అవి వదంతులే.. సీఎం పీఠం నుంచి దిగిపోను!
అవి వదంతులే.. సీఎం పీఠం నుంచి దిగిపోను!
Published Mon, May 30 2016 8:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబేన్ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేసి.. మరొకరికి ఆ పగ్గాలు ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు కథనాలు గుప్పుమన్నాయి. ఈ రెండేళ్లకాలంలో సీఎంగా ఆమె తనదైన ముద్ర వేయకపోవడంతో కమలనాథులు ఈ మేరకు ఆలోచిస్తున్నట్టు వందతులు వినిపించాయి. ఈ వదంతులను సీఎం ఆనందిబేన్ కొట్టిపారేశారు. గుజరాత్ లో సీఎం మార్పుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నోటి నుంచి నేరుగా వస్తేనే తాను విశ్వసిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి సేవ చేయడంపైనే తాను దృష్టి పెట్టానని చెప్పారు.
సీఎం మార్పుపై సొంత పార్టీ నేతలే లీకులు ఇచ్చారా? అంటే అది తనకు తెలియదని, ఇది మాత్రం పక్కాగా వదంతులు సృష్టించేవారి పనేనని చెప్పారు. అమిత్ షాతో తనకెలాంటి విభేదాలు లేవని, సీఎంగా తాను పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ షా వర్గంగా, తన వర్గంగా రెండుగా చీలిందన్న కథనాల్లో వాస్తవం లేదని వెల్లడించారు.
Advertisement