Google Play Store application
-
మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి..!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రమాదకరమైన 8 యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఆ యాప్స్‌ను ఫోన్ల నుంచి వెంటనే డిలీట్ చేయాలని యూజర్లను హెచ్చరించింది. టప్ మని నీటి బుడగలా పేలిపోయే బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఇంటస్ట్ర్ చూపిస్తున్నారు. అయితే ఆ ఇంట్రస్ట్‌ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరస్తులు కొత్త మార్గాల్ని అనుసరిస్తున్నారు. బిట్ కాయిన్‌పై యాప్స్ తయారు చేసి వైరస్ల సాయంతో యూజర్ల అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. దీంతో గూగుల్ ఆయా యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ♦ బిట్‌ఫండ్స్- క్రిప్టో క్లౌడ్ మైనింగ్ ♦ బిట్‌కాయిన్ మైనర్- క్లౌడ్ మైనింగ్ ♦ వికీపీడియా (BTC)- పూల్ మైనింగ్ క్లౌడ్ వాలెట్ ♦ క్రిప్టో హోలిక్- బిట్‌కాయిన్ క్లౌడ్ మైనింగ్ ♦ డైలీ బిట్ కాయిన్ రివార్డ్స్ - క్లౌడ్ ఆధారిత మైనింగ్ వ్యవస్థ ♦ బిట్‌కాయిన్ 2021 ♦ మైన్‌బిట్ ప్రో - క్రిప్టో క్లౌడ్ మైనింగ్ & బిటిసి మైనర్ ♦ ఎథీరియం (ETH) - పూల్ మైనింగ్ క్లౌడ్ యాడ్స్‌ను ఎరగా వేసి సైబర్ నేరస్తులు తయారు చేసిన యాప్స్ ద్వారా యూజర్ల అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తుంటారని ప్రముఖ సెక్యూరిటీ సంస్థ ట్రెండ్ మైక్రో తెలిపింది. ట్రెండ్ మైక్రో రిపోర్ట్ ప్రకారం.. తొలత సైబర్ నేరస్తులు బిట్ కాయిన్ పై ట్రేడింగ్ నిర్వహించేందుకు ఇష్టపడుతున్న వారిని టార్గెట్ చేస్తారు. వారికి రూ.1000తో (ఉదాహరణకు) బిట్ కాయిన్‌పై ట్రేడింగ్ చేస్తే వారికి అదనంగా రూ.2వేలు చెల్లిస్తామంటూ యాడ్స్‌ను క్రియేట్ చేస్తుంటారు. పొరపాటున ఆ యాడ్స్‌ను క్లిక్ చేస్తే మన పర్సనల్ డేటా అంతా సైబర్ నేరస్తుల డేటాలో స్టోరై ఉంటుందని సెక్యూరిటీ సంస్థ తెలిపింది. ఆ తర్వాత యాప్స్ ద్వారా మాల్వేర్ సాయంతో అకౌంట్లలో ఉన్న డబ్బులు కాజేస్తుంటారని, ఇలాంటి యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చదవండి : Asus Chromebook: మార్కెట్లో బాహుబలి ల్యాప్ ట్యాప్ -
డేటింగ్ ముసుగులో వ్యభిచారమే.. గూగుల్ డెడ్లీ వార్నింగ్
వయసు మళ్లిన వాళ్లు.. వయసులో అమ్మాయిలతో డేటింగ్ చేయడమే షుగర్ డాడీ యాప్స్ కాన్సెప్ట్. అయితే ఇది తోడు వరకో లేదంటే చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఆగిపోదు. శారీరక సుఖం.. దానికి బదులుగా యువతులకు కాస్ట్లీ గిఫ్ట్‌లు, డబ్బు ఎరవేస్తుంటారు. విదేశాల్లో బాగా నడిచే ఈ వ్యవహారానికి మనదేశంలోనూ క్రేజ్ ఉంది. కానీ, త్వరలో ఇలాంటి యాప్స్‌పై బ్యాన్ విధించేందుకు గూగుల్ సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 1 నుంచి షుగర్ డాడీ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించబోతున్నట్లు గూగుల్ ప్లేస్టోర్ స్పష్టం చేసింది. సెక్సువల్ కంటెంట్ మీద కొరడా జులిపించాలని గూగుల్ నిర్ణయించుకుంది. ఈ మేరకు నిర్ణయించుకున్న పాలసీల్లో షుగర్ డాడీ యాప్స్ కూడా టార్గెట్‌గా ఉంది. ఈ యాప్స్ మొత్తం సెక్సువల్ యాక్ట్స్ కిందకే వస్తాయని గూగుల్ ప్లేస్టోర్ జూన్ 29న ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యభిచారమే! ‘షుగర్ యాప్స్ అనేవి వయసు మళ్లిన ధనవంతులు.. డబ్బులు వెదజల్లి అమ్మాయిలతో డేటింగ్ కోసం ఉపయోగించే యాప్స్. అయితే ఇది ముమ్మాటికీ డేటింగ్ యాప్స్ ముసుగులో వ్యభిచారం నడిపించడమే’ అని గూగుల్ ప్లేస్టోర్ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక మూములు డేటింగ్ యాప్‌లు కూడా ఇలా అశ్లీలతను పెంపొందించేలా వ్యవహరిస్తే.. వాటి మీద కూడా బ్యాన్ తప్పదని హెచ్చరించింది గూగుల్ ప్లే స్టోర్. మన దగ్గరా ఇక మన దేశంలో ఇప్పుడిప్పుడే వీటి క్రేజ్ పెరుగుతోంది. ఆసియా దేశాల లిస్ట్‌లో.. మన దేశంలో మూడున్నర లక్షల మంది షుగర్ డాడీలు ఉండగా, ఇండొనేషియాలో అరవై వేలమంది ఉన్నారు. ఈ యాప్‌ల్లో ‘ఎస్డీఎం, స్పాయిల్, షుగర్ డాడీ, షుగెర్ డాడీ’.. ఇవి ప్లేస్టోర్ ద్వారా బాగా పాపులర్ అయ్యాయి. సెక్సువల్ రిలేషన్స్ ప్రొత్సహించే ఏ యాప్స్‌ను ఉపేకక్షించబోమని స్పష్టం చేసింది గూగుల్. అయితే అనధికారిక యాప్ స్టోర్లలో, డౌన్లోడ్లతో షుగర్ డేటింగ్ యాప్స్ కొనసాగే అవకాశాల్లేకపోలేదు. -
జోకర్‌తో నవ్వాలనుకుంటే అది ఏడిపిస్తోంది
'పెగసెస్' ప్రకంపనలు ప్రపంచదేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మంటలు చల్లారక ముందే ఇప్పుడు 'జోకర్' మాల్వేర్ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జోకర్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన మాల్వేర్. మనకు తెలిసిన జోకర్ నవ్విస్తే..ఈ జోకర్ మాత్రం ఫోన్లలో చొరబడి ఏడిపిస్తుంది. 2017లో తొలిసారిగా గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఇదే మాల్వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీని దెబ్బకు ఇటీవల కాలంలో ప్లేస్టోర్ నుంచి 1800యాప్ లను గూగుల్ తొలగించింది. ఈ ఏడాది జూన్ నెలలో జోకర్ దెబ్బకు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. మాల్వేర్ దాడి జరిగిందనే అనుమానంతో పది యాప్ లను తొలగించారు. తాజాగా ఈ మాల్వేర్ కెమెరా, ఫొటో, ట్రాన్సలేషన్ యాప్స్, ఎడిటింగ్ తో పాటు ప్రాసెసింగ్, మెసెంజర్, గేమింగ్ యాప్ లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నట్లు తేలింది. వాటి సాయంతో ఒకరి ఫోన్లోనుంచి మరొకరి ఫోన్లలోకి ప్రవేశిస్తోందని తేలింది. దీని ప్రభావం ఒక్క గూగుల్ ప్లేస్టోర్ లోనే కాకుండా ఇతర థర్డ్ పార్టీ యాప్ లపై దాడి చేస్తున్నట్లు ఇంక్రీన్స్ సీఈఓ నయ్యర్ తెలిపారు. డాక్టర్ వెబర్ వివరాల ప్రకారం... తొలిసారి ఈ మాల్వేర్ను ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే కు చెందిన యాప్ గ్యాలరీలో గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ యాప్ గ్యాలరీ సాయంతో ప్రమాదకరమైన మాల్వేర్ ను పంపిస్తుంది. ఇలా సుమారు 538,000 మంది వినియోగదారుల ఫోన్లలోకి చొరబడినట్లు సమాచారం. చదవండి: భారత్ ఎకానమీ చెక్కు చెదర్లేదు -
BGMI టీజర్ విడుదల: గేమ్‌ను 2060లో విడుదల చేస్తావా ఏంటి?!
పబ్జీ గేమ్.. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(BGMI) పేరుతో భారత్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గేమ్‌ను డిజైన్ చేసిన క్రాఫ్టన్ సంస్థ ప్రీ-రిజిస్ట్రేషన్లు, అప్డేట్స్, దానికి సంబంధించిన ఓ టీజర్ విడుదల చేయడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే గేమింగ్ లవర్స్ ఆసక్తికి అనుగుణంగా సదరు సంస్థ గేమ్‌ను విడుదల చేయడంతో విఫలమైందంటూ గేమింగ్ ప్రియులు పెదవి విరుస్తున్నారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా రానున్న పబ్జీ గేమ్ ను ఆడేందుకు ఔత్సాహికులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో ఈ గేమ్‌ను విడుదల చేసేందుకు పబ్జీ మాతృసంస్థ క్రాఫ్టన్ సంస్థ ప్రతినిధులు గేమ్‌ను రీ డిజైన్ చేసి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభింభించారు. దీంతో గేమ్ లవర్స్ భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అదే సమయంలో టీజర్‌ను విడుదల చేసింది. అయితే ఈ టీజర్ విడుదలతో గేమ్‌ను ఇన్స్టాల్ చేసుకొని ఆడేందుకు గేమింగ్ ప్రియులు ప్రయత్నించారు. కానీ ఆ గేమ్ ఇన్స్టాల్ చేసే ఆప్షన్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో ప్రి రిజిస్ట్రేషన్లు భారీ స్థాయిలో చేసుకుంటున్నారని ప్రచారం చేసుకోవడం కాదు.. గేమ్ ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్‌ను కూడా క్రియేట్ చేయాలి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు 2060 సంవత్సరం అయినా క్రాఫ్టన్ సంస్థ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా ప్రి రిజిస్ట్రర్ నౌ అని ప్రచారం చేసుకుంటుందని ట్రోల్ చేస్తున్నారు. కాగా, ప్రముఖ పబ్జీ గేమ్ మొబైల్ ఇన్ఫ్లుయెన్సర్ సాగర్ ఠాకూర్ ఇటీవల పబ్జీ మొబైల్ ఇండియన్ వెర్షన్ విడుదల తేదీని ప్రకటించి విషయం తెలిసిందే. జూన్ 18న విడుదల కానుందని బైనరీ కోడ్ ద్వారా ఆయన వెల్లడించారు. -
గూగుల్ హైదరాబాద్ కార్యాలయంపై కేసు నమోదు!
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ పై ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ ను వారణాసిలో నమోదు చేశారు. మైనర్ వినియోగదారులకు ఆండ్రాయిడ్ మోబైల్ పోన్లలో సులభంగా ఆశ్లీల సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచడంపై గూగుల్ పై కేసు నమోదు చేశారు. గూగుల్ ఇండియా హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలోని మేనేజర్ పై వారణాసి లోని పటేల్ నగర్ కు చెందిన వినీత్ కుమార్ సింగ్ కేసు నమోదు చేశారు. వినియోగదారుల వయస్సు, ఇతర వివరాలతో సంబంధంలేకుండా అశ్లీల సమాచారాన్ని గూగుల్ ప్లే స్టోర అప్లికేషన్ లో ఆండ్రాయిడ్ మోబైల్ ఫోన్లలో అందుబాటులో గూగుల్ సంస్థ ఉంచిందని పిటిషన్ వినీత్ పేర్కోన్నారు. గూగుల్ సరియైన చర్యలు తీసుకోకపోవడం వలన పిల్లలు అశ్లీల సమాచారానికి చాలా సులభంగా ఆకర్షింపబడుతున్నారనే పిటిషన్ లో తెలిపారని పోలీసు అధికారులు తెలిపారు.