ఆ పుర్రె షీనా ముఖాకృతితో సరిపోలింది! | Sheena Bora murder: Digital superimposition of profile matches skull | Sakshi
Sakshi News home page

ఆ పుర్రె షీనా ముఖాకృతితో సరిపోలింది!

Published Sat, Sep 5 2015 1:50 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

రాయ్‌గఢ్ అడవుల్లో స్వాధీనం చేసుకున్న కపాలంతో కన్నతల్లి ఇంద్రాణి ముఖర్జియా చేతిలో హత్యకు గురైన షీనాబోరా ముఖ రేఖాకృతి సరిపోలినట్లు తమ డిజిటల్ సూపరింపొజిషన్‌లో తేలిందని శుక్రవారం ముంబై పోలీసులు వెల్లడించారు.

ముంబై: రాయ్‌గఢ్ అడవుల్లో స్వాధీనం చేసుకున్న కపాలంతో కన్నతల్లి ఇంద్రాణి ముఖర్జియా చేతిలో హత్యకు గురైన షీనాబోరా ముఖ రేఖాకృతి సరిపోలినట్లు తమ డిజిటల్ సూపరింపొజిషన్‌లో తేలిందని శుక్రవారం ముంబై పోలీసులు వెల్లడించారు. అలాగే, ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను తామింకా నిర్దోషిగా తేల్చలేదన్నారు. అయితే, ఆయనను ఈ కేసులో ఇంకా నిందితుడిగా కూడా చేర్చలేదు. షీనా హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్, పీటర్, షీనా తండ్రి సిద్ధార్థ్ దాస్ తదితరులను ఖార్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం కూడా సుదీర్ఘంగా విచారించారు. తొలిసారి ఇంద్రాణి, ఖన్నాల కూతురు విధిని కూడా కాసేపు ప్రశ్నించి పంపించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement