మీ నంబ‌ర్ ఇక‌పై ప‌ని చేయ‌దు అంటూ.. | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్క మెసేజ్‌.. వెంట వెంటనే డబ్బులు కట్‌ అయ్యాయి..

Published Sun, Apr 25 2021 8:21 PM

Online Cheating Froud In Hyderabad - Sakshi

సాక్షి, హిమాయత్‌ నగర్‌: మీరు వాడుతున్న ఫోన్‌ నంబర్‌ మరికొద్దిసేపటిలో క్లోజ్‌ అవుతుందని ఓ వ్యక్తికి మెసేజ్‌ వచ్చింది. కంగారు పడ్డ వ్యక్తి మెసేజ్‌ వచ్చిన నంబర్‌ కు ఫోన్‌ చెయ్యడంతో ఆన్‌ లైన్‌ ప్రక్రియతో రూ.61వేలు లూటీ చేసిన సంఘటన నారాయణ గూడ పీఎస్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. క్రైమ్‌ ఇన్‌ స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్ర‌కారం నారాయణ గూడ విఠల్‌ వాడిలో ఈ సంఘటన జరిగింది.

ఎయిర్‌బస్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే సూర్య విక్టర్‌ ప్రతాప్‌ కు 9339635199 ఈ నంబర్‌ నుంచి మీరు వాడుతున్న ప్రస్తుత నంబర్‌ ఆగిపోతుందని మెసేజ్‌ వచ్చింది. కంగారు పడ్డ ఆయన వచ్చిన నంబర్‌ కు ఫోన్‌ చేసాడు. వాళ్లు క్యూక్‌ వ్యువర్‌ యాప్ఙ్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోమన్నారు. అది చేసుకోగానే అతని అకౌంట్‌ నుంచి ముందుగా రూ.14,987 , రెండవసారి ఫోన్‌ పే యాప్‌ నుంచి రూ.46,514 కట్‌ అయ్యాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Advertisement
 
Advertisement
 
Advertisement