరెడ్డి గోవర్థన్ తండ్రి పేరు : బాజిరెడ్డి దిగంబర్ పుట్టిన తేదీ : 17/02/1954 చదువు : బీఏ స్వగ్రామం : సిరికొండ మండలం చీమన్‌పల్లి ప్రస్తుత నివాసం : వాసవి స్కూల్ సమీపంలో, మహాలక్ష్మినగర్, నిజామాబాద్ పదవులు.. 1973 లో పోలీస్ పటేల్ 1981లో సర్పంచ్ 1987– 1990లో మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) 1994–2004లో ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరక్టర్ 1994లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1999–2004లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఎన్నిక 2004–2008లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నిక 2009లో బాన్సువాడ ఎమ్మెల్యేగా పోటీ చేసి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు 2014లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నిక బిగాల గణేశ్ గుప్తా నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్త ప్రొఫైల్ పూర్తి పేరు : బిగాల గణేశ్‌గుప్తా భార్యపేరు : లత పుట్టిన ఊరు : మాక్లూర్ పిల్లలు : ఇద్దరు కుమార్తెలు(రిది, రియ) పుట్టిన సంవత్సరం : 17/04/1970 తండ్రిపేరు : కృష్ణమూర్తిగుప్తా తల్లిపేరు : సువర్ణమాల రాజకీయం : 2009లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ ,2014లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఎన్నిక మాట్లాడే భాషలు : తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, కనడ, ఉర్దూ తమ్ముడు : మహేశ్ బిగాల చెల్లెళ్లు : రాణి, వాణి స్కూల్ విద్యాభాస్యం : జెడ్పీహెచ్ఎస్(మాక్లూర్) ఇంటర్ విద్య : సీఎస్ఐ కళాశాల(నిజామాబాద్) ఉన్నత విద్య : బీఈ సివిల్ గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల(బీదర్) బిగాల గణేశ్‌గుప్తా తాత బిగాల గంగారాం మాక్లూర్ గ్రామానికి 1961లో మొట్టమొదటి గ్రామ సర్పంచ్ పనిచేశారు. -
ఆ పుర్రె షీనా ముఖాకృతితో సరిపోలింది!
ముంబై: రాయ్‌గఢ్ అడవుల్లో స్వాధీనం చేసుకున్న కపాలంతో కన్నతల్లి ఇంద్రాణి ముఖర్జియా చేతిలో హత్యకు గురైన షీనాబోరా ముఖ రేఖాకృతి సరిపోలినట్లు తమ డిజిటల్ సూపరింపొజిషన్‌లో తేలిందని శుక్రవారం ముంబై పోలీసులు వెల్లడించారు. అలాగే, ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను తామింకా నిర్దోషిగా తేల్చలేదన్నారు. అయితే, ఆయనను ఈ కేసులో ఇంకా నిందితుడిగా కూడా చేర్చలేదు. షీనా హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్, పీటర్, షీనా తండ్రి సిద్ధార్థ్ దాస్ తదితరులను ఖార్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం కూడా సుదీర్ఘంగా విచారించారు. తొలిసారి ఇంద్రాణి, ఖన్నాల కూతురు విధిని కూడా కాసేపు ప్రశ్నించి పంపించేశారు. -
రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్
-
రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్
సామాన్యుల కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడు పేపర్ బాయ్‌గా పనిచేశారు. కష్టపడి ఉన్నత చదువులు అభ్యసించారు. సైంటిస్టుగా కెరీర్ ఆరంభంచి దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారు. దేశానికి వెలకట్టలేని సేవలు అందించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న స్వీకరించారు. దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పీఠం అధిరోహించారు. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా ఏపీజే అబ్దుల్ కలాం ప్రస్థానమిది. కోట్లాది మంది స్ఫూర్తిగా నిలిచిన అబ్దుల్ కలాం ఇకలేరు. సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కానీ ఆయన ఆశయాలు, కలలు ఎప్పటికీ బతికే ఉంటాయి. కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోడానికి కష్టపడాలని పిలుపునిచ్చిన ఏకైక దార్శనికుడు అబ్దుల్ కలాం. అలాగే, స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత మళ్లీ పిల్లలకు అంత చేరువగా వెళ్లిన ఏకైక వ్యక్తి కూడా ఆయనే. ఆయన స్ఫూర్తితో అనేకమంది అంతరిక్ష శాస్త్రవేత్తలు భారతదేశంలో వచ్చారు. ఇస్రో, డీఆర్డీఓ, షార్ తదితర కేంద్రాల్లో ఇప్పటికీ ఆయన శిష్యులు, ప్రశిష్యులే కీలక పాత్రలు పోషిస్తున్నారు. రక్షణ రంగంలో పరిశోధనలు చేసిన ఆయన.. కేర్ ఆస్పత్రికి చెందిన సోమరాజుతో కలిసి హృద్రోగులకు అమర్చే స్టెంట్ల రూపకల్పనలో కూడా కీలకపాత్ర పోషించారు. కలాం జీవితంలో కీలక ఘట్టాలు.. పూర్తి పేరు: ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం జననం: 1931 అక్టోబరు 15, రామేశ్వరం (తమిళనాడు) వయసు: 84 తల్లిదండ్రులు: అషియమ్మ, జైనులబుద్దీన్ విద్య పాఠశాల విద్య: రామనంతపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ కాలేజీ విద్య: తిరుచిరాపల్లి సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఫిజిక్స్‌లో డిగ్రీ, మద్రాసులో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ సైంటిస్టుగా కెరీర్ ఉద్యోగం: 1960లో డీఆర్డీఓలో సైంటిస్టుగా చేరిక ఇస్రోతో అనుబంధం: 1969లో ఇస్రోకు బదిలీ, ఎస్ఎల్వీ-3 ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ. 1990 వరకు ఇస్రోలో వివిధ హోదాల్లో బాధ్యతలు, పీఎస్ఎల్వీ, ఎస్ఎల్వీ ప్రాజెక్టుల అభివృద్ధిలో కీలక పాత్ర డీఆర్డీఓ: 1992-99 మధ్య డీఆర్డీఓ సెక్రటరీగా బాధ్యతలు ప్రధాని సాంకేతిక సలహాదారుగా బాధ్యతలు కలాం సారథ్యంలో ప్రోక్రాన్-2 అణుపరీక్షల నిర్వహణ రాష్ట్రపతి పదవీకాలం: జూలై 25, 2002-జూలై 25, 2007 రచనలు: వింగ్స్ ఆఫ్ ఫైర్ అవార్డు: భారతరత్న -
భార్యాభర్తలిద్దరూ జర్నలిస్టులే..
విశాఖపట్టణం: ఏచూరిమంచి రచయితగా కూడా పేరుంది. ఉత్తర భారతంలో పేరున్న హిందూస్తాన్ టైమ్స్ పత్రికలో కాలమిస్టుగా అనేక వ్యాసాలు రాశారు. ఆయన భార్య సీమా శిస్తీ కూడా జర్నలిస్టే. బీబీసీ హిందీ విభాగానికి ఢిల్లీలో సంపాదకురాలిగా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆంగ్ల పత్రికకు రెసిడెంట్ ఎడిటర్‌గా ఉన్నారు. ఆయనకు ఇది రెండో పెళ్లి. తొలి భార్యకు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన మోహన్ కందా ఆయన మేనమామ. మంచి పార్లమెంటేరియన్ కూడా... పార్లమెంటరీ సమావేశాలు సజావుగా సాగకుండా తరచూ అడ్డం పడుతుంటారన్న విమర్శ ఉన్నప్పటికీ కార్మిక వర్గ ప్రయోజనాల కోసమేనని చెబుతుంటారు. మంచి రచయిత కూడా.. దాదాపు 20 పుస్తకాలు రాశారు. వీటిల్లో ఆర్ధిక శాస్త్రం మొదలు రాజకీయ అంశాల వరకు ఉన్నాయి. చాలా దేశాలలో విస్తృతంగా పర్యటించారు. -
సీతారాం ఏచూరి ప్రొఫైల్
భారతదేశ కమ్యూనిస్టు రాజకీయాల్లో సీతారాం ఏచూరి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందరికీ సుపరిచితమైన నేత. 1952 ఆగస్టు 12న చెన్నైలో తెలుగు మాట్లాడే కుటుంబంలోజన్మించారు. ప్రారంభం నుంచే చురుకుగా ఉండే ఆయన భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా సమస్యలపట్ల ఆయన స్పందించే తీరు అమోఘం. ఒక్కసారి ఆయన జీవిత ప్రస్థానాన్ని గమనించినట్లయితే.. విద్యాభ్యాసం 1970లో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న సీతారాం ఏచూరి అనంతరం ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో కాలేజీ విద్యలో చేరారు. 1975లో ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో ఎంఏ ఆర్థికశాస్త్రంలో చేరి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. జేఎన్యూలోనే పీహెచ్‌డీలో ప్రవేశం పొంది.. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధింపు సమయంలో ఆరెస్టు కావడంతో దానిని పూర్తి చేయలేకపోయారు. రాజకీయ జీవితం 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ)లో విద్యార్థి నాయకుడిగా చేరిక. అత్యవసర సమయంలో కొన్నిసార్లు అజ్ఞాతంలోకి కూడా వెళ్లిన ఆయన అరెస్టయ్యారు. అత్యవసర పాలన ముగిసిన తర్వాత జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా మూడుసార్లు పనిచేశారు. 1978లో ఎస్ఎఫ్ఐ ఆలిండియా జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ ఆలిండియా ప్రెసిడెంట్‌గా నియామకం అయ్యారు. 1986లో ఎస్ఎఫ్ఐని వదిలి పూర్తి రాజకీయాలపై దృష్టిపెట్టారు. 1984లో ఆయననుపార్టీలోకి సీపీఎం ఆహ్వానించింది. 1985లో జరిగిన సీపీఎం పన్నెండో జాతీయ సభల్లో కేంద్రం కమిటీ సభ్యుడిగా ఎన్నిక. 1988లో జరిగిన సీపీఎం పదమూడో జాతీయ సభల్లో కేంద్ర కార్యనిర్వహకుడిగా ఎన్నిక. 1992లో జరిగిన సీపీఎం పద్నాలుగో జాతీయ సభలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికై ఇప్పటికీ కొనసాగుతున్నారు. 2005 పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నిక. 2015 విశాఖపట్నంలో జరిగిన 21 జాతీయ మహాసభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. సీతారాం ఏచూరి పార్లమెంటు గ్రూపు సభ్యుడిగా కూడా ఉన్నారు. రాజకీయాలతోపాటు సమకాలిన అంశాలపై వ్యాసాలు రాస్తూ హిందుస్థాన్ టైమ్స్‌కు కాలమిస్టుగా కూడా ఉన్నారు. -
ఎమర్జెన్సీ వీసా పొందాలంటే...
నా మేనల్లుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అనుకోకుండా అనారోగ్యం పాలయ్యి, ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నాడు. తోడుగా తన భార్య మాత్రమే ఉంది. ఒక్కతే కష్టపడుతూ ఉండటం వల్ల సహాయం కోసం మా చెల్లెలిని, బావగారిని (అబ్బాయి తల్లిదండ్రులు), వాళ్ల రెండో అబ్బాయిని అమెరికా పంపించాలని అనుకుంటున్నాను. ఇప్పటికే వీసా ఫీజు చెల్లించేశాను. అయితే సమయం పడుతుందంటున్నారు. వీసా ఇంటర్వ్యూ కోసం ఎమర్జెన్సీ స్లాట్ సంపాదించాలంటే ఏం చేయాలి? - ఎం.రవీంద్రనాథ్ రవీంద్రగారూ... మీరు వెంటనే కాన్సులేట్ ఆఫీసుకు ఒక మెయిల్ పంపండి. మీ సమస్యను తెలియజేస్తూ మెయిల్ పెడితే... వారు తక్షణం స్పందిస్తారు. మీకు సమాధానం ఇవ్వడమో, మిమ్మల్ని కాంటాక్ట్ చేయడమో చేస్తారు. ఒక్కసారి మీరు బ్యాంకులో డబ్బు కట్టేశాక... అది మీరు క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్‌లో అప్డేట్ అయిపోతుంది. మీరు ఈ160 ఫారంను అపాయింట్మెంట్ సెక్షన్లో సబ్మిట్ చేసి, ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ చేయండి. నా భర్త ఆరేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. మూడో నెల గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను ఇండియాలో వదిలి వెళ్లిపోయారు. ఇంతవరకూ తిరిగి రాలేదు. ఇప్పుడు మా పాపకు ఐదేళ్లు. నేను నా భర్త కోసం, నా కూతురు తన తండ్రి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాం. నేను తనని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. ఎందుకంటే నాకు తన పాస్‌పోర్ట్ నంబర్ తప్ప ఇతర వివరాలేమీ తెలియదు. ఎక్కడ పని చేస్తున్నాడో, ఎక్కడ నివసిస్తున్నాడో కూడా తెలీదు. తను ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి నేను ఏం చేయాలి? - ఓ బాధితురాలు, తిరుపతి నుంచి మీ పరిస్థితి నిజంగా బాధాకరమే. మీరే కాదు... చాలామంది అమ్మా యిలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నారై సంబంధాలు చేసుకుని మోసపోతున్నారు. భర్త కనీసం ఎక్కడున్నాడో కూడా తెలియక, అతడిని ఎలా చేరుకోవాలో అర్థం కాక విలవిల్లాడిపోతున్నారు. రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ కేసుల్ని డీల్ చేయడం పోలీసులకు కూడా కాస్త కష్టంగానే ఉంటోంది. ఒక పని చేయండి. మీరు వెంటనే ఒక లాయర్‌ను కానీ ఎవరైనా సామాజిక కార్యకర్తను కానీ సంప్ర దించండి. వారి సహాయంతో మీ పెళ్లి ఎక్కడైతే జరిగిందో, ఆ ఊరి పోలీస్ స్టేషన్లో ఓ కంప్ల యింట్ ఇవ్వండి. ఇండియాలో ఉన్న మీ భర్త బంధువుల ద్వారా అతడి ఆచూకీని తెలుసుకోవ డానికి ప్రయత్నించండి. వీలు కాకపోతే ఇండియాలో ఉన్న యూఎస్ ఎంబసీని సంప్రదించి, సమస్యను వివరించండి. తద్వారా చట్టబద్ధంగా అతని వివరాలు సంపాదించి, నోటీసులు పంపేందుకు వీలవుతుంది. కావాలంటే మరొకటి కూడా చేయవచ్చు. అతనితో మీ పెళ్లి జరిగిందని నిరూపించే ఫొటోలు, వీడియోలు... పాప అతని కూతురే అని నిరూపించే ఆధారాలతో యూఎస్ ఎంబసీని సంప్రదిస్తే... అమెరికా వచ్చేందుకు విజిటింగ్ వీసాని పొందవచ్చు. అమెరికా వచ్చి అతడిని వెతికే ప్రయత్నం చేయవచ్చు. లక్ష్మీ దేవినేని, చైర్పర్సన్, ‘తానా’ ఇమిగ్రేషన్ కమిటీ మీ సందేహాలు, సమస్యలను తెలియజేయాల్సిన చిరునామా... గైడ్, సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స్, రోడ్ నం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34 ఈ మెయిల్: guide.sakshi@gmail.com -
రాజసం తిరిగొస్తుందా ?
రాజస్థాన్ రాయల్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎప్పుడూ లో ప్రొఫైల్‌లో ఉండే జట్టు ఏదైనా ఉందంటే అది రాజస్థాన్ రాయల్సే. అంచనాలేమీ లేకుండానే బరిలోకి దిగడం. అనామకులతోనే ప్రత్యర్థికి చుక్కలు చూపించడంలో ఈ టీమ్‌ది అందెవేసిన చేయి. టి20లకు స్టార్లు అవసరం లేదని, నైపుణ్యం ఉన్న యువ క్రికెటర్లను స్టార్లను చేయొచ్చని రాజస్థాన్ చేసి చూపించింది. అంతేకాదు అత్యంత పొదుపైన జట్టు కూడా ఇదే. ఆటగాళ్లపై తక్కువగా ఖర్చుచేసి.. ఎక్కువగా ప్రతిఫలాన్ని పొందడం రాయల్స్ ఫ్రాంచైజీకి వెన్నతో పెట్టిన విద్య. ‘షేన్’ సెంటిమెంట్ ఫలించేనా? ఐపీఎల్ ఆరో సీజన్ వరకు రాజస్థాన్ జట్టును దిగ్గజ క్రికెటర్లు ముందుండి నడిపించారు. తొలుత ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్, ఆ తర్వాత భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్లుగా వ్యవహరించారు. వీరి ఆధ్వర్యంలో రాజస్థాన్ రాయల్స్ అంచనాలకు మించి రాణించింది. ఐపీఎల్-1లో రాయల్స్‌ను వార్న్ విజేతగా నిలపగా.. గత సీజన్లో చాంపియన్స్ లీగ్ టి20లో రన్నరప్‌గా నిలిచింది ద్రవిడ్ కెప్టెన్సీలోనే. అయితే ద్రవిడ్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పడంతో ఈసారి జట్టు యాజమాన్యం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్‌వాట్సన్‌కు పగ్గాలు అప్పగించింది. ఐపీఎల్ ఆరంభం నుంచి వాట్సన్ ఈ జట్టుతోనే ఉన్నాడు. దీంతో పాటు ‘షేన్’ సెంటిమెంట్ కలిసొస్తుందని యాజమాన్యం భావిస్తోంది. ఇక రాయల్స్ ఫ్రాంచైజీ షేన్ వాట్సన్‌తో పాటు జేమ్స్ ఫాల్క్‌నర్, అజింక్యా రహానె, సంజు శామ్సన్, స్టువర్ట్ బిన్నీలను కొనసాగించుకుంది. వేలంలో మరోసారి దేశవాళీ క్రికెటర్లకే పెద్దపీట వేసింది. అదే సమయంలో టి20లకు సరిగ్గా సరిపోయే విదేశీ ఆటగాళ్లను దక్కించుకుంది. వివాదాలకు కేరాఫ్... రాజస్థాన్ రాయల్స్‌ను ముందు నుంచీ వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2013 సీజన్లోనైతే ఈ జట్టు పతాక శీర్షికలకు ఎక్కింది. ఇందుకు కారణం రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇరుక్కోవడం.. అలాగే జట్టు యజమాని రాజ్‌కుంద్రాపై బెట్టింగ్ ఆరోపణలతో రాజస్థాన్ రాయల్స్ ఉక్కిరిబిక్కిరైంది. సుప్రీం గడప తొక్కిన ఈ వ్యవహారంలో సస్పెన్షన్ నుంచి కాస్తలో తప్పించుకుంది. బలాలు... షేన్ వాట్సన్‌తో పాటు మిగిలిన విదేశీ ఆటగాళ్లు రాజస్థాన్ రాయల్స్ ప్రధాన బలం. భారత ఆటగాడు అజింక్యా రహానే నిలకడైన ఆట.. ఎప్పటిలాగే యువ ఆటగాళ్లపైనే ఆధారపడటం రాయల్స్ బలాలుగా చెప్పవచ్చు. బలహీనతలు... విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడటం.. రహానేను మినహాయిస్తే భారత స్టార్లు లేకపోవడం. ముఖ్యంగా భారత జట్టుకు ఆడిన ప్రధాన బౌలర్లు లేకపోవడం బలహీనత. జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్ల్లు: అజింక్యా రహానే, స్టువర్ట్ బిన్నీ, అభిషేక్ నాయర్. విదేశీ క్రికెటర్లు: షేన్ వాట్సన్, జేమ్స్ ఫాల్క్‌నర్, స్టీవెన్ స్మిత్, బ్రాడ్ హాడ్జ్, కేన్ రిచర్డ్సన్, బెన్ కటింగ్ (ఆస్ట్రేలియా), టిమ్ సౌతీ(న్యూజిలాండ్), కెవాన్ కూపర్(వెస్టిండీస్). భారత దేశవాళీ క్రికెటర్లు: సంజు శామ్సన్, రజత్ భాటియా, ధావల్ కులకర్ణి, కరుణ్ నాయర్, ఉన్ముక్త్ చంద్, ఇక్బాల్ అబ్దుల్లా, దీపక్ హుడా, దిశాంత్ యాగ్నిక్, విక్రమ్‌జీత్ మాలిక్, అంకిత్ శర్మ, రాహుల్ తెవాటియా, అంకుశ్ బైన్స్, ఎ. మిశ్రా, ప్రవీణ్ తాంబే. -
విదేశీ ఉద్యో‘గాలం’
విశాఖపట్నం, న్యూస్‌లైన్: కువైట్ ఆయిల్ కంపెనీలో ఉద్యోగం. పెద్ద మొత్తంలో జీతం. ఇంకా మరెన్నో సదుపాయాలు.. అని నిరుద్యోగులకు ఆశ చూసి సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేసి పరారయ్యాడు ఓ వ్యక్తి. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన విక్టర్ ఫ్రెడ్డీ డిసౌజా ‘క్వీనీటెక్ క్విక్ సొల్యూషన్స్’ పేరిట నాలుగు నెలల క్రితం ద్వారకానగర్ అరుణోదయ కాంప్లెక్స్‌లో కార్యాలయం ప్రారంభించాడు. కువైట్‌లోని సీ డ్రిల్ ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలిప్పిస్తానని క్వికర్.కామ్, ఓఎల్ఎక్స్.కామ్, ట్విట్టర్.కామ్‌లో యాడ్స్ పోస్టు చేశాడు. రూ.30 వేల నుంచి రూ. 60 వేల వరకు జీతమని కంపెనీ ఫ్రొఫైల్ సైట్లో పొందుపరిచాడు. ఆకర్షితులైన బంగ్లాదేశ్, చెన్నై, బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది క్వీనీటెక్ ఉచ్చులో పడ్డారు. విశాఖకు చెందినవారు 25 మంది ఉన్నారు. వీరికి పలు దఫాలుగా ఇంటర్వ్యూలు, వైద్య పరీక్షలు నిర్వహించారు. పోస్టును బట్టి ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆన్లైన్ ద్వారా వసూలు చేశారు. సుమారు రూ. 6 కోట్లకు పైగా వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తొలుత ఈ నెల 5న, తరువాత 11న వీసాలు వస్తాయన్నారని పేర్కొన్నారు. 14న డెరైక్ట్‌గా పంపిస్తామని సంస్థ నుంచి ఫోన్ రావడంతో ద్వారకానగర్‌లోని సంస్థ కార్యాలయానికి వచ్చినట్టు తెలిపారు. ఇక్కడ డిసౌజా లేకపోవడం, ఫోన్ ఆపేసి ఉండటంతో హెచ్ఆర్ని బాధితులు నిలదీశారు. తనకు సంబంధం లేదని ఆమె చేతులెత్తేయడంతో బాధితులు కార్యాలయంపై డాడికి దిగారు. అనంతరం ద్వారకాజోన్ పోలీసులను ఆశ్రయించారు. సీఐ ఎలియాబాబు కేసు నమోదు చేశారు. కువైట్‌లో ఉద్యోగమని.. ట్విట్టర్లో యాడ్ చూశాను. కువైట్‌లో ఉద్యోగమని మా తమ్ముని కోసం రూ.లక్షన్నర కట్టాను. వీసా వచ్చేస్తుందంటూ రెండు వారాలుగా వాయిదా వేస్తున్నారు. గురువారం కచ్చితంగా నియామక ఉత్తర్వులు ఇస్తామన్నారు. తీరా డిసౌజా ఫోన్ ఆపేసి ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేశాం. -రవి, విశాఖపట్నం ఆకర్షణీయమైన జీతమని... క్వికర్‌లో యాడ్ చూశాను. కంపెనీ ప్రొఫైల్ చూసి నిజమని నమ్మాను. సీ డ్రిల్ కంపెనీలో ఆకర్షనీయమైన జీతమని డబ్బులు కట్టాను. ఎండీ డిసో జా పత్తా లేకుండా పోయాడు. హెచ్ఆర్ను నిలదీస్తే తాను ఉద్యోగినని...తనకెలాంటి సంబంధం లేదంటోంది. దీంతో పోలీసులను ఆశ్రయించాను. -సంతోష్‌కుమార్, అక్కయ్యపాలెం