షీనా సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు | carries out searches at nine locations Sheena Bora murder case by cbi | Sakshi
Sakshi News home page

షీనా సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు

Published Mon, Oct 19 2015 12:31 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM

షీనా సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు

షీనా సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు

ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. సోమవారం ముంబయి, కోల్ కతా, గువాహటి వంటి తొమ్మిది చోట్ల విస్తృతంగా సోదాలు నిర్వహించింది. షీనా సోదరి మిఖెయిల్ బోరా ఇంట్లో కూడా సోదా చేసింది. అయితే, కేసు దర్యాప్తులో భాగంగానే తన ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించిందని, తాను దర్యాప్తు అన్ని విధాల సహకరిస్తానని చెప్పాడు.

ఈ కేసులో ప్రధాన నిందితులై ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మొదటి భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ తో పాటు మరికొందరు అనుమానితులకు సంబంధించిన ప్రాంతాల్లో కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాల కోసం గాలింపులు చేపట్టినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. తన కూతురు షీనా బోరాను తాను హత్య చేయలేదని తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ హతమార్చారని సీబీఐకి ఇంద్రాణి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ కేసు విచారణను మరింత వేగవంతం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement