froud
-
అజిత్ 'మోసగాడు' అంటూ సీరియస్ అయిన నిర్మాత
తమిళ చిత్ర పరిశ్రమలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో అజిత్ కుమార్ ఒకరు. సూపర్‌హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ కింగ్ అయినప్పటికీ, చిత్రపరిశ్రమలో అతను ఎంతో వినయపూర్వకంగా ఉంటూ డౌన్ టు ఎర్త్‌గా పేరు పొందాడు. అయితే, అజిత్ అలాంటివాడేమి కాదంటూ.. నిర్మాత మాణికం నారాయణన్ ఆరోపిస్తున్నాడు. తన వద్ద డబ్బు తీసుకుని ఇప్పటికి కూడా తిరిగి ఇవ్వలేదని, అతనో మోసగాడని ఆరోపించాడు. (ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?) నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ అజిత్ కుమార్ తనను మోసం చేశారని మండిపడ్డారు. 'అజిత్ తన తల్లిదండ్రులను సెలవుపై మలేషియాకు పంపాలని చాలా సంవత్సరాల క్రితం నా నుంచి డబ్బు తీసుకున్నాడు. అప్పట్లో అతను నా కోసం ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. రెమ్యునరేషన్లో ఆ డబ్బును సర్దుబాటు చేస్తానని మాట ఇచ్చాడు. అయితే, ఈ రోజు వరకు కూడా అతను డబ్బు తిరిగి ఇవ్వలేదు. అంతే కాకుండా నాకు సినిమా చేయలేదు. ఇన్నేళ్లలో అతను దీని గురించే మాట్లాడటం మానేశాడు. అతను తనను తాను పెద్దమనిషిగా అనకుంటాడు కానీ అది నిజం కాదు.' అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అతనొక టాప్ హీరో ప్రతి చిత్రానికి రూ. 50కోట్లకు పైగానే సంపాదిస్తున్నాడు. కాబట్టి తనకు రావాల్సిన డబ్బు చెల్లించవచ్చు కదా అని నిర్మాత మాణికం ఫైర్ అవుతున్నాడు. తనతో పాటు ఏఎమ్ రత్నం వంటి నిర్మాతలు కూడా అజిత్ చిత్రాలను నిర్మించడంతో భారీగా నష్టాలను చవిచూశామని. ఇప్పటి వరకు నష్టపోయిన నిర్మాతలకు సహాయం కూడా చేయలేదని ఆయన పంచుకున్నారు. గతంలోనే ఆరోపణ హీరో అజిత్‌కు 1996లో మొదట రూ.6లక్షలు, 1998లో మరోసారి రూ.12 లక్షలు ఇచ్చానని నిర్మాత మాణికం నారాయణన్ గతంలోనే ఆరోపించారు. తాజాగా ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాడు. గతంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. నిర్మాత మాణికం కుతురు పెళ్లికి కొన్ని కారణాల వల్ల అజిత్ రాలేదని అందుకే ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని ఆయన ఫ్యాన్స్ తెలుపుతున్నారు. ప్రస్తుతం అజిత్ తన 60వ ప్రాజెక్ట్ 'వలిమాయి'తో బిజీగా ఉన్నాడు. (ఇదీ చదవండి: యువతికి కేక్ తినిపించిన బాలకృష్ణ.. ఆమె ఎవరంటూ..) -
రష్మికను మోసం చేసిన మేనేజర్!
సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నిరోజుల్లోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో రష్మిక మందన చోటు సంపాదించుకుంది . ఇక ‘పుష్ప’ సినిమాతో ఈ బ్యూటీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలతో ఫిదా చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. తాజాగా మీడియా కథనాల ప్రకారం రష్మిక గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: శ్రీజతో విడాకులు.. కల్యాణ్ దేవ్ కన్ఫర్మ్ చేసినట్లేనా?) తన వద్ద చాలా రోజులుగా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న మేనేజర్ మోసం చేశాడని తెలుస్తోంది. ఆమె నుంచి దాదాపు రూ. 80 లక్షలు దొంగలించాడని సమాచారం. దీంతో రష్మిక అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఈ వ్యవహారంపై ఆమె మౌనంగానే ఉంది. మరోవైపు రష్మిక ఈ ఏడాది ‘పుష్ప2’ తో పాటు, రణ్‌బీర్‌కపూర్, సందీప్ వంగా కాంబినేషన్లో వస్తున్న ‘యానిమల్’ చిత్రంలోనూ నటిస్తోంది. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా ఇంపాక్ట్.. గతం ఏం చెబుతోంది?) -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్, మీకు ఈ మెసేజ్ వచ్చిందా!
మీరు ఎస్బీఐ ఖాతాదారులా? మీ బ్యాంక్ అకౌంట్లను బ్లాక్ చేస్తామని మెసేజ్‌లు వస్తున్నాయా?అయితే అప్రమత్తంగా ఉండండి అంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. Here is an example of #YehWrongNumberHai, KYC fraud. Such SMS can lead to a fraud, and you can lose your savings. Do not click on embedded links. Check for the correct short code of SBI on receiving an SMS. Stay alert and stay #SafeWithSBI.#SBI #AmritMahotsav pic.twitter.com/z1goSyhGXq — State Bank of India (@TheOfficialSBI) March 4, 2022 కేవైసీ సబ్మిట్ చేయకపోతే అకౌంట్లను బ్లాక్ చేస్తామని వస్తున్న మెసేజ్‌లపై కేంద్రం అప్రమత్తమైంది.ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు ఎస్బీఐ ఖాతాదారుల్ని టార్గెట్ చేశారు. వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అంతేకాదు అనుమానాస్పద వ్యక్తులు కాల్ చేసినా,మెయిల్స్ పెట్టినా రిప్లయి ఇవ్వొద్దని తెలిపింది. ఒకవేళ ఎవరైనా పొరపాటున వచ్చిన మెసేజ్‌లకు సమాధానాలు ఇచ్చి ఉంటే report.phishing@sbi.co.in కు మెయిల్ చేయాలని తెలిపింది. A message in circulation claiming that your @TheOfficialSBI account has been blocked is #FAKE #PIBFactCheck ▶️ Do not respond to emails/SMS asking to share your personal or banking details. ▶️ If you receive any such message, report immediately at report.phishing@sbi.co.in pic.twitter.com/Y8sVlk95wH — PIB Fact Check (@PIBFactCheck) May 18, 2022 ఇప్పుడు రెండో సారి డియర్ కస్టమర్ మీ ఎస్బీఐ బ్యాంక్ డాక్యుమెంట్లకు కాలం చెల్లింది. అందుకే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 24గంటల్లోపు కేవైసీ సబ్మిట్ చేయండి. అందుకోసం మేం పంపిన లింక్స్ క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేయండి అంటూ సైబర్ నేరస్తులు ఓ లింక్‌ను ఎస్బీఐ ఖాతాదరులకు పంపిస్తున్నారు. ఇలా పంపడం ఇదే తొలిసారి కాదని, ఈ ఏడాది మార్చిలో ఒకసారి ఈ తరహా లింక్స్ పంపినట్లు ఎస్బీఐ అధికారికంగా తెలిపింది. అకౌంట్ హోల్డర్లు ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్త ఉండాలని హెచ్చరించింది. అనుమానం ఉంటే బ్యాంక్ అధికారుల్ని సంప్రదించాలని ట్వీట్లో పేర్కొంది. -
వామ్మో.. బంధువులని చేరదీస్తే ఎంత పనిచేశారు..
సాక్షి, కోనరావుపేట(రాజన్న సిరిసిల్ల): దగ్గరి బంధువని చేరదీస్తే ఉన్న ఆస్తి రాయించుకున్నాడు. ఇప్పుడు ఆ వృద్ధురాలినే ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటున్నాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. మండలంలోని నిమ్మపల్లికి చెందిన మానుక రాజయ్య–నర్సవ్వ దంపతులకు పిల్లలు లేరు. కొన్నేళ్ల క్రితం నుంచి దగ్గరి బంధువు మానుక శంకర్ వారింట్లోనే ఉంటున్నాడు. రాజయ్యకు ఫించన్ ఇప్పిస్తానని చెప్పి ఆస్తి కాగితాలపై సంతకాలు చేయించుకుని ఇల్లు, 30 గుంటల భూమిని తనపేరిట చేయించుకున్నాడు. రాజయ్య నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. ఈక్రమంలో ఒంటరి అయిన నర్సవ్వకు తిండి పెట్టకపోవడంతో శంకర్‌ను నిలదీయగా ఇది తనదని, వెళ్లిపొమ్మంటూ కొడుతున్నాడని బాధితురాలు రోదిస్తూ చెప్పింది. శంకర్ వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకుంది. గ్రామానికి వచ్చి విచారణ జరిపి న్యాయం చేస్తానని వృద్ధురాలికి ఎస్సై రాజశేఖర్ హామీ ఇచ్చారు. కన్న కొడుకులు కూడు పెడ్తలేరు వేములవాడ: కనీ పెంచి పెద్దచేసిన కొడుకులు మలిసంధ్యలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండలంలోని నిజామాబాద్‌కు చెందిన వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. తమ బాధను చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన శ్రీరాముల రామయ్య–సత్తవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు దేవయ్య, లచ్చయ్య, చంద్రయ్య. వృద్ధులు కావడంతో ఒక్కో కొడుకు దగ్గర 3 నెలలు ఉండాలని నిర్ణయించారు. కానీ గత కొన్ని నెలలుగా దేవయ్య, లచ్చయ్య తల్లిదండ్రులను పోషించడంలేదు. ఇంట్లోకి రానివ్వకపోవడంతో చిన్న కుమారుడు చంద్రయ్య వద్దే ఆరునెలల నుంచి ఉంటున్నారు. సోమవారం ఎస్సై రాజశేఖర్‌ను కలిసి తన ఇద్దరు కుమారులు పోషించడంలేదని ఫిర్యాదు చేశారు. కుమారులను పిలిపించి మాట్లాడుతానని బాధితులకు ఎస్సై హామీ ఇచ్చారు. చదవండి: భార్యను తిట్టాడని ఆవేశంతో.. కన్న తండ్రినే -
‘కంటి వెలుగు డబ్బు’ కోసం వైద్యాధికారి కక్కుర్తి..
టేకులపల్లి(ఖమ్మం): రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కంటి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కంటి వెలుగులో పనిచేసిన వైద్య సిబ్బందికి చెల్లించాల్సిన నగదు చెల్లించకుండా అప్పటి వైద్యాధికారి కంచర్ల రాజశేఖర్ నిబంధనలకు విరుద్ధంగా తన ఖాతాలోకి జమ చేసుకున్న ఘటన సులానగర్ పీహెచ్సీలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోనూ 2018 ఆగస్టు 15 నుంచి ఫిబ్రవరి 15 2019 వరకు కంటి పరీక్షల కేంద్రాలు నిర్వహించారు. ఇక్కడ పనిచేసిన సిబ్బందికి చెల్లించాల్సిన నగదును 2019 నవంబర్ 11న రూ.2.50 లక్షలను సులానగర్ పీహెచ్సీ ఖాతాలో జమ చేశారు. ఎన్నిసార్లు సిబ్బంది అడిగినా అప్పటి డీడీఓగా ఉన్న కంచర్ల రాజశేఖర్ చెల్లించలేదు. దీంతో తమకు రావాల్సిన కంటి వెలుగు డబ్బులు ఇప్పించాలని కోరుతూ అప్పటి వైద్యాధికారి, జిల్లా మాతా శిశు ప్రోగ్రాం ఆఫీసర్ జె.శ్రీనునాయక్‌కు బాధితులు దేవా, శ్రీనివాసరావు, ఉమేశ్, మానస, స్రవంతి, వెంకటరమణ, కృష్ణవేణి గతేడాది ఫిబ్రవరి 24న ఫిర్యాదు చేశారు. గోల్మాల్.. నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ రాజశేఖర్ కంటి వెలుగు నగదును తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ను పరిశీలిస్తే 13.11.2019 నాడు వైద్య శాఖ రూ.2.50 లక్షలు పీహెచ్సీ ఖాతాలో జమ చేసింది. 14.11.2019 నాడు సదరు డాక్టర్ చెక్ నంబర్ 785013 ద్వారా రూ.1,35,000 తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఆ తరువాత 30.12.2019 నాడు చెక్ నంబర్ 785014 ద్వారా రూ.1,14,500 డ్రా చేసుకున్నాడు. మొత్తం రూ.2,49,500 గోల్మాల్ అయ్యాయి. నిబంధనల ప్రకారం ఏదైనా ప్రత్యేక ప్రోగ్రాంకు సంబంధించిన నగదును సిబ్బంది ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకుండా సదరు డాక్టర్ మొత్తం నగదు తన ఖాతాలోకి జమ చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై వివరణ కోరేందుకు డాక్టర్ రాజశేఖర్‌కు ఫోన్ చేయగా ఆయన్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. -
సెల్‌టవర్ నిర్మాణం అగ్రిమెంట్ పేరుతో మోసం..
సాక్షి, జగిత్యాల: సాంకేతికరంగం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కూడా సాంకేతికరంగాన్ని ఉపయోగిస్తూ బడా వ్యాపారుల నుంచి మొదలుకుని సామాన్య రైతులు, రైతు కూలీలను మోసం చేస్తున్నారు. తమ భూ మిలో సెల్‌టవర్ నిర్మిస్తామని నమ్మించి అగ్రిమెంట్ పేరుతో రూ.22,700 ఫోన్‌పే చేయించుకుని రైతును మోసం చేశారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన బోడుగం బాపురెడ్డి అనే రైతుకు పొరండ్ల గ్రామ శివారులో రెండు స్థలాల్లో భూమి ఉంది. 10 రోజుల నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి తమ భూమిని ఐడియా సెల్‌టవర్ నిర్మాణానికి 10 ఏళ్లపాటు అద్దెకివ్వాలని కోరాడు. తాము ల్యాండ్ కూడా చూశామని నమ్మించి రూ.20 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ పెడతామని, నెలకు రూ.25 వేల అద్దె, ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని నమ్మించారు. దీంతో సోమవారం బాపురెడ్డికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి అగ్రిమెంట్ చార్జీలు రూ.5200 సెల్ నంబరు 8195911026కు ఫోన్ ద్వారా చెల్లించారు. తర్వాత వారు రైతుకు ఐటీ రిటర్న్ లేదని, ట్యాక్స్ పేరున రూ.17,500 జమచేస్తే బ్యాంక్ ఖా తాలో రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తామని నమ్మించారు. రూ.17,500 జమచేసిన తర్వాత బ్యాంక్‌లో రూ.10 లక్షలు జమకాకపోవడంతో రైతు వారికి ఫోన్ చేయగా బ్యాంక్ డబ్బులు జమచేసినట్లు ఓ నకిలీ రశీదును పంపించారు. “మరో రూ.25 వేలు చెల్లిస్తే ఖాతాలో అరగంటలో రూ.10 లక్షలతో పాటు మీరు వేసిన రూ.25 వేలు మీ ఖాతాలోనే జమ అవుతాయి’ అని నమ్మించారు. కానీ రైతు అనుమానం వచ్చి వారు పంపించిన డాక్యుమెంట్లు పరిశీలించగా మోసపోయామని తెలుసుకున్నాడు. దీంతో అతడు సోమవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
ఆన్లైన్ మోసం.. బ్లూటూత్ బుక్ చేస్తే...
సాక్షి, కురవి (జయశంకర్ భూపాలపల్లి): ఓ ఆన్లైన్ సంస్థలో బ్లూటూత్ హెడ్సెట్ బుక్ చేస్తే ఖాళీ డబ్బా వచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ) గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొమ్మగాని మల్సూర్‌గౌడ్ బోట్ కంపెనీ బ్లూ టూత్ కోసం ఆర్డర్ చేశాడు. మంగళవారం కొరియర్ సంస్థ నుంచి వచ్చిన వ్యక్తి ఇచ్చిన బాక్స్ తీసుకుని రూ.1,670 చెల్లించాడు. ఆ తర్వాత డబ్బాలో ఏమీ లేకపోవడంతో డెలివరీ బాయ్‌ను నిలదీశాడు. తన చేతిలో ఏమీ ఉండదని ఆయన చెప్పగా, వాదనకు దిగడంతో చివరకు డెలివరీ బాయ్ డబ్బు ఇచ్చేసి వెళ్లిపోయాడు. -
మీ నంబర్ ఇకపై పని చేయదు అంటూ..
సాక్షి, హిమాయత్ నగర్: మీరు వాడుతున్న ఫోన్ నంబర్ మరికొద్దిసేపటిలో క్లోజ్ అవుతుందని ఓ వ్యక్తికి మెసేజ్ వచ్చింది. కంగారు పడ్డ వ్యక్తి మెసేజ్ వచ్చిన నంబర్ కు ఫోన్ చెయ్యడంతో ఆన్ లైన్ ప్రక్రియతో రూ.61వేలు లూటీ చేసిన సంఘటన నారాయణ గూడ పీఎస్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. క్రైమ్ ఇన్ స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం నారాయణ గూడ విఠల్ వాడిలో ఈ సంఘటన జరిగింది. ఎయిర్‌బస్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే సూర్య విక్టర్ ప్రతాప్ కు 9339635199 ఈ నంబర్ నుంచి మీరు వాడుతున్న ప్రస్తుత నంబర్ ఆగిపోతుందని మెసేజ్ వచ్చింది. కంగారు పడ్డ ఆయన వచ్చిన నంబర్ కు ఫోన్ చేసాడు. వాళ్లు క్యూక్ వ్యువర్ యాప్ఙ్ డౌన్ లోడ్ చేసుకోమన్నారు. అది చేసుకోగానే అతని అకౌంట్ నుంచి ముందుగా రూ.14,987 , రెండవసారి ఫోన్ పే యాప్ నుంచి రూ.46,514 కట్ అయ్యాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
అమ్మాయితో చాటింగ్, నగ్నవీడియోలు.. కట్ చేస్తే!
సాక్షి, కుత్బుల్లాపూర్: ఆన్లైన్లో డేటింగ్ యాప్ క్రియేట్ చేసి ఓ యువకుడిని నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తులపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.. సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. లోకాంటో ఆన్లైన్ డేటింగ్ యాప్ ..పేరుతో ఓ ఐడి క్రియేట్ చేసి, దాని ద్వారా యువకులను మభ్యపెట్టి అమ్మాయిలు అబ్బాయిలు కమ్యూనికేషన్ ఉండేలా చూస్తామని చెప్పి మోసానికి పాల్పడుతున్న వ్యక్తుల బండారం బయటపడింది. సుచిత్ర గోదావరి హోమ్స్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే యువకుడు ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆన్లైన్లో ఉన్న డేటింగ్ యాప్‌ను సంప్రదించి ఓ మహిళతో మాటలు కలిపాడు. ఇలా వారం రోజుల వ్యవధిలో అతను నగ్నంగా ఉన్న ఫొటోలను ఆ అమ్మాయి సేకరించింది. ఇక అంతే మూడో వ్యక్తి ఎంటరై నీ ఫొటోలను యూట్యూబ్, ఫేస్ బుక్ పాటు ఇతర సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో కరుణాకర్ పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన ఘటన వివరాలను వెల్లడిస్తూ ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ రమేష్ కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైమ్‌కు సమాచారం ఇచ్చారు. (చదవండి: గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగుల మధ్య ఘర్షణ) -
లక్ష టన్నుల బియ్యం స్వాహా.. బయటపడ్డ భారీ అక్రమాలు!
ఆయన వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రానికి చెందిన ఓ రైస్ మిల్లర్.. మరికొందరు మిల్లర్లను జతచేసుకుని ఎఫ్‌సీఐతో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఒప్పందాలు చేసుకుంటున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా సీఎంఆర్ కింద రీసైక్లింగ్ చేస్తు న్నారు. ఆయనకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే బియ్యం డాన్‌గా పేరున్నట్టు ప్రచా రంలో ఉంది. ఆయనకు చెం దిన వాహనాలు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తర లిస్తూ.. గతేడాది జూన్ 26 నుంచి నెల రోజుల వ్యవధిలోనే మూడు సార్లు పట్టుబడ్డాయి. అధికారిక దాడుల్లో 1,013 క్వింటాళ్ల బియ్యం దొరికింది. 2018లో అప్పటి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పానగల్‌లోని సంబంధిత మిల్లులో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. లెక్కలకు మించిన ధాన్యం ఉన్నట్టు గుర్తించి సీఎంఆర్ ఒప్పందాలను రద్దు చేశారు. భవిష్యత్తులోనూ అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించారు. కానీ సదరు ‘బియ్యం డాన్’.. తన కుమారుడి పేరుమీద జిల్లా కేంద్రంలో, కొత్తకోట మండలంలో కొన్ని రైస్ మిల్లులను లీజ్‌కు తీసుకుని సీఎంఆర్ ఒప్పం దాలు చేసుకున్నారు. ఎప్పట్లాగే తన సొంత గ్రామంలో నిర్మాణం లోని మిల్లు వద్ద, పానగల్లో సీజ్ చేసిన మిల్లు వద్ద రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో రీసైకిల్ చేస్తూ పట్టుబడ్డారు. అయినా అధికారులు 6ఏ కేసులు మాత్రమే నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇంత జరిగినా కొందరు అ«ధికారుల సహకారంతో బినామీ పేర్లతో సీఎంఆర్ ఒప్పందాలు చేసుకుని దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్: రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలంటూ ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తే.. మిల్లర్లు బియ్యం తిరిగివ్వకుండా, బయట అమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్నారు. 2019–20 ఏడాది యాసంగికి సంబంధించి రూ.400 కోట్ల విలువైన 1.25 లక్షల టన్నుల బియ్యాన్ని ఇప్పటికీ తిరిగి అప్పగించకుండా దందా చేస్తున్నారు. గట్టిగా ఒత్తిడి తెస్తే.. పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గాల్లో సేకరించి, దాన్నే రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. మిల్లర్లను బ్లాక్‌లిస్టులో పెట్టడంగానీ, రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించి వసూలు చేయడంగానీ చేయడం లేదు. కొందరు అధికారులు, మిల్లర్ల అసోసియేషన్ నేతల అండతోనే ఈ వ్యవహారం సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. గడువు పొడిగించినా చలనమేదీ? సర్కారు రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపి, బియ్యంగా మార్పించి తిరిగి తీసుకుంటుంది. దీనిని కస్టమ్ మిల్లింగ్ అంటారు. మిల్లర్లు ఒక్కో క్వింటాల్ ధాన్యానికి.. ముడి బియ్యం అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లింగ్ చేసినం దుకు ప్రభుత్వం క్వింటాల్‌కు ఇంత అని చార్జీలు చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం పంపిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంతో రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి ధాన్యం తీసుకుని ఏడాది దాటుతున్నా బియ్యాన్ని తిరిగి పంపడం లేదు. ► 2019–20 యాసంగి సీజన్లో ప్రభుత్వం రైతుల నుంచి కొన్న 64.17 లక్షల టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం రైస్ మిల్లర్లకు పంపింది. ఈ మేరకు మిల్లర్లు 43.59 లక్షల టన్నుల బియ్యాన్ని అప్పగించాలి. కానీ 42.34 లక్షల టన్నులే తిరిగి చ్చారు. ఇంకా 1.25 లక్షల టన్నులు రాలేదు. ప్రధానంగా పెద్దపల్లిలో 28,168 టన్నులు, వరంగల్ ఆర్బన్ 19,122, వరంగల్ రూరల్ 12,165, సూర్యాపేట 16,679, మంచిర్యాల 3,386, నిర్మల్ 3,534, నిజామాబాద్ 2,549, మెదక్ 6,853, కరీంనగర్ 4,479, జగిత్యాల 8,184, మహబూబాబాద్ 4,655, జనగాం 2,975, ములుగు 5,969, యాదాద్రి 7,884, వనపర్తి 4,510 గద్వాల జిల్లా నుంచి 2,492 టన్నులు సీఎంఆర్ బియ్యం రావాల్సి ఉంది. ►నిజానికి ఈ బియ్యాన్ని గత ఏడాది అక్టోబర్ నాటికే అప్పగించాల్సి ఉన్నా మిల్లర్ల నుంచి స్పందన లేదు. ఈ విషయంగా గత ఏడాది నవంబర్లోనే సమీక్షించిన సీఎస్ సోమేశ్ కుమార్.. డిసెంబర్ నాటికే సీఎంఆర్ ఇవ్వాలని ఆదేశించారు. అయినా ఫలితం రాలేదు. ఇలా నాలుగు మార్లు గడువు పొడిగించినా 1.25 లక్షల టన్నుల బియ్యం పెండింగ్‌లోనే ఉంది. ఆ బియ్యం విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనే సీఎంఆర్ ఇవ్వని మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటు బిజినెస్.. పీడీఎస్‌కు పాలిష్.. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 45 రోజుల్లోగా బియ్యాన్ని తిరిగి అప్పగించాలి. కానీ రాష్ట్రంలో ఎన్నడూ ఈ గడువులోగా బియ్యం ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం పెంచిన గడువు వరకూ కూడా అంద జేయడం లేదు. దీనికి కారణం సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యంతో మిల్లర్లు ప్రైవేటు వ్యాపారం చేయడమే. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ధాన్యం సాగు ఎక్కువగా లేకపోవడం, రెండేళ్లుగా దిగుబడి తగ్గడంతో వారంతా తెలంగాణపైనే ఆధారపడ్డారు. మరోవైపు మలేసియా, ఇండోనేషియా, నైజీరియా, శ్రీలంక దేశాలకు మన రాష్ట్రం నుంచే బియ్యం ఎగుమతి అవుతోంది. ఇలా డిమాండ్ ఉండటంతో.. మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యాన్ని బయట మార్కెట్లలో అమ్మేసుకుంటున్నారు. ప్రధానంగా బీపీటీ, హెచ్ఎంటీ, జైశ్రీరామ్, తెలంగాణ సోనా రకాలను ఎక్కువగా సాగు చేసే చోట ఈ దందా నడుస్తోంది. బియ్యం అప్పగించాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన సందర్భాల్లో.. మిల్లర్లు పీడీఎస్ బియ్యాన్నే సేకరించి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో దళారుల ద్వారా రేషన్ బియ్యాన్ని రూ.8 నుంచి రూ.10 చొప్పున కొంటున్నారు. ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. గత ఏడాది విజిలె¯న్స్ దాడుల్లో చాలా చోట్ల ఈ అక్రమాలను గుర్తించారు. వనపర్తి జిల్లాలో రాజకీయ ఆశీస్సులున్న ఓ రైస్ మిల్లర్‌కు చెందిన మిల్లులో ఏటా రేషన్ బియ్యం పట్టుబడుతోంది. ఇటీవలే అదే రైస్‌మిల్లులో ఏకంగా 500 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. సదరు మిల్లర్ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మరీ.. వనపర్తితోపాటు పక్క జిల్లాల నుంచీ రేషన్ బియ్యం సేకరిస్తున్నట్టు గుర్తించారు. అయినా సదరు రైస్‌మిల్లుకు మళ్లీ సీఎంఆర్ కింద ధాన్యం కేటాయించడం గమనార్హం. ఇలాంటి మిల్లులు రాష్ట్రంలో 70 నుంచి 80 వరకు ఉన్నట్టు అంచనా. బ్లాక్ లిస్టులో పెట్టినా.. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని వరలక్ష్మి రైస్ మిల్లు గడువులోగా సీఎంఆర్ బియ్యం ఇవ్వలేదన్న కారణంగా పౌర సరఫరాల శాఖ దాన్ని బ్లాక్ లిస్టులో పెట్టింది. అయితే నల్లగొండకు చెందిన ఓ వ్యాపారి.. రాజకీయ పలుకుబడితో, పౌర సరఫరాల అధికారుల సాయంతో మిల్లు ఓనర్‌పై ఒత్తిడి తెచ్చి, దానిని కొనేశారు. సదరు మిల్లు ద్వారా అప్పగించాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ఆయనే ప్రభుత్వానికి అప్పగించారు. ఏదైనా మిల్లును బ్లాక్ లిస్టులో పెడితే.. తర్వాతి సీజన్లోనే, యాజమాన్యం మారితేనే సీఎంఆర్ ఇవ్వాలి. కానీ అధికారుల తోడ్పాటుతో.. బ్లాక్ లిస్టులో పెట్టిన సీజన్లోనే వరలక్ష్మి మిల్లు ద్వారా సీఎంఆర్ బియ్యం అప్పగించినట్టు లెక్కల్లో చూపారు. అంటే సీఎంఆర్ విషయంలో మిల్లర్లు, అధికారులు ఎలా కలిసిపోయారో అర్థం చేసుకోవచ్చు. అసోసియేషన్ నాయకుడి అండతోనే.. జగిత్యాల జిల్లాలో గతనెలలో దాదాపు 10 మిల్లులు సీఎంఆర్ ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్టు ఎఫ్‌సీఐ తనిఖీల్లో తేలింది. అయినా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మిల్లర్ల అసోసియేషన్ నాయకుడొకరు అధికార యంత్రాంగాన్ని శాసిస్తున్నాడని, మిల్లులపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని బహిరంగంగానే చర్చ జరుగుతున్నా అడిగే నాథుడు లేడు. సీఎంఆర్‌కు సంబంధించి ఇటీవల ఎఫ్‌సీఐ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. దీంతో మిల్లర్లు ఏకంగా ఎఫ్‌సీఐ అధికారులు వేధిస్తున్నారంటూ రివర్సులో ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. నాణ్యత లేని బియ్యాన్ని ఎఫ్‌సీఐకి తరలించినా ఎవరూ అడ్డుచెప్పకుండా, మిల్లర్ల వద్దకు అధికారులెవరూ రాకుండా ముందు జాగ్రత్తగా మిల్లర్లు ఇలా మైండ్‌గేమ్ ఆడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నో రికవరీ.. నో బ్లాక్‌లిస్ట్.. సీఎంఆర్ బియ్యం తిరిగివ్వడంలో జాప్యం చేస్తున్న మిల్లర్లపై చర్యలే లేకుండా పోయాయి. 2014 నుంచి 2016 వరకు 137 మంది మిల్లర్ల నుంచి 1.20 లక్షల టన్నుల బియ్యం రావాల్సి ఉన్నా.. ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆ బియ్యం విలువ సుమారు రూ.165 కోట్లు. అయితే అప్పటి పౌర సరఫరాల శాఖ కమిషనర్లు సీవీ ఆనంద్, అకున్ సబర్వాల్ గట్టిగా ఒత్తిడి తెచ్చి.. 30 మంది మిల్లర్ల నుంచి రూ.80 కోట్ల విలువైన బియ్యాన్ని రికవరీ చేశారు. ఇంకా రూ.85 కోట్ల బియ్యాన్ని రికవరీ చేయాల్సి ఉన్నా పట్టించుకున్నవారు లేరు. కేవలం 80 రైస్ మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టి వదిలేశారు. 2016 తర్వాత సీఎంఆర్ బియ్యం తిరిగివ్వడంతో ఎంత జాప్యం చేస్తున్నా సదరు మిల్లర్ల నుంచి రెవెన్యూ రికవరీ గానీ, బ్లాక్‌లిస్టులో పెట్టడం గానీ జరగడం లేదు. మిల్లర్లు ఎప్పుడిస్తే అప్పుడే అన్నట్టు వ్యవహారం నడుస్తోంది. 2019–20కి సంబంధించి 1.25 లక్షల టన్నుల బియ్యం ఇవ్వని 70 వరకు మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశమున్నా.. పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టడం లేదు. ఎఫ్‌సీఐ వద్దు..రాష్ట్రమే ముద్దు మిల్లర్లు సీఎంఆర్ ధాన్యాన్ని మర పట్టించాక.. బియ్యాన్ని ఎఫ్‌సీఐకి డెలివరీ చేస్తారు. ఆ బియ్యానికి సంబంధించిన డబ్బును ఎఫ్‌సీఐ రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు జమచేస్తుంది. తర్వాత ఎఫ్‌సీఐ రాష్ట్రంలో రేషన్ పంపిణీకోసం అవసరమైన బియ్యాన్ని సబ్సిడీ ధరపై పౌర సరఫరాల సంస్థకు ఇస్తుంది. అంటే ప్రభుత్వం కొన్న ధాన్యానికి సంబంధించిన బియ్యం ఎఫ్‌సీఐకి వెళ్లి.. తిరిగి సబ్సిడీ ధరతో పౌరసరఫరాల సంస్థకు వస్తుంది. అయితే ఎఫ్‌సీఐ సీఎంఆర్ బియ్యం నాణ్యత విషయంలో నిబంధనలను ఇటీవల కఠినంగా అమలు చేస్తోంది. నూకలు, రంగు మారడం వంటివి నిర్ణీత మొత్తానికి ఏమాత్రం ఎక్కువ ఉన్నా.. ఆ బియ్యాన్ని తీసుకోవడం లేదు. నూకలు 25 శాతానికి మించొద్దన్న నిబంధనను ఎఫ్‌సీఐ పక్కాగా అమలు చేస్తుంది. అదే పౌరసరఫరాల సంస్థకు ఇచ్చే బియ్యంలో నూకలు 40– 50 శాతం ఉంటున్నా.. రాళ్లు, మట్టిగడ్డలు, రంగు మారడం వంటివి ఉన్నా అధికారులు పట్టించుకోరు. ఎఫ్‌సీఐకి నాణ్యమైన బియ్యం ఇవ్వడంకంటే.. పౌర సరఫరాల శాఖకు నాణ్యత లేనివి అంటగడితే మిల్లర్లకు రూ.కోట్లలో కలిసొస్తుంది. ►నిజానికి రాష్ట్రంలో రేషన్, మధ్యాహ్న భోజనం అవసరాలకు ఏటా 20 లక్షల టన్నుల బియ్యం అవసరం. కానీ మిల్లర్ల ఒత్తిళ్లకు తలొగ్గి పౌర సరఫరాల సంస్థ అంతకుమించి సేకరిస్తోంది. 2018–19లో ఇలా అదనంగా ఏడెనిమిది లక్షల టన్నులు తీసుకున్నది. అవసరం లేకున్నా తీసుకున్న ఆ బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేయడం, బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపుల్లో జాప్యంతో సర్కారుకు రూ.75 కోట్ల అదనపు భారం పడింది. ►ఇప్పుడు కూడా సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాములకు కాకుండా..నేరుగా పౌర సరఫరాల సంస్థ గోదాములకు పంపి, లెక్కల్లో సర్దుబాటు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పౌర సరఫరాల సంస్థ నుంచే లేఖ రాయించేందుకు మిల్లర్లు ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. -
వామ్మో..ఏటీయమ్‌లో కేటుగాడు!
వైరా: ఆంధ్రా(యూనియన్) బ్యాంక్ ఏటీఎంకు నగదు కోసం వెళ్లిన ఓ వ్యక్తి మోసానికి గురైన సంఘటన వైరాలో చోటుచేసుకుంది. స్థానిక పాతబస్టాండ్ సెంటర్లోని ఓ ఫొటో స్టూడియో యజమాని జనార్దన్ బుధవారం ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. ఏటీఎంలో కార్డు ఉంచి పిన్ నంబర్ కొట్టడంతో ఎర్రర్ అని చూపింది. దీంతో పిన్ నంబర్ కోసం తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అప్పటికే ఏటీఎంలో మాటు వేసి ఉన్న ఓ ఆగంతకుడు తన చేతిలోని కార్డును మిషన్‌లో ఉంచి, జనార్దన్ కార్డు తీసుకున్నాడు. ఇది గమనించని జనార్దన్.. మిషన్‌లో ఉన్న కార్డు తీసుకుని వెళ్లిపోయాడు. అదే రోజు సాయంత్రం 6.30 సమయంలో అగంతకుడు మరో ఏటీఎం నుంచి రూ. 20 వేలు డ్రా చేశాడు. నగదు డ్రా చేసినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో ఆందోళన చెందిన జనార్దన్ తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చే«శాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మహిళకు మధ్య వేలు చూపించి అసభ్యంగా.. -
ఫైనాన్స్ పేరుతో మోసం.. కోటిన్నరతో పరార్
సాక్షి, వెల్గటూరు(ధర్మపురి): కోటిన్నర మేర అప్పులు చేసిన లిక్కర్ వ్యాపారి పరార్ అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ధర్మారం టౌన్‌కు చెందిన వ్యక్తి చిట్టీలు, ఫైనాన్స్ నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి అత్యవసర పరిస్థితిలో రూ.లక్ష అయినా ఉన్నఫలంగా ఇచ్చేవాడు. ఇలా ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నాడు. ప్రజల అత్యాశను ఆసరా చేసుకుని అధిక వడ్డీ ఇస్తానని, వైన్స్‌లో షేరు ఇస్తానని చెప్పి çసుమారు 40 మంది దగ్గర రూ.కోటిన్నర వరకు చిట్టీలు అప్పులు తెచ్చి ఉడాయించిన విషయం వెల్గటూర్, ధర్మారం మండలాల్లో సంచలనం రేపింది. బాధితులు మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావును కలసి మొరపెట్టుకున్నారు. డబ్బు ఇచ్చిన వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. వెల్గటూరు మండలం పాతూగూడూరు గ్రామానికి చెందిన వ్యక్తి ఐదేళ్లక్రితం ఇక్కడికి వచ్చాడు. ధర్మారం మండలకేంద్రంలో లిక్కర్, ఫైనాన్స్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. మార్కెట్లో మంచిపేరు తెచ్చుకున్నాడు. ధర్మారంలో వీరి గ్రూపు వైన్స్ ఏర్పాటు చేయగా అందులో షేర్ ఇస్తామని నమ్మించి అప్పులు తెచ్చాడు. చిట్టీలు ఇవ్వకుండా అతడి వద్దే ఉంచుకుని వడ్డీకి ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. నగదు ఇచ్చిన వారు సుమారు 40 మంది వరకు ఉన్నారు. వీరి నుంచి రూ.1.5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. వైన్స్ గడువు దసరాతో ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి డబ్బు కావాలని ఒత్తిడి పెరిగింది. దీంతో సెప్టెంబర్ 13న ధర్మారం నుంచి అర్ధరాత్రి బిచానా ఎత్తేశాడు. బాధితులు కొన్నినెలల నుంచి ఆందోళన చెందుతున్నారు. అంతా పేదవారే... బాధితులంతా పేదవారే. రాజారాంపల్లి గ్రామానికి చెందిన రాకేశ్ అనే యువకుడి తల్లి చనిపోగా బీమా డబ్బు రూ.5లక్షలు వచ్చాయి. అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్న రెండురోజులకే కనిపించకపోయాడు. సూరారాంకు చెందిన మాదాసు రాములు ,ఆత్మకూరుకు చెందిన లచ్చన్న,సంతోశ్ ,రూ.5లక్షలు ,రూ12 లక్షలు ఇచ్చిన వారున్నారు. కూరగాయలు అమ్మి కూడబెట్టుకున్న సొమ్ము రూ.12లక్షలు తీసుకున్నాడని పాతగూగూరు గ్రామానికి చెందిన పొనుగోటి శ్యామల రోదిస్తూ తెలిపింది. కూతురు పెళ్లి కోసమని రూ.10 లక్షలు కూడబెట్టా, డబ్బు రాకపోతే మరణమే శరణ్యమని మరో బాధితుడు వాపోయాడు. మాజీ ఎంపీపీకి మొరపెట్టుకున్న బాధితులు పాతగూడూరులోని వ్యాపారి తల్లిదండ్రి, భార్యాపిల్లలు నివాసం ఉంటున్నారు. అతడు నాలుగునెలలుగా కనిపించలేదు. ఇన్నాళ్లు వేచి ఉన్న బాధితులు అంతాకలసి గురువారం పాతగూడురుకు వచ్చిన మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావును న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. వ్యాపారి తండ్రి బొల్లం మల్లయ్యను పిలిచి బాధితులకు ఎలాగైనా న్యాయం చేయాలని మాజీ ఎంపీపీ సూచించారు. కుమారుడి జాడకోసం తండ్రిపై బాధితలు ఒత్తిడి పెంచారు. అతడి భూములు దున్నకుండా అడ్డుకుంటున్నారు. అయితే అప్పులు ఇచ్చేప్పుడు నాకెవ్వరూ చెప్పలేదని నేనెలా బా«ధ్యుడనని తండ్రి తప్పించుకుంటున్నాడు. తనకున్న ఆస్తిలో సగం రాసిస్తానని చెప్పుకొచ్చాడు. ఆస్తి మొత్తం ఇచ్చి నా తీసుకున్న డబ్బుల్లో 20 శాతం కూడా తీరవని బాధితులు వ్యాపారి తండ్రిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరువర్గాలను మాజీ ఎంపీపీ శాంతిపజేశారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. చివరికి పంచాయితీ స్టేషన్‌కు చేరినట్లు సమాచారం. -
పత్తి రైతులపై దళారుల పంజా
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో పత్తి రైతులు దళారుల దందాకు చిత్తవుతున్నారు. ప్రభుత్వ అలసత్వం, సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రాలు ప్రారంభించకపోవడం దళారులకు కలిసి వస్తోంది. తూకం, ధరలో మోసం చేస్తూ నిండుగా ముంచేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తికి మద్దతు ధరరాక రైతులకు అప్పులే మిగిలేలా ఉన్నాయి. పలువురు ఎరువుల, వడ్డీ వ్యాపారులు, ప్రజాప్రతినిధులు పత్తి వ్యాపారుల అవతారం ఎత్తుతున్నారు. గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుని పత్తిని స్థానికంగా విక్రయించే విధంగా పావులు కదుపుతున్నారు. సిండికేట్‌గా ఏర్పడి తమ వ్యాపారాన్ని మూడు పూలు..ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో సుమారు 2 లక్షల 31 వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. హెక్టార్‌కు సుమారు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మొదటి, రెండవ దశలో పత్తి తెంపేశారు. ఈ రెండు దశల్లో కలిపి హెక్టార్‌కు 7 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. అంటే ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 20 లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడి పొందారు. కానీ నేటివరకు సీసీఐ.. పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతోపాటు దసరా పండుగ సమీపించడం, కూలీలకు డబ్బులను చెల్లించడం కోసం రైతులు గ్రామాల్లోనే దళారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో గత సంవత్సరం 19 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు నేటికి ఒక్క కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం పట్ల పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత అవసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరకుఅమ్మాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాలు గత ఏడాది జిల్లాలో నకిరేకల్‌లో 2, చిట్యాలలో 2, చండూరులో 2, దేవరకొండలో 6, మాల్లో 5, మిర్యాలగూడలో 2 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులనుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయించారు. కానీ వాటిని ఇప్పటివరకు ప్రారంభించని కారణంగా రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది వీటితోపాటు తిప్పర్తిలో కూడా సీసీఐ కొనుకోలు కేంద్రాన్ని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు. కానీ నేటికీ వాటి ఊసేలేదు. మోసాలు ఇలా.. దళారులు గ్రామాల్లో మచ్చిక చేసుకున్న ఏజెంట్ల ద్వారా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.5450 ఉండగా దళారులు రూ.4000 నుంచి రూ.4500 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే మద్దతు ధరలో క్వింటాకు వెయ్యి రూపాయల నుంచి రూ.1500 వరకు నష్టపోతున్నారు. అయితే దళారులు పత్తిని కొన్న వెంటనే డబ్బులను ఇస్తున్నారు. వెంటనే డ బ్బులను చెల్లిస్తున్నందున రైతులు.. వారికే పత్తిని విక్రయించడానికి సుముఖత చూపుతున్నారు. తూకంలో మోసం.. పత్తిని తూకం వేసేటప్పుడు ఎలక్ట్రానిక్ కాంటా లను వినియోగించాలనే నిబంధనలున్నాయి. అ ధికారుల నిర్లక్ష్యం కారణంగా దళారులు పాతరకం కాంటాలను వినియోగిస్తున్నారు. పాతరకం బా ట్లు వాడడంతోపాటు తూకంలో మోసాలకు పాల్పడుతూ క్వింటాపై సుమారు 15 కిలోల పత్తిని అదనంగా తూకం వేస్తున్నారు. దీనికారణంగా సుమారు రూ.750 వరకు రైతులు అదనంగా నష్టపోవాల్సి వస్తుంది. దళారులపై మార్కెటింగ్ శాఖ అధికారులు, తూనికల కొలతల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారి మోసాలనుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు. -
ట్యాంకుపైకి ఎక్కి దూకుతానంటూ...
చిన్నశంకరంపేట(మెదక్) : మండలంలోని ఖాజాపూర్‌లో బ్యాంకు సేవ కేంద్రం ఏజెంట్‌గా పనిచేస్తున్న వెంకట్ వాటర్ ట్యాంకుపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటున్నానని కాసేపు హల్చల్ చేశారు. గురువారం ఉదయం ఖాజాపూర్ మధిర గ్రామమైన కుమ్మరిపల్లిలో వెంకట్ ట్యాంకుపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతడిని సముదాయించారు. చిన్నశంకరంపేట పోలీస్‌లకు కూడా సమాచారం అందించడంతో వారు కూడ అక్కడికి చేరుకుని ట్యాంకుపై ఉన్న వెంకట్‌కు నచ్చజెప్పి కిందకు దించారు. తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా వారం రోజుల క్రితం గ్రామంలోని బ్యాంకు సేవ కేంద్రంతో ఖాతాదారుల డబ్బులు తన ఖాతాలోకి మల్లించుకున్న సంఘటన బయటపడడంతో గ్రామస్తులు ఎవరి డబ్బులు వారికి చెల్లించాలని అతడిని హెచ్చరించారు. అలాగే కొందరికి చెల్లించడంతో పాటు మరి కొంత మందికి చెల్లించేందుకు గడువు కోరిన వెంకట్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండ బెదిరించేందుకు ఈ డ్రామకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. గురువారం నాడు మరో సారి గ్రామంలో మాట్లాడుదామని చెప్పడంతోనే ఇలా చేశాడని తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపేందుకు నార్సింగి ఎస్బీఐ మేనేజర్ దీపిక ఖాజాపూర్ గ్రామానికి చేరుకున్నప్పటికి బ్యాంకు సేవ కేంద్రానికి తాళం ఉండడంతో పాటు వెంకట్ అందుబాటులో ఉండకపోవడంతో ఆమె వెనక్కి వెళ్లారు. విచారణ జరిపి అతడిపై చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. -
ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి..
రాజమహేంద్రవరం క్రైం : ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల వద్ద రూ.లక్షలలో సొమ్ము తీసుకొని మోసం చేసిన అంతర్ జిల్లా నిందితుడిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. టూ టౌన్ సీఐ ముక్తేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం సలాది రాంజీ నాయుడు, అలియాస్ రామదాసు, అలియాస్ సుంకర రామకృష్ణ, అనే వివిధ నకిలీ పేర్లతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. టూ టౌన్ పరిధిలో ఇద్దరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు రాంజీ నాయుడు నకిలీ పేర్లుతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో వందకు పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించి వారి వద్ద లక్షల్లో నగదు తీసుకొని మోసం చేశాడని టూ టౌన్ సీఐ ముక్తేశ్వరరావు తెలిపారు. -
వీసా పేరిట టోకరా..
కాజీపేట అర్బన్ : సామాజిక మాధ్యమాలు మానవ సంబంధాలను దగ్గర చేస్తూ.. ఉపాధికి బాటాగా నిలుస్తుండగా.. మరో వైపు సైబర్ నేరగాళ్లకు పైసా వసూల్‌కు ప్రజలను దగ్గర చేస్తున్నాయి. ఉద్యోగాల పేరిట, రుణాల అందిస్తామని, నూతన ఏటీఎం కార్డును పంపిస్తామని నిత్యం ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నా.. ప్రజలు మాత్రం అప్రమత్తమవడం లేదు. ఇందుకు జిల్లాలో జరిగిన ఈ తాజా ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. యూఎస్‌కు వీసా ఇస్తామని నమ్మబలికి ఏకంగా తమ అకౌంట్లో రూ.6.97 లక్షలను వేయించుకుని ఓ సైబర్ నేరగాడు ఓ నిరుద్యోగిని నిలువు దోపిడీ చేశాడు. సూబేదారి పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వాట్సప్ అంటూ పలకరింపు ... సుబేదారి ఎన్జీఓస్ కాలనీకి చెందిన మహేష్‌చంద్ర బికాం కంప్యూర్స్ పూర్తి చేసి దుబాయ్‌లోని బెహరీన్‌లో ఉద్యోగం చేసి ఈ ఏడాది నగరానికి విచ్చేశాడు. ఆన్లైన్ ఉద్యోగాల కోసం తన బయోడేటాను జనవరిలో పొందుపర్చాడు. మార్చిలో యూఎస్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామంటూ మహేష్‌చంద్ర సెల్‌ఫోన్‌కు వాట్సప్ బ్రదర్ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. యూఎస్‌కు వీసా అందిస్తానని నమ్మబలికాడు సదరు వాట్సప్ కాల్ సైబర్ నేరగాడు. రూ.6.97 లక్షల చెల్లింపు యూఎస్‌కు వీసా అందించేందుకు సహకరిస్తానని ఆన్లైన్లో బయోడేటాను స్వీకరించానని మార్చిలో వాట్సప్ కాల్ ద్వారా పరిచమైన వ్యక్తి మహేష్ చంద్రకు తెలిపాడు. సదరు వ్యక్తి మాటలను నమ్మిన మహేష్‌చంద్ర తొలుత మార్చి 23న రెస్యూమ్ రిజిస్ట్రేషన్‌కు రూ.30 వేలు ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్లో వేశాడు. మెడికల్ చెకప్, అగ్రిమెంట్, జాబ్‌ష్యూరిటీ పేరిట ఆరు సార్లు వివిధ అకౌంట్లలోకి సుమారు రూ.6.97 లక్షలను ఏప్రిల్ 27వ తేదీ వరకు జమ చేశాడు. అనంతరం వాట్సప్ కాల్ వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో మహేష్‌చంద్ర మోసపోయినట్లు నిర్దారించుకుని ఆదివారం సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుబేదారి ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్ సైబర్ నేరం కింద చీటింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
డబుల్ మిఠాయికి.. డబ్బుల్ బూజు
‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన ఈ ఇంటి నంబర్ 14–2–109. ఓ అగ్రవర్ణ వ్యాపార వర్గానికి చెందిన ఆయన ఈ ఇంటి యజమాని. ఆయనకు భద్రాచలంలో కిరాణా షాపు ఉంది. ఇద్దరు కుమారులూ వ్యాపారంలో స్థిరపడ్డారు. ఇలాంటి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైంది. ఈ యజమాని కోడలుకు ఆమె భర్త పేరులో చిన్న మార్పు చేసి.. 83వ నంబర్ ఇల్లు మంజూరు చేశారు. అంతేకాదు.. భద్రాచలంలో 1/70 చట్టం అమల్లో ఉంది. ఇక్కడ అగ్రవర్ణాల ఇళ్ల రిజిస్ట్రేషన్‌కు పీసా కమిటీ అనుమతి తప్పనిసరి. అధికారులు ఆ నిబంధననూ తుంగలో తొక్కి ఇల్లు మంజూరు చేశారు. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో అవకతవకలకు చిన్న ఉదాహరణ ఇది. ఇదొక్కటే కాదు.. ఒక్క భద్రాచలంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి. డబుల్ ఇళ్ల పథకంలోకి చొరబడిన దళారుల చేతివాటం, వారికి కక్కుర్తి అధికారుల సహకారం కలసి ప్రతిష్టాత్మక పథకం నిర్వీర్యమవుతోంది. పేదవాడి కల అయిన సొంతిల్లు.. ‘మామూళ్ల’దందా మధ్యన పక్కదారి పడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,522 ఇళ్లను లబ్ధి్దదారులకు అప్పగించగా.. ఒక్క సిద్దిపేట జిల్లా మినహా మిగతా అన్నిచోట్ల కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’బృందం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎక్కువగా ఫిర్యాదులు అందిన గ్రామాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించింది. భద్రాచలం పట్టణంలో 88 ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన జాబితాను క్షుణ్నంగా పరిశీలించగా.. అందులో ఏకంగా 52 ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్టు స్పష్టమైంది. మిగతా చోట్లా ఇదే పరిస్థితి కనిపించింది. ప్రతిష్టాత్మక లక్ష్యంతో.. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంతిల్లు కట్టించాలన్న బృహత్తర లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని చేపట్టారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2.73 లక్షల ఇళ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1.51 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు 9,522 ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించారు. కానీ దళారుల రంగ ప్రవేశంతో ఈ ఇళ్ల కేటాయింపులో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. ఆయా గ్రామాలకు ఎన్ని ఇళ్లు కేటాయించవచ్చని స్థానిక ఎమ్మెల్యే నిర్ణయం తీసుకుంటారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక గృహ ప్రవేశ సమయంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి.. గుడిసె కూడా లేని నిరుపేదలను గుర్తించి, వారికి మొదటి ప్రాధాన్యత కింద ఇళ్లను కేటాయించాలి. ఎక్కువ మంది అర్హులు ఉంటే లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. కానీ ఇలాంటివేవీ లేకుండా ‘మామూలు’గానే కేటాయింపులు జరిగిపోతున్నాయి. ఒక్కో ఇంటికి రూ.2.5 లక్షల వరకు..! కొందరు ఎమ్మెల్యేల అనుచరుల పేరిట దళారుల అవతారం ఎత్తారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆర్థికంగా బాగున్న కుటుంబాలను గుర్తించి.. ఇళ్లు ఇప్పిస్తామంటూ బేరసారాలకు దిగుతున్నారు. గ్రామాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.2.5 లక్షల వరకు ఒప్పందం చేసుకుని రెండు మూడు దఫాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అటు ఎమ్మెల్యేల పేరు చెప్పి, ప్రలోభాలు ఎరచూపి రెవెన్యూ అధికారులను తమ వైపునకు తిప్పుకొంటున్నారు. గ్రామ సభ తీర్మానం, లాటరీ విధానం వంటివేవీ లేకుండానే తాము కోరుకున్నవారికి ఇళ్లు మంజూరు చేయించుకుంటున్నారు. ఇల్లున్నా.. ట్రాక్టరున్నా.. పొలమున్నా.. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలపురంలో 236 మంది డబుల్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ గ్రామానికి మొదటి విడతలో 20 ఇళ్లు, రెండో విడతలో 70 ఇళ్లు కేటాయించారు. మొదటి విడత 20 ఇళ్లు పూర్తయి లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. నిబంధనల ప్రకారం ఇక్కడ లాటరీ తీయాలి. కానీ రెవెన్యూ అధికారులు దళారుల కనుసన్నల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇలా ఇళ్లు కేటాయించిన వారిలో.. అప్పటికే ఇల్లున్నవారు ముగ్గురు, ట్రాక్టర్ ఉన్న వారు ఒక్కరు, వ్యవసాయ భూములున్నవారు ఏడుగురు ఉన్నట్టు స్థానికులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రెండో విడతలో వచ్చిన 70 ఇళ్లకు కూడా బేరసారాలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఆ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను సేకరించిన ‘సాక్షి’బృందం.. వారి నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేయగా ఎవరికీ డబ్బులివ్వలేదంటూ చెప్పుకొచ్చారు. ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలోనూ కొందరు దళారులు దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. డబ్బున్నోళ్లకే ఇళ్లు.. భద్రాచలం పట్టణంలో ఏడు వేల మంది డబుల్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొగా.. అందులో 3,800 మంది అర్హులని అధికారులు తేల్చారు. ఇళ్ల నిర్మాణం కోసం పట్టణంలోని కొర్రాజులగుట్ట వద్ద స్థలాన్ని ఎంపిక చేశారు. అది ఖరీదైన ప్రాంతం. ఇక్కడ తొలివిడత 88 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా.. లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ ఒక్కో ఇంటి విలువ మార్కెట్‌రేటు ప్రకారం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండటంతో.. విపరీతంగా పోటీ ఏర్పడింది. వాస్తవానికి భారీగా దరఖాస్తులున్న నేపథ్యంలో లాటరీ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలి. పైగా ఇక్కడ 1/70 చట్టం అమల్లో ఉంది. అంటే కేటాయింపుల్లో గిరిజనులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. నగర పంచాయతీ తీర్మానంతోపాటు, పీసా కమిటీ అనుమతి తీసుకుని గిరిజనేతరులకు ఇళ్లు కేటాయించాలి. కానీ అధికారులు ఇందులో ఒక్క నిబంధన కూడా పాటించలేదు. మొత్తం ఇళ్లలో అధికార పార్టీకి 40 శాతం, ఓ వామపక్ష పార్టీకి 30 శాతం, ఇతర ప్రతిపక్షాలకు 20 శాతం, మిగతా ఇళ్లను రెవెన్యూ అధికారులు పంచుకున్నట్టు తేలింది. ఎవరికి వారు తమకు డబ్బులిచ్చిన వారికి తమ వాటాగా వచ్చిన ఇళ్లను కేటాయింపజేసుకున్నట్టు తెలిసింది. స్థానికంగా ఉన్న ఒక దేవాలయం కమిటీ (రామాలయ కమిటీ కాదు) చైర్మన్ సహా సభ్యులు గుండుగుత్తగా ఇళ్లు తీసేసుకున్నారు. ఇంకా వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, ఓ వామపక్ష పార్టీ నేతల సన్నిహితులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఇప్పటికే పక్కా ఇళ్లున్నవారు కూడా డబ్బులిచ్చి ఇళ్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై స్థానిక తహసీల్దార్ రామకృష్ణను వివరణ కోరగా.. డబుల్ ఇళ్ల కేటాయింపుల్లో ఎలాంటి పొరపాట్లు జరగలేదని పేర్కొన్నారు. స్థలం కొనుగోలు కోసమంటూ వసూళ్లు.. నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాల్లోనే డబుల్ ఇళ్ల నిర్మాణం చేసి, లబ్ధిదారులకు ఇవ్వాలి. కానీ అనేక గ్రామాల్లో ప్రభుత్వ స్థలం కొరత ఉంది. దీంతో దళారులు ప్రైవేటు వ్యక్తుల నుంచి స్థలం కొనుగోలు చేసి.. ప్రభుత్వానికి ఇస్తామంటూ దరఖాస్తుదారుల నుంచి రూ.40 వేల నుంచి రూ. 60 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇళ్ల కేటాయింపు కోసమంటూ మరో రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. మెదక్ జిల్లా రాయినిపల్లిలో 40 ఇళ్లు మంజూరుకాగా.. స్థానిక నేత ఒకరు ఇళ్ల స్థలాల కోసమని ఒక్కో దరఖాస్తుదారు నుంచి రూ. 40 వేలు వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందాయి. అదే జిల్లా హవేలిఘనపురం మండలం కూచన్పల్లిలోనూ, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోనూ, సూర్యాపేట జిల్లా సూర్యాపేట, పెన్‌పహాడ్ మండలాల్లోనూ ఇదే రకమైన ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. అందులో సుమారు 60 శాతం ఇళ్లకు సంబంధించి ఇదే రకమైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇల్లు ఓ ఫైనాన్స్ వ్యాపారిది. ఇంటి నంబర్ 14–2–10. భద్రాచలం నగర పంచాయతీకి ఏడాదికి రూ.2,279 ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నారు. ఇటీవలే ఎన్నికల కమిషన్ నుంచి విడుదలైన ఓటర్ల జాబితాను పరిశీలిస్తే.. ఇదే ఇంటి నంబర్లో ఆయనకు, ఆయన భార్యకు ఓటు హక్కు కూడా ఉంది. ముడుపులు పుచ్చుకున్న అధికారులు ఆయన పేదవాడంటూ, ఆయన భార్య పేరును కూడా మార్చేసి మరీ 88వ నంబర్ డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించారు. (ఫోటో నంబర్ వీవీ02) -
మళ్లీ రోడ్డెక్కిన రైతన్నలు
సూర్యాపేట వ్యవసాయం : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులు మళ్లీ రోడ్డెక్కారు. రెండు రోజులుగా కాంటాల కోసం మార్కెట్లో పడిగాపులు పడుతున్నా.. మాకు కనీస సౌకర్యాలు కల్పించకపోగా, తక్కువ ధరలు వేసి మమ్మల్ని దోచుకునేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని రైతులు తీవ్రంగా ఆగ్రహించారు. కొనుగోలు కేంద్రాలకు వెలితే తేమశాతం పేరుతో కొర్రీలు, డబ్బులు వెంటనే ఇవ్యరు.. మార్కెట్లకు వస్తే వ్యాపారుల దోపిడీ మేము మరెక్కడికి వెళ్లి మా పంటను అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం రాస్తారోకో జరిపిన రైతులు శుక్రవారం రెండోరోజూ ఆందోళన చేపట్టారు. ఉదయం మార్కెట్ కార్యాలయంలోని కార్యదర్శి, చైర్మన్ గదుల్లోని ఫర్నిచర్, కుర్చీలను ధ్వసం చేశారు. వ్యాపారులు చేసిన మోసానికి కడుపుమండిన రైతులు రెండో రోజుకూడా మార్కెట్‌కు దగ్గరలోని నేషనల్ హైవే మీద రాస్తారోకోకు దిగారు. అయితే గురువారమే జేసీ సంజీవరెడ్డి వచ్చి క్వింటాళ్‌కు రూ.1,100నుంచి రూ.1,400 వరకు పడ్డ అన్ని కుప్పలకు ధర రూ.1400లు చేయాలని వ్యాపారులను ఆదేశించినా అమలు చేయకపోవడమేంటని ప్రశ్నించారు. కలెక్టర్ వచ్చేదాకా మా రాస్తారోకో ఆగదని రైతన్నలు రోడ్డుమీదే భీష్మించారు. దీంతో కలెక్టర్ సురేంద్రమోహన్ రైతుల వద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిని మరలా మార్కెట్‌కు తీసుకువెళ్లారు. తేమశాతం చేతితోనే.. సాధారణంగా ధాన్యం తేమశాతాన్ని పరిశీలించి దాని ఆధారంగా వ్యాపారలు ధరలు నిర్ణయించాలి. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో తేమశాతంను మిషన్లతో పరిశీలిస్తుండగా వ్యవసాయ మార్కెట్లో మాత్రం వ్యాపారులు, వారి గుమస్తాలు ధాన్యం తేమను చేతితోనే అంచనా వేసి ఇప్పటికి ఆశాస్త్రీయంగానే ధరలను నిర్ణయిస్తున్నారు. శుక్రవారం మార్కెట్‌కు వచ్చిన కలెక్టర్ కొద్ది సేపు మార్కెట్లో తిరిగి రైతులను శాంత పరిచి కార్యాలయంలో వ్యాపారులు, కమీషన్‌దారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ «తేమశాతం ఎలా చూస్తున్నారని వ్యాపారులని ఆడుగగా చేతితో చూసి ధరలు అంచనా వేస్తామని వ్యాపారులు చెప్పడంతో ఇకనుంచి అలా కుదరదని ఖచ్చితంగా తేమశాతం చూసే మిషన్‌తోనే చూసి «మద్దతు« ధరలు రైతులకు అందేలా చూడాలని కలెక్టర్ సురేంద్రమోహన్ చెప్పారు. మార్కెట్ నిర్వహణలో అంతా వైఫల్యమే.. మార్కెట్ నిర్వహణలో మార్కెట్ సిబ్బంది వైఫల్యం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై జేసీ సంజీవరెడ్డి కూడా రైతులకు అనుకూలంగా మాట్లాడారు. మార్కెట్లో తేమశాతం మిషన్లు అందుబాటులో లేక పోవడంతో కార్యదర్శిపై అందోళన వ్యక్తం చేశారు. సీజన్ సమయంలో మార్కెట్‌కు ధాన్యం పోటెత్తుతుందని ముందే తెలిసినా వ్యవసాయ మార్కెట్లలో అందకు తగ్గ ఏర్పాట్లను మార్కెట్ సిబ్బంది చేయలేదు. రాత్రి సమయంలోనే ఎక్కువగా రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకు వస్తారు. అప్పుడు మార్కెట్ సిబ్బంది ఎవరూ అందుబాటులో ఉండరు. ఉదయం 11 గంటల వరకూ ఏ అధికారి కాని, సిబ్బందికాని కార్యాలయానికి రారు. అంతా కమీషన్‌దారులు, వ్యాపారులు, సెక్యూరిటీ గార్డులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే మార్కెట్ నిర్వహణను చూస్తున్నారు. వ్యాపారులు ధరలు నిర్ణయిస్తున్నప్పుడు తప్పనిసరిగా మార్కెట్ సూపర్వైజర్లు ధరల సరళిని పరిశీలించాలి. అలా చేసి ఉంటే ధరలు తక్కువ వేస్తున్నారని ముందే పసిగట్టవచ్చని..ఆదిలోనే తమ సమస్యను పరిష్కరించే అవకాశముండేది రైతులు అంటున్నారు. మార్కెట్లోనే అధికారుల మకాం.. మార్కెట్‌కు గురువారం వచ్చిన లక్ష బస్తాల ధాన్యంలో ఒక్క బస్తా కూడా గురువారం కాంటా కాలేదు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆందోళనలో ఉన్న రైతులను కలెక్టర్ సముదాయించారు. వ్యాపారులకు అవసరముంటే ధాన్యం అమ్ముకోవచ్చని లేదంటే మీ ధాన్యాన్ని మద్దతు కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటామని కలెక్టర్ ప్రకటించారు. జేసీ సంజీవరెడ్డితో సహా వ్యవసాయ, రెవెన్యూ, కోఆపరేటివ్, సివిల్ సప్లయ్ జిల్లా అధికారులు మార్కెట్లోనే మకాం వేశారు. వారి సిబ్బందితో తేమశాతం పరిశీలన, కొన్నవారికి వెంటనే గన్నీ బ్యాగులు సరఫరా, కాంటాలు వేయించే పనిలో నిమగ్నమయ్యారు. ధాన్యం ఎక్కువగా వస్తున్నందున టోకెన్ పద్ధతితోనే ధాన్యం క్రమబద్దీకరించాల్సి ఉందని రోజు 30 వేల బస్తాలు వచ్చే విధంగా టోకెన్లు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కార్యదర్శిని ఆదేశించారు.. దొడ్డు, సన్నాలకు ఒకే ధర ! కొద్దిరోజుల వరకు దొడ్డు రకం ధాన్యానికి ధర రూ.1,550అటు ఇటుగా ఉండగా సన్న రకాలకు రూ.1,750 నుంచి రూ.1,900 వరకు ధర పలికింది. కాని వ్యాపారులు గురువారం సందట్లో సడేమియాలాగా సన్నరకాలకు కూడా రూ.1,550 వరకే ధరలను వేయడంతో సన్న రకాలు తెచ్చిన రైతులు జేసీ ఎదుట లదోదిబోమన్నారు. సన్నాలకు ధర బాగుందని అవి పండించామని వ్యాపారులు నిలువునా ముంచారని ఆదుకోవాలని కోరడంతో ధరలను మళ్లీ వేపిస్తామని తెలిపారు. రెండు రోజులుగా మార్కెట్లో ఇంతజరుగుతుంటే మార్కెట్ కమిటీ చైర్మన్‌గాని.. డైరెక్టర్లు గాని ఒక్కరు మార్కెట్ వైపునకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారమూ సెలవే.. గురువారం అధికంగా వచ్చిన ధాన్యానికి మార్కెట్ అధికారులు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించారు. ఆదివారం ఎలాగు సెలవుకాగా సోమవారం ఒక్కరోజు మార్కెట్ నడిచే అవకాశముంది మరలా మంగళవారం మేడే సెలవు ఉంటుంది. రైతులతో పాటుగా.. మార్కెట్ కార్యాలయాన్ని రైతులు ధ్వంసం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయాన్ని చాలెంజ్‌గా తీసుకున్న జిల్లా అధికారులు వ్యవసాయ మార్కెట్లోనే మకాం వేశారు. కలెక్టర్ సురేంద్రమోహన్, జేసీసంజీవరెడ్డి రైతులతో పాటుగా శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు మార్కెట్లోనే ఉండి కాంటాలు, బస్తాల ఎగుమతులను పర్యవేక్షించారు. వీరి వెంట సివిల్‌సప్లయ్, వ్యవసాయశాఖల అధికారులు అనురాధ, జ్యోతిర్మయి, సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతి, మార్కెట్ కార్యదర్శి ఎల్లయ్య, సిబ్బంది పోశెట్టి, అల్తాఫ్‌లు ఉన్నారు. గురువారం వచ్చిన లక్ష బస్తాల ధాన్యంలో శుక్రవారం రాత్రి వరకు 70శాతం కాంటాలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మార్కెట్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నాగేశ్యర్రావు ఆధ్వర్యంలో టౌన్ సీఐ శివశంకర్. ఎస్ఐ జానకిరాములు ఉదయం నుంచి బందోబస్తు నిర్వహించారు. -
నకిలీ పార్శిల్‌తో టోకరా
అచ్చంపేట: ఖరీదైన సెల్‌ఫోన్, రిస్ట్‌వాచ్ లాటరీలో తగిలిందన్న అపరిచితుల కాల్‌ను నమ్మి రూ.3 వేలు మోసపోయాడు ఓ బాధితుడు. అచ్చంపేటకు చెంది కత్తి చంద్రం సెల్‌ఫోన్‌కు నాలుగురోజుల కిందట ఢిల్లీ నుంచి ఓ కాల్ వచ్చింది. ఆయుర్వేదిక్ హెర్బల్ కంపెనీ తరపున నీ ఫోన్ నెంబరుకు బంపర్ ఆఫర్ తగిలిందని, అందులో రూ.30 వేల చెక్కు, రూ.15 వేల ఖరీదు చేసే శ్యాంసంగ్ గెలాక్సీ ఫోను, రూ.5 వేల విలువచేసే రిస్ట్‌వాచ్ వచ్చాయని చెప్పారు. అడ్రస్ చెప్తే పార్శిల్ పంపుతామని నమ్మించారు. నిజమేనని నమ్మిన చంద్రం వారికి తన చిరునామా ఇచ్చాడు. వారు చెప్పినట్టుగానే శుక్రవారం అతని పేరిట పోస్టాఫీసుకు ఒక పార్శిల్ వచ్చింది. రూ.3వేలు చెల్లించి తీసుకోవాలని పోస్టుమ్యాన్ చెప్పడంతో అలాగే తీసుకున్నాడు. విప్పిచూడగా అందులో మూడు ప్యాకెట్ల భస్మం, కొన్ని చిత్తు కాగితాలు, ఒక చెక్కపెట్టె ఉన్నాయి. తాను మోసపోయానని గ్రహించిన చంద్రం శుక్రవారం అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యాయవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్?
పీఎం పాలెం: పీఎం పాలెం న్యాయ విద్యా పరిష™Œ (ఎన్వీపీ)lకళాశాల్లో జరుగుతున్న పరీక్షల నిర్వహణలో పలు అవకతవకలు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయవిద్యను అభ్యసించే విద్యార్థులకు (1బై3 1బై5) జంబ్లింగ్ పద్ధతిలో ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. వివిధ కళాశాలల్లో న్యాయవిద్యను అభ్యసించే రెగ్యులర్ విద్యార్థులతోపాటు ప్రభుత్వ , ప్రయివేటు ఉద్యోగాలు చేసుకునే వారు 418 మంది( మూడేళ్ల కోర్సు), ఐదేళ్ల కోర్సులో 85 మంది మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షకు హాజరవుతున్నారు. ఆ రెండు గదులు ప్రత్యేకం! అయితే ఈ పరీక్షను అడ్డదారిలో గట్టెక్కాలను కొందరు డబ్బు ఎరగా వేసి, పరీక్ష నిర్వహణాధికారులను తమకు అనుకూలంగా లోబరచుకున్నారని తెలిసింది. ఇందులో భాగంగా అలాంటివారిని మాత్రమే రెండు గదుల్లో ప్రత్యేకించి కూర్చోబెట్టి కాపీయింగ్‌కు అవకాశం కల్పించారని ఆరోపణ. వీరంతా సంబంధిత పాఠ్యాంశాల పుస్తకాలను పెట్టుకుని మరీ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు భోగట్టా. పైగా, ఈ గదుల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో అభ్యర్థులు పరీలు రాస్తున్నట్టు తెలియవచ్చింది. ఇలా మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఇచ్చి ఒక్కో విద్యార్థి నుంచి రూ.3500 వరకు వసూలు చేసిట్టు తెలిసింది. డబ్బులివ్వనివారిపట్ల స్ట్రిక్టు! కాపీయింగ్‌కు అవకాశం కల్పించిన ఆ రెండు గదులు మినహా, మిగతా గదుల్లో పరీక్ష రాస్తున్న విద్యార్థులను కనీసం తలతిప్పనియ్యడం లేదని విద్యార్థుల ఆరోపణ. పైగా క్షణం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించడంలేదని ఓ బాధితుడు వాపోయాడు. ‘స్పెషల్ రూముల్లో’ పరీక్షలు రాసే అభ్యర్థులను చూసీచూడనట్టు వదిలేస్తున్నారని, అంతా డబ్బు మహిమ అని, ఉన్నతాధికారులు ఈ పరీక్ష కేంద్రంపై దష్టి సారించి అవకతవకలకు అవకాశమిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత వర్గం విద్యార్థులు కోరుతున్నారు. కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వలేదనే ఆరోపణ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వలేదన్న అక్కసుతో ఇతర న్యాయవిద్య కళాశాలల నుంచి వచ్చిన కొంతమంది న్యాయ విద్యార్థులు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కనీసం చదవకుండా స్లిప్పులతో పరీక్షలు రాద్దామనుకునే వారి ఆటలు సాగవు. కష్టపడి చదువున్నవారు చక్కగా రాసుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు పరీక్ష అధికారుల కళ్లుగప్పి కాపీయింగ్‌కు పాల్పడాలనిSచూస్తున్నారు. పరీక్ష హాలులోకి ప్రవేశించడానికి ముందు వారిని సోదా చేసి వారివద్ద రహస్యంగా దాచుకున్న స్లిప్పులను స్వాధీన పరచుకున్న తర్వాతే పరీక్షలకు అనుమతి ఇస్తున్నాం. –డాక్టర్ సి.నిర్మల, ప్రిన్సిపాల్ ఎన్వీపీ లా కళాశాల, పీఎం పాలెం, మధురవాడ. -
సినిమా పేరుతో మోసం
తిరువొత్తియూరు(చెన్నై): సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పి విద్యార్థులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి 27 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. శివగంగై జిల్లా దేవకోటై కీళవాయిల్ గ్రామం కార్మేఘన్ కుమారుడు పాండియన్ (40) సినిమాల పేరుతో విద్యార్థులను లక్ష్యం చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం ట్రిప్లికేన్ దంత వైద్యశాల దగ్గర నిలుచొని ఉన్న మెకానిక్ మణి (21), అతని స్నేహితుడు ఆది (23)లను సినిమాల్లో అవకాశం ఉందంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. విజయ్ సినిమాలో నటించేందుకు అవకాశం కల్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. కొద్ది దూరం తీసుకెళ్లి పాండియన్ కత్తి చూపించి వారి వద్ద వున్న సెల్‌ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో వీరద్దరూ కేకలు వేయడంతో స్థానికులు పాండియన్ చుట్టుముట్టి పట్టుకున్నారు. అతనిని ట్రిప్లికేన్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేయగా 21న తండయారుపేటలోని విద్యార్థులకు సినిమా ఆశ చూపి 15 సెల్ఫోన్లను, 16న వేలూరు జిల్లా రాణిపేట ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల వద్ద 16 సెల్ఫోన్లను చోరీ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు అతని వద్ద నుంచి 27 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశారు. -
స్కాలర్ షిప్ పేరుతో ఘరానా మోసం
హైదరాబాద్: స్కాలర్ షిప్ పేరుతో ఆసిఫ్ నగర్ పరిధిలో ఘరానా మోసం వెలుగు చూసింది. అబ్దుల్ కలాం మెరిట్ స్కాలర్షిప్ పేరుతో ఒక్కొక్కరి నుంచి నిర్వాహకులు రూ. 200 వసూలు చేశారు. ఈ రోజు(ఆదివారం) పరీక్ష ఉందంటూ హాల్ టికెట్లు జారీ చేశారు. పరీక్ష లేకపోవడంతో ఆసిఫ్‌నగర్ పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. -
‘గల్ఫ్’ మోసాలు
అమాయకులను టార్గెట్ చేస్తున్న ఏజెంట్లు లెసైన్స్ లేకుండా విచ్చల విడిగా వీసాల దందా నిరుద్యోగులకు టోకరా రూ.కోట్లు కాజేస్తున్న వైనం మోర్తాడ్ : గల్ఫ్ ఏజెంట్లు నిరుద్యోగులకు ఉద్యోగ ఆశ చూపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. నట్టేట ముంచుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గల్ఫ్ ఏజెంటు భూమేశ్ రూ.60 లక్షలకుపైగా నిరుద్యోగులకు టోకరా వేశాడు. భూమేశ్ చేసిన మోసాన్ని పరిశీలిస్తే ఇమిగ్రేషన్ చట్టానికి అనుగుణంగా గల్ఫ్ కంపెనీలు రిక్రూట్మెంట్ సాగించడం లేదని స్పష్టం అవుతుంది. ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం.. గల్ఫ్, ఇతర దేశాలలోని కంపెనీలకు అవసరమైన కార్మికులను పంపడానికి లెసైన్స్ ఉన్న ఏజెంట్లే ఇంటర్వ్యూలను నిర్వహించి విదేశాలకు పంపించాలి. కానీ.. లెసైన్స్ ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లను నియమించుకుని వీసాల దందాను జోరుగా సాగిస్తున్నాయి. ఇమిగ్రేషన్ చట్టంపై నిరుద్యోగులకు అవగాహన లేకపోవడంతో గల్ఫ్ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోతున్నారు. లెసైన్స్ ఉన్న ఏజెన్సీలు 33 మంది తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ దేశాలకు కార్మికులను ఎగుమతి చేసే ఏజెన్సీలు 33 ఉన్నాయి. హైదరాబాద్‌లో 32 లెసైన్స్డ్ ఏజెన్సీలు.. ఒకటి కరీంనగర్ జిల్లా జగిత్యాల్లో ఉంది. గతంలో లెసైన్స్ ఏజెన్సీలు చాలానే ఉన్నా ఇమిగ్రేషన్ చట్టాలకు లోబడి పని చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లెసైన్స్‌లను రద్దు చేసింది. విదేశాలలోని కంపెనీలకు కార్మికులను పంపించడానికి లెసైన్స్ పొందాలంటే ప్రభుత్వానికి బ్యాంకు గ్యారెంటీ కింద రూ.50 లక్షల స్థిరాస్తి లేదా బ్యాంకు బాండ్లను చూపాలి. కార్మికులకు ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేంట్(పీవోఈ) కార్యాలయం నుంచి అనుమతి పొందాలి. దినపత్రికలో ప్రకటన ఇచ్చిన తరువాత ఏజెన్సీ కార్యాలయంలోనే ఇంటర్వ్యూలను నిర్వహించాలి. సర్వీసు చార్జీగా రూ.20 వేలు లేదా కార్మికుడు కంపెనీలో చేరిన తరువాత 45 రోజుల వేతనంను పొందాలి. విచ్చలవిడిగా దోపిడీ ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల నుంచి లెసైన్స్డ్ ఏజెన్సీలు తక్కువ సర్వీసు చార్జీలు వసూలు చేయాలి. కానీ.. సబ్ ఏజెంట్లను నియమించుకుంటూ వారి ద్వారా గల్ఫ్ వెళ్లే వారి నుంచి విచ్చలవిడిగా సొమ్ము వసూలు చేస్తున్నారు. ఏజెన్సీలు ఇమిగ్రేషన్ నియమనిబంధనల ప్రకారం రిక్రూట్మెంట్లను నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీలు వీసా ఖర్చుల పేరిట రూ.60 వేల నుంచి రూ.ఒక లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. లెసైన్స్ ఉన్న ఏజెన్సీలు సబ్ ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. పేరుకే లెసైన్స్ ఏజెన్సీలు. అయినా సబ్ ఏజెంట్ల ద్వారా వీసాల దందాను జోరుగా సాగిస్తున్నాయి. సబ్ ఏజెంట్లకు అధికారిక గుర్తింపు ఏది ఉండదు. దీంతో వారు గ్రామీణ ప్రాంతాలలో పర్యటిస్తూ మొదట ఒకరిద్దరు కార్మికులను గల్ఫ్‌కు పంపించి వారిని చూపుతూ.. మిగతా కార్మికులను నట్టేట ముంచుతున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో చాలా చోటు చేసుకున్నాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో పని చేయడానికి మన దేశం నుంచి కార్మికులను పంపించడంపై నిషేధం ఉంది. కానీ, ఏజెంట్లు దుబాయ్ దేశానికి విజిట్ వీసాలు తీసి అక్కడి నుంచి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌కు కార్మికులను పంపిస్తున్నారు. ఇరాక్‌లో యుద్ధం ముగియడంతో ఇటీవలే అక్కడి కంపెనీలకు సంబంధించిన వీసాలు ఇప్పుడిప్పుడే జారీ అవుతున్నాయి. కానీ, ఏజెంట్లు మాత్రం ఇమిగ్రేషన్ చట్టాన్ని తుంగలోకి తొక్కుతూ విచ్చలవిడిగా వీసాల దందా చేస్తున్నాయి. ఇమిగ్రేషన్ చట్టానికి లోబడి సాగని ఇంటర్వ్యూలు ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం లెసైన్స్డ్ ఏజెన్సీలు ఏజెన్సీ ఉన్న చోటనే ఇంటర్వ్యూలు నిర్వహించాలి. జిల్లా కేంద్రాలు, ప్రధాన ప ట్టణాల్లోని స్టార్ హోటళ్లలో ఏజెంట్లు బస చే స్తు గల్ఫ్ వీసాల పేరిట ఇంటర్వ్యూలను సా గిస్తున్నాయి. నిజామాబాద్, ఆర్మూర్ తదిత ర పట్టణాల్లో వారానికి ఒక సారి గల్ఫ్ ఏజెం ట్లు భారీ ఎత్తున ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం నిరుద్యోగి పాస్‌పోర్టు జిరాక్సు కాపీని మాత్ర మే ఏజెంట్లు తీసుకోవాలి. ఒరిజినల్ పాస్‌పోర్టు తీసుకుంటున్నారు. గల్ఫ్‌కు కార్మికున్ని పంపించకున్నా ఒరిజినల్ పాస్‌పోర్టు తమ చేతిలో ఉందనే భావనతో ఏజెంట్లు కార్మికులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీసా ఇవ్వకపోయినా పాస్‌పోర్టును వాపసు చేయడానికి ఏజెంట్లు డబ్బులు గుంజుతున్న సంఘటనలు ఉన్నాయి. గల్ఫ్ ఏజెంట్లపై కఠిన చర్యలు శూన్యం నిరుద్యోగులను నిండాముంచుతున్న ఏజెంట్లపై కఠిన చర్యలను పోలీసులు తీసుకోకపోవడంతో ఏజెంట్ల మోసాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. రెండేళ్ల కింద లిబియాలో ఉద్యోగాల పేరుమీద వేల్పూర్‌కు చెందిన నిరుద్యోగులను ముంచిన ఏజెంటుకు అప్పటి పోలీసు అధికారి ఒకరు వత్తాసు పలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్మూర్‌లో ఒక ఏజెంటు ట్రావెల్స్ పేరుమీద వీసాల దందా చేసి రూ.కోటికి ముంచినా ఎలాంటి రికవరీ చేయలేదు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వీసాల పేరిట ముంచిన ఏజెంట్లు కనీసం 100 మంది వరకు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాల్లో ఏజెంట్ల దందా జోరుగా ఉంది. ఏజెంట్లపై చర్యలు తీసుకున్న సందర్భాలు తక్కువగా ఉన్నాయి. ఏజెంట్లకు రాజకీయ నాయకులు అండదండలు ఉండటం వల్ల వారి మోసాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇమిగ్రేషన్ చట్టంను పకడ్బందీగా అమలు చేయాలి ప్రభుత్వం గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టడానికి ఇమిగ్రేషన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. కాని ప్రభుత్వం ఎక్కడ కూడా ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్న సంఘటనలు లేవు. ఎజెంట్ల స్థిరాస్తులను రికవరీ చేసి నిరుద్యోగులకు అందాల్సిన సొమ్మును పంపిణి చేయాలి. ఏజెంట్లపై నిఘా ఉంచి వారి కదలికలను గమనించాలి. అలా అయితేనే గల్ఫ్ మోసాలను అడ్డుకోవచ్చు. - చాంద్ పాషా, గల్ఫ్ రిటర్నింగ్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ -
జెడ్పీ చైర్మన్ కుమారుడంటూ వసూళ్లు
అనంతపురం : అనంతపురం జెడ్పీ చైర్మన్ కుమారుడినంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ విజయ్ మల్లికార్జున వర్మ తెలిపిన వివరాలివీ.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వల్లభరావుపేట గ్రామానికి చెందిన అత్తోటి సునీల్‌కుమార్ కొన్ని రోజులుగా వసూళ్లు మొదలుపెట్టాడు. విశాఖ జిల్లాకు చెందిన పలువురు రియల్టర్లను జెడ్పీ చైర్మన్ చమన్ సాబ్ కుమారుడినంటూ బెదిరించి రూ.15 లక్షలు వసూలు చేశాడు. ఇటీవల అనంతపురంలోని ఓ లాడ్జిలో మకాం వేసిన సునీల్‌కుమార్ ఉద్యోగమిప్పిస్తానని ఆశచూపి ఇద్దరు యువకుల నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడు. అంతేకాకుండా తన వద్ద నున్న బొమ్మ పిస్తోలు చూపి ఓ వ్యాపారి నుంచి రూ.లక్ష వసూలు చేశాడు. అతనిచ్చిన సమాచారం మేరకు వన్‌టౌన్ పోలీసులు సునీల్ కుమార్ ను సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.