dating apps
-
డేటింగ్ ముఠా.. పబ్బు ఓనర్ల కొత్త దందా
-
పబ్ లో కొత్త దందా..
-
డేటింగ్.. చీటింగ్
సాక్షి, హైదరాబాద్: సరదా కోసమో.. కాలక్షేపం కోసమో చేసే కొన్ని పనులు కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయనడానికి డేటింగ్ యాప్స్ వ్యవహారం ఓ ఉదాహరణ. ఏదో కాసేపు టైంపాస్ చేద్దామని కొందరు.. ఒంటరితంతో మరికొందరు ఆన్లైన్ డేటింగ్ యాప్‌ల వలలో చిక్కుతున్నారు. ఈ తరహా మోసాలకు గురవుతున్న వారిలో యువకుల నుంచి వయోవృద్ధులు వరకు ఉంటున్నారు. ఎదుటివారి బలహీనతలను అనుకూలంగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు... అందమైన యువతులతో న్యూడ్ వీడియోకాల్స్ మాట్లాడిస్తున్నారు. ఎదుటి వ్యక్తిని మాటల్లో దింపి రెచ్చగొట్టి తర్వాత వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడేలా చేస్తున్నారు. ఆ వీడియోలను రికార్డు చేసి, ఆపై సోషల్ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు పంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో పరువు పోతుందని భావించి బాధితులు సైబర్ నేరస్తులు డిమాండ్ చేసినట్లు రూ. లక్షలు సమర్పిస్తున్నారు. లింక్‌లు పంపి.. మనకు డేటింగ్ యాప్‌లపై ఆసక్తి లేకున్నా సోషల్ మీడియాలో మన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కూడా కొందరు సైబర్ నేరగాళ్లు ఈ తరహా లింక్‌లు పంపి రెచ్చిగొట్టి ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల నారాయణగూడ ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల ఓ వృద్ధుడికి వీడియోకాల్ చేసిన ఓ యువతి.. ఆ వృద్ధుడిని నగ్నంగా ఫోన్ మాట్లాడేలా చేసి దాన్ని వీడియో తీసి బెదిరింపులకు దిగింది. ఇలా రూ. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న ఆ వృద్ధుడు చివరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. లాలాపేటకు చెందిన 59 ఏళ్ల బీమా కంపెనీ ఉద్యోగి సైతం రూ. 8 లక్షలు ఇదే రీతిలో పోగొట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్లు ప్రజల సోషల్ మీడియా ఖాతాల నుంచి సమాచారం సేకరించి వాటి ఆధారంగా డేటింగ్ యాప్ లింక్‌లు, వాట్సాప్ వీడియో న్యూడ్‌కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. అప్రమత్తంగా ఉండటం ద్వారానే ఇలాంటి ముప్పు నుంచి బయటపడగలుగుతామని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు మరవొద్దు... ♦ మన మానసిక పరిస్థితి ఏదైనా సరే ఆన్లైన్ డేటింగ్ యాప్‌లలో అపరిచిత వ్యక్తులతో స్నేహాలు అవసరమా అన్నది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఆన్లైన్ స్నేహాల వల్ల మోసపోయే కంటే నిజమైన స్నేహితులను, సన్నిహితులను గుర్తించడం ఉత్తమమన్నది తెలుసుకోవాలి. ♦ ఆన్లైన్ మోసగాళ్లకు సోషల్ మీడియా అనేది ప్రధాన వేదిక. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగాం వంటి సోషల్ మీడియా ఖాతాల్లో మనం పెట్టే వ్యక్తిగత సమాచారం, ఫాలో అవుతున్న వ్యక్తులను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు డేటింగ్ యాప్‌ల లింక్‌లు పంపి మోసాలకు తెరతీస్తున్నారు. సోషల్ మీడియాలో పరిమితికి మించి వ్యక్తిగత సమాచారం ఇవ్వకపోవడం ఉత్తమం. ♦ ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో మన ఫొటోలు, వీడియోలు కేవలం స్నేహితులకే కనపించేలా ప్రొఫైల్ ప్రైవసీ ఆప్షన్లు వాడాలి. దీనివల్ల ఇతరులకు మన వ్యక్తిగత అంశాలు వెల్లకుండా నిరోధించవచ్చు. ♦ అందమైన యువతుల ప్రొఫైల్ ఫొటోలతో (ఫేక్ ప్రొఫైల్స్‌తో) కొందరు సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ఇలా వారి వలలో పడే అమాయకులను మోసగిస్తున్నారు. అందువల్ల అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దు. ♦ మొబైల్‌ఫోన్, ల్యాప్‌లాప్, డెస్క్‌టాప్‌లకు సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. దీనివల్ల సైబర్ నేరగాళ్లు పంపే ఫిషింగ్ లింక్స్, మాల్వేర్స్ నుంచి రక్షణ ఉంటుంది. ♦ డేటింగ్ యాప్స్ పేరిట లింక్‌లు పంపి స్నేహాలు చేసే వారిని వీలైనంత వరకు వ్యక్తిగత సమాచారం అడిగేందుకు ప్రయత్నించాలి. ప్రశ్నించడం ప్రారంభిస్తే ఫేక్‌గాళ్లు వెంటనే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. అదేవిధంగా ఆన్లైన్లో పరిచయం అయ్యే స్నేహితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బులు పంపవద్దు. ఏ రకమైన ఆన్లైన్ యాప్‌లోనూ డబ్బు లావాదేవీలు చేయవద్దు. -
ఉత్తుత్తి కంపెనీలు.. ఊళ్లు దాటిన వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: చైనా, హాంకాంగ్‌లకు చెందిన గేమింగ్, డేటింగ్ యాప్స్ కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. యాప్స్ నిర్వహిస్తున్న కంపెనీల లావాదేవీలు చూస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్.. రూ.1,500లకో సంతకంతో వేల కోట్లు దేశం దాటేలా సహకరించాడని వెల్లడించింది. షెల్ కంపెనీల లావాదేవీలకు బోగస్ సర్టిఫికెట్లు జారీ చేసి రూ.1,100 కోట్లు చైనా, హాంకాంగ్ చేరేలా చేశాడని చెప్పింది. హెయిర్ మర్చంట్స్.. క్రిప్టో కరెన్సీ రూపంలో ఢిల్లీకి చెందిన చార్టెట్ అకౌంటెంట్ రవికుమార్.. చైనా, హాంకాంగ్‌కు చెందిన లింక్యూన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, డోకిపే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల లావాదేవీలు చూస్తున్నాడు. సంబంధిత కంపెనీలు మన దేశంలో డేటింగ్, గేమింగ్ యాప్‌ల ద్వారా వేల కోట్లు వసూలు చేసి మోసం చేశాయి. ఈ డబ్బు ను మనీలాండరింగ్ ద్వారా రవికుమార్ దేశం దాటించినట్టు ఈడీ గుర్తించింది. నకిలీ ఎయిర్ వే బిల్లులు, సీసీ కెమెరాల క్లౌడ్ స్టోరేజ్ మెయింటెనెన్స్ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి ఎస్బీఐ, ఎస్‌బీఎమ్ బ్యాంకుల ద్వారా రూ.1,100 కోట్ల డబ్బును రవికుమార్ దేశం దాటించినట్టు ఈడీ గుర్తించింది. కొంత డబ్బును హవాలా రూపంలో హెయిర్ మర్చంట్స్, క్రిప్టో కరెన్సీ పేరుతో సింగపూర్‌కు మళ్లించినట్టు తేల్చింది. సంతకానికి రూ. 1,500 మనీ లాండరింగ్ ద్వారా రూ.1,100 కోట్లను దేశాన్ని దాటించేందుకు చైనా, హాంకాంగ్‌లో ఉన్న మాఫియా నేతృత్వంలో రవికుమార్ 621 బోగస్ కంపెనీలు సృష్టించాడని, అలాగే బోగస్ ఫామ్ 15 సీబీ సర్టిఫికెట్లు జారీ చేశాడని ఈడీ గుర్తించింది. చార్టెడ్ అకౌంటెంట్‌గా బ్యాలెన్స్ షీట్లను చూడకుండానే షెల్ కంపెనీలకు సంతకాలు చేశాడంది. ఈ మొత్తం వ్యవహారంలో రవికుమార్ తన ప్రతి సంతకానికి రూ.1,500 చొప్పున తీసుకున్నట్టు గుర్తించింది. బోగస్ కంపెనీల సృష్టికర్తలు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, రవికుమార్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టామని ఈడీ తెలిపింది. రవికుమార్‌ను విచారించేందుకు కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించినట్టు చెప్పింది. -
డేటింగ్ యాప్‌లో లారా ప్రోఫైల్, స్పందించిన మాజీ మిస్ యూనివర్స్
మాజీ మిస్ యూనివర్స్, నటి.. టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి భార్య లారా దత్తాకు చెందిన ప్రోఫైల్ ఓ డేటింగ్ యాప్‌లో ఉందని ఇటీవల జోరుగా ప్రచారం జరుగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇది కాస్తా లారా దృష్టికి వెళ్లడంతో తాజాగా దీనిపై ఆమె స్పందించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తనపై వస్తున్న వార్తలకు స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు లారా మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ ఏ డేటింగ్ సైట్లో లేను. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నాపై విపరీతమైన ప్రచారం జరిగుతుంది. చదవండి: ప్రభాస్ గురించి ట్వీట్ చేసిన సన్నీ సింగ్, ‘డార్లింగ్’ ఫ్యాన్స్ ఫైర్ అందుకే దీనికి సమాధానం ఇవ్వాలనుకుంటున్నా. డేటింగ్ యాప్‌లో నా ప్రొఫైల్ ఉందని వారంటున్నారు. ఇది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత ఒక్కొక్కరికి క్లారిటీ ఇస్తూ వస్తున్నా. చివరకు ఆన్ లైన్ ద్వారా అందరికీ ఒకే సారి క్లారిటీ ఇస్తున్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అలాగే డేటింగ్ యాప్స్క తాను వ్యతిరేకం కాదని... జనాలు ఒకరినొకరు కలుసుకోవడానికి ఈ యాప్స్ ఎంతో ఉపయోగపడతాయని లారా వ్యాఖ్యానించింది. అయితే, ఇప్పటి వరకు తాను డేటింగ్ యాప్‌లో లేనని చెప్పారు. ఈ వార్తలను నమ్మొద్దని ఆమె ఫ్యాన్స్‌ను కోరారు. View this post on Instagram A post shared by Lara Dutta Bhupathi (@larabhupathi) -
ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీగానే ఆదరణ పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీపై పెరుగుతున్న ఆదరణను కొంతమంది సైబర్ నేరస్తులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లపై హ్యకర్లు దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. దాడికి గురవుతున్న వారిలో ఎక్కువగా ఐఫోన్ యూజర్లే ఉండడం గమనార్హం. తాజాగా బ్రిటన్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ ఐఫోన్ యూజర్లను హెచ్చరించింది. చదవండి: ఈ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా పెంచిన వివో...! డేటింగ్ యాప్స్‌తో దాడులు..! బంబుల్, టిండర్ వంటి డేటింగ్ యాప్స్‌తో క్రిప్టో స్కామర్లు ఐఫోన్ యూజర్లపై విరుచుకపడుతున్నట్లు సోఫోస్ పేర్కొంది. ఐఫోన్ యూజర్ల క్రిప్టోకరెన్సీలను దొంగలించడంతో పాటుగా, ఆయా వ్యక్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారని సోఫోస్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు సుమారు రూ. 10 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీలను సైబర్ నేరస్తులు దొంగిలించారని సోఫోస్ వెల్లడించింది. క్రిప్టో స్కామర్లు ఎక్కువగా ఆసియాలోని వ్యక్తులనే లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఈ స్కామర్లు యూరప్, యూఎస్ నుంచి తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు సోఫోస్ పేర్కొంది. క్రిప్టో ఇన్వెస్టర్లు సురక్షిత క్రిప్టో లావాదేవీలను సులభతరం చేయడానికి ఆపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ధృవీకరించబడిన ఎక్స్ఛేంజ్, ట్రేడింగ్ సైట్లను మాత్రమే ఉపయోగించాలని సోఫోస్ సూచించింది. ఒక నివేదిక ప్రకారం.. 2020 ఏప్రిల్‌లో సుమారు 10.52 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 79,194 కోట్లు) మేర క్రిప్టోకరెన్సీ దొంగిలించబడిందని తెలుస్తోంది. చదవండి: డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! -
రూటు మార్చిన మోసగాళ్లు.. జర జాగ్రత్త!
ముంబై: ఆర్థిక కార్యకలాపాల పునప్రారంభంతో యాత్రలు, ఆతిథ్యం, ఆన్లైన్ ఫోరమ్స్, సరుకు రవాణా వంటి రంగాలను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్‌యూనియన్ నివేదిక వెల్లడించింది. 40,000 పైచిలుకు వెబ్‌సైట్స్, యాప్స్‌ను విశ్లేషించి ట్రాన్ ఈ నివేదిక రూపొందించింది. టార్గెట్ ఇవే ట్రాన్స్ నివేదిక ప్రకారం.. ‘డిజిటల్ వేదికగా మోసం చేసేందుకు జరిగిన ప్రయత్నాలు భారత్‌లో గతేడాదితో పోలిస్తే 2021లో.. యాత్రలు, ఆతిథ్య రంగంలో 269 శాతం, డేటింగ్ యాప్స్ వంటి ఆన్లైన్ ఫోరమ్స్‌లో 267శాతం, సరుకు రవాణా రంగంలో 94 శాతం అధికం అయ్యాయి. ఏప్రిల్–జూన్‌లో లాక్డౌన్లు ఎత్తివేశాక యాత్రలు, ఆతిథ్య కార్యకలాపాలు మరింత ప్రధాన స్రవంతిగా మారడంతో మోసగాళ్లు ఈ పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్నారు’ అని వివరించింది. జాగ్రత్తలు తప్పనిసరి గతంలో సైబర్ నేరగాళ్లు బ్యాంకు లావాదేవీల ఆధారంగా ఎక్కువగా మోసాలకు పాల్పడేవారు. ఇప్పుడు టూరిజం సెక్టార్‌ని లక్ష్యంగా చేసుకోవడంతో పర్యటనల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండటం మేలని ట్రాయ్ సూచించింది. కొత్త ప్రదేశాల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది. చదవండి : మీరు వాడే క్రోమ్ బ్రౌజర్ సెక్యూర్‌గా ఉందో లేదో ఇలా చెక్ చేయండి.. -
మీ ఫోన్లో నుంచి ఈ యాప్ వెంటనే తొలగించండి.. ముఖ్యంగా మహిళలు
ప్రముఖ డేటింగ్ యాప్ బంబుల్ లో ఉన్న ఒక సెక్యూరిటీ బగ్ వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని బహిర్గతం చేస్తున్నట్లు ఒక భద్రతా పరిశోధకుడు పేర్కొన్నారు. ఈ బంబుల్ యాప్ లో ఉన్న లోపం ద్వారా హ్యకర్లు దాడి చేసి వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలిపారు. బంబుల్ యాప్ ను ఇప్పటి వరకు కోటి మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర డేటింగ్ యాప్స్ కంటే ఈ డేటింగ్ యాప్ సురక్షితం అని మహిళా యూజర్స్ భావిస్తున్నారు. ఎందుకంటే, వారి అనుమతి లేకుండా ఏ పురుషుడు వారికి మెసేజ్ పంపలేరు. అయితే, తాజాగా ఈ బగ్ బయటపడటంతో మహిళా వినియోగదారులకు ఎక్కువగా హాని కలిగే అవకాశం ఉంది. స్ట్రైప్ సంస్థలో పనిచేసే పరిశోధకులు రాబర్ట్ హీటన్, బంబుల్ యాప్స్ లో ఉన్న బగ్ ను కనుగొన్నారు. ఈ లోపం వల్ల వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒక బ్లాగ్ పోస్ట్ లో నివేదించారు. ఇందుకు గాను అతనికి $2,000 బహుమతి కూడా లభించింది. సైబర్ క్రిమినల్స్ వినియోగదారుల ఖచ్చితమైన ఇంటి చిరునామాను తెలుసుకోవడానికి, వారి కదలికలను ట్రాక్ చేయడానికి వారు బంబుల్ యాప్ ఉపయోగించేకునే అవకాశం ఉంది అని హీటన్ పేర్కొన్నారు. అందుకే ఈ యాప్ ఉన్న యూజర్లు వెంటనే మీ ఫోన్ నుంచి తొలగించాలని భద్రత నిపుణులు పేర్కొన్నారు.(చదవండి: పీఎంజేడీవై ఖాతాదారులకు తీపికబురు) -
ఫొటోలు, వివరాలు షేర్ చేసింది.. అసలు నిజం తెలిసి..
రాధిక (పేరు మార్చడమైనది) డిగ్రీ పూర్తి చేసింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ, తనకు నచ్చే వ్యక్తిని తను ఎంచుకోవాలనుకుంది. అందుకు తగినట్టుగా డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని, తన వ్యక్తిగత వివరాలు ఇచ్చింది. ఎంతోమంది ఫ్రొఫైల్స్ పంపారు. వాటిలో తనకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుంది. అలా పరిచయం అయిన వాడే కుమార్ (పేరు మార్చడమైనది). కుమార్ మాటలు, ప్రవర్తన రాధికకు బాగా నచ్చాయి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. ఇంజినీరింగ్ చేశాడు. మంచి కంపెనీలో జాబ్. అన్ని విధాలా తనకు అనువైనవాడు అనుకుంది. తన ఫొటోలు, వివరాలు కూడా అతనితో షేర్ చేసుకుంది. కుమార్ కుటుంబ నేపథ్యం తెలిశాక ఇంట్లో పెద్దలతో మాట్లాడి సంబంధం ఓకే చేయించాలనుకుంది. బయట విడిగా కలవాలనుకున్నారు కానీ, కుమార్ ఉండేది బెంగళూరులో. ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని చెప్పాడు. ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా ముందే అన్నీ మాట్లాడుకుంటే బాగుంటుందని కుమార్ చెప్పడంతో సరే అంది రాధిక. ∙∙ రెండు రోజులుగా కుమార్ చాటింగ్ చేయడం లేదు. ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. ఆన్లైన్లో రెండు కూడా కనిపించడం లేదు. మరుసటి రోజు ఉదయాన్నే వార్తలు చూస్తోంది రాధిక. అందులో... ‘‘డేటింగ్ యాప్‌లు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకున్న కుమార్, వారి అర్ధనగ్న చిత్రాలు, వీడియోలను అడ్డుగా పెట్టుకొని లక్షల్లో డబ్బు లాగుతున్నాడని, ఇలా మోసపోయినవారిలో 200 మంది యువతులు, 100 మందికి పైగా మహిళలు ఉన్నారనీ...జల్సాలకు అలవాటు పడి గతంలో గొలుసు చోరీలు, ఇళ్లలో దొంగతనాలు కూడా చేశాడని, పరిచయస్తుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి బంగారం తీసుకొని పారిపోయాడనీ’’ ఉంది. షాకైన రాధిక ఇంకెప్పుడూ తెలియని వ్యక్తులతో ఫోన్లో కూడా సంభాషించకూడదు అనుకుంది. మంచివాళ్లుగా అనిపించే మహామాయగాళ్లు చేతిలో ఉన్న ఫోన్ ద్వారానే మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకుంది. ‘ఇలా అయితే, ఎవరికైనా ప్రమాదమే. ఈ డేటింగ్ యాప్స్ అన్నీ బ్యాన్ చేస్తే ఎంతో మంది యువతులు, గృహిణులు సురక్షితంగా ఉంటారు’ అనుకుంది. అన్ని యాప్స్‌లో తన వివరాలన్నీ తొలగించి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. వీడియోలు షేర్ చేయవద్దు డేటింగ్ యాప్‌లో మీరు ఎంటర్ అవుతున్నారంటేనే అక్కడ నకిలీ ప్రొఫైల్స్ ఉంటాయని, మోసపుచ్చే మనుషులు ఉంటారని ముందే అవగాహనతో ఉండాలి. అవతలి వారి మాటలు వేటిని ఉద్దేశించి ఉంటున్నాయో వారి చాటింగ్ చదివితే ఇట్టే అర్థమైపోతుంది. అలాంటి వ్యక్తులతో సంభాషణ అంత సురక్షితం కాదు. పరిచయం అయ్యేవరకు డేటింగ్ యాప్‌ను వాడుకొని, రియల్ లైఫ్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తమ పెద్దవారిని కలవమని చెప్పాలి. అంతే కాని మాయమాటలు నమ్మి బయటకు వెళ్లి కలవడం, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం మంచిది కాదు. ఒకవేళ మోసపోయామని గుర్తించినా, పరువు పోతుందని ప్రాణం పోగొట్టుకోకూడదు. వీడియోకాల్స్ రికార్డ్ చేయడం, చాటింగ్ సేవ్ చేసుకోవడం వంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏమైనా జరిగితే, తల్లిదండ్రులకు చెప్పడం, పోలీసులకు పిర్యాదు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. మీ వివరాలు బయటకు రాకుండా, నేరస్తులను పట్టుకుంటాం. మోసపూరిత సమస్యల్లో ఇరుకున్నామనిపిస్తే సైబర్మిత్రా, మహిళామిత్ర వెబ్సైట్లలో కంప్లైంట్ ఇవ్వచ్చు. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ గోప్యతా నిబంధనలు తప్పనిసరి వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం అనేది ఈ రోజుల్లో బాగా చర్చించాల్సిన, అవగాహన పెంచుకోవాల్సిన విషయం. ఈ ఆధునిక జీవనంలో స్మార్ట్‌గా మోసం చేసే వ్యక్తులు ఒక్క క్లిక్ అంత దూరంలో ఉంటారనే విషయాన్ని విస్మరించ కూడదు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, ఇతర డేటింగ్ యాప్స్ ఏవైనా మీ గోప్యతా నిబంధనలు తప్పక పాటించండి. అందులో సెట్టింగ్స్‌ను అర్ధం చేసుకోవాలి. మీరున్న లొకేషన్‌ను టర్న్ ఆఫ్ చేయాలి. మీ ఫొటోలు ఆన్లైన్లో పోస్ట్ చేయడం పట్ల జాగ్రత్త వహించాలి. మీ స్నేహితులు పంపినవి అయినా సరే, సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలి. అపరిచితులను ఎప్పుడూ దూరం పెట్టడం మంచిది. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
డేటింగ్ ముసుగులో వ్యభిచారమే.. గూగుల్ డెడ్లీ వార్నింగ్
వయసు మళ్లిన వాళ్లు.. వయసులో అమ్మాయిలతో డేటింగ్ చేయడమే షుగర్ డాడీ యాప్స్ కాన్సెప్ట్. అయితే ఇది తోడు వరకో లేదంటే చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఆగిపోదు. శారీరక సుఖం.. దానికి బదులుగా యువతులకు కాస్ట్లీ గిఫ్ట్‌లు, డబ్బు ఎరవేస్తుంటారు. విదేశాల్లో బాగా నడిచే ఈ వ్యవహారానికి మనదేశంలోనూ క్రేజ్ ఉంది. కానీ, త్వరలో ఇలాంటి యాప్స్‌పై బ్యాన్ విధించేందుకు గూగుల్ సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 1 నుంచి షుగర్ డాడీ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించబోతున్నట్లు గూగుల్ ప్లేస్టోర్ స్పష్టం చేసింది. సెక్సువల్ కంటెంట్ మీద కొరడా జులిపించాలని గూగుల్ నిర్ణయించుకుంది. ఈ మేరకు నిర్ణయించుకున్న పాలసీల్లో షుగర్ డాడీ యాప్స్ కూడా టార్గెట్‌గా ఉంది. ఈ యాప్స్ మొత్తం సెక్సువల్ యాక్ట్స్ కిందకే వస్తాయని గూగుల్ ప్లేస్టోర్ జూన్ 29న ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యభిచారమే! ‘షుగర్ యాప్స్ అనేవి వయసు మళ్లిన ధనవంతులు.. డబ్బులు వెదజల్లి అమ్మాయిలతో డేటింగ్ కోసం ఉపయోగించే యాప్స్. అయితే ఇది ముమ్మాటికీ డేటింగ్ యాప్స్ ముసుగులో వ్యభిచారం నడిపించడమే’ అని గూగుల్ ప్లేస్టోర్ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక మూములు డేటింగ్ యాప్‌లు కూడా ఇలా అశ్లీలతను పెంపొందించేలా వ్యవహరిస్తే.. వాటి మీద కూడా బ్యాన్ తప్పదని హెచ్చరించింది గూగుల్ ప్లే స్టోర్. మన దగ్గరా ఇక మన దేశంలో ఇప్పుడిప్పుడే వీటి క్రేజ్ పెరుగుతోంది. ఆసియా దేశాల లిస్ట్‌లో.. మన దేశంలో మూడున్నర లక్షల మంది షుగర్ డాడీలు ఉండగా, ఇండొనేషియాలో అరవై వేలమంది ఉన్నారు. ఈ యాప్‌ల్లో ‘ఎస్డీఎం, స్పాయిల్, షుగర్ డాడీ, షుగెర్ డాడీ’.. ఇవి ప్లేస్టోర్ ద్వారా బాగా పాపులర్ అయ్యాయి. సెక్సువల్ రిలేషన్స్ ప్రొత్సహించే ఏ యాప్స్‌ను ఉపేకక్షించబోమని స్పష్టం చేసింది గూగుల్. అయితే అనధికారిక యాప్ స్టోర్లలో, డౌన్లోడ్లతో షుగర్ డేటింగ్ యాప్స్ కొనసాగే అవకాశాల్లేకపోలేదు. -
అమ్మాయిలతో చాటింగ్, డేటింగ్ అని ఆశపడ్డావో, అంతే!
‘‘5 పైసలు కొట్టేస్తే పెద్ద తప్పు కాదు, 5 కోట్లసార్లు 5 పైసలు కాజేస్తే.. తప్పే. అదే 5 కోట్ల మంది ఐదుసార్లు 5 పైసలు కాజేస్తే.. అది తప్పకుండా మెగా తప్పు అవుతుంది’’ఒక సినిమాలో హీరో అవినీతిపై చెప్పే డైలాగ్ ఇది.. వాస్తవానికి ఇందులో కంటికి కనిపించని మోసం, కుంభకోణం ఉన్నాయి. సాధారణంగా చిన్నమొత్తం మోసపోయిన వారెవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రారు. పరువు, ఆత్మాభిమానాలను ఆయుధంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. ముఖ్యంగా టీనేజీ కుర్రాళ్లను లక్ష్యంగా చేసుకుని డేటింగ్ యాప్స్ ముసుగులో రోజుకు కోట్లు కొట్టేస్తున్నారు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) ప్రకారం.. గత నాలుగేళ్లలో ఈ డేటింగ్ యాప్స్ మోసాలు నాలుగురెట్లు పెరిగాయి. డేటింగ్ యాప్‌లకు అమెరికా తరువాత ఇండియానే అతిపెద్ద మార్కెట్. ఇవి 2020లో మనదేశంలోని యువకుల నుంచి రూ.2,394 కోట్లు లాగేశాయి. – సాక్షి, హైదరాబాద్ టీనేజీ, పెళ్లికాని కుర్రాళ్లే లక్ష్యంగా కొన్ని విదేశీ కంపెనీలు ఇండియాలో డేటింగ్ యాప్స్ నిర్వహిస్తున్నాయి. తక్కువ కాలంలో కోట్ల రూపాయలు సంపాదించేందుకు డేటింగ్ యాప్‌ల పేరిట అక్రమమార్గం ఎంచుకున్నాయి. యాప్స్ నిర్వాహకులు చాలా తెలివిగా ఉచ్చులోకి లాగి, వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఇంకా కొందరి వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు సంపాదించి బ్లాక్‌మెయిలింగ్‌కు సైతం దిగుతున్నారు. ఎక్కడో విదేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తూ.. ఇక్కడి యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఎలా మోసం చేస్తారంటే..! వీరు చేసే మోసాలకు సోషల్ మీడియానే వేదిక. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన నరేశ్ ఒకరోజు సోషల్ మీడియాలో లామోర్ అనే డేటింగ్ యాప్ యాడ్ చూశాడు. అందమైన యువతులు మీ స్నేహం కోసం ఎదురుచూస్తున్నారు అన్న క్యాప్షన్‌తో ఆకర్షితుడయ్యాడు. దాంతో వెంటనే ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్ ఓపెన్ చేయగానే.. ఒకేసారి పదుల సంఖ్యలో అమ్మాయిలు తమతో స్నేహం చేయాలని సందేశాలు పంపారు. ఆ అమ్మాయిలతో చాట్ చేయాలంటే రూ.199 చెల్లించాలని షరతు విధించారు. రూ.199 కదా అని చెల్లించాడు. చాలామందితో చాట్ చేశాడు. మరికొందరు వీడియో చాట్ చేయాలని ఉందని చెప్పారు. వారి కాల్స్ వస్తున్నా.. ఆన్సర్ చేయలేకపోతున్నాడు. వారి కాల్ లిఫ్ట్ కావాలంటే మరోసారి రూ.499 చెల్లించాలని సందేశం వచ్చింది. అలా చేస్తే 1,600 డైమండ్లు వస్తాయి. అవి అయిపోయే వరకు మాట్లాడవచ్చన్నది దాని సందేశం. దీంతో తాను ట్రాప్‌లో ఇరుక్కున్నానని అర్థం చేసుకొని అంతటితో వదిలేశాడు. ఇలాంటి యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అందులో చైనావే అధికం. చైనాకే చెందిన లామోర్ డేటింగ్‌యాప్ ఇలా మన దేశంలో గతేడాది రూ.199 ప్యాకేజీల పేరిట దాదాపు రూ.7 కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కన మిగిలిన డేటింగ్ యాప్‌లు ఇంకెంత సంపాదించి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. యాప్ నిర్వాహకులు ఇలా సంపాదించిన డబ్బును బిట్కాయిన్ల రూపంలోకి మార్చి తమ దేశాలకు తీసుకెళ్తున్నారు. పరువు కోసం మౌనం..: ఇలా నమ్మి మోసపోయిన వారు ఏటా లక్షల్లో ఉంటారు. వారు పోగొట్టుకునే డబ్బు రూ.కోట్లలో ఉంటుంది. వీరంతా 18 నుంచి 35 ఏళ్లలోపు యువకులే కావడం గమనార్హం. రూ.199 పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేయలేరు. ఒకవేళ చేసినా.. వారు ఇలాంటి యాప్స్‌ను ఎందుకు డౌన్లోడ్ చేశావని మందలిస్తారు. దీంతో నలుగురిలో పరువు పోతుందని భయపడతారు. పరువు, చిన్నమొత్తమే కదా అన్న రెండు అంశాలే ఆయుధంగా నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ ఇలాగే డేటింగ్ వెబ్సైట్లో అమ్మాయితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాడు. వాటిని రికార్డు చేసి అతన్నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇలాంటి బెదిరింపులకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏజెన్సీలతో రిక్రూట్మెంట్.. ఇలాంటి డేటింగ్ సైట్లలో పనిచేసే అమ్మాయిలను భర్తీ చేసేందుకు ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉన్నాయి. టాలెంట్ ఏజెన్సీ పేరుతో వీరు అమ్మాయిలను ఉద్యోగాల కోసం పంపుతారు. వీరు చేయాల్సిందల్లా.. అబ్బాయిలతో ఫోన్లలో మాట్లాడటమే. ఎంత ఎక్కువ సేపు మాట్లాడితే అంత ఎక్కువ డబ్బు వీరికి వస్తుంది. సోనోకాన్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఏజెన్సీ ఉంది. ఇది ఇప్పటివరకు 15 డేటింగ్ యాప్‌లకు రెండువేల మంది అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి రిక్రూట్ చేసింది. సోనోకాన్లాంటి కంపెనీలు చాలానే ఉన్నాయి. కొన్ని గణాంకాలు పరిశీలిస్తే.. డేటింగ్ యాప్స్ ద్వారా ఏటా మోసపోతున్న మొత్తం రూ.2,394 కోట్లు సగటున రోజుకు పోగొట్టుకుంటున్నది రూ.6.5 కోట్లు ఏటా మోసపోతున్న యువకులు 12 కోట్లు సగటున నిమిషానికి మోసపోతున్న యువకులు 229 వీటికి దూరంగా ఉండాలి డేటింగ్ యాప్స్‌లో అధిక భాగం పశ్చిమబెంగాల్ నుంచి నడుస్తున్నాయి. ఇందుకోసం ఆయా కంపెనీలు అమ్మాయిలతో ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీరు అబ్బాయిలే లక్ష్యంగా చేసుకుని కాల్స్ చేస్తున్నారు. వారిని తమ మాయమాటలతో ముగ్గులోకి దింపి న్యూడ్ కాల్స్ చేయిస్తున్నారు. వాటిని వీడియో తీసి, తిరిగి వారికే పంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరూ కూడా అందమైన అమ్మాయిల ఫొటోలు చూపి వల వేసే కాల్స్‌ను నమ్మొద్దు. డేటింగ్ యాప్స్, సైట్స్‌కు దూరంగా ఉండటం మంచిది. – ప్రసాద్, ఏసీపీ, సీసీఎస్ -
అమ్మాయితో చాటింగ్, నగ్నవీడియోలు.. కట్ చేస్తే!
సాక్షి, కుత్బుల్లాపూర్: ఆన్లైన్లో డేటింగ్ యాప్ క్రియేట్ చేసి ఓ యువకుడిని నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తులపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.. సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. లోకాంటో ఆన్లైన్ డేటింగ్ యాప్ ..పేరుతో ఓ ఐడి క్రియేట్ చేసి, దాని ద్వారా యువకులను మభ్యపెట్టి అమ్మాయిలు అబ్బాయిలు కమ్యూనికేషన్ ఉండేలా చూస్తామని చెప్పి మోసానికి పాల్పడుతున్న వ్యక్తుల బండారం బయటపడింది. సుచిత్ర గోదావరి హోమ్స్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే యువకుడు ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆన్లైన్లో ఉన్న డేటింగ్ యాప్‌ను సంప్రదించి ఓ మహిళతో మాటలు కలిపాడు. ఇలా వారం రోజుల వ్యవధిలో అతను నగ్నంగా ఉన్న ఫొటోలను ఆ అమ్మాయి సేకరించింది. ఇక అంతే మూడో వ్యక్తి ఎంటరై నీ ఫొటోలను యూట్యూబ్, ఫేస్ బుక్ పాటు ఇతర సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో కరుణాకర్ పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన ఘటన వివరాలను వెల్లడిస్తూ ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ రమేష్ కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైమ్‌కు సమాచారం ఇచ్చారు. (చదవండి: గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగుల మధ్య ఘర్షణ) -
డేటింగ్ ఫ్రెండ్: ఆ పదాలు యూట్యూబ్‌లో సెర్చ్
సాక్షి, హైదరాబాద్: డేటింగ్ పేరుతో నగరానికి చెందిన యువకుడిని ట్రాప్ చేసి, అతడి ఖాతా నుంచి రూ.11.36 లక్షలు కాజేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేశవను విచారించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇతడితో సహా ముగ్గురు నిందితుల్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం అరెస్టు చేశారు. న్యాయస్థానం అనుమతితో వీరికి కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. ఈ కేసులో నంద్యాలకు చెందిన సోఫియా అనే యువతి కోసం గాలిస్తున్నారు. ► మెదక్ జిల్లా జిన్నారంలో ఉండే కేశవ డిగ్రీ రెండో సంవత్సరంలో చదువు మానేశాడు. 2018లో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. బెంగళూరులో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న మేనమామ హరిప్రసాద్ వద్దకు చేరాడు. ఓ కేటరింగ్ సంస్థలో రోజుకు రూ.300 జీతానికి కుదిరాడు. ఈ ఆదాయం సరిపోకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ► యూట్యూబ్‌లో ‘హౌ టు ఎర్న్ ఈజీ మనీ’ సెర్చ్ చేసిన కేశవ.. దాదాపు 10 వేల వీడియోలను పరిశీలించాడు. వాటి నుంచి రిమోట్ అసిస్టెంట్ యాప్‌ను ఎంచుకుని వివరాలు తెలుసుకున్నాడు. తన స్మార్ట్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. ఏడాదిపాటు ప్రాక్టీస్ చేశాడు. ► ఈ యాప్‌ను వినియోగించి ఎలా మోసాలు చేయాలనేది కూడా యూ ట్యూబ్‌లో ఉంది. దీని కోసం ఓ సెల్ఫోన్లో ఫోర్న్ వీడియోలు ప్లే చేస్తూ లేదా ఓ యువతితో మాట్లాడిస్తూ.. మరో సెల్‌ఫోన్ నుంచి ఎంపిక చేసిన టార్గెట్‌కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. రెండో ఫోన్ బ్యాక్ కెమెరాను మొదటి ఫోన్ స్రీన్‌కు సరిగా సరిపోయేలా చేసి సదరు యువతే మాట్లాడుతున్న భ్రమ కలిగించేవాడు. ► ఈ సైబర్ క్రైమ్ విధానాన్ని మేనమామ హరిప్రసాద్‌కు చెప్పడంతో ఇద్దరూ కలిసి రంగంలోకి దిగారు. దీనికి అవసరమైన సిమ్ కార్డుల్ని బోగస్ వివరాలతో బెంగళూరులోని మెజిస్టిక్ రైల్వేస్టేషన్ వద్ద వీటిని విక్రయించే అన్భురాజ్ నుంచి పొందారు. ► గత ఏడాది రంగంలోకి దిగిన కేశవ తమకు సహకరించడానికి బిగో యాప్ ద్వారా పరిచయమైన నంద్యాలకు చెందిన సోఫియా అనే యువతితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పెద్ద సంఖ్యలో యువతుల ఫొటోలు, వివరాలతో ఫేస్బుక్లో ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. వీటి నుంచి అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపేవాడు. ► ఇలా పలువురి బ్యాకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ సంగ్రహించి అదను చూసుకుని ఖాతాల్లోని డబ్బులు ఖాళీ చేసేవాడు. ఇలా ఈ గ్యాంగ్ హైదరాబాద్, సైబరాబాద్, తిరుపతిల్లో ముగ్గురి నుంచి రూ.20 లక్షలు కాజేసింది. ► సిటీలో కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలోని బృందం కేశవ, హరిప్రసాద్, అన్బురాజ్లను అరెస్టు చేసింది. చదవండి: మహిళకు ఉరిశిక్ష.. దేశంలో తొలిసారి -
డేటింగ్ యాప్: అందమైన అమ్మాయిలతో..!
సాక్షి, గచ్చిబౌలి : డేటింగ్ అంటూ యాప్‌లో అందమైన అమ్మాయిలను ఎరగా వేసి చీటింగ్‌కు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను సీపీ వి.సి.సజ్జనార్ వెల్లడించారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ డేటింగ్ యాప్‌ను ఓపెన్ చేశారు. పేరు, మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే అందమైన అమ్మాయిల ఫొటోలు కనిపించాయి. కొద్ది సేపటికే రీమా అనే యువతి ఫోన్ చేసి విదేశీయులకు సహాయంగా వెళ్లేందుకు మేల్ ఎస్కార్ట్ జాబ్ ఉందని చెప్పింది. మాటల్లో పెట్టి డేటింగ్ కోసం అందమైన అమ్మాయిలను పంపుతామని నమ్మించింది. యువతి మాయమాటలకు ఆకర్షితుడైన సదరు వ్యక్తి మొదట రూ. 2,500 ఆన్లైన్లో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జాయినింగ్ ఫీజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్, వీఐపీ మెంబర్‌షిప్‌లు, ప్రోడక్ట్ పర్చేజ్ ఫీజ్, లేట్ పీజ్, ఇన్సూ్యరెన్స్, రీఫండ్ అమౌంట్ పేరిట ఏకంగా రూ. 13,83,643 ఆన్లైన్లో చెల్లించారు. చదవండి: ప్రేమాయణం.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా.. డేటింగ్ కోసం మీ ప్రాంతంలో అమ్మాయిలు అందుబాటులో లేరని బుకాయిండంతో తన వెనక్కు ఇవ్వాలని అడిగారు. చెల్లిస్తామని చెప్పి ఫోన్ పెట్టేసిన తరువాత ఆ ఫోన్ కలవక పోవడంతో మోసాన్ని బాధితుడు సెప్టెంబర్ 18న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ చెందిన మరో వ్యక్తి ఆ వెబ్సైట్ ఓసెన్ చేసి మొబైల్ నంబర్, పేరు ఎంటర్ చేశారు. త్రిష అనే యువతి మాట్లాడి మొదట ఎస్కార్ట్ జాబ్ ఇస్తామని, తరువాత మాటల్లో పెట్టి అమ్మాయిలను డేటింగ్‌కు పంపిస్తామని నమ్మబలికింది. రూ. 1,500 ఆన్లైన్లో చెల్లించాడు. మెంబర్ షిప్, జీఎస్టీ అంటూ వివిధ పేర్లు చెప్పి బ్యాంక్ అకౌంట్‌కు ఆన్లైన్లో రూ. 1,15,700 చెల్లించాడు. మాయ మాటలుగా గుర్తించి అక్టోబర్ ఒకటిన సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి అమ్మాయిలతో కాల్‌సెంటర్..డేటింగ్ ముఠా అరెస్ట్ రెండు వారాలపాటు రెక్కీ.. ఐదుగురు అరెస్ట్ పోలీసులు తమ విచారణలో వెస్ట్ బెంగాల్‌లోని సిలిగురి కేంద్రంగా కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందం సిలిగురి వెళ్లి రెండు వారాల పాటు రెక్కీ నిర్వహించి ఏబీసీ ఫైనాన్స్ బోర్డు పెట్టుకొని కాల్‌సెంటర్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. పర్యవేక్షకులుగా పని చేస్తున్న సిలిగురికి చెందిన బిజయ్ కుమార్ షా, బినోద్ కుమార్ షా, మహ్మద్‌నూర్ అలమ్ అన్సారీ, మేనేజేర్లు దీప హల్దార్(27), షికా హల్దార్(22)లను స్థానిక పోలీసుల సహకారంతో ఈ నెల 11న అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ల్యాప్ టాప్, 31 సెల్ ఫోన్లు, 12 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు సంతు దాస్, అమిత్ పాల్, శశాంక్ కుమార్‌లు పరారీలో ఉన్నారు. రోజుకు రూ. కోటి మేర మోసం డేటింగ్.. చీటింగ్ కేసులో నేపాల్‌కు చెందిన సంతుదాస్ కింగ్ పిన్‌గా వ్యవహరిస్తున్నాడు. నేపాల్ నుంచి వచ్చి సిలిగురిలో నివాసం ఉంటున్నాడు. డేటింగ్ పేరిట చీటింగ్‌కు పాల్పడే 35 కాల్ సెంటర్లు సిలిగురిలో నిర్వహిస్తూ రోజు దాదాపు కోటి రూపాయల వరకు మోసానికి పాల్పడుతున్నారని కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. భవనం అద్దెకు తీసుకొని బిజయ్, బినోద్ పర్యవేక్షణలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఫోన్లో మాట్లాడే యువతులకు రోజు చేసే బిజినెస్‌లో 10 శాతం ఇస్తారు. బిజయ్ కుమార్ అకౌంట్లోకి డబ్బు వచ్చిన వెంటనే తమకు రావాల్సిన మొత్తం ఉంచుకొని మిగతా డబ్బును వెంటనే సంతుదాస్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేస్తారు. కస్టమర్లతో మాట్లాడిన సిమ్‌లను తీసి పడేస్తారు. పోలీసులు విచారణ చేస్తున్నారని చిన్నపాటి అనుమానం వచ్చినా కాల్ సెంటర్లు మూసివేసి సంతుదాస్ నేపాల్‌కు వెళ్లి పరిస్థితులు చక్కబడే వరకు తలదాచుకుంటాడు. ప్రధాన నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. డేటింగ్ యాప్‌లను ఓపెన్ చేయొద్దు.. డేటింగ్ యాప్‌లను ఓపెన్ చేయవద్దని, తెలియని వ్యక్తులకు వ్యక్తి గత సమాచారం ఇవ్వొద్దని, ఆన్లైన్ డబ్బులు చెల్లించవద్దని కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించారు. సైబర్ క్రైం బృందాన్ని అభినందించి రివార్డు అందజేశామన్నారు. సమాశంలో క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిణి, ఏసీపీ బాలకృష్ణారెడ్డి, ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఎస్ఐ రాజేంద్ర, ఏఎస్ఐ శ్యామ్, సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మాయిలతో కాల్‌సెంటర్..డేటింగ్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : డేటింగ్ యాప్ పేరుతో 16 మంది అమ్మాయిలతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలో ఉన్న కాల్ సెంటర్‌పై దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 16 మంది యువతులకు 41 సీఆర్పీ సెక్షన్ కింద నోటీసులు అందజేశారు. ఆనంద్కర్, బుద్దపాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరు దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, 24 సెల్ఫోన్లు, 51 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
‘డేటింగ్ ఫ్రెండే’ దోచేసింది
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ యువకుడు డేటింగ్ యాప్స్ మోజులో పడి రూ.11.3 లక్షలు కోల్పోయాడు. అతడి ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం అతడి ప్రమేయం లేకుండానే ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని, ఆన్ చేశాక యాప్స్ అన్నీ డిలీట్ అయి ఉండటంతో అనుమానం వచ్చి ఏపీలో ఉన్న బ్యాంకు ఖాతా సరిచూడగా అందులో ఉండాల్సిన రూ.15 లక్షలకు బదులు రూ.3.7 లక్షలు మాత్రమే ఉన్నాయి. అంతు చిక్కకుండా ఉన్న ఈ కేసును సవాల్‌గా తీసుకున్న ఏసీపీ కేవీఎం ప్రసాద్ ప్రత్యేకంగా దర్యాప్తు చేయించారు. ఫలితంగా గురువారం నాటికి ఈ వ్యవహారంలో స్పష్టత వచ్చింది. ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన కిషోర్ ప్రస్తుతం ఎస్సార్‌నగర్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. అతడి తండ్రి స్వస్థలంలోనే ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం పదవీ విమరణ చేసిన ఆయనకు రూ.15 లక్షలు బెనిఫిట్స్ అందాయి. వీటిని స్థానిక ఎస్బీఐ బ్రాంచ్‌లో కుమారుడు కిషోర్ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఈ ఖాతాకు సంబంధించిన యూనో యాప్‌ను కిషోర్ తన స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకుని లావాదేవీలు జరిపేవాడు. ఇదిలా ఉండగా... కొన్నాళ్ల క్రితం ఇతడికి ఓ డేటింగ్ యాప్ ద్వారా అఖిల అని చెప్పుకున్న యువతి పరిచయం అయింది. వాట్సాప్, ఐఎంఒ యాప్స్ ద్వారా చాటింగ్, ఫోన్ కాల్స్ వీరిద్దరి మధ్యా సాగాయి. కిషోర్ దగ్గర ఉన్న మొత్తం కొల్లగొట్టాలనే పథకం పన్నిత అఖిల అదును చూసుకుని అతడితో ఫోన్లో ‘గూగుల్ ప్లే సర్వీసెస్’ యాప్‌ను డౌన్లోడ్ చేయించింది. దానిని యాక్సస్ చేయడానికి అనువైన నంబర్‌ను అతడి నుంచే తీసుకుని తన ఫోన్ ద్వారా లింకు ఏర్పాటు చేసుకుంది. టీమ్ వ్యూవర్ తరహాకు చెందిన ఆ యాప్ ద్వారా అఖిల తన ఫోన్ నుంచే కిఫోర్ ఫోన్‌ను, అందులోని యాప్స్‌ను యాక్సస్ చేయవచ్చు. కొన్ని రోజుల తర్వాత తనకు కొంత డబ్బు అవసరం ఉందని, కావాల్సినప్పుడు అడిగితే సహాయం చేయాలని కోరడంతో కిషోర్ అందుకు అంగీకరించాడు. ఈ నెపంతో తనను యూనో యాప్‌లో బెనిఫిషియరీగా జోడించేలా చేసింది. ఎప్పటి లాగానే వీరిద్దరూ బుధవారం ఉదయం చాలాసేపు చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత కిషోర్ తన ఫోన్ చార్జింగ్ పెట్టి బయటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన సదరు అఖిల సదరు యాప్ ద్వారా కిషోర్ ఫోన్‌ను యాక్సస్ చేసింది. యూనో యాప్ ద్వారా గిద్దలూరులోని బ్యాంకు ఖాతాలో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్లు రద్దు చేసి ఆ మొత్తం నుంచి రూ.11.3 లక్షలు దఫదఫాలుగా బెంగళూరులో మహేశ్వర్ పేరుతో ఉన్న ఖాతాల్లోకి నిఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా మళ్లించింది. ఆపై యూనో సహా అన్ని యాప్స్ డిలీట్ చేయడంతో పాటు ఫోన్‌ను ఫార్మాట్ చేసేసింది. కొద్దిసేపటి తర్వాత తన ఫోన్‌ను పరిశీలించిన కిషోర్ అన్ని యాప్స్ డిలీట్ కావడాన్ని గుర్తించి గిద్దలూరులోని బ్యాంకు ఖాతాను పరిశీలించాలని తండ్రిని కోరాడు. ఆ పని చేసిన ఆయన ఫిక్సిడ్ డిపాజిట్లూ గల్లంతయ్యాయని, కేవలం రూ.3.7 లక్షలు ఉన్నట్లు చెప్పాడు. దీంతో బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన సైబర్ కాప్స్ ఆ మొత్తం బెంగళూరు ఖాతా నుంచి ప్రకాశం జిల్లా కందుకూరులో ఉన్న ఖాతాలకు వెళ్లినట్లు, అక్కడే డ్రా అయినట్లు గుర్తించారు. సదరు అఖిలగా చెప్పుకున్న యువతి ఎవరనేది గుర్తిస్తే ఈ కేసులో చిక్కుముడి వీడుతుందనే ఉద్దేశంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. డేటింగ్ యాప్స్‌లో ద్వారా జరిగే మోసాలకు ఇదో ఉదాహరణ అని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు. -
యువతుల ఫొటోలతో ఏడాదిలో రూ.20 లక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ఇన్‌స్ట్రాగామ్ యాప్ నుంచి యువతుల ఫొటోలు డౌన్లోడ్ చేయడం... వీటిని వినియోగించి డేటింగ్ యాప్ టిండర్‌లో ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం... దీని ఆధారంగా చాటింగ్ చేస్తూ సెక్స్ చాట్, న్యూడ్ ఫొటోలంటూ వసూలు చేయడం... ఏడాది కాలంగా ఈ పంథాలో అనేక మందిని మోసం చేసిన సీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి వెన్నెల వెంకటేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇతను ఇప్పటి వరకు అనేక మందితో యువతుల మాదిరిగా చాటింగ్ చేసి రూ.20 లక్షలు వరకు వసూలు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన వెన్నెల వెంకటేష్ కొన్నాళ్ళు విజయవాడలో విద్యనభ్యసించాడు. ప్రస్తుతం సీఏ ఫైనల్ ఇయర్‌కు రావడంతో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో ఉంటున్న తన బావ వద్ద నివసిస్తున్నాడు. చార్టెడ్ అకౌంటెంట్‌గా మారే లోపే తేలిగ్గా డబ్బు సంపాదించుకోవాలని భావించిన అతగాడు యువతుల పేరిట ఎరవేసే ప్లాన్ వేశాడు. ఇన్‌స్ట్రాగామ్ నుంచి అందమైన యువతుల ఫొటోలను డౌన్లోడ్ చేసుకునేవాడు. వీటిని వినియోగించి వేర్వేరు పేర్లతో డేటింగ్ యాప్ టిండర్‌లో ప్రొఫైల్స్ క్రియేట్ చేసేవాడు. తనతో ఎవరైనా చాటింగ్ చేయాలంటూ పింగ్ చేయండి అంటూ తన వాట్సాప్ నెంబర్ ఇచ్చేవాడు. అలా చాటింగ్‌లోకి వచ్చిన వారితో అతడే యువతిగా చాటింగ్ చేసేవాడు. సెక్స్ చాటింగ్ చేయాలంటే రూ.100, న్యూడ్ ఫొటోలు పంపాలంటే రూ.300, న్యూడ్ వీడియో కాలింగ్ చేయాలంటూ రూ.500 తన బ్యాంకు ఖాతాలో పంపాలని కోరేవాడు. అంగీకరించిన వారికి విజయవాడలోని బ్యాంకు ఖాతా వివరాలు అందించేవాడు. ఎవరైనా డబ్బు డిపాజిట్ చేయడానికి ముందు ‘మగా, ఆడా?’ అంటూ సందేశం పెడితే వెంటనే ‘బై’ అంటూ వారిని కట్ చేస్తున్న భావన కలిగించే వాడు. దీంతో పూర్తిగా ఇతడి వల్లోపడిపోయి ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు. డబ్బు బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేసే వారు కాదు. దీంతో దాదాపు ఏడాది కాలంలో ఇతగాడు అనేక మందిని మోసం చేసి నుంచి రూ.20 లక్షల వరకు తన ఖాతాలో వేయించుకోగలిగాడు. వెంకటేష్ రెండు నెలల క్రితం నగరానికి చెందిన ఓ యువతి ఫొటో వినియోగించి టిండర్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఆ యువతికి ఇటీవలే నగరానికి చెందిన మరో యువకుడితో నిశ్చితార్థం అయింది. అయితే ఈమె ఫొటోతో ఓ ప్రొఫైల్ టిండర్‌లో ఉన్నట్లు కాబోయే భర్త తరఫు వారికి తెలియడంతో ఎంగేజ్మెంట్ రద్దయింది. దీంతో ఆమె సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు దర్యాప్తు చేశారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఆయన వెంకటేష్ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మోహన్‌రావు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో యువతులు తమ ఫొటోలు అప్ లోడ్ చేయకపోవడమే ఉత్తమమని పేర్కొన్నారు. -
మనకు నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడొచ్చు!
‘స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమే మన చేతిలో ఉన్నట్లు’ అన్న మాట అక్షర సత్యం. విజ్ఞానం, వినోదం.. ఒకటేంటి అన్ని విధాలా ఫోన్ మనిషికి ఓ అత్యవసరంగా మారిపోయింది. చిత్రంగా స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని దగ్గరగా ఉన్న వాళ్లు దూరం అవుతుంటే సోషల్ మీడియా పుణ్యమా అని పరిచయం లేని వాళ్లతో కొత్త స్నేహాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని అవసరాలతో పాటు ప్రేమ కోసం కూడా కొన్ని యాప్‌లు, సైట్లు పుట్టుకొచ్చాయి. అవే డేటింగ్ యాప్స్, సైట్లు! ఈ డేటింగ్ సైట్స్, యాప్స్‌ల సంస్కృతి ఇప్పుడిప్పుడే మన దేశంలో వేళ్లూనుకుపోతోంది. ఇంట్లో కూర్చుని సరుకులు ఆర్డర్ చేసినట్లు ఆన్లైన్లో మనకు నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడొచ్చు. వీటి ద్వారా కొన్ని వేల మందిని జల్లెడ పట్టి మనకు నచ్చిన భాగస్వామిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది.అలాగే ఎలాంటి వారు కావాలలో(అభిరుచులు, అభిప్రాయాలు..) ఎంచుకోవచచ్చు. మ్యాచింగ్ టెస్ట్ ద్వారా మనకు ఎలాంటి భాగస్వామి అయితే బాగుంటారో కూడా తెలుసుకోవచ్చు. మనం వారిని కలుసుకునే ముందుగా వారిని గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు, పరిచయం పెంచుకోవచ్చు. నచ్చితే మన రిలేషన్‌ను ముందుకు నడిపించొచ్చు. ప్రేమ కోసం అన్వేషించే సోషల్ మీడియా లవర్స్ కోసం పది డేటింగ్ సైట్లు, యాప్స్ : 1) OKCupid.com 2) Tastebuds.fm 3) HowAboutWe.com 4) MySingleFriend.com 5) eHarmony.com యాప్స్ 6) Tinder 7) Bumble 8) Hinge 9) Happn 10) Wingman (డేటింగ్ యాప్స్ లేదా సైట్లు వాడాలనుకునే వారు ముందుగా గుర్తుంచుకోవాల్సిదేంటంటే.. వీటి పనితీరుపై యువతనుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అలాగే వీటి వాడకంతో కొన్ని లాభాలు మరికొన్ని నష్టాలు కూడా ఉంటాయని గుర్తించాలి.) చదవండి : డేటింగ్ యాప్.. బాప్రే బాప్ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
డేటింగ్ యాప్.. బాప్రే బాప్
‘కొత్తగా స్నేహితులను చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే అందుకోసం ఏవేవో ఫీట్లు చేయాల్సిన అవసరం లేదు.. మీ మొబైల్ ఫోన్ తీసుకోండి.. మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి.. అంతే మీ ఆలోచనలకు సరితూగే వేలాది మంది మీ కోసం ఎదురుచూస్తున్నారు.. వెంటనే వారితో ముచ్చటించండి.. స్నేహితులుగా మారండి..’ ఇవీ డేటింగ్ సైట్లు చెబుతున్న మాటలు.. ఇటీవల ఢిల్లీలో 52 ఏళ్ల మహిళకు ఓ డేటింగ్ యాప్‌లో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మాటామాటా కలిసి స్నేహితులుగా మారారు. ఓ రోజు నేరుగా కలుద్దామని నిర్ణయించుకున్నారు. ఇలా తరచూ కలుస్తుండేవారు.. కానీ ఓ రోజు ఆ మహిళ తన అపార్ట్మెంటులో హత్యకు గురైంది. తీరా చూస్తే ఆ ‘స్నేహితుడే’ఆమెను హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. డేటింగ్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండకపోతే జరుగుతున్న పరిణామాలకు ఇదో చిన్న ఉదాహరణ. దేశంలో ఇప్పుడు డేటింగ్ యాప్‌లు, సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్‌లను రూపొందిస్తున్నారు. ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ఫోన్లు ఉండటంతో వెంటనే ముందూ వెనుక చూడకుండా యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా వీటిని వాడుతున్నారు. కొందరేమో నిజంగానే స్నేహితుల కోసం ఈ యాప్‌లను వాడుతుండగా.. మరికొందరేమో మోసం చేయాలనే దురుద్దేశంతోనే వీటిని వాడుకుంటున్నారు. అయితే వీరి వలలో పడి మోసపోయిన వారు కుటుంబసభ్యులకు, పోలీసులకు కానీ చెప్పడానికి భయపడుతున్నారు. సమాజంలో పరువు పోతుందని భావించి ఎవరితో చెప్పుకోకుండా వారిలో వారే మథనపడుతున్నారు. ఇలాంటి వారినే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ‘స్కౌట్’యాప్‌తో మోసాలు.. విద్యార్థులు, యువకులను లక్ష్యంగా చేసుకుని స్కౌట్ అనే డేటింగ్ యాప్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని కొందరు బాధితులు ‘సాక్షి’తో వాపోయారు. అమ్మాయిలతో వీడియో కాల్ మాట్లాడిస్తామని మాయ మాటలు చెప్పారన్నారు. వీడియో కాల్ మాట్లాడాలంటే డబ్బులు పంపాలని అడిగారని.. నిజంగానే మాట్లాడతారేమోనన్న ఆశతో డబ్బులు పంపామన్నారు. డబ్బులు పంపిన వెంటనే తమ నంబర్లు బ్లాక్‌లో పెట్టారని, మోసపోయామని తెలుసుకునే లోపే నష్టం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేస్బుక్లో ప్రకటన ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నామని, ఈ యాప్ తో అనేకమంది విద్యార్థులు ఇందులో ఇరుక్కుని, నష్టపోతున్నారని, ఎవరితో చెప్పుకోవాలో తెలియక తమలో తామే కుమిలిపోతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగానే కాకుండా.. తెలంగాణ, ఏపీల్లో కూడా ఈ దందా జరుగుతోందని పేర్కొన్నారు. సాధారణంగా చేసే తప్పులు... ► వీడియో కాల్ లేదా వెబ్ కెమెరా ద్వారా మాట్లాడేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏమరుపాటు ప్రదర్శించినా చిక్కుల్లో పడతారు. స్క్రీన్ షాట్లు తీసి, మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. ► డేటింగ్ సైట్లలో ప్రతి పది మందిలో ఒకరు నగ్న చిత్రాలను పంచుకుంటున్నారట. బాగానే మాట్లాడుతున్నారు కదా అని నగ్న చిత్రాలను వారితో షేర్ చేస్తే అంతే సంగతులు.. ► వ్యక్తిగత విషయాలను ఎదుటివారితో సులువుగా పంచుకుంటారు. మీ అడ్రస్.. మీ తల్లిదండ్రుల వివరాలు, కుటుంబ నేపథ్యం ఇలా ఏవీ కూడా ఎవరితోనూ డేటింగ్ యాప్‌లల్లో పంచుకోకూడదు. ► డేటింగ్ యాప్‌లల్లో ఉన్నవారు దాదాపు 57 శాతం మంది తమ గురించి పూర్తిగా అబద్ధాలే చెబుతున్నారట. ఉద్యోగం, పెళ్లి, రూపం, ఆకారం, నేపథ్యం ఇలా అన్ని విషయాల్లో అబద్ధమే చెబుతున్నారని తేలింది. మోసగాళ్లను ఎలా గుర్తించవచ్చు.. డేటింగ్ సైట్లలో మోసగాళ్లను ఎలా గుర్తించాలో సైబర్ నిపుణులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. వాటిని పాటిస్తే కొంతలో కొంత వారి బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు. వాటిలో కొన్ని.. అవతలి వ్యక్తి భాష, వాక్య నిర్మాణం, ఇంగ్లిష్ సరిగా లేకపోయినా, అక్షర దోషాలున్నా వారిని దూరంగా ఉంచడమే మంచిది. ప్రొఫైల్‌పై ఉన్న ఫొటోను గూగుల్ సెర్చ్ చేయాలి. ఒకవేళ మోసగాళ్లయితే ఆ ఫొటో గూగుల్‌లో ఉంటుంది. స్నేహితులుగా మారిన తర్వాత.. ఏవేవో కష్టాలు, కథలు చెబుతూ.. డబ్బులు అడుగుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ డబ్బులు పంపకూడదు. డబ్బుల గురించి మాట్లాడారంటే వారు మోసగాళ్లే. మోసపోయామని తెలిసిన వెంటనే ఇంట్లో వారికి కానీ.. పోలీసులకు కానీ కచ్చితంగా ఫిర్యాదు చేయాలి. మోసగాళ్లను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటారు. అప్పుడే వేరే ఎవరూ మోసపోకుండా జాగ్రత్తపడతారు. ఆన్లైన్లో బాగా మాట్లాడుతున్నారు కదా.. నేరుగా కలుద్దామంటే ముందూ వెనుక ఆలోచించకుండా వెళ్లకూడదు. వెళితే ఏదైనా దారుణం జరగొచ్చు. ఇటీవలే ఫేస్బుక్ స్నేహితుడు.. లైంగిక కోరికలు తీర్చలేదని ఓ అమ్మాయిని దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఏవేవో లింకులు పంపి వాటిని చూడమంటే అస్సలు చూడకండి. ఆ లింకుల్లో అశ్లీల చిత్రాలు ఉండే అవకాశం ఉంది. అలాంటి లింకులు తెరిస్తే మీ ఫోన్ లేదా కంప్యూటర్లో మాల్వేర్ డౌన్లోడై మీ వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. -
ఒక్క అమ్మాయి వెంట ముగ్గురు మగాళ్లు!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ఆన్లైన్ డేటింగ్ ఫ్లాట్‌ఫారాలపై ఒక్క అమ్మాయి వెంట ముగ్గురు మగవాళ్లు పోటీ పడుతున్నారు. అంటే దేశంలో డేటింగ్ యాప్స్‌ను ఉపయోగిస్తున్న వారిలో 26 శాతం మందే మహిళలు ఉన్నట్లు ‘వూస్’ అనే దేశీయ డేటింగ్ యాప్ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. అమెరికా మహిళలకన్నా ఈ సంఖ్య ఎంతో తక్కువ. అమెరికాలో టిండర్, బంబుల్ డేటింగ్ యాప్స్‌ను 40 శాతం మంది మహిళలను ఉపయోగిస్తున్నారు. డేటింగ్ యాప్స్‌ను పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కబుర్ల కోసం ఉపయోగిస్తుండగా భారత్‌లోనే లక్ష్యం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో భారతీయులను ఇంటర్వ్యూలు చేయగా ఎక్కువ మంది, అంటే 32 శాతం మంది అర్థవంతమైన సంబంధం కోసం అని సమాధానం ఇవ్వగా, కొత్త నగరానికి వెళ్లినప్పుడు అక్కడ కొత్త వారిని పరిచయం చేసుకోవాలనే ఉద్దేశంతోని 28 శాతం మంది సమాధానం ఇవ్వగా, కేవలం సామాజిక సర్కిల్‌ను పెంచుకోవడం కోసమే ఈ యాప్స్‌ను ఉపయోగిస్తున్నామని 17 శాతం మంది తెలిపారు. 18 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్కులైన యువకులను ప్రశ్నించగా, కేవలం మిత్రల కోసమేనని, ముఖ్యంగా అమ్మాయిల స్నేహం కోసమని చెప్పారు. వారిలో ఎక్కువ మంది చదువురీత్యనో, ఉద్యోగం రీత్యనో దూరం ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన అమ్మాయిలతో స్నేహం చేయడానికి ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నారని ‘ట్రూలీమాడ్లీ’ అనే డేటింగ్ యాప్ సహ వ్యవస్థాపకుడు సచిన్ భాటియా తెలిపారు. కొత్త నగరానికి వచ్చినప్పుడు ప్రజల సోషల్ నెట్‌వర్క్‌లు పరిమితం అవుతాయిగనుక, కొత్త వారిని పరిచయం చేసుకోవడానికి ఎక్కువ మంది డేటింగ్ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. యూజర్ల మధ్య ఏదో బంధం ఏర్పడడానికి ఈ యాప్స్ ఎంతో దోహదం చేస్తున్నాయని ఆయన తెలిపారు. సగటు యూజర్లు రోజుకు ఈ యాప్స్‌పై దాదాపు 45 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తున్నారు. ‘మహిళలతో పోలిస్తే మగవాళ్లే ఈ యాప్స్‌పై ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఒకేసారి పలువురు మహిళలతో మాట్లాడేందుకు మగవారు ఇష్ట పడుతుండగా, మహిళలు మాత్రం ఒకేసారి ఇద్దరు, ముగ్గురు మగాళ్లకు మించి మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు’ అని సర్వే నివేదిక వెల్లడించింది. ఇష్టపడే లేదా నచ్చే మహిళా ప్రొఫైళ్లు ఎక్కువ కనిపించడం లేదని మగ యూజర్లు చెబుతుండగా, ఎక్కువ మంది మగాళ్ల ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నామని మహిళలు చెప్పారు. భారత్ లాంటి దేశంలో మహిళలు సామాజికంగా ఇంకా వెనకబడి ఉండడమే కాకుండా మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు కూడా తక్కువే. మొబైల్ ఇంటర్నెట్ యూజర్లలో 89 శాతం మంది మగవాళ్లే ఉన్నారు. ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాపై కూడా ముగ్గురు మగవాళ్లకు ఒక మహిళ ఉన్నారు. డేటింగ్ యాప్స్‌లో కూడా 70 శాతం మహిళలు వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించేందుకు భయపడుతున్నారు. డేటింగ్ యాప్స్‌ను ఉపయోగించే మహిళలకు మరింత భద్రతను కల్పించేందుకు తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే భద్రత విషయంలో ఇప్పుడు మెరుగ్గానే ఉన్నాయని మహిళా యూజర్లు అభిప్రాయపడ్డారు. అమెరికాలోని అతిపెద్ద ఆన్‌లైన డేటింగ్ సంస్థ టిండర్ గత సెప్టెంబర్‌లో ‘మై లవ్’ అనే డేటింగ్ యాప్‌ను ప్రవేశపెట్టగా, అమెరికాలోని దాని పోటీ సంస్థ ‘బంబుల్’ ఈనెలలో బాలివుడ్ సినీ తార ప్రియాంక చోప్రాతో కలిసి భారతీయ డేటింగ్ యాప్‌ను ప్రారంభించబోతోంది. ఈ యాప్ భారతీయ మహిళలు ప్రొఫైల్స్‌లోగానీ, సంభాషణలోగానీ తమ పూర్తి పేరును వెల్లడించాల్సిన అవసరం లేదని, పేరులోని మొదటి అక్షరాన్ని వెల్లడిస్తే సరిపోతుందని యాప్ నిర్వాహకులు తెలిపారు. -
పోటాపోటీగా ‘కన్యత్వ’ అమ్మకాలు
సాక్షి వెబ్‌డెస్క్ : చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అమ్మ వైద్యం కోసమో, కేన్సర్‌తో బాధపడుతున్న నాన్న వైద్యం కోసమో రష్యా, చైనా, థాయ్‌లాండ్ యువతులు తమ కన్యత్వాన్ని బహిరంగ వేలం ద్వారా అమ్ముకునేవారు. జర్మనీ, నెదర్లాండ్‌కు చెందిన యువతులు ప్రపంచ పర్యటనకు అవసరమైన డబ్బుల కోసమో, ప్రపంచాన్ని తిప్పి చూపించే ధనికుడికో తమ కన్యత్వాన్ని అమ్ముకునేవారు. ఇప్పుడు రష్యాకు చెందిన యువతులు అపార్టుమెంట్లు కొనుక్కోవడానికి, ఒకేసారి ధనవంతులు అయిపోవడానికి తమ కన్యత్వాన్ని వేలం వేస్తున్నారు. ఇదివరకు ఇలా కన్యత్వాన్ని వేలం వేసుకునే కన్యలు ఒకరో, ఇద్దరో ఉండగా ఇప్పుడు వేల మంది యువతులు పోటీపడి మరీ ముందుకు వస్తున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఇటు కన్యలను, అటు ధనవంతులను కలిపి కాస్త సొమ్ము సంపాదించేందుకు దళారులు కూడా బయల్దేరారు. దళారుల ఫీజులు కూడా లక్షల రూపాయల్లో ఉంటున్నాయి. దీంతో కొందరు యువతులు ‘రైట్ టు ది ఫస్ట్ నైట్’ అనే వేదికలకు, డేటింగ్ వెబ్సైట్లలో తమ కన్యత్వం అమ్మకానికి ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి వారిని ఆకర్షించడం కోసం దళారులు కూడా క్లబ్బులు ఏర్పాటు చేస్తూ ఆ క్లబ్బుల పేరిట వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తున్నారు. అలాగే ఆన్లైన్ ‘బ్యాడ్ గర్ల్స్ క్లబ్’ ఏర్పాటయింది. రష్యాలోని ఏ నగరానికి చెందిన వారైనా సరే, 19 ఏళ్లలోపుండి, అందంగా, ఆకర్షణీయంగా ఉన్న వాళ్లు కావాలంటూ ఇలాంటి క్లబ్బులో ప్రకటనలు ఇస్తున్నారు. తాము కన్యగానే ఉన్నట్లు వేలంలో పాల్గొనే అమ్మాయిలు అవసరమైన వైద్య సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది. ఏ నగరానికి చెందిన వారైనా సరే యువతి ఫొటోలు నచ్చితే మాస్కో వరకు వచ్చి పోయేందుకు టిక్కెట్లు కూడా ఉచితంగానే పంపిస్తామని దళారులు చెబుతున్నారు. దాంతో మిలానా మెర్సర్ లాంటి వారు పడకపై అర్థ నగ్నంగా దిగిన ఫొటోలను దళారీలకు పంపిస్తున్నారు. ఇలంటిదే మరో క్లబ్ ‘డెస్పరేట్ వర్జిన్స్ క్లబ్’ పేరిట ఏర్పాటయింది. ‘నాకు 19 ఏళ్లు. ఎత్తు 175 సెంటీమీటర్లు, బరువు 65 కిలోలు. కన్యత్వం అమ్మడానికి సిద్ధం. వ్యక్తిగత సందేశం పంపించండి’ అంటూ ఒకరు. ‘వయస్సు 17, కన్యత్వం అమ్మకానికి సిద్ధం. వ్యక్తిగత సందేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తాను’ అంటూ మరొకరు డెస్పరేట్ వర్జిన్స్ క్టబ్’కు పోస్టింగ్‌లు చేస్తున్నారు. అనంతరం బ్రోకర్లు ‘ఫలానా మరినా 18,90,000 రూపాయలకు తన కన్యత్వాన్ని అమ్ముకొని ఎంచెక్కా ఓ ఫ్లాట్ కొనుక్కొంది....ఫలానా అమ్మాయి పది లక్షల రూపాయలకు కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టగా...పాపం, ఫలానా అమ్మాయి కేన్సర్‌తో బాధ పడుతున్న తన తల్లికి చికిత్స చేయించేందుకు కేవలం మూడు లక్షల రూపాయలకే కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది’ అన్న ప్రకటనలు క్లబ్‌ల పేరిట వెలిసిన వైబ్సైట్లలో తెగ కనిపిస్తున్నాయి. ‘నేను వళ్లు అమ్ముకునే పడుపు వత్తి చేయాలనుకోవడం లేదు. ఒక్క పైసా ఇవ్వక పోయినా సరే, బాగా డబ్బున్న యువకుడితో అనుభవాన్ని కోరుకుంటున్నాను’ లాంటి ప్రకటనలు కూడా కొంత మంది యువతులు చేస్తున్నారు. ‘నేను 500 డాలర్లు చెల్లించి అనేక మంది కన్నె పిల్లల పొందును కొనుక్కున్నాను’ అని ఓ మెడికల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న అన్న అనే బైసెక్సువల్ తెలిపారు. డేటింగ్ క్లబ్బులు వల్గర్‌గా ఉంటున్నందున తాను కూడా ‘క్లబ్’ సైట్లను ఆశ్రయిస్తున్నానని తెలిపారు. ఫలానా మెలీనా అనే 18 ఏళ్ల అమ్మాయి తన కన్యత్వాన్ని 20 లక్షల రూపాయలకు ఫలానా హోటల్లోని, ఫలానా గదిలో అమ్ముకుందంటూ కూడా బ్రోకర్లు పబ్లిసిటీ ఇస్తున్నారు. కన్యత్వానికి సిద్ధమైన వారితో టీవీ ఛానళ్లు టాక్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. వారు ఎందుకు కన్యత్వాన్ని అమ్ముకుంటున్నారో ఎలాంటి ఇబ్బంది లేకుండా వీడియో సాక్షిగా తెలియజేస్తున్నారు. -
బ్రిట్నీ స్పియర్స్ మోసపోయిందా?
పాపులర్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 2010 నుంచీ కొన్నేళ్ల పాటు ఇటు పర్సనల్‌గా, కెరీర్ పరంగా చాలా కష్టాలనే ఎదుర్కొన్న ఆమె, ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ చేస్కొని చక్కగా లైఫ్‌ని లీడ్ చేస్తోంది. ముఖ్యంగా శామ్ అస్గరీతో ప్రేమలో పడ్డాక బ్రిట్నీ లైఫంతా మారిపోయింది. ఇప్పుడు ఊహించనంత సంతోషంగా రోజులను గడుపుతోందామె. ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తారు. బ్రిట్నీకేమో 36 ఏళ్లు. శామ్ అస్గరీకి 23 ఏళ్లు. వయసులో చాలా తేడా ఉన్నా ఇద్దరూ చూడముచ్చటగా కనిపిస్తారు. అది వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టంగా ప్రేమించుకోవడం వల్లేనేమో! కపుల్ గోల్స్ క్యాటగిరీలో వీళ్లనూ పడేస్తుంటారు నెటిజన్స్. ఇంతవరకూ బాగానే ఉంది. ఇక్కడే తాజాగా బయటకొస్తోన్న ఓ వార్త కొంత తేడాగా ఉంది. ఓవైపు బ్రిట్నీతో ప్రేమలో ఉంటూనే, మరోవైపు వేరే అమ్మాయిలతోనూ డేట్ చేస్తున్నాడట శామ్. ఇదెంతవరకూ నిజమన్నది ఎవ్వరికీ తెలియదు కానీ డేటింగ్ యాప్స్‌లో శామ్ అఫీషియల్ అకౌంట్స్ ఉన్నాయని, బ్రిట్నీతో పాటుగా, అతను వేరే అమ్మాయిల వెంట కూడా పడుతున్నాడని ఈ అకౌంట్స్ చూపించి, చెబుతున్నారు నెటిజన్లు. బ్రిట్నీ అంత పాపులర్ కాదు శామ్. మోడల్‌గా ఇప్పుడే కెరీర్లో వృద్ధిలోకి వస్తున్నాడు. అలాంటి వాడు బ్రిట్నీనే మోసం చేస్తున్నాడా? బ్రిట్నీ నిజంగానే ప్రేమలో మోసపోతోందా? కాలమే సమాధానం చెప్పాలి. శామ్ అయితే తాను అలాంటి వాడిని కానని క్లీన్ చీట్ ఇచ్చుకుంటున్నాడు తనకు తానే! చూడాలి... ఈ ప్రేమకథ ఎటు వెళుతుందో!! -
ఆన్ లైన్ డేటింగ్.. చిక్కితే తిప్పలే!
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. అయితే నో ప్రాబ్లమ్. స్మార్ట్ ఫోన్ ద్వారా గేమ్స్ ఆడటం, ఆన్ లైన్ లో బిల్లులు చెల్లించడం, ఇతర లావాదేవీలు చేయడం వరకూ ఎలాంటి సమస్య లేదు. కానీ ఆన్ లైన్ యూజర్లు ముఖ్యంగా డేటింగ్ సర్వీసును అందించే యాప్స్ వాడుతున్న భారతీయులు సమస్యలు ఎదుర్కొంటున్నారట. ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ వాడే ప్రతి ఐదుగురు భారతీయులలో ముగ్గురికి(దాదాపు 60శాతం యూజర్లు) కచ్చితంగా సెక్యూరిటీ ఇబ్బందులు తప్పడం లేదట. తాజాగా బుధవారం విడుదలైన ఓ సర్వేలో ఈ విషయాలు బహిర్గమయ్యాయి. భారత్ లో దాదాపు 38 శాతం యూజర్లు ఆన్ లైన్ డేటింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. 8 శాతం మహిళలు, 13 శాతం పురుషులు తమ స్మార్ట్ ఫోన్లలో డేటింగ్ సర్వీస్ యాప్స్ వాడుతున్నారు. 16 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న 1005 మంది ఇండియన్ స్మార్ట్ యూజర్లపై సర్వే చేసినట్లు మార్టన్ మొబైల్ సర్వే వారు తెలిపారు. 64శాతం మంది మహిళలు తమ డేటింగ్ భాగస్వాములతో పాటు వైరస్ ప్రొగామ్స్ ద్వారా సమస్యలు ఎదుర్కొంటున్నారని, అదే విధంగా పురుషులు కూడా సైబర్ క్రైమ్ నేరాలలో చిక్కుకుంటున్నారు. వైరస్ వల్ల 23శాతం, యాడ్స్ వల్ల 13శాతం, సైబర్ క్రైమ్స్ 9శాతం, ప్రీమియం సర్వీసులు 9శాతం, ఐడెండిటీ చోరీ సమస్యలు 6శాతం, ప్రతీకార సెక్స్ క్రైమ్ 4శాతం మంది యూజర్లు ఆయా విభాగాల వారీగా సమస్యలతో బాధపడుతున్నారు. నగరాల వారీగా చూస్తే.. న్యూఢిల్లీలో 51శాతం, చెన్నైలో 39శాతం, కోల్ కతాలో 36శాతం, ముంబై, అహ్మదాబాద్ లో 35శాతం యూజర్లు కనీసం ఓసారి డేటింగ్ యాప్స్ వినియోగించినట్లు సర్వేలో వెల్లడైంది. దక్షిణాది నగరాలైన చెన్నైలో 20శాతం యూజర్లు, హైదరాబాద్ యూజర్లలో 21శాతం మంది ఈ యాప్స్ కారణంగా సమస్యలలో ఇరుక్కుంటున్నట్లు సర్వే బృందం తెలిపింది. సైబర్ నేరాలు, ఇతర భద్రతాపరమైన సమస్యల వలయంలో బాధితుడు/బాధితురాలు కాకూడదంటే ఇలాంటి ఆన్ లైన్ డేటింగ్ యాప్స్, అదే తరహాలో ఉండే మరిన్ని యాప్స్ ను వినియోగించరాదని సర్వే చేసిన నార్టన్ మొబైల్ సర్వే సభ్యులు సూచించారు.