
సీతారాం ఏచూరి ప్రొఫైల్
భారతదేశ కమ్యూనిస్టు రాజకీయాల్లో సీతారాం ఏచూరి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందరికీ సుపరిచితమైన నేత. 1952 ఆగస్టు 12న చెన్నైలో తెలుగు మాట్లాడే కుటుంబంలోజన్మించారు. ప్రారంభం నుంచే చురుకుగా ఉండే ఆయన భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా సమస్యలపట్ల ఆయన స్పందించే తీరు అమోఘం. ఒక్కసారి ఆయన జీవిత ప్రస్థానాన్ని గమనించినట్లయితే..
విద్యాభ్యాసం
1970లో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న సీతారాం ఏచూరి అనంతరం ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో కాలేజీ విద్యలో చేరారు.
1975లో ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ)లో ఎంఏ ఆర్థికశాస్త్రంలో చేరి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు.
జేఎన్యూలోనే పీహెచ్డీలో ప్రవేశం పొంది.. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధింపు సమయంలో ఆరెస్టు కావడంతో దానిని పూర్తి చేయలేకపోయారు.
రాజకీయ జీవితం
1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ)లో విద్యార్థి నాయకుడిగా చేరిక.
అత్యవసర సమయంలో కొన్నిసార్లు అజ్ఞాతంలోకి కూడా వెళ్లిన ఆయన అరెస్టయ్యారు.
అత్యవసర పాలన ముగిసిన తర్వాత జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా మూడుసార్లు పనిచేశారు.
1978లో ఎస్ఎఫ్ఐ ఆలిండియా జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ ఆలిండియా ప్రెసిడెంట్గా నియామకం అయ్యారు.
1986లో ఎస్ఎఫ్ఐని వదిలి పూర్తి రాజకీయాలపై దృష్టిపెట్టారు.
1984లో ఆయననుపార్టీలోకి సీపీఎం ఆహ్వానించింది.
1985లో జరిగిన సీపీఎం పన్నెండో జాతీయ సభల్లో కేంద్రం కమిటీ సభ్యుడిగా ఎన్నిక.
1988లో జరిగిన సీపీఎం పదమూడో జాతీయ సభల్లో కేంద్ర కార్యనిర్వహకుడిగా ఎన్నిక.
1992లో జరిగిన సీపీఎం పద్నాలుగో జాతీయ సభలో పొలిట్బ్యూరో సభ్యుడిగా ఎన్నికై ఇప్పటికీ కొనసాగుతున్నారు.
2005 పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నిక.
2015 విశాఖపట్నంలో జరిగిన 21 జాతీయ మహాసభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక.
సీతారాం ఏచూరి పార్లమెంటు గ్రూపు సభ్యుడిగా కూడా ఉన్నారు.
రాజకీయాలతోపాటు సమకాలిన అంశాలపై వ్యాసాలు రాస్తూ హిందుస్థాన్ టైమ్స్కు కాలమిస్టుగా కూడా ఉన్నారు.