Lara Dutta Gave Clarity On Rumors About Her Profile On Dating App | Lara Dutta Fake Account - Sakshi
Sakshi News home page

Lara Dutta: డేటింగ్‌ యాప్‌లో లారా ప్రోఫైల్‌, స్పందించిన మాజీ మిస్‌ యూనివర్స్‌

Published Mon, Nov 8 2021 6:56 PM | Last Updated on Tue, Nov 9 2021 11:07 AM

Lara Dutta Gave Clarity On Rumors About Her Profile On Dating App  - Sakshi

మాజీ మిస్‌ యూనివర్స్‌, నటి.. టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి భార్య లారా దత్తాకు చెందిన ప్రోఫైల్ ఓ డేటింగ్ యాప్‌లో ఉందని ఇటీవల జోరుగా ప్రచారం జరుగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇది కాస్తా లారా దృష్టికి వెళ్లడంతో తాజాగా దీనిపై ఆమె స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తనపై వస్తున్న వార్తలకు స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు లారా మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ ఏ డేటింగ్ సైట్లో లేను.  నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నాపై విపరీతమైన ప్రచారం జరిగుతుంది.

చదవండి: ప్రభాస్‌ గురించి ట్వీట్‌ చేసిన సన్నీ సింగ్‌, ‘డార్లింగ్‌’ ఫ్యాన్స్‌ ఫైర్‌

అందుకే దీనికి సమాధానం ఇవ్వాలనుకుంటున్నా. డేటింగ్ యాప్‌లో నా ప్రొఫైల్ ఉందని వారంటున్నారు. ఇది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత ఒక్కొక్కరికి క్లారిటీ ఇస్తూ వస్తున్నా. చివరకు ఆన్ లైన్ ద్వారా అందరికీ ఒకే సారి క్లారిటీ ఇస్తున్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అలాగే డేటింగ్ యాప్స్‌క తాను వ్యతిరేకం కాదని... జనాలు ఒకరినొకరు కలుసుకోవడానికి ఈ యాప్స్ ఎంతో ఉపయోగపడతాయని లారా వ్యాఖ్యానించింది. అయితే, ఇప్పటి వరకు తాను డేటింగ్ యాప్‌లో లేనని చెప్పారు. ఈ వార్తలను నమ్మొద్దని ఆమె ఫ్యాన్స్‌ను కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement