chatting site
-
అమ్మాయితో చాటింగ్, నగ్నవీడియోలు.. కట్ చేస్తే!
సాక్షి, కుత్బుల్లాపూర్: ఆన్లైన్లో డేటింగ్ యాప్ క్రియేట్ చేసి ఓ యువకుడిని నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తులపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.. సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. లోకాంటో ఆన్లైన్ డేటింగ్ యాప్ ..పేరుతో ఓ ఐడి క్రియేట్ చేసి, దాని ద్వారా యువకులను మభ్యపెట్టి అమ్మాయిలు అబ్బాయిలు కమ్యూనికేషన్ ఉండేలా చూస్తామని చెప్పి మోసానికి పాల్పడుతున్న వ్యక్తుల బండారం బయటపడింది. సుచిత్ర గోదావరి హోమ్స్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే యువకుడు ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆన్లైన్లో ఉన్న డేటింగ్ యాప్‌ను సంప్రదించి ఓ మహిళతో మాటలు కలిపాడు. ఇలా వారం రోజుల వ్యవధిలో అతను నగ్నంగా ఉన్న ఫొటోలను ఆ అమ్మాయి సేకరించింది. ఇక అంతే మూడో వ్యక్తి ఎంటరై నీ ఫొటోలను యూట్యూబ్, ఫేస్ బుక్ పాటు ఇతర సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో కరుణాకర్ పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన ఘటన వివరాలను వెల్లడిస్తూ ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ రమేష్ కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైమ్‌కు సమాచారం ఇచ్చారు. (చదవండి: గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగుల మధ్య ఘర్షణ) -
‘నమ్మకం’ కోసం స్నేహితురాళ్ల ఫొటోలు షేర్
సాక్షి, సిటీబ్యూరో: చాటింగ్ యాప్ స్ట్రేంజర్‌లో విశృంఖలత్వం రాజ్యమేలుతోంది. ఈ యాప్ ద్వారా ఒకరికొకరు పరిచయమైన నగరానికి చెందిన ‘ఎక్స్’, ‘వై’ చాటింగ్ చేసుకున్నారు. తాను యువతినంటూ వై, ఎక్స్‌తో చెప్పాడు. అది నమ్మించడం కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో ఉన్న తన స్నేహితురాలైన ‘జెడ్’ ఫొటోలు షేర్ చేశారు. తన ఫొటోలు షేర్ అయిన విషయం ఎక్స్ ద్వారా తెలుసుకున్న జెడ్.. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు గురువారం ఎక్స్, వైలకు కౌన్సెలింగ్ ఇచ్చి తీవ్రంగా మందలించారు. కొన్నాళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన స్ట్రేంజర్ యాప్‌ను అనేక మంది తమ స్మార్ట్ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఆపై నాక్మే వాస్తేగా లాగిన్ అయి చాటింగ్స్ చేస్తున్నారు. ఇందులో చాట్ చేయడానికి ఒకరికి మరొకరు తెలిసి ఉండటం, పరిచయం అవసరం లేదు. దీంతో ఈ యాప్‌లో విశృంఖలత్వం వీరవిహారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నగరానికి చెందిన ఓ విద్యా సంస్థలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎక్స్‌కు స్ట్రేంజర్ ద్వారా విద్యార్థి అయిన వైతో పరిచయం ఏర్పడింది. తాను యువతినంటూ చెప్పుకొన్న వై.. ఎక్స్‌తో అభ్యంతరకరంగా, అసభ్యంగా చాటింగ్ చేశాడు. ఓ దశలో ‘నీ ఫొటోలు పంపించు’మంటూ ఎక్స్ కోరడంతో ఏం చేయాలని ఆలోచనలో పడ్డాడు. చివరకు క్లాస్మేట్ అయిన విద్యార్థిని ‘జెడ్’ ఇన్‌స్ట్రాగామ్ ఖాతా వినియోగించాలని నిర్ణయించుకున్నాడు. అందులో నుంచి ఆమె ఫొటోలను డౌన్లోడ్ చేసిన వై.. వాటిని ఎక్స్‌కు షేర్ చేస్తూ, అభ్యంతరకరమైన చాటింగ్ కొనసాగించాడు. సామాజిక సేవపై ఆసక్తి ఉన్న ఆ యువతి ‘జెడ్’ ఓ స్వచ్ఛంద సంస్థలో వలంటీర్‌గా పని చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆమె ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో ఉన్నాయి. ఓ దశలో వీటిని సంగ్రహించిన వై.. స్ట్రేంజర్ యాప్ ద్వారా ఎక్స్‌కు పంపించాడు. ఆ ఫొటోలో సదరు స్వచ్ఛంద సంస్థ పేరును చూసిన ఇతగాడు కొన్ని ప్రయత్నాలు చేసి జెడ్‌ను సంప్రదించాడు. ఈ నేపథ్యంలో తనతో చాటింగ్ చేస్తోంది ఆమె కాదని, ఫొటోలను వై దుర్వినియోగం చేసినట్లు గుర్తించి ఆమెకు సమాచారం ఇచ్చాడు. దీంతో జెడ్ ఈ నెల 17న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలు విజ్ఞప్తి మేరకు అధికారులు సాంకేతికంగా వైని కనిపెట్టారు. గురువారం బాధితురాలితో పాటు ఎక్స్, వైలను సైబర్ ఠాణాకు తీసుకువచ్చారు. వారి భవిష్యత్, కుటుంబ నేపథ్యాలను దృష్టిలో పెట్టుకున్న బాధితురాలు తదుపరి చర్యలు వద్దని, కౌన్సెలింగ్‌తో పాటు వార్నింగ్ ఇచ్చి బైండోవర్ చేయమని కోరారు. దీంతో అధికారులు ఇద్దరినీ మందలించడంతో పాటు పునరావృతం కాదంటూ లిఖితపూర్వకంగా హామీ తీసుకుని పంపారు. మహిళలు, యువతులు సోషల్‌మీడియాలో తమ వ్యక్తిగత ఫొటోలు పెడితే ఇలా దుర్వినియోగం అవుతుందని, కొన్నిసార్లు అసభ్యంగా మార్ఫింగ్‌కు గురవుతాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. విద్యార్థులు సైతం ఇలాంటి యాప్స్‌లో పడి తమ భవిష్యత్తును కాలరాసుకోవద్దని సూచిస్తున్నారు. ఈ తరహా యాప్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా ఉంచాలని నిర్ణయించారు. -
‘చాటింగ్’కు రూ.లక్షలు ఖర్చు...
సాక్షి, సిటీబ్యూరో: ఖాతాదారులకు చెందిన షేర్లు కాజేయడంతో పాటు నకిలీ ధ్రువీకరణలతో వాటిని విక్రయించి రూ.5.4 కోట్లు స్వాహా చేసిన కేసులో ఓ ప్రైవేట్ ఉద్యోగిని సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాచిగూడకు చెందిన శ్రీనివాసచారి వృత్తిరీత్యా వైద్యుడు. ఇతను కొన్నేళ్ల క్రితం బేగంపేటలోని ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన షేర్ల వ్యాపార సంస్థలో అనేక షేర్లు ఖరీదు చేశారు. సుదీర్ఘకాలం పాటు ఆయన వీటిని అమ్ముకోలేదు. ఈ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న శ్రవణ్‌కుమార్, అతని సహాయకుడు లక్ష్మీ దీపక్ తమ సంస్థలో షేర్లు ఖరీదు చేసి, కొన్నేళ్ల పాటు వాటిని తిరిగి విక్రయించని వ్యక్తుల వివరాలు సేకరించారు. వాటిలో శ్రీనివాసచారి ఖరీదు చేసిన షేర్ల వివరాలు తెలుసుకున్నారు. ఆయన వృద్ధాప్యంలో ఉండటంతో అతని మనుమడైన డాక్టర్ విజయ్ను సంప్రదించారు. మీ తాతగారు సుదీర్ఘకాలం క్రితం తమ సంస్థ ద్వారా భారీ స్థాయిలో షేర్లు ఖరీదు చేసినట్లు చెప్పడంతో విజయ్ ఆ షేర్లు విక్రయించి నగదు ఇవ్వాల్సిందిగా కోరారు. కొంత మేరకు షేర్లు విక్రయించగా వచ్చిన నగదును శ్రవణ్, దీపక్‌లు విజయ్‌కు అప్పగించారు. ఆపై కుట్ర పన్నిన వీరు మిగిలిన షేర్లకు సంబంధించిన మొత్తం కాజేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా విజయ్, శ్రీనివాసచారి పేర్లతో బోగస్ ధ్రువీకరణలు తయారు చేసిన ఇరువురూ వీటి ఆధారంగా వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచారు. రూ.2.94 కోట్ల విలువైన షేర్లను అనధికారికంగా విక్రయించి ఆ మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమ చేసుకున్నారు. వీటి నుంచి నగదును తమ ఖాతాల్లోకి మార్చుకుని కాజేశారు. అలాగే ఉషారాణి అనే మహిళకు చెందిన ధ్రువీకరణలు సంగ్రహించిన దీపక్ వీటి ఆధారంగా ఆమె షేర్లు విక్రయించాడు. మొత్తం రూ.2.5 కోట్లు శ్రవణ్ సహకారంతో తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. సహకరించినందుకు కమీషన్‌గా శ్రవణ్‌కు రూ.5 లక్షలు చెల్లించాడు. ఇలా వీరు రూ.5.4 కోట్లు కాజేశారు. 2014లో జరిగిన ఈ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులకు గతేడాది, ఈ ఏడాది ఫిర్యాదులు అందాయి. వీటిని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శ్రీనివాసాచారి కేసులో నిందితులను గత డిసెంబర్లో అరెస్టు చేసింది. ఇటీవల నమోదైన ఉషారాణి కేసుకు సంబంధించి మంగళవారం దీపక్‌ను పట్టుకుంది. పరారీలో ఉన్న శ్రవణ్ కోసం గాలిస్తోంది. ‘చాటింగ్’కు రూ.లక్షలు ఖర్చు... ఇలా సంపాదించిన సొమ్ముతో దీపక్ జల్సాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటర్నెట్లో ని కొన్ని చాటింగ్ సైట్స్‌లో వీడియో చాటింగ్ చేయడానికి డాలర్ల రూపంలో భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వీటికి బానిసగా మారిన దీపక్ ప్రతి రోజూ గంటల తరబడి అదే పనిలో ఉండేవాడు. చాటింగ్‌లో పరిచయమైన వారితో ‘వ్యక్తిగత సంభాషణలు’ చేయాలన్నా, వారి ‘ఫొటోలను’ పొందాలన్నా మరికొంత చెల్లించాల్సిందే. ఈ రకంగా దీపక్ రూ.లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. చాటింగ్ ద్వారా పరిచయమైన ఓ విదేశీ యువతికి పూర్తి ఖర్చులు భరించిన ఇతగాడు ఢిల్లీకి రప్పించాడు. అక్కడి ఓ సెవెన్ స్టార్ హోటల్లో నెల రోజులకు పైగా ఆమెతో కలిసి బస చేశాడు. విమానాల్లో షికార్లు, స్టార్ హోటల్స్‌లో బస, విలాసవంతమైన జీవితం... వీటికే డబ్బంతా ఖర్చు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో లోతుగా ఆరా తీస్తున్నారు. -
జాగ్రత్త! మీ పిల్లలు ఈ యాప్స్ వాడుతున్నారా?
మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ లేదా టాబ్ కొనిచ్చారా? వాళ్లు ఇరవై నాలుగు గంటలూ మొబైల్ లో చాట్ చేస్తూనే ఉన్నారా? మిమ్మల్ని చూడగానే చాటింగ్ హడావిడిగా వెళ్లిపోతున్నారా? కంగారు పడాల్సిందేమీ లేదు. ఈ తరం అంతే. అయితే వారు ఏ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చాట్ చేస్తున్నారు? ఎవరితో చాట్ చేస్తున్నారు? ఆ చాటింగ్ సైట్లు ఎలాంటివి? అన్నది మాత్రం చూసుకొండి. అయితే కొన్ని సైట్లలో వారు చాట్ చేస్తుంటే మాత్రం మీరు జాగ్రత్త పడాల్సిందే. అమాయకంగా వారు ఉపయోగించే సైట్లకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉండొచ్చు. అలా ఉన్న యాప్స్ లో లైంగిక వికృతిగాళ్లు, పీడోఫైల్స్ వంటి వారు మీ పాప లేదా బాబును ట్రాక్ చేసి, కలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. పరిచయం పెంచుకుని, వారిని ఎక్స్ ప్లాయిట్ చేయవచ్చు. అలాంటి కొన్ని సైట్లు ఈ దిగువన ఇస్తున్నాం. యిక్ యాక్ - ఇది అత్యంత ప్రమాదకరమైన సైట్. ట్విట్టర్ లాగా ఇది కూడా ఒక మైక్రో సైట్. 200 అక్షరాల వరకూ టైప్ చేసి మెసేజ్ ను పంపొచ్చు. ఈ మెసేజ్ నను సమీపంలో ఉన్న అయిదువందల మంది యిక్ యాక్ మెంబర్లు చూడగలుగుతారు. అంటే వీరంతా ఒకరికొకరు దగ్గరగా ఉండటం వల్ల కలుసుకునే అవకాశం ఉంటుంది. లైంగికంగా ప్రమాదకరమైన సమాచారాన్ని పోస్ట్ చేవచ్చు. అమెరికా తదితర పాశ్చాత్య దేశాల్లో స్కూళ్లలో ఈ సైట్ ను బ్లాక్ చేశారు. స్నాప్ చాట్ - దీనంత ప్రమాదకమైన సైట్ ఇంకోటి లేదు. ఇందులో ఫోటో పంపితే, దాన్ని ఓపెన్ చేసిన పది సెకన్లలో డిలీట్ అయిపోతుంది. అటు పంపిన వారి ఫోన్ లో, ఇటు పొందిన వారి ఫోన్ లో దాని ఛాయలు కూడా ఉండకుండా డిలీట్ అయిపోతుంది. అయితే కావాలనుకుంటే పది సెకన్లలో స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకుని, షేర్ చేసుకోవచ్చు. పిల్లలు సెక్స్టింగ్ చేసేందుకు ఈ సైట్ ను వాడుకుంటున్నారు. కిక్ మెసెంజర్ - ఇది ఒక ప్రైవేటు మెసింజర్ యాప్. మీరు పంపే మెసేజీని పొందాల్సిన వారు తప్ప ఇంకెవరకూ చూడలేదు. కాబట్టి మైనర్లకు గాలం వేసే సెక్స్ పిశాచులు ఈ సైట్ ను ప్రిఫర్ చేస్తున్నారు. పూఫ్ - ఈ యాప్ ప్రత్యేకతేమిటంటే స్క్నీన్ ను టచ్ చేస్తే చాలు మీరు కోరుకున్న యాప్ అదృశ్యం అయిపోతుంది. అంటే స్క్రీన్ మీద కనిపించదు. తల్లిదండ్రులు చూడాలనుకున్నా స్క్రీన్ మీద ఇది కనిపించదు. ఈ యాప్ ఇప్పుడు డిసేబుల్ అయింది. కానీ అంతకుముందే డౌన్ లోడ్ చేసుకున్న వారు దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఓమేగుల్ - ఈ సైట్ ప్రత్యేకత ఏమిటంటే మీరెవరో చెప్పనవసరం లేదు. ఎదుటివాడు ఎవరో తెలుసుకోనవసరం లేదు. మీరు 'యు' అన్న పేరుతో కనిపిస్తారు. ఎదుటివారు 'స్ట్రేంజర్' అన్న పేరుతో కనిపిస్తాడు. ఈ యాప్ ను ఫేస్ బుక్ లో లైక్ కొట్టడం ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విస్పర్ - విస్పర్ అంటే గుసగుస. ఈ సైట్ లో మీకు మాత్రమే తెలిసిన మీ పరమ రహస్యాలను ముక్కూ మొహం తెలియనివారితో షేర్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇలా రహస్యాలు చేసుకుంటే అది బ్లాక్ మెయిల్ కి దారి తీయొచ్చు కూడా. గతేడాది ఈ సైట్ ను వాడి ఒక 12 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసిన ఒక వాషింగ్టన్ నివాసి కి శిక్షకూడా పడింది. డౌన్ - ఈ సైట్ ను గతంలో బ్యాంగ్ విత్ ఫ్రెండ్స్ అనేవారు. దీని స్లోగన్ ఏమింటటే 'ఎవరికీ తెలియకుండా, రాత్రి వేళ మీ ఫ్రెండ్స్ లో ఫన్ పొందే చక్కని మార్గం'. ఇంకేమీ చెప్పనక్కర్లేదనుకుంటా! హాట్ ఆర్ నాట్, వైన్, ఫేక్ ఎ టెక్స్ట్, ఐ ఫన్నీ, పీఓ ఎఫ్ వంటి సైట్లు కూడా ప్రమాదకరమైనవేనని నిపుణులు చెబుతున్నారు. మీ బుజ్జి బంగారు బాబు, పాప ఏ సైట్లు చూస్తున్నారో, ఏ చాట్లు చేస్తున్నారో చూసుకొండి. జాగ్రత్త!!