షీనా బోరా కేసు విచారణాధికారి భార్య అనుమానాస్పద మరణం | Wife of Inspector who probed Sheena Bora murder found dead | Sakshi
Sakshi News home page

షీనా బోరా కేసు విచారణాధికారి భార్య అనుమానాస్పద మరణం

Published Wed, May 24 2017 11:23 AM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

షీనా బోరా కేసు విచారణాధికారి భార్య అనుమానాస్పద మరణం - Sakshi

షీనా బోరా కేసు విచారణాధికారి భార్య అనుమానాస్పద మరణం

ముంబై: షీనా బోరా హత్య కేసులో విచారణ అధికారి భార్య  ఆకస్మికమరణం పలు అనుమానాలకు  తావిస్తోంది. ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారి భార్య అనుమానాస్పద రీతిలో మరణించింది.  దర్యాప్తు బృందంలోని  పోలీస్  అధికారి ధ్యానేశ్వర్‌ గనోర్‌   భార్య  దీపాలి గనోర్‌ శాంతక్రూజ్ ప్రాంతంలోని  ఇంటిలో    మంగళవారం రాత్రి  చనిపోయారు.  విధులు ముగించుకొని   ఇంటికి వచ్చిన ధ్యానేశ్వర్   చనిపోయి వున్నభార్యను  గుర్తించి పోలీసులకు  సమాచారం అందించారు.

ముంబై పోలీస్ ప్రెస్ నోట్ ప్రకారం  పోలీస్‌ అధికారి ఉదయం 03:30 గంటలకు  ఇంటికి వచ్చి భార్య ఎంతకీ తలుపు తీయలేదు. ఫోన్‌ చేసినా ఫలితం లేదు.  చివరకి ఏదో  విధంగా తలుపు తెరిచి చూడగా రక్తపు మడుగులోఉన్న భార్య ను చూసి షాకైన అధికారి పై అధికారులకు సమాచారం అందించారు. మరోవైపు  ఈ సంఘటన అనంతరం కొడుకు కూడా కనిపించకుండా పోయాడు. అతని  మొబైల్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ లో ఉంది.

సంఘటనా స్థలంలో హత్య సమయంలో ఉపయోగించిన ఆయుధంగా భావిస్తున్న  కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన   దర్యాప్తు మొదలుపెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement