indrani mukhrjia
-
షీనా సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. సోమవారం ముంబయి, కోల్ కతా, గువాహటి వంటి తొమ్మిది చోట్ల విస్తృతంగా సోదాలు నిర్వహించింది. షీనా సోదరి మిఖెయిల్ బోరా ఇంట్లో కూడా సోదా చేసింది. అయితే, కేసు దర్యాప్తులో భాగంగానే తన ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించిందని, తాను దర్యాప్తు అన్ని విధాల సహకరిస్తానని చెప్పాడు. ఈ కేసులో ప్రధాన నిందితులై ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మొదటి భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ తో పాటు మరికొందరు అనుమానితులకు సంబంధించిన ప్రాంతాల్లో కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాల కోసం గాలింపులు చేపట్టినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. తన కూతురు షీనా బోరాను తాను హత్య చేయలేదని తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ హతమార్చారని సీబీఐకి ఇంద్రాణి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ కేసు విచారణను మరింత వేగవంతం చేసింది. -
'షీనాను చంపింది నేను కాదు.. ఆయనే'
-
'షీనాను చంపింది నేను కాదు.. ఆయనే'
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన తన కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా సీబీఐకి కీలక వివరణ ఇచ్చినట్లు తెలిసింది. తన కూతురు షీనా బోరాను తాను చంపలేదని, తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ హతమార్చారని సీబీఐకి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. బాంద్రాలో సంజీవ్ ఖన్నాతో ఏర్పాటుచేసిన ఓ డిన్నర్ కార్యక్రమానికి షీనాబోరాను ఇంద్రాణి ఆహ్వానించినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. సీబీఐ అధికారులకు ఇంద్రాణి ఇచ్చిన వివరాల ప్రకారం షీనా పెరుగుతున్న తీరును ఖన్నాను కలవరపెట్టిందని, ముఖ్యంగా ఆమె తన భర్త పీటర్ ముఖర్జియా కుమారుడితో సంబంధం పెట్టుకోవడం అతడికి ఏమాత్రం నచ్చలేదని, తన సొంత కూతురుపై ఆ ప్రభావం పడుతుందేమోననే భయంతో హత్య చేశాడు. ఈ హత్యకు తనకు ఏ సంబంధం లేదని, సంజీవ్ ఖన్నా, డ్రైవర్ మాత్రం హత్యచేశారని వివరణ ఇచ్చింది. మరోపక్క, ఏ విధమైన విచారణకైనా తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని, వివరాలు తెలియజేస్తానని కూడా ఆమె చెప్పినట్లు సమాచారం.