Roy
-
నిందితుడు సంజయ్‌ది పశు ప్రవృత్తి
న్యూఢిల్లీ/ కోల్‌కతా: ట్రైనీ పీజీ డాక్టర్ హత్యాచారం కేసులో ప్ర ధాన నిందితుడైన సంజయ్ రాయ్ పశుప్రవృత్తిని కలిగి ఉన్నాడని సైకో అనాలసిస్ పరీక్షలో తేలింది. వైద్యురాలిపై పాశవిక రేప్, హత్యపై అతనిలో కించిత్తు కూడా పశ్చాత్తాపం లేదని, అశ్లీల చిత్రాలు విపరీతంగా చూస్తాడని సైకో అనాలసిస్‌లో తేలిందని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. “అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. రేప్, హత్యను ప్రతి చిన్న అంశంతో సహా పూసగుచ్చినట్లు వివరించాడు.ఏమాత్రం సంకోచించలేదు’అని సీబీఐ అధికారి చెప్పారు. సంజయ్ రాయ్ మొబైల్ ఫోన్లో పలు అశ్లీల చిత్రాలు పోలీసులకు లభించిన విషయం తెలిసిందే. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలు సంజయ్ రాయ్ ఘటనా స్థలి (ఆర్.జి.కర్ ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్) వద్ద ఉన్నట్లు నిరూపిస్తున్నాయని సీబీఐ తెలిపింది. హత్యాచారం జరిగిన ఆగస్టు 8న అర్ధరాత్రి దాటాక సంజయ్ రాయ్ తప్పతాగి ఉత్తర కోల్‌కతాలోని వేశ్యావాటికను సందర్శించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అక్కడ ఒక మహిళను నగ్న చిత్రాన్ని అడిగాడు. ఆగస్టు 9న వేకువజామున 4 గంటల ప్రాంతంలో సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నట్లు సీసీటీవీల్లో రికార్డైంది. జీన్స్ ప్యాంట్, టీ షర్టు ధరించిన అతని చేతిలో పోలీసు హెల్మెట్ ఉంది. రాయ్ కోల్‌కతా పోలీసు సివిల్ వాలంటీర్ అనే విషయం తెలిసిందే. రాయ్ మెడచుట్టూ బ్లూటూత్ డివైస్ సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. తర్వాత ఇదే బ్లూటూత్ డివైస్ క్రైమ్ సీన్లో లభించింది. దర్యాప్తులో కీలకంగా మారింది. సంజయ్‌రాయ్‌కు సంబంధించిన డీఎన్ఏ పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. సందీప్ ఘోష్‌కు లై డిటెక్టర్ టెస్టు ఆర్.జి.కర్ ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకల కేసును కలకత్తా హైకోర్టు శుక్రవారం సీబీఐకి బదిలీ చేసింది. ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అప్పగించాలని ఆసుపత్రి మాజీ డిప్యూ టీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ వేయడంతో హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. మూడు వారాల్లో పురోగతి నివేదిక సమరి్పంచాలని ఆదేశిస్తూ కేసును సెపె్టంబరు 17కు వాయిదా వేసింది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ఐదుగురికి లై డిటెక్టర్ పరీక్షలు చేయడానికి స్థానిక కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. అలాగే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై పాలిగ్రాఫ్ పరీక్షకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. మరోవైపు బీజేపీ కార్యాకర్తలు బెంగాల్ వ్యాప్తంగా పోలీసుస్టేషన్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
పాక్ బాంబు దాడికి బలైన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? ఆ రోజు ఏం జరిగింది?
ఆయన గుజరాత్ రెండో ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ పితామహునిగానూ పేరొందారు. ఆయనే బల్వంత్ రాయ్ మెహతా. భారత్- పాక్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికుల చేతిలో హతమైన ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతి గడించారు. 1965వ సంవత్సరంలో ఆయన మరణించారు. 1965, సెప్టెంబరు 19 న ఇండో-పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో నాటి గుజరాత్ సీఎం బల్వంత్రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ఛాపర్ బీచ్‌క్రాఫ్ట్ భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లోని కచ్ మీదుగా వెళుతోంది. ఈ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం సీఎం ప్రయాణిస్తున్న ఛాపర్‌పై బాంబు దాడి చేసింది. ఈ ప్రమాదంలో మెహతాతో పాటు మరో ఏడుగురు మరణించారు. వీరిలో ఆయన భార్య సరోజ్‌బెన్, ఒక జర్నలిస్టు కూడా ఉన్నారు. ఆ రోజు సీఎం బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ఛాపర్ మిథాపూర్ నుండి కచ్‌కి బయలుదేరిన వెంటనే, దానిని పాకిస్తాన్ ఫైటర్ పైలట్ కైస్ హుస్సేన్ అడ్డగించాడు. పాకిస్తాన్ ఛాపర్ అడ్డగించడం చూసిన భారత పైలెట్ బీచ్‌క్రాఫ్ట్ ఫ్యాన్ రెక్కలను కదిలించాడు. ఇది దయ చూపించి, విడిచిపెట్టాలని కోరుతూ చేసిన సూచన. అయితే అప్పటికి పాక్ పైలట్ గాలిలోకి రెండుసార్లు కాల్పులు జరిపాడు. అవి బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న బీచ్క్రాఫ్ట్ను తాకాయి. అంతే.. హఠాత్తుగా బీచ్‌క్రాఫ్ట్ పేలిపోయి, నేల మీదకు ఒరిగిపోయింది. పలు నివేదికలలోని వివరాల ప్రకారం 25 ఏళ్ల వయసు కలిగిన పాకిస్తాన్ పైలెట్ హుస్సేన్ ఆ రోజు 20 వేల అడుగుల ఎత్తులో తన ఛాపర్‌తో భారత గగనతలంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో నాటి గుజరాత్ సీఎం ప్రయాణిస్తున్న బీచ్క్రాఫ్ట్ను గుజరాత్ ప్రభుత్వ చీఫ్ పైలట్ జహంగీర్ నడుపుతున్నారు. ఆయన భారత వైమానిక దళంలో పైలట్, కో-పైలట్‌గా పనిచేశారు. ఈ ఘటన జరిగిన 46 ఏళ్ల తర్వాత పాక్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలెట్ హుస్సేన్ ఒక లేఖలో దివంగత సీఎం బల్వంత్ రాయ్ మెహతా కుమార్తెకు క్షమాపణలు తెలిపారు. ఈ లేఖకు ఆమె సమాధానమిస్తూ, తాను తన తండ్రి హంతకుడిని క్షమిస్తున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్‌కు రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన బల్వంత్ రాయ్ మెహతా 1963 జూన్ నుండి 1965 సెప్టెంబర్ 1965 వరకు పదవిలో ఉన్నారు. ఇది కూడా చదవండి: సౌరభ్ చంద్రకర్ ఎవరు? పెళ్లి నేపధ్యంలో ఈడీకి ఎందుకు చిక్కాడు? -
IPL కోసం ఇంగ్లాండ్ కాంట్రాక్ట్ వదులుకున్న KKR స్టార్ బ్యాటర్
-
ఇంధన సామర్థ్యంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్య రంగంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఏపీ ఒకటని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సెక్రటరీ ఆర్.కే. రాయ్ కొనియాడారు. ఇంధన భద్రత, పర్యావరణ లక్ష్యాలను సాధించడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై ఇంధన తీవ్రతను తగ్గించడానికి సహాయపడే ఇంధన సామర్థ్య కార్యకలాపాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఇంధన సామర్థ్య పరికరాలను అమర్చే ప్రాజెక్టును ఏపీ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) రికార్డు స్థాయిలో నెల రోజుల్లోనే పూర్తిచేసింది. ఈ ప్రాజెక్టును రాయ్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీ భవన్లో ఏటా 1.96 లక్షల యూనిట్ల విద్యుత్తును, రూ.39 లక్షల మేర ప్రజా ధనాన్ని ఆదా చేయొచ్చని చెప్పారు. 139 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించొచ్చన్నారు. ఇందుకోసం పెట్టిన పెట్టుబడి 13 నెలల్లోనే ఇంధనం ఆదా రూపంలో తిరిగి పొందవచ్చన్నారు. తొలి దశలో హాలోజన్ ల్యాంప్‌ల స్థానంలో 190 వాట్ల కెపాసిటీ గల 12 ఎల్ఈడీ ఫ్లడ్ లైట్లు, సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో 28 వాట్స్ కెపాసిటీ గల 170 బీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్లు, 1.8 టీఆర్ 3 స్టార్ రేటెడ్ హాట్ అండ్ కోల్డ్ ఇన్వర్టర్ టైప్ స్ప్లిట్ ఏసీలు, కారిడార్ల వద్ద లైట్లను నియంత్రించడానికి 40 మోషన్ సెన్సార్లను ఏర్పాటు చేశారని తెలిపారు. దీనివల్ల ఏటా రూ.6.25 లక్షల విలువైన49,469 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందన్నారు. నెల రోజుల్లోనే పనులు పూర్తి చేసిన ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిని రాయ్ అభినందించారు. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. ఇంధన సామర్థ్య చర్యలకు న్యూ ఢిల్లీలో బీఈఈ ఎంపిక చేసిన తొలి రాష్ట్ర భవన్ ఏపీ భవన్. ఇక్కడి ఇంధన పొదుపు చర్యల ఫలితాల ఆధారంగా ఇతర రాష్ట్ర ప్రభుత్వాల భవనాల్లోనూ ఇదే ప్రాజెక్టును అమలు చేయాలని బీఈఈ భావిస్తోంది. ఏపీ భవన్‌ను ఎంపిక చేసి ఏపీఎస్ఈసీఎం ద్వారా ఇంధన సామర్థ్య చర్యలను విజయవంతంగా అమలు చేసిన బీఈఈకి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఫిలిప్పీన్స్ తుపాను.. 375కు చేరిన మరణాలు
మనీలా: ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం సంభవించిన తీవ్ర తుపాను ‘రాయ్’ తీవ్రతకు మరణించిన వారి సంఖ్య భారీస్థాయిలో పెరుగుతోంది. తాజాగా మరణాల సంఖ్య మొత్తంగా 375కు చేరుకుంది. మరోవైపు, ఈ తుపాను ధాటికి 56మంది జాడ తెలియడం లేదని అధికారులు సోమవారం తెలిపారు. గోడలు, చెట్లు కూలిపడటం, ఆకస్మిక వరదలు, కొండచెరియలు విరిగి పడిన ఘటనల్లో మరో 500 మంది గాయపడ్డారన్నారు. తుపాను తాకిడికి గురైన 25 నగరాలు, పట్టణాల్లో ఇప్పటికీ సమాచార వ్యవస్థలను పునరుద్ధరించడం వీలుకాలేదని చెప్పారు. మరో 200కు పైగా నగరాలు, పట్టణాలు చీకట్లోనే మగ్గుతున్నాయన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఆహారం, మంచినీరు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. -
వైద్యరంగానికి వన్నెతెచ్చిన రాయ్
డాక్టర్ బీసీ రాయ్‌గా ప్రసిద్ధిగాంచిన బిధాన్ చంద్రరాయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. వైద్యరంగానికి వన్నెతెచ్చిన బీసీ రాయ్ 1882 జులై 1వ తేదీన బిహార్ రాష్ట్రంలోని పాట్నాజిల్లా బంకింపూర్లో జన్మించారు. కలకత్తా మెడికల్ కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 1909లో ఇంగ్లాండ్ లోని బర్త్ హోమ్ హాస్పిటల్లో అతి కష్టంమీద సీటు సాధించిన రాయ్ కేవలం రెండేళ్ల మూడునెలల స్వల్పకాలంలోనే ఎం.ఆర్.సి.పి, ఎఫ్.ఆర్. సీ.ఎస్ డిగ్రీలు పూర్తిచేసి, ఇంత తక్కువకాలంలో ప్రతిష్టాత్మకమైన రెండు డిగ్రీలు పూర్తిచేసిన అరుదైన వ్యక్తిగా చరిత్రలో స్థానం సంపాదించాడు. 1911లో స్వదేశానికి తిరిగొచ్చి కలకత్తా వైద్య కళాశాలలో కొంతకాలం అధ్యాపకుడిగా పని చేశారు. పేదరోగులకు ఏదో చేయాలన్న తపనతో జాదవ్ పూర్ టీ.బీ హాస్పిటల్, ఆర్.జి.ఖార్ మెడికల్ కాలేజ్, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇనిస్టిట్యూట్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ తదితర సంస్థల్ని నెలకొల్పాడు. 1922 నుంచి, 1928 వరకు ఆరేళ్లకు పైగా కలకత్తా మెడికల్ జర్నల్‌కు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 1925లో రాజకీయ రంగప్రవేశం చేసి, బార క్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్‌గా పేరుగాంచిన సురేంద్రనాథ్ బెనర్జీపై గెలుపొందిన రాయ్ అనేక రాజకీయ, అకడమిక్ పదవులు చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా పేరుగాంచిన బీసీ రాయ్ 1948 జనవరి 13న పశ్చిమబెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రోజులో కనీసం ఒక్క గంట యినా పేద రోగులకోసం కేటాయించాలనే భావనతో, ఎన్ని పని ఒత్తిడులున్నప్పటికీ ఖచ్చితంగా పేద రోగులకు వైద్యసేవలందించేవాడు. విద్య, వైద్యరంగాల్లో ఆయన చేసిన సేవలకు 1944 లో గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. 1961లో ఫిబ్రవరి 4న డా‘‘ బీసీరాయ్‌ను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. ప్రజా నేతగా, ప్రజావైద్యుడిగా రాయ్ చేసిన కృషికి, త్యాగానికి గుర్తుగా, ఆయన స్మారకార్థం ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారతప్రభుత్వం 1962లో ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి 1976 నుండి డాక్టర్ బీసీ రాయ్ పేరుమీద అవార్డులు అందజేస్తున్నారు. ప్రజల రోజువారీ జీవితాల్లో కీలకపాత్ర పోషించే వైద్యుల సేవలను గుర్తించి, వారి గొప్పతనం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కనుక బీసీ రాయ్ స్ఫూర్తితో వైద్యరంగంలో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి వైద్యులు కృషిచేయాలి. వైద్యుణ్ణి దైవసమానుడుగా గుర్తించే స్థాయి నుంచి, వైద్యుడంటే పేదల రక్తం పీల్చే పిశాచి అన్న స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య మహోదయులపై ఈ దురభిప్రాయాన్ని తొలగించాల్సిన బాధ్యత మరింత అధికంగా ఉంది. కార్పొరేట్ కల్చర్‌కు అలవాటు పడిన అధికశాతం మంది వైద్యులు మానవీయ కోణాన్ని విస్మరించి ఎన్నిరకాల అవకాశాలుంటే అన్నిరకాలుగా రోగుల్ని పిండుతున్నారు. కొంతమంది అత్యాశాపరుల వల్ల పూర్తి వ్యవస్థకే చెడ్డపేరు వస్తున్న పరిస్థితిని నివారించాల్సిన అవసరం ఉంది. స్వాభావికంగా సేవాభావం లేని వారు, వైద్యేతర రంగాల్లోని కార్పొరేట్ వ్యాపారులు వైద్యవృత్తిలోకి ప్రవేశించి వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్న బలమైన వాదనపైనా దృష్టి సారించాలి. వైద్యులు రోగులపట్ల తమ దృక్పథాన్ని మార్చుకొని, ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలి. ప్రజా వైద్యుడిగా విశేషఖ్యాతి గడించిన డా‘‘ బీసీ రాయ్‌ను ఆదర్శంగా తీసుకొని వైద్యవృత్తిపై పడిన కళంకాన్ని తొలగించడానికి ప్రతి ఒక్కవైద్యుడూ ఆచరణాత్మక కృషి చేయాలి. (జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం) యండి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్టు ‘ 99125 80645 -
అపూర్వం ... అద్భుతం... అద్వితీయం
6, 6, 6, 6 ప్రపంచకప్ ఫైనల్లో చివరి ఓవర్లో జరిగిన విధ్వంసం ఇది. వెస్టిండీస్ హిట్టర్ బ్రాత్‌వైట్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 19 పరుగులు చేయాల్సి ఉండగా... ఆశలు లేని దశలో అతనిలోని హిట్టర్ బయటికి వచ్చాడు. ఆరు బంతులేం ఖర్మ అంటూ భారీ సిక్సర్లు బాది రెండు బంతుల ముందే మ్యాచ్‌ను ముగించాడు. వెస్టిండీస్‌ను మరోసారి విశ్వవిజేతగా నిలిపాడు. సెమీఫైనల్ వరకు డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ విజయాల్లో కీలకంగా వ్యవహరించిన స్టోక్స్‌కు... ఫైనల్లో మాత్రం బ్రాత్‌వైట్ స్ట్రోక్ తగిలింది. కరీబియన్ల డబుల్ ధమాకా క్రికెట్ చరిత్రలో ఇదో అపూర్వ ఘట్టం... ఒకే దేశానికి చెందిన మహిళల, పురుషుల జట్లు ఒకేసారి చాంపియన్స్ అయ్యాయి.మహిళల క్రికెట్లో ఇదో అద్భుత ఘట్టం... ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన వెస్టిండీస్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది.టి20 చరిత్రలో ఇదో అద్వితీయ క్షణం... తొలిసారి వెస్టిండీస్ పురుషుల జట్టు ప్రపంచకప్‌ను రెండోసారి గెలిచింది.అవును... కరీబియన్స్ భారత గడ్డపై శివతాండవం చేశారు. అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు ఈడెన్ గడ్డపై సంచలనం సృష్టించారు. మధ్యాహ్నం జరిగిన మహిళల ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ షాకిస్తే... రాత్రి జరిగిన పురుషుల ఫైనల్లో సంచలన ఆటతీరుతో కరీబియన్స్ రెండోసారి కప్‌ను ముద్దాడారు. గేల్ గర్జించకపోయినా... ఇంగ్లండ్‌కు వణుకు పుట్టింది. శామ్యూల్స్ అనే యోధుడి పోరాటానికి... బ్రాత్‌వైట్ పవర్ హిట్టింగ్ తోడవడంతో వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. రూట్ (36 బంతుల్లో 54;7 ఫోర్లు), బట్లర్ (22 బంతుల్లో 36;1 ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగారు. తర్వాత విండీస్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసి నెగ్గింది. శామ్యూల్స్ (66 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రాత్ వైట్ (10 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) దుమ్మురేపారు. శామ్యూల్స్ మరోసారి 2012లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 56 బంతుల్లో 78 పరుగులు చేసి వెస్టిండీస్‌ను గెలిపించిన శామ్యూల్స్... మరోసారి ఒంటరి పోరాటంతో వెస్టిండీస్‌ను విజేతగా నిలిపాడు. ఈసారి అజేయంగా 66 బంతుల్లో 85 పరుగులు చేసి యోధుడిలా ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో బంతికి క్రీజులోకి వచ్చిన శామ్యూల్స్ చివరి వరకు నిలబడ్డాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (బి) బద్రీ 0; హేల్స్ (సి) బద్రీ (బి) రసెల్ 1; రూట్ (సి) బెన్ (బి) బ్రాత్‌వైట్ 54; మోర్గాన్ (సి) గేల్ (బి) బద్రీ 5; బట్లర్ (సి) బ్రేవో (బి) బ్రాత్‌వైట్ 36; స్టోక్స్ (సి) సిమన్స్ (బి) బ్రేవో 13; అలీ (సి) రామ్‌దిన్ (బి) బ్రేవో 0; జోర్డాన్ (నాటౌట్) 12; విల్లీ (సి) చార్లెస్ (బి) బ్రాత్‌వైట్ 21; ప్లంకెట్ (సి) బద్రీ (బి) బ్రేవో 4; రషీద్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1-0; 2-8; 3-23; 4-84; 5-110; 6-110; 7-111; 8-136; 9-142. బౌలింగ్: బద్రీ 4-1-16-2; రసెల్ 4-0-21-1; బెన్ 3-0-40-0; బ్రేవో 4-0-37-3; బ్రాత్‌వైట్ 4-0-23-3; స్యామీ 1-0-14-0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) స్టోక్స్ (బి) రూట్ 1; గేల్ (సి) స్టోక్స్ (బి) రూట్ 4; శామ్యూల్స్ (నాటౌట్) 85; సిమన్స్ (ఎల్బీ) (బి) విల్లీ 0; బ్రేవో (సి) రూట్ (బి) రషీద్ 25; రసెల్ (సి) స్టోక్స్ (బి) విల్లీ 1; స్యామీ (సి) హేల్స్ (బి) విల్లీ 2; బ్రాత్‌వైట్ (నాటౌట్) 34; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1-1; 2-5; 3-11; 4-86; 5-104; 6-107. బౌలింగ్: విల్లీ 4-0-20-3; రూట్ 1-0-9-2; జోర్డాన్ 4-0-36-0; ప్లంకెట్ 4-0-29-0; రషీద్ 4-0-23-1; స్టోక్స్ 2.4-0-41-0. ప్రైజ్‌మనీ (పురుషుల విభాగం) విజేత :- 16 లక్షల డాలర్లు (రూ. 10 కోట్ల 59 లక్షలు) రన్నరప్ :- 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 29 లక్షలు) సెమీస్‌లో ఓడిన జట్లకు:- 4 లక్షల డాలర్లు (రూ. 2 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీ (మహిళల విభాగం) విజేత :- లక్ష డాలర్లు (రూ. 66 లక్షల 23 వేలు) రన్నరప్:- 50 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు) -
‘రాయ్’ల్గా... ఫైనల్‌కి
► సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ ► చెలరేగిన రాయ్, బట్లర్ ► టి20 ప్రపంచకప్ ఐపీఎల్ జట్లు తమను తీసుకోలేదన్న కసితో ఉన్నారేమో... భారత గడ్డపై ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ప్రతి మ్యాచ్‌లోనూ విశ్వరూపం చూపిస్తున్నారు. టోర్నీలో నిలకడగా విజయాలు సాధిస్తూ వచ్చిన బలమైన ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు సెమీఫైనల్లో చుక్కలు చూపించారు. ఓపెనర్ జాసన్ రాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో... న్యూజిలాండ్‌పై అలవోకగా నెగ్గిన ఇంగ్లండ్ రెండోసారి టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. న్యూఢిల్లీ: లీగ్ దశలో ఎంత ప్రతిభ చూపినా.... నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం న్యూజిలాండ్‌ను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన కివీస్... ఈసారి టి20 ప్రపంచకప్‌ను సెమీస్‌తోనే ముగించింది. ఈ టోర్నీలో అజేయశక్తిలా దూసుకుపోతున్న న్యూజిలాండ్‌ను సెమీఫైనల్లో ఇంగ్లండ్ ఏడు వికెట్లతో చిత్తు చేసింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. మున్రో (32 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ (28 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి నెగ్గింది. జాసన్ రాయ్ (44 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఆరంభం ఇవ్వగా... బట్లర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ముగించాడు. ఆఖర్లో తడబాటు న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన గప్టిల్ (12 బంతుల్లో 15; 3 ఫోర్లు) మూడో ఓవర్లోనే పెవిలియన్‌కు చేరినా... విలియమ్సన్, మున్రోలు చెలరేగిపోయారు. ఈ ఇద్దరి జోరుతో తొలి 10 ఓవర్లలో కివీస్ స్కోరు 89/1కు చేరింది. అయితే 11వ ఓవర్లో విలియమ్సన్ అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 8.2 ఓవర్లలో 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అండర్సన్ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడినా.... 14వ ఓవర్లో మున్రోను అవుట్ చేసి ఇంగ్లిష్ బౌలర్లు ట్రాక్‌లోకి వచ్చారు. 16 ఓవర్లలో 133/3 స్కోరుతో పటిష్టస్థితిలో ఉన్న కివీస్‌ను నాణ్యమైన బౌలింగ్‌తో అద్భుతంగా కట్టడి చేశారు. కేవలం 20 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు తీసి భారీ స్కోరును అడ్డుకున్నారు. దీంతో చివరి 10 ఓవర్లలో కివీస్ 64 పరుగులతో సరిపెట్టుకుంది. స్టోక్స్ 3 వికెట్లు తీశాడు. అదిరిపోయే ఆరంభం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి ఓవర్లోనే రాయ్ నాలుగు ఫోర్లు బాదితే.. రెండో ఎండ్‌లో హేల్స్ (19 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) కూడా దీటుగా స్పందించాడు. మెక్లీంగన్, మిల్నేలకు భారీ సిక్సర్ల రుచి చూపెట్టిన ఈ ఇద్దరు ఓవర్‌కు 10 పరుగులకు పైగా సాధించారు. దీంతో పవర్‌ప్లేలో 67 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో రాయ్ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే తొమ్మిదో ఓవర్లో హేల్స్‌ను సాంట్నర్ అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలో 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో రూట్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా.. రాయ్ మాత్రం ఎలియట్ ఓవర్లో భారీ సిక్సర్‌తో మరింత జోరు పెంచాడు. అయితే 48 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన దశలో స్పిన్నర్ సోధి వరుస బంతుల్లో రాయ్, మోర్గాన్ (0)లను అవుట్ చేసినా ప్రయోజనం లేకపోయింది. చివర్లో రూట్ అండతో బట్లర్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. 24 బంతుల్లో 23 పరుగులు అవసరమైన దశలో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో విజయ లాంఛనం ముగించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 29 బంతుల్లోనే 49 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) బట్లర్ (బి) విల్లే 15; విలియమ్సన్ (సి అండ్ బి) అలీ 32; మున్రో (సి) అలీ (బి) ఫ్లంకెట్ 46; అండర్సన్ (సి) జోర్డాన్ (బి) స్టోక్స్ 28; టేలర్ (సి) మోర్గాన్ (బి) జోర్డాన్ 6; రోంచి (సి) విల్లే (బి) స్టోక్స్ 3; ఎలియట్ నాటౌట్ 4; సాంట్నర్ (సి) జోర్డాన్ (బి) స్టోక్స్ 7; మెక్లీంగన్ రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-17; 2-91; 3-107; 4-134; 5-139; 6-139; 7-150; 8-153. బౌలింగ్: విల్లే 2-0-17-1; జోర్డాన్ 4-0-24-1; ఫ్లంకెట్ 4-0-38-1; రషీద్ 4-0-33-0; స్టోక్స్ 4-0-26-3; మొయిన్ అలీ 2-0-10-1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (బి) సోధి 78; హేల్స్ (సి) మున్రో (బి) సాంట్నర్ 20; రూట్ నాటౌట్ 27; మోర్గాన్ ఎల్బీడబ్ల్యు (బి) సోధి 0; బట్లర్ నాటౌట్ 32; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: (17.1 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1-82; 2-110; 3-110. బౌలింగ్: అండర్సన్ 1-0-16-0; మిల్నె 3-0-27-0; మెక్లీంగన్ 3-0-24-0; సాంట్నర్ 3.1-0- 28-1; సోధి 4-0-42-2; ఎలియట్ 3-0-21-0. ► రేసులో మిగిలిన మూడు జట్లు (ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్)లో ఎవరు గెలిచినా... రెండోసారి టి20 ప్రపంచకప్ సాధించిన తొలి జట్టుగా అవతరిస్తుంది. -
జాక్విలిన్ డబుల్ ధమాకా..
భూషణ్‌కుమార్ తదుపరి చిత్రం ‘రాయ్’లో జాక్విలిన్ ఫెర్నాండెజ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనుంది. ఒక పాత్రలో అర్జున్ రామ్‌పాల్‌కు, మరో పాత్రలో రణబీర్ కపూర్‌కు జంటగా కనిపించనుంది. సినీ దర్శకురాలి పాత్రలో అర్జున్ రామ్‌పాల్ సరసన అల్ట్రా మోడర్న్‌గా, కళాభిమాని పాత్రలో రణబీర్ కపూర్ సరసన క్లాసీ లుక్‌లో కనిపించనుంది. సినీ దర్శకురాలి పాత్ర కోసం మెడపైన, మణికట్టుపైన టాటూలు కూడా పొడిపించుకుంది.