సాక్షి, ఖమ్మం: కల్లూరు పంచాయతీ పరిధి శ్రీరాంపురం గ్రామంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం గ్రామానికి చెందిన మహిళ శ్రీరాంపురంలో ఇళ్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. దీంతో ఎస్‌ఐ వెంకటేశ్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టగా నిర్వాహకురాలితో పాటు మరికొందరు మహిళలు, విటులు పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment