న్యాయవిద్య పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌? | mass copying in law exams | Sakshi
Sakshi News home page

న్యాయవిద్య పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌?

Published Thu, Jul 28 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

mass copying in law exams

పీఎం పాలెం: పీఎం పాలెం న్యాయ విద్యా పరిష™Œ  (ఎన్‌వీపీ)lకళాశాల్లో జరుగుతున్న పరీక్షల నిర్వహణలో పలు అవకతవకలు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయవిద్యను అభ్యసించే విద్యార్థులకు (1బై3 1బై5) జంబ్లింగ్‌ పద్ధతిలో ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. వివిధ కళాశాలల్లో న్యాయవిద్యను అభ్యసించే రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు ప్రభుత్వ , ప్రయివేటు ఉద్యోగాలు చేసుకునే వారు 418 మంది( మూడేళ్ల కోర్సు), ఐదేళ్ల కోర్సులో 85 మంది మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షకు హాజరవుతున్నారు.
ఆ రెండు గదులు ప్రత్యేకం!
అయితే ఈ పరీక్షను అడ్డదారిలో గట్టెక్కాలను కొందరు డబ్బు ఎరగా వేసి, పరీక్ష నిర్వహణాధికారులను తమకు అనుకూలంగా లోబరచుకున్నారని తెలిసింది. ఇందులో భాగంగా అలాంటివారిని మాత్రమే రెండు గదుల్లో ప్రత్యేకించి కూర్చోబెట్టి కాపీయింగ్‌కు అవకాశం కల్పించారని ఆరోపణ. వీరంతా సంబంధిత పాఠ్యాంశాల పుస్తకాలను పెట్టుకుని మరీ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు భోగట్టా. పైగా, ఈ గదుల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో అభ్యర్థులు పరీలు రాస్తున్నట్టు తెలియవచ్చింది. ఇలా మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఇచ్చి ఒక్కో విద్యార్థి నుంచి రూ.3500 వరకు వసూలు చేసిట్టు తెలిసింది.
డబ్బులివ్వనివారిపట్ల స్ట్రిక్టు!
కాపీయింగ్‌కు అవకాశం కల్పించిన ఆ రెండు గదులు మినహా, మిగతా గదుల్లో పరీక్ష రాస్తున్న విద్యార్థులను కనీసం తలతిప్పనియ్యడం లేదని విద్యార్థుల ఆరోపణ. పైగా క్షణం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించడంలేదని ఓ బాధితుడు వాపోయాడు. ‘స్పెషల్‌ రూముల్లో’ పరీక్షలు రాసే అభ్యర్థులను చూసీచూడనట్టు వదిలేస్తున్నారని, అంతా డబ్బు మహిమ అని, ఉన్నతాధికారులు ఈ పరీక్ష కేంద్రంపై దష్టి సారించి అవకతవకలకు అవకాశమిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత వర్గం విద్యార్థులు కోరుతున్నారు.
 
కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వలేదనే ఆరోపణ
కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వలేదన్న అక్కసుతో ఇతర న్యాయవిద్య కళాశాలల నుంచి వచ్చిన కొంతమంది న్యాయ విద్యార్థులు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కనీసం చదవకుండా స్లిప్పులతో పరీక్షలు రాద్దామనుకునే వారి ఆటలు సాగవు. కష్టపడి చదువున్నవారు చక్కగా రాసుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు పరీక్ష అధికారుల కళ్లుగప్పి కాపీయింగ్‌కు పాల్పడాలనిSచూస్తున్నారు. పరీక్ష హాలులోకి ప్రవేశించడానికి ముందు వారిని సోదా చేసి వారివద్ద రహస్యంగా దాచుకున్న స్లిప్పులను స్వాధీన పరచుకున్న తర్వాతే పరీక్షలకు అనుమతి ఇస్తున్నాం.
–డాక్టర్‌ సి.నిర్మల, ప్రిన్సిపాల్‌ ఎన్‌వీపీ లా కళాశాల, పీఎం పాలెం, మధురవాడ.   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement