హోసూరు: హోసూరు కార్పొరేషన్ పరిధిలో వ్యభిచారాలు నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాగలూరు రోడ్డులోని ఎన్.జి.జి.వోఎస్. కాలనీలో ఆదివారం రాత్రి పట్టణ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఓ ఇంటిపై దాడి చేసి మూకొండపల్లికి చెందిన కవిత (30), ఎన్‌జిజివోఎస్ కాలనీకి చెందిన హరిదాస్ (21), ఉడయాండహళ్లి గ్రామానికి చెందిన లత (40), అత్తిముగంకు చెందిన దినేష్(42)లను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment