సీఎం పదవికి ఆనందీ రాజీనామా
న్యూఢిల్లీ: గుజరాత్ సీఎం పదవి నుంచి వైదొలగుతానన్న ఆనందీబెన్ పటేల్ అభ్యర్థనకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది. బుధవారం సాయంత్రం ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ఆమె .. గవర్నర్‌కోహ్లికి రాజీనామా పత్రాలను సమర్పించారు. మరొకరు సీఎం బాధ్యతలు స్వీకరించేదాకా సీఎం పదవిలో కొనసాగాలని గవర్నర్.. ఆమెను కోరారు. అంతకుముందు అమిత్ షా అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది.
ప్రధాని మోదీ కూడా హాజరైన ఈ సమావేశం.. ఆనందీ రాజీనామా ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో పాటు తదుపరి సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడుషాకు అప్పగించింది. కొత్త నాయకుడి ఎంపిక కోసం ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపేందుకు గడ్కారీ, సరోజ్ పాండేలను కేంద్ర పరిశీలకులుగా నియమించింది. కొత్త సీఎం ఎంపికపై పార్టీ నాయకులతో చర్చించేందుకు షా గురువారం గుజరాత్ వెళ్లనున్నారు. కాగా సీఎం రేసులో అమిత్ షా లేరని బీజేపీ నేత వెంకయ్య చెప్పారు.