ఏమాత్రం కనిపించని పశ్చాత్తాపం
అశ్లీలచిత్రాలకు అలవాటుపడ్డాడు
సైకో అనాలసిస్ పరీక్ష తర్వాత సీబీఐ
న్యూఢిల్లీ/ కోల్‌కతా: ట్రైనీ పీజీ డాక్టర్ హత్యాచారం కేసులో ప్ర ధాన నిందితుడైన సంజయ్ రాయ్ పశుప్రవృత్తిని కలిగి ఉన్నాడని సైకో అనాలసిస్ పరీక్షలో తేలింది. వైద్యురాలిపై పాశవిక రేప్, హత్యపై అతనిలో కించిత్తు కూడా పశ్చాత్తాపం లేదని, అశ్లీల చిత్రాలు విపరీతంగా చూస్తాడని సైకో అనాలసిస్‌లో తేలిందని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. “అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. రేప్, హత్యను ప్రతి చిన్న అంశంతో సహా పూసగుచ్చినట్లు వివరించాడు.
ఏమాత్రం సంకోచించలేదు’అని సీబీఐ అధికారి చెప్పారు. సంజయ్ రాయ్ మొబైల్ ఫోన్‌లో పలు అశ్లీల చిత్రాలు పోలీసులకు లభించిన విషయం తెలిసిందే. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలు సంజయ్ రాయ్ ఘటనా స్థలి (ఆర్.జి.కర్ ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్) వద్ద ఉన్నట్లు నిరూపిస్తున్నాయని సీబీఐ తెలిపింది. హత్యాచారం జరిగిన ఆగస్టు 8న అర్ధరాత్రి దాటాక సంజయ్ రాయ్ తప్పతాగి ఉత్తర కోల్‌కతాలోని వేశ్యావాటికను సందర్శించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అక్కడ ఒక మహిళను నగ్న చిత్రాన్ని అడిగాడు.
ఆగస్టు 9న వేకువజామున 4 గంటల ప్రాంతంలో సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నట్లు సీసీటీవీల్లో రికార్డైంది. జీన్స్ ప్యాంట్, టీ షర్టు ధరించిన అతని చేతిలో పోలీసు హెల్మెట్ ఉంది. రాయ్ కోల్‌కతా పోలీసు సివిల్ వాలంటీర్ అనే విషయం తెలిసిందే. రాయ్ మెడచుట్టూ బ్లూటూత్ డివైస్ సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. తర్వాత ఇదే బ్లూటూత్ డివైస్ క్రైమ్ సీన్‌లో లభించింది. దర్యాప్తులో కీలకంగా మారింది. సంజయ్‌రాయ్‌కు సంబంధించిన డీఎన్‌ఏ పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
సందీప్ ఘోష్‌కు లై డిటెక్టర్ టెస్టు
ఆర్.జి.కర్ ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకల కేసును కలకత్తా హైకోర్టు శుక్రవారం సీబీఐకి బదిలీ చేసింది. ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అప్పగించాలని ఆసుపత్రి మాజీ డిప్యూ టీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ వేయడంతో హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. మూడు వారాల్లో పురోగతి నివేదిక సమరి్పంచాలని ఆదేశిస్తూ కేసును సెపె్టంబరు 17కు వాయిదా వేసింది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ఐదుగురికి లై డిటెక్టర్ పరీక్షలు చేయడానికి స్థానిక కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. అలాగే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై పాలిగ్రాఫ్ పరీక్షకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. మరోవైపు బీజేపీ కార్యాకర్తలు బెంగాల్ వ్యాప్తంగా పోలీసుస్టేషన్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment