గూగుల్ హైదరాబాద్ కార్యాలయంపై కేసు నమోదు!
గూగుల్ హైదరాబాద్ కార్యాలయంపై కేసు నమోదు!
Published Fri, Feb 7 2014 9:08 PM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ పై ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ ను వారణాసిలో నమోదు చేశారు. మైనర్ వినియోగదారులకు ఆండ్రాయిడ్ మోబైల్ పోన్లలో సులభంగా ఆశ్లీల సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచడంపై గూగుల్ పై కేసు నమోదు చేశారు. గూగుల్ ఇండియా హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలోని మేనేజర్ పై వారణాసి లోని పటేల్ నగర్ కు చెందిన వినీత్ కుమార్ సింగ్ కేసు నమోదు చేశారు.
వినియోగదారుల వయస్సు, ఇతర వివరాలతో సంబంధంలేకుండా అశ్లీల సమాచారాన్ని గూగుల్ ప్లే స్టోర అప్లికేషన్ లో ఆండ్రాయిడ్ మోబైల్ ఫోన్లలో అందుబాటులో గూగుల్ సంస్థ ఉంచిందని పిటిషన్ వినీత్ పేర్కోన్నారు. గూగుల్ సరియైన చర్యలు తీసుకోకపోవడం వలన పిల్లలు అశ్లీల సమాచారానికి చాలా సులభంగా ఆకర్షింపబడుతున్నారనే పిటిషన్ లో తెలిపారని పోలీసు అధికారులు తెలిపారు.
Advertisement