
కేజ్రీవాల్ జోస్యం నిజమైందోచ్!
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ ఊహించనిరీతిలో తన పదవికి రాజీనామా చేశారు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఏకంగా ఫేస్‌బుక్‌లో తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ ఊహించనిరీతిలో తన పదవికి రాజీనామా చేశారు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఏకంగా ఫేస్‌బుక్‌లో తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియా వినియోగంలో చాలా ముందుంటారనే విషయం తెలిసిందే. మోదీ బాటలోనే నడుస్తూ ఆనందిబెన్ కూడా సోషల్ మీడియా వేదికగా రాజీనామా నిర్ణయం వెల్లడించారు. ఇది ఈ రోజుల్లో సాధారణ విషయమే కానీ.. ఇంతకూ ఆనందిబెన్ రాజీనామా రాజీనామా నెటిజన్లు ఏమంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నుంచి సామాన్య నెటిజన్ వరకు ఏమంటున్నారంటే..
ఆనందిబెన్ ఫేస్‌బుక్ ద్వారా తన రాజీనామాను ప్రకటించారు. 'డిజిటల్ ఇండియా' పథకంలో ఇది కొత్త అఛీవ్‌మెంట్ అని చెప్పొచ్చు.
#AnandibenPatel resigns via Facebook. A new achievement under Digital India initiative !
— Saket Aloni (@SaketAloni) August 1, 2016