
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, కురవి (జయశంకర్ భూపాలపల్లి): ఓ ఆన్‌లైన్ సంస్థలో బ్లూటూత్ హెడ్‌సెట్ బుక్ చేస్తే ఖాళీ డబ్బా వచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ) గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొమ్మగాని మల్సూర్‌గౌడ్ బోట్ కంపెనీ బ్లూ టూత్ కోసం ఆర్డర్ చేశాడు.
మంగళవారం కొరియర్ సంస్థ నుంచి వచ్చిన వ్యక్తి ఇచ్చిన బాక్స్ తీసుకుని రూ.1,670 చెల్లించాడు. ఆ తర్వాత డబ్బాలో ఏమీ లేకపోవడంతో డెలివరీ బాయ్‌ను నిలదీశాడు. తన చేతిలో ఏమీ ఉండదని ఆయన చెప్పగా, వాదనకు దిగడంతో చివరకు డెలివరీ బాయ్ డబ్బు ఇచ్చేసి వెళ్లిపోయాడు.