doctor raped
-
‘కోల్‌కతా’ నిందితునికి ముగిసిన లై డిటెక్టర్ పరీక్ష
న్యూఢిల్లీ: కోల్‌కతాలో ఆర్జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలి దారుణ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ఆదివారం లై డిటెక్షన్ పరీక్ష నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. కోల్‌కతాలో ప్రెసిడెన్సీ కారాగారంలోనే పరీక్ష పూర్తిచేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీ నుంచి పాలిగ్రఫీ నిపుణులు కోల్‌కతాకు వచ్చారు.మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు హతురాలితో పాటు పనిచేసే నలుగురు వైద్యులకు శనివారమే లై డిటెక్షన్ టెస్ట్ చేశారు. ఆ పరీక్షలో వాళ్లు ఏమేం చెప్పారనే వివరాలను పోలీసులు బయట పెట్టలేదు. సత్యశోధన పరీక్షలో వీళ్లు చెప్పిన అంశాలను సాక్ష్యాధారాలుగా కోర్టులో ప్రవేశపెట్టేందుకు చట్టపరంగా అనుమతి లేనప్పటికీ కేసు దర్యాప్తులో ఆ వివరాలు ఎంతో ఉపయోగపడతాయి.ఘోష్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కర్ వైద్య కళాశాలకు ప్రిన్సిపల్‌గా ఉండగా సందీప్ ఘోష్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ ఆదివారం ఆకస్మిక సోదాలు చేపట్టింది. ఉదయమే కేంద్ర బలగాలతో ఘోష్ ఇంటికి వెళ్లిన అధికారులు డోర్లు తెరవకపోవడంతో చాలాసేపు వేచి చూడాల్సి వచి్చంది. మాజీ మెడికల్ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ వశిష్్ట, మరో ప్రొఫెసర్, ఇంకో 12 మందికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు. ఆస్పత్రికి ఔషధాలు, ఇతర ఉపకరణాలను సరఫరాచేసే వారి ఆఫీసుల్లో సోదాలు చేశారు. -
నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రగిలి్చన వైద్యురాలి రేప్, హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించడానికి సోమవారం స్థానిక కోర్టు అనుమతించింది. ఆర్జి కార్ ఆసుపత్రిలో పీజీ ట్రైనీ డాక్టర్‌ను అత్యంత పాశవికంగా రేప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడికి ఏరోజు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలనేది సీబీఐ ఇంకా ఖరారు చేయలేదు. సంజయ్ రాయ్ మానసిక స్థితిని తెలుసుకోవడానికి సీబీఐ ఇదివరకే సైకోఅనాలసిస్ టెస్టు చేసింది. మరోవైపు కోల్‌కతా పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అసత్య ప్రచారాన్ని అడ్డుకునేందుకేనని పోలీసులు చెబుతుండగా, నిరసనకారుల గళం నొక్కేందుకేనని విపక్షాలు మండిపడుతున్నాయి. వైద్యురాలి హత్యపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సీనియర్ డాక్టర్లు కునాల్ సర్కార్, సువర్ణ గోస్వామిలకు సమన్లు జారీ చేయడంతో వారు భారీ ర్యాలీతో కోల్‌కతా పోలీసు కేంద్ర కార్యాలయానికి వచ్చారు. వైద్య రంగానికి చెందిన వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘యువ డాక్టర్‌కు న్యాయం కోరుతున్నాం. మేమేమీ నేరం చేయలేదు. పోలీసులు తమ సమన్లను వెనక్కి తీసుకున్నారు. వైద్య పరివారం సహకారాన్ని కోరారు’ అని డాక్టర్ కునాల్ సర్కార్ తెలిపారు. సీఎం మమతా బెనర్జీని బెదిరించినందుకు, బాధితురాలి పేరును సోషల్ మీడియాలో బహిర్గతపర్చినందుకు పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఆర్జి కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ వరుసగా నాలుగోరోజు కూడా విచారించింది. మరోవైపు దేశ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరసనలు సోమవారం కూడా కొనసాగాయి. కేంద్ర ఆరోగ్యశాఖతో సోమవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయని, అంగీకారయోగ్యమైన ఒప్పందానికి రాలేకపోయామని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) వెల్లడించింది. వైద్యుల సమ్మె కొనసాగుతుందని ప్రకటించింది. నేడు సుప్రీంకోర్టు విచారణ దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె, తీవ్ర ఆగ్రహావేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం పీజీ డాక్టర్ హత్యోదంతంపై సుమోటోగా విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10:30 గంటలకు విచారణ చేపడుతుంది. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సలె్టంట్స్ ఆఫ్ ఇండియా (ఫామ్కీ), ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా)లు సుమోటో కేసులో తమను భాగస్వాములను చేయాలని సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు, వైద్యురాలి హత్యోదంతంలో పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బదనాం చేస్తూ, రాజీనామా చేయాలని ఆమెవైపు వేలెత్తి చూపుతున్న వారి వేలు విరిచివేయాలని సీనియర్ మంత్రి ఉదయన్ గుహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మమతపై దాడి చేస్తూ ఆమెను వేలెత్తి చూపుతున్న వారు. రాజీనామాకు డిమాండ్ చేస్తున్న వారు ఎప్పటికీ సఫలం కాలేరు. మమత వైపు ఎత్తిన వేళ్లను విరిచేస్తాం’ అని ఉదయన్ అంటున్న వీడియో వైరల్‌గా మారింది. -
అధికార యంత్రాంగం వైఫల్యం వల్లే విధ్వంసం
కోల్‌కతా: ఆర్జీ కార్ ప్రభుత్వ ఆసుపత్రిలో దుండగులు సృష్టించిన విధ్వంసకాండపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ అధికార యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆక్షేపించింది. ఆసుపత్రిలో దాడి ఘటనపై వివరణ ఇవ్వాలని, వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని పోలీసులు, ఆసుపత్రి వర్గాలను ఆదేశించింది. ఆర్జీ కార్ ఆసుపత్రిలో విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.శివాజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విధ్వంసాన్ని పోలీసు నిఘా వర్గాలు ఎందుకు పసిగట్టలేకపోయాయని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత అసలేం జరిగిందో చెప్పాలని అధికారులను ఆదేశించారు. వైద్యురాలి మృతదేహం కనిపించిన గదిని శుభ్రం చేసి, రంగులు వేయాల్సిన అవసరం ఏమొచి్చందని నిలదీశారు. ఆసుపత్రిని మూసివేయాలని ఆదేశాలు ఇవ్వగలమని స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనలో విచారణ పురోగతిని వివరించాలని, మధ్యంతర నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు. -
Mamata Banerjee: మరో బంగ్లాదేశ్ చేద్దామనుకుంటున్నారు
కోల్‌కతా: వైద్యురాలి రేప్, హత్యపై విపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, విద్యార్థులను ఎగదోసి బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు సృష్టించాలని అనుకుంటున్నాయని సీపీఎం, బీజేపీలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఆర్జి కార్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి అవరణలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై తమకేమీ అభ్యంతరం లేదని, సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని, కేసు త్వరితగతిన తేలాలనేదే తమ అభిమతమని పేర్కొన్నారు. ‘వైద్యురాలి కుటుంబానికి అండగా నిలువాల్సిందిపోయి సీపీఎం, బీజేపీలు చవకబారు రాజకీయాలు చేస్తున్నాయి. బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి ఇక్కడా తేగలమని వారు అనుకుంటున్నారు. నేనొకటే చెప్పదలచుకున్నాను. నాకు అధికార వ్యామోహం లేదు’ అని మమత అన్నారు. హత్య గురించి తెలియగానే రాత్రంతా కేసును పర్యవేక్షించానని, పోలీసు కమిషనర్‌తో, బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడానని వివరించారు. మేము ఏం చేయలేదో చెప్పండి? ఏం చర్యలు తీసుకోలేదో చెప్పండి? అని విపక్షాలపై మండిపడ్డారు. ‘డీఎన్ఏ పరీక్ష, సీసీటీవీ ఫుటేజిని సేకరించడం, శాంపిల్స్‌ను పరీక్షించడం.. ఇలా ప్రతిదీ 12 గంటల్లోపే జరిగింది. నిందితుడిని కూడా 12 గంటల్లోనే అరెస్టు చేశాం’ అని చెప్పుకొచ్చారు. సీబీఐ ఆదివారం లోగా కేసును చేధించాలని డిమాండ్ చేశారు. కోల్‌కతా పోలీసులు 90 శాతం దర్యాప్తును పూర్తి చేశారన్నారు. దోషులను ఉరి తీయాలన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలనే డిమాండ్‌తో స్వయంగా తాను శుక్రవారం కోల్‌కతా వీధుల్లో నిరసన ప్రదర్శన చేయనున్నట్లు వెల్లడించారు. నిందితుడిని రక్షించే ప్రయత్నం: రాహుల్ వైద్యురాలి రేప్, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరగడం ఆసుపత్రిపై, అధికార యంత్రాంగంపై పలు సందేహాలకు తావిస్తోందన్నారు. డాక్టర్లలో, మహిళల్లో అభద్రతాభావం నెలకొందన్నారు. ‘‘మెడికల్ కాలేజీలోనే డాక్టర్లకు భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువు కోసం ఎలా పంపిస్తారు? నిర్భయ వంటి కఠినచట్టాలు కూడా ఇలాంటి నేరాలను ఎందుకు ఆపలేకపోతున్నాయి?’’ అని ప్రశ్నించారు. -
శిక్షపడేదాకా నిరసన బాటే!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో వైద్యురాలిపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. ‘‘విచారణ సత్వరమే పూర్తై దోషులకు కఠిన శిక్ష పడాలి. బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలి. అప్పటిదాకా అన్ని రకాల వైద్య సేవలనూ నిలిపేస్తున్నాం’’ అని ప్రకటించారు. కోల్‌కతాతో పాటు ఢిల్లీ, ముంబై, చండీగఢ్, లఖ్‌నవూ తదితర అన్ని నగరాల్లోనూ సిబ్బంది రోడ్లపైకొచ్చారు. వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఎయిమ్స్ వంటి ప్రఖ్యాత వైద్య సంస్థల సిబ్బంది కూడా ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. రంగంలోకి మహిళా కమిషన్ కోల్తాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాన్ఫరెన్స్ హాల్లోనే ఓ వైద్యురాలిపై సంజయ్రాయ్ అనే పౌర వలంటీర్ గురువారం దారుణంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడటం తెలిసిందే. ఈ దారుణం శుక్రవారం వెలుగు చూసింది. దీనిపై బెంగాల్లో మొదలైన నిరసనలు, ఆందోళనలు అన్నిచోట్లకు పాకాయి. దాంతో నాలుగు రోజులుగా దేశమంతా అట్టుడుకుతోంది. బెంగాల్లోనైతే వైద్య సేవలు పూర్తిగా పడకేశాయి. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ ఆఫ్ ఇండియా (ఫోర్డా) తదితర సంఘాలు సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించాయి. కేసు దర్యాప్తుకు జాతీయ మహిళా కమిషన్ కూడా కోల్‌కతా చేరుకుంది. పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై మంగళవారం విచారణ జరగనుంది. కోల్‌కతాలో మెడికల్ కాలేజీ నుంచి జరిగిన భారీ ర్యాలీలో ప్రముఖ నటీనటులు రిద్ధీ సేన్, సురాంగనా బంధోపాధ్యాయ, కౌశిక్ సేన్, చైతీ ఘోషాల్ తదితరులు పాల్గొన్నారు. వైద్యులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.వారంలో ఛేదించకుంటే సీబీఐకి: మమత వైద్యురాలి కేసును ఆదివారంలోగా ఛేదించాలని బెంగాల్ పోలీసులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. ‘‘ఈ దారుణం వెనక ఆస్పత్రి లోపలి వ్యక్తుల హస్తం కూడా ఉందని వైద్యురాలి కుటుంబం అనుమానిస్తోంది. వారెవరో కనిపెట్టి ఆదివారం లోపు అందరినీ అరెస్టు చేయాలి. లేని పక్షంలో కేసును సీబీఐకి అప్పగిస్తా’’ అని ప్రకటించారు. సోమవారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నిజానికి పలు కేసుల దర్యాప్తులో సీబీఐ చేసిందేమీ పెద్దగా లేదంటూ పెదవి విరిచారు. అయినా అవసరమైతే ఈ కేసును దానికి అప్పగిస్తామన్నారు. తీవ్రత దృష్ట్యా ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. మమత డెడ్‌లైన్ నేపథ్యంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మీడియాతో మాట్లాడారు. నాలుగైదు రోజుల్లో దోషులందరినీ పట్టుకుంటామన్నారు. ఈ దారుణం గురించి తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని తృణమూల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.నన్ను ఉరి తీసుకోండి: నిందితుడు దారుణానికి పాల్పడ్డ సంజయ్ రాయ్‌లో పశ్చాత్తాపమే లేదని పోలీసులంటున్నారు. విచారణలో నేరం అంగీకరించడమే గాక, ‘కావాలంటే ఉరి తీసుకొ’మ్మని అన్నట్టు తెలుస్తోంది. రాయ్ ఆసుపత్రి ఉద్యోగి కాదు. కోల్‌కతా పోలీసు శాఖలో పౌర వలంటీర్‌గా ఆస్పత్రిలోని పోలీస్ ఔట్‌పోస్టులో పని చేస్తున్నాడు. అడ్మిషన్ కోసం రోగుల నుంచి డబ్బు వసూలు చేసేవాడు. కోల్‌కతా పోలీస్ (కేపీ) అని రాసున్న టీ షర్ట్‌తో తిరుగుతున్నాడు. అతని బైక్‌కు కూడా కేపీ ట్యాగ్ ఉంది. రాయ్ మొబైల్ ఫోన్ నిండా అశ్లీల దృశ్యాలే ఉన్నట్టు తెలిసింది.ప్రిన్సిపాల్ రాజీనామా..వైద్యురాలి హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ సోమవారం రాజీనామా చేశారు. తనపై వస్తున్న విమర్శలను, అవమానాన్ని భరించలేనన్నారు. ‘‘బాధితురాలినే నిందితురాలిగా చిత్రిస్తూ నేను వ్యాఖ్యలు చేశాననడం అబద్ధం. ఆమె నా కూతురి వంటిది. నేనూ ఓ తండ్రినే’’ అన్నారు. -
మాజీ మంత్రి అరెస్టుకు స్పీకర్ పచ్చజెండా
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్ అరెస్టుకు అక్కడి అసెంబ్లీ స్పీకర్ ముబారక్ గుల్ తన ఆమోదం తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఆయన అనుమతి మంజూరు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఖాన్, సదరు మహిళా వైద్యురాలిని తన కార్యాలయానికి పిలిపించుకుని, ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనను వెంటనే అరెస్టు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరు కావడంతో పాటు, మాజీ మంత్రిని ఆదివారంలోగా అరెస్టు చేయని పక్షంలో అత్యవసర సర్వీసులు సహా అన్ని రకాల విధులను ఆపేస్తామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఖాన్ ఎమ్మెల్యే కావడంతో ఆయనను అరెస్టు చేయాలంటే స్పీకర్ అనుమతి తప్పనిసరి. అందుకోసమే వారు జమ్ము కాశ్మీర్ స్పీకర్‌ను సంప్రదించగా, ఆయన వెంటనే అరెస్టుకు ఆమోదం తెలిపారు. అత్యాచార ఆరోపణలు రావడంతో ఖాన్ తన మంత్రిపదవికి గత శుక్రవారమే రాజీనామా చేశారు. -
'ఆ' మంత్రిని అరెస్టు చేయండి: వైద్యులు
మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ అక్కడి వైద్యులు భారీగా నిరసన ప్రదర్శన చేశారు. శ్రీనగర్ నగరంలోని అన్ని ఆస్పత్రులలోనూ తమ రోజువారీ విధులకు గైర్హాజరయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఖాన్, సదరు మహిళా వైద్యురాలిని తన కార్యాలయానికి పిలిపించుకుని, ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనను వెంటనే అరెస్టు చేయాలంటూ వైద్యులు నినాదాలు చేస్తూ తమ తమ ఆస్పత్రుల వద్దే నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అత్యాచార ఆరోపణలు రావడంతో ఖాన్ తన మంత్రిపదవికి శుక్రవారం నాడు రాజీనామా చేశారు. ఈ కేసులో దోషిని కఠినంగా శిక్షించేవరకు తమ నిరసనలు ఆగేది లేదని కాశ్మీర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు నిస్సారుల్ హసన్ తెలిపారు. తాము ఆస్పత్రులలో ఎమర్జెన్సీ వార్డులు, కాజువాలిటీ సర్వీసులను మాత్రమే కొనసాగిస్తున్నామని, ఆదివారంలోగా మంత్రిని అరెస్టు చేయకపోతే అత్యవసర సర్వీసులు సహా అన్ని రకాల విధులను ఆపేస్తామని హెచ్చరించారు.