
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాఘవేంద్ర కాలనీలోని వైట్ హౌస్ ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచరం అందడంతో గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ సభ్యులు హోటల్‌పై దాడి చేశారు.
ఈ సందర్భంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన చెందిన ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. నిర్వాహకులు మహ్మద్ అదీమ్, మహ్మద్ సమీర్, హర్బిందర్ కౌర్ అలియాస్ అనికా, మహ్మద్ సల్మాన్, మహ్మద్ అబ్దుల్ కరీంలను అరెస్ట్ చేశారు. మహ్మద్ అదీమ్ పలు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితులపై సైబరాబాద్‌లో పది కేసులు నమోదై ఉన్నట్లు ఆయన వివరించారు.
చదవండి: Warangal: బర్త్‌డే వేడుకల్లో గొడవ.. శానిటైజర్ తాగిన విద్యార్థినులు
Comments
Please login to add a commentAdd a comment