జాగ్రత్త! మీ పిల్లలు ఈ యాప్స్ వాడుతున్నారా? | Beware of these sites | Sakshi
Sakshi News home page

జాగ్రత్త! మీ పిల్లలు ఈ యాప్స్ వాడుతున్నారా?

Published Sat, Apr 19 2014 12:40 PM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM

జాగ్రత్త! మీ పిల్లలు ఈ యాప్స్ వాడుతున్నారా?

జాగ్రత్త! మీ పిల్లలు ఈ యాప్స్ వాడుతున్నారా?

మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ లేదా టాబ్ కొనిచ్చారా? వాళ్లు ఇరవై నాలుగు గంటలూ మొబైల్ లో చాట్ చేస్తూనే ఉన్నారా? మిమ్మల్ని చూడగానే చాటింగ్ హడావిడిగా వెళ్లిపోతున్నారా?  కంగారు పడాల్సిందేమీ లేదు. ఈ తరం అంతే. అయితే వారు ఏ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చాట్ చేస్తున్నారు? ఎవరితో చాట్ చేస్తున్నారు? ఆ చాటింగ్ సైట్లు ఎలాంటివి? అన్నది మాత్రం చూసుకొండి.
అయితే కొన్ని సైట్లలో వారు చాట్ చేస్తుంటే మాత్రం మీరు జాగ్రత్త పడాల్సిందే. అమాయకంగా వారు ఉపయోగించే సైట్లకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉండొచ్చు. అలా ఉన్న యాప్స్ లో లైంగిక వికృతిగాళ్లు, పీడోఫైల్స్ వంటి వారు మీ పాప లేదా బాబును ట్రాక్ చేసి, కలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. పరిచయం పెంచుకుని, వారిని ఎక్స్ ప్లాయిట్ చేయవచ్చు. అలాంటి కొన్ని సైట్లు ఈ దిగువన ఇస్తున్నాం.

యిక్ యాక్ - ఇది అత్యంత ప్రమాదకరమైన సైట్. ట్విట్టర్ లాగా ఇది కూడా ఒక మైక్రో సైట్. 200 అక్షరాల వరకూ టైప్ చేసి మెసేజ్ ను పంపొచ్చు. ఈ మెసేజ్ నను సమీపంలో ఉన్న అయిదువందల మంది యిక్ యాక్ మెంబర్లు చూడగలుగుతారు. అంటే వీరంతా ఒకరికొకరు దగ్గరగా ఉండటం వల్ల కలుసుకునే అవకాశం ఉంటుంది. లైంగికంగా ప్రమాదకరమైన సమాచారాన్ని పోస్ట్ చేవచ్చు. అమెరికా తదితర పాశ్చాత్య దేశాల్లో స్కూళ్లలో ఈ సైట్ ను బ్లాక్ చేశారు.
స్నాప్ చాట్ - దీనంత ప్రమాదకమైన సైట్ ఇంకోటి లేదు. ఇందులో ఫోటో పంపితే, దాన్ని ఓపెన్ చేసిన పది సెకన్లలో డిలీట్ అయిపోతుంది. అటు పంపిన వారి ఫోన్ లో, ఇటు పొందిన వారి ఫోన్ లో దాని ఛాయలు కూడా ఉండకుండా డిలీట్ అయిపోతుంది. అయితే కావాలనుకుంటే పది సెకన్లలో స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకుని, షేర్ చేసుకోవచ్చు. పిల్లలు సెక్స్టింగ్ చేసేందుకు ఈ సైట్ ను వాడుకుంటున్నారు.
కిక్ మెసెంజర్ - ఇది ఒక ప్రైవేటు మెసింజర్ యాప్. మీరు పంపే మెసేజీని పొందాల్సిన వారు తప్ప ఇంకెవరకూ చూడలేదు. కాబట్టి మైనర్లకు గాలం వేసే సెక్స్ పిశాచులు ఈ సైట్ ను ప్రిఫర్ చేస్తున్నారు.
పూఫ్ - ఈ యాప్ ప్రత్యేకతేమిటంటే స్క్నీన్ ను టచ్ చేస్తే చాలు మీరు కోరుకున్న యాప్ అదృశ్యం అయిపోతుంది. అంటే స్క్రీన్ మీద కనిపించదు. తల్లిదండ్రులు చూడాలనుకున్నా స్క్రీన్ మీద ఇది కనిపించదు. ఈ యాప్ ఇప్పుడు డిసేబుల్ అయింది. కానీ అంతకుముందే డౌన్ లోడ్ చేసుకున్న వారు దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు.
ఓమేగుల్ - ఈ సైట్ ప్రత్యేకత ఏమిటంటే మీరెవరో చెప్పనవసరం లేదు. ఎదుటివాడు ఎవరో తెలుసుకోనవసరం లేదు. మీరు 'యు' అన్న పేరుతో కనిపిస్తారు. ఎదుటివారు 'స్ట్రేంజర్' అన్న పేరుతో కనిపిస్తాడు. ఈ యాప్ ను ఫేస్ బుక్ లో లైక్ కొట్టడం ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
విస్పర్ - విస్పర్ అంటే గుసగుస. ఈ సైట్ లో మీకు మాత్రమే తెలిసిన మీ పరమ రహస్యాలను ముక్కూ మొహం తెలియనివారితో షేర్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇలా రహస్యాలు చేసుకుంటే అది బ్లాక్ మెయిల్ కి దారి తీయొచ్చు కూడా. గతేడాది ఈ సైట్ ను వాడి ఒక 12 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసిన ఒక వాషింగ్టన్ నివాసి కి శిక్షకూడా పడింది.
డౌన్ - ఈ సైట్ ను గతంలో బ్యాంగ్ విత్ ఫ్రెండ్స్ అనేవారు. దీని స్లోగన్ ఏమింటటే 'ఎవరికీ తెలియకుండా, రాత్రి వేళ మీ ఫ్రెండ్స్ లో ఫన్ పొందే చక్కని మార్గం'. ఇంకేమీ చెప్పనక్కర్లేదనుకుంటా!
హాట్ ఆర్ నాట్, వైన్, ఫేక్ ఎ టెక్స్ట్, ఐ ఫన్నీ, పీఓ ఎఫ్  వంటి సైట్లు కూడా ప్రమాదకరమైనవేనని నిపుణులు చెబుతున్నారు. మీ బుజ్జి బంగారు బాబు, పాప ఏ సైట్లు చూస్తున్నారో, ఏ చాట్లు చేస్తున్నారో చూసుకొండి. జాగ్రత్త!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement