'షీనాను చంపింది నేను కాదు.. ఆయనే' | Indrani Mukerjea claims innocence, tells CBI that ex-husband killed Sheena | Sakshi
Sakshi News home page

'షీనాను చంపింది నేను కాదు.. ఆయనే'

Published Wed, Oct 14 2015 11:11 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

'షీనాను చంపింది నేను కాదు.. ఆయనే'

'షీనాను చంపింది నేను కాదు.. ఆయనే'

ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన తన కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా సీబీఐకి కీలక వివరణ ఇచ్చినట్లు తెలిసింది. తన కూతురు షీనా బోరాను తాను చంపలేదని, తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ హతమార్చారని సీబీఐకి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. బాంద్రాలో సంజీవ్ ఖన్నాతో ఏర్పాటుచేసిన ఓ డిన్నర్ కార్యక్రమానికి షీనాబోరాను ఇంద్రాణి ఆహ్వానించినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

సీబీఐ అధికారులకు ఇంద్రాణి ఇచ్చిన వివరాల ప్రకారం షీనా పెరుగుతున్న తీరును ఖన్నాను కలవరపెట్టిందని, ముఖ్యంగా ఆమె తన భర్త పీటర్ ముఖర్జియా కుమారుడితో సంబంధం పెట్టుకోవడం అతడికి ఏమాత్రం నచ్చలేదని, తన సొంత కూతురుపై ఆ ప్రభావం పడుతుందేమోననే భయంతో హత్య చేశాడు. ఈ హత్యకు తనకు ఏ సంబంధం లేదని, సంజీవ్ ఖన్నా, డ్రైవర్ మాత్రం హత్యచేశారని వివరణ ఇచ్చింది. మరోపక్క, ఏ విధమైన విచారణకైనా తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని, వివరాలు తెలియజేస్తానని కూడా ఆమె చెప్పినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement