ఆయన గుజరాత్ రెండో ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ పితామహునిగానూ పేరొందారు. ఆయనే బల్వంత్ రాయ్ మెహతా. భారత్- పాక్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికుల చేతిలో హతమైన ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతి గడించారు. 1965వ సంవత్సరంలో ఆయన మరణించారు.
1965, సెప్టెంబరు 19 న ఇండో-పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో నాటి గుజరాత్ సీఎం బల్వంత్‌రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ఛాపర్ బీచ్‌క్రాఫ్ట్ భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లోని కచ్ మీదుగా వెళుతోంది. ఈ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం సీఎం ప్రయాణిస్తున్న ఛాపర్‌పై బాంబు దాడి చేసింది. ఈ ప్రమాదంలో మెహతాతో పాటు మరో ఏడుగురు మరణించారు. వీరిలో ఆయన భార్య సరోజ్‌బెన్, ఒక జర్నలిస్టు కూడా ఉన్నారు.
ఆ రోజు సీఎం బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ఛాపర్ మిథాపూర్ నుండి కచ్‌కి బయలుదేరిన వెంటనే, దానిని పాకిస్తాన్ ఫైటర్ పైలట్ కైస్ హుస్సేన్ అడ్డగించాడు. పాకిస్తాన్ ఛాపర్ అడ్డగించడం చూసిన భారత పైలెట్ బీచ్‌క్రాఫ్ట్ ఫ్యాన్ రెక్కలను కదిలించాడు. ఇది దయ చూపించి, విడిచిపెట్టాలని కోరుతూ చేసిన సూచన. అయితే అప్పటికి పాక్ పైలట్ గాలిలోకి రెండుసార్లు కాల్పులు జరిపాడు. అవి బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న బీచ్‌క్రాఫ్ట్‌ను తాకాయి. అంతే.. హఠాత్తుగా బీచ్‌క్రాఫ్ట్ పేలిపోయి, నేల మీదకు ఒరిగిపోయింది.
పలు నివేదికలలోని వివరాల ప్రకారం 25 ఏళ్ల వయసు కలిగిన పాకిస్తాన్ పైలెట్ హుస్సేన్ ఆ రోజు 20 వేల అడుగుల ఎత్తులో తన ఛాపర్‌తో భారత గగనతలంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో నాటి గుజరాత్ సీఎం ప్రయాణిస్తున్న బీచ్‌క్రాఫ్ట్‌ను గుజరాత్ ప్రభుత్వ చీఫ్ పైలట్ జహంగీర్ నడుపుతున్నారు. ఆయన భారత వైమానిక దళంలో పైలట్, కో-పైలట్‌గా పనిచేశారు.
ఈ ఘటన జరిగిన 46 ఏళ్ల తర్వాత పాక్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలెట్ హుస్సేన్ ఒక లేఖలో దివంగత సీఎం బల్వంత్ రాయ్ మెహతా కుమార్తెకు క్షమాపణలు తెలిపారు. ఈ లేఖకు ఆమె సమాధానమిస్తూ, తాను తన తండ్రి హంతకుడిని క్షమిస్తున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్‌కు రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన బల్వంత్ రాయ్ మెహతా 1963 జూన్ నుండి 1965 సెప్టెంబర్ 1965 వరకు పదవిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: సౌరభ్ చంద్రకర్ ఎవరు? పెళ్లి నేపధ్యంలో ఈడీకి ఎందుకు చిక్కాడు?
Comments
Please login to add a commentAdd a comment