వామ్మో..ఏటీయమ్‌‌లో కేటుగాడు! | Atm Froud In Khammam District | Sakshi
Sakshi News home page

వామ్మో..ఏటీయమ్‌‌లో కేటుగాడు!

Published Fri, Mar 19 2021 5:45 PM | Last Updated on Fri, Mar 19 2021 5:51 PM

Atm Froud In Khammam District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వైరా: ఆంధ్రా(యూనియన్‌) బ్యాంక్‌ ఏటీఎంకు నగదు కోసం వెళ్లిన ఓ వ్యక్తి మోసానికి గురైన సంఘటన వైరాలో చోటుచేసుకుంది. స్థానిక పాతబస్టాండ్‌ సెంటర్‌లోని ఓ ఫొటో స్టూడియో యజమాని జనార్దన్‌ బుధవారం ఆంధ్రాబ్యాంక్‌ ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. ఏటీఎంలో కార్డు ఉంచి పిన్‌ నంబర్‌ కొట్టడంతో ఎర్రర్‌ అని చూపింది. దీంతో పిన్‌ నంబర్‌ కోసం తన భార్యకు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నాడు. అప్పటికే ఏటీఎంలో మాటు వేసి ఉన్న ఓ ఆగంతకుడు తన చేతిలోని కార్డును మిషన్‌లో ఉంచి, జనార్దన్‌ కార్డు తీసుకున్నాడు. ఇది గమనించని జనార్దన్‌.. మిషన్‌లో ఉన్న కార్డు తీసుకుని వెళ్లిపోయాడు.

అదే రోజు సాయంత్రం 6.30 సమయంలో అగంతకుడు మరో ఏటీఎం నుంచి రూ. 20 వేలు డ్రా చేశాడు. నగదు డ్రా చేసినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో ఆందోళన చెందిన జనార్దన్‌ తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చే«శాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: మహిళకు మధ్య వేలు చూపించి అసభ్యంగా.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement