
రవీంద్ర విజయ్.. ఇటు థియేటర్లలో.. అటు ఓటీటీలో ఎక్కడ చూసినా ఈయనే కనిపిస్తున్నాడు.

లేటెస్ట్‌గా రఘు తాతలో కీర్తి సురేష్ జోడిగా సెల్వన్ క్యారెక్టర్‌లో, త్రిష బృందాలో ఎస్సై సారథి పాత్రలో కనిపించారీయన.

అంతకు ముందు.. ఆరంభం, మంగళవారం, కీడా కోలా.. ఇలా తెలుగు చిత్రాలతో పాటు అటు కోలీవుడ్, మాలీవుడ్‌లోనూ రోల్స్ దక్కించుకుంటున్నారు

బెంగళూరులో పుట్టి పెరిగిన రవీంద్ర విజయ్.. ఒకప్పుడు డాక్టర్. ఎంబీబీఎస్ చదివే టైంలో యాక్టింగ్‌ను హాబీగా మల్చుకున్నారు

వైద్య వృత్తిని కొనసాగిస్తూనే.. థియేటర్ ఆర్టిస్ట్‌గా కొన్ని వీధి నాటకాల్లోనూ నటించారు.

యాక్టింగ్‌పై ఫుల్ ఫోకస్‌తో డాక్టర్ వృత్తిని వదిలేశారు.. ఆ తర్వాతే ఆయనకు సినిమా కష్టాలు మొదలయ్యాయి

ఒకవైపు సినిమా ఛాన్స్‌ల కోసం కాళ్లు అరిగేలా ఫిల్మ్‌మేకర్స్ చుట్టూ చాలా ఏండ్లు తిరిగారు. అదే టైంలో బతకడం కోసం చిన్నాచితక పనులు చేశారు.

అయితే ఫుల్ టైం థియేటర్ యాక్టర్‌గా మారాక.. ఆయనకు అవకాశాలు రావడం పెరిగాయి.

సుధా కొంగర ఇరుది సుట్రూ ఆయన తొలి చిత్రం. కోలీవుడ్‌లోనే ఒడు రాజా ఒడు(2018)తో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది.

తెలుగులో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య తొలి చిత్రం. అందులో జోగ్‌నాథ్ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఒకవైపు చిత్రాలతో పాటు ది ఫ్యామిలీ మ్యాన్, యాంగర్ టేల్స్, నాగ చైతన్య దూత, అంజలి బహిష్కరణ లాంటి ఓటీటీ సిరీస్‌లలో నటించి మెప్పించారీయన.

ప్రస్తుతం తెలుగుతో పాటు మిగతా భాషల అగ్రహీరోల చిత్రాల్లోనూ ఆయనకు అవకాశాలు దక్కుతున్నాయి