వయసు మళ్లిన వాళ్లు.. వయసులో అమ్మాయిలతో డేటింగ్ చేయడమే షుగర్ డాడీ యాప్స్ కాన్సెప్ట్. అయితే ఇది తోడు వరకో లేదంటే చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఆగిపోదు. శారీరక సుఖం.. దానికి బదులుగా యువతులకు కాస్ట్‌లీ గిఫ్ట్‌లు, డబ్బు ఎరవేస్తుంటారు. విదేశాల్లో బాగా నడిచే ఈ వ్యవహారానికి మనదేశంలోనూ క్రేజ్ ఉంది. కానీ, త్వరలో ఇలాంటి యాప్స్‌పై బ్యాన్ విధించేందుకు గూగుల్ సిద్ధం అయ్యింది.
సెప్టెంబర్ 1 నుంచి షుగర్ డాడీ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించబోతున్నట్లు గూగుల్ ప్లేస్టోర్ స్పష్టం చేసింది. సెక్సువల్ కంటెంట్ మీద కొరడా జులిపించాలని గూగుల్ నిర్ణయించుకుంది. ఈ మేరకు నిర్ణయించుకున్న పాలసీల్లో షుగర్ డాడీ యాప్స్ కూడా టార్గెట్‌గా ఉంది. ఈ యాప్స్ మొత్తం సెక్సువల్ యాక్ట్స్ కిందకే వస్తాయని గూగుల్ ప్లేస్టోర్ జూన్ 29న ఓ ప్రకటన విడుదల చేసింది.
వ్యభిచారమే!
‘షుగర్ యాప్స్ అనేవి వయసు మళ్లిన ధనవంతులు.. డబ్బులు వెదజల్లి అమ్మాయిలతో డేటింగ్ కోసం ఉపయోగించే యాప్స్. అయితే ఇది ముమ్మాటికీ డేటింగ్ యాప్స్ ముసుగులో వ్యభిచారం నడిపించడమే’ అని గూగుల్ ప్లేస్టోర్ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక మూములు డేటింగ్ యాప్‌లు కూడా ఇలా అశ్లీలతను పెంపొందించేలా వ్యవహరిస్తే.. వాటి మీద కూడా బ్యాన్ తప్పదని హెచ్చరించింది గూగుల్ ప్లే స్టోర్.
మన దగ్గరా
ఇక మన దేశంలో ఇప్పుడిప్పుడే వీటి క్రేజ్ పెరుగుతోంది. ఆసియా దేశాల లిస్ట్‌లో.. మన దేశంలో మూడున్నర లక్షల మంది షుగర్ డాడీలు ఉండగా, ఇండొనేషియాలో అరవై వేలమంది ఉన్నారు. ఈ యాప్‌ల్లో ‘ఎస్‌డీఎం, స్పాయిల్, షుగర్ డాడీ, షుగెర్ డాడీ’.. ఇవి ప్లేస్టోర్ ద్వారా బాగా పాపులర్ అయ్యాయి. సెక్సువల్ రిలేషన్స్ ప్రొత్సహించే ఏ యాప్స్‌ను ఉపేకక్షించబోమని స్పష్టం చేసింది గూగుల్. అయితే అనధికారిక యాప్ స్టోర్‌లలో, డౌన్‌లోడ్‌లతో షుగర్ డేటింగ్ యాప్స్ కొనసాగే అవకాశాల్లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment