ఆర్‌జీ కార్ ఆసుపత్రి ఘటనపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం
కోల్‌కతా: ఆర్‌జీ కార్ ప్రభుత్వ ఆసుపత్రిలో దుండగులు సృష్టించిన విధ్వంసకాండపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ అధికార యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆక్షేపించింది. ఆసుపత్రిలో దాడి ఘటనపై వివరణ ఇవ్వాలని, వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని పోలీసులు, ఆసుపత్రి వర్గాలను ఆదేశించింది. ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.శివాజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
విధ్వంసాన్ని పోలీసు నిఘా వర్గాలు ఎందుకు పసిగట్టలేకపోయాయని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత అసలేం జరిగిందో చెప్పాలని అధికారులను ఆదేశించారు. వైద్యురాలి మృతదేహం కనిపించిన గదిని శుభ్రం చేసి, రంగులు వేయాల్సిన అవసరం ఏమొచి్చందని నిలదీశారు. ఆసుపత్రిని మూసివేయాలని ఆదేశాలు ఇవ్వగలమని స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనలో విచారణ పురోగతిని వివరించాలని, మధ్యంతర నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment