సాక్షి, కుత్బుల్లాపూర్: ఆన్‌లైన్‌లో డేటింగ్ యాప్ క్రియేట్ చేసి ఓ యువకుడిని నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తులపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.. సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. లోకాంటో ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ..పేరుతో ఓ ఐడి క్రియేట్ చేసి, దాని ద్వారా యువకులను మభ్యపెట్టి అమ్మాయిలు అబ్బాయిలు కమ్యూనికేషన్ ఉండేలా చూస్తామని చెప్పి మోసానికి పాల్పడుతున్న వ్యక్తుల బండారం బయటపడింది. సుచిత్ర గోదావరి హోమ్స్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే యువకుడు ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు.
ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో ఉన్న డేటింగ్ యాప్‌ను సంప్రదించి ఓ మహిళతో మాటలు కలిపాడు. ఇలా వారం రోజుల వ్యవధిలో అతను నగ్నంగా ఉన్న ఫొటోలను ఆ అమ్మాయి సేకరించింది. ఇక అంతే మూడో వ్యక్తి ఎంటరై నీ ఫొటోలను యూట్యూబ్, ఫేస్ బుక్ పాటు ఇతర సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో కరుణాకర్ పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన ఘటన వివరాలను వెల్లడిస్తూ ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ రమేష్ కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైమ్‌కు సమాచారం ఇచ్చారు.
(చదవండి: గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగుల మధ్య ఘర్షణ)
Comments
Please login to add a commentAdd a comment